Home » Kommanapalli ganapathi rao » అరణ్యకాండ

    నడుస్తూకూడా  మేనీటర్  గురించి  ఆలోచిస్తున్నాడు.

    ఇంతమందిని  కలవర  పరుస్తున్న  మేనీటర్ ను సాధ్యమయినంత   త్వరలో  ఎదుర్కోవాలి.

    మరో మనిషి  చావుకోసం  ఎదురుచూడ్డంలో  అర్ధంలేదు. మరోరోజు  అడవిని  పూర్తిగా  పరిశీలించి, అవసరమయితే  ఎరను  ఉపయోగించి మాటు వేయాలి.

    ఆలోచిస్తూ  వాగు అంచున  నడుస్తున్న  చైతన్య ఏదో  అలికిడి వినిపించినట్లయి  ఆగి, ఆ శబ్దం  వినిపించిన  దిక్కువేపు  దృష్టి సారించాడు  మసక వెన్నెట్లో  సుమారు  ఏభై  అడుగుల కిందనున్న  బాటపై యెవరో వ్యక్తుల కదలిక అస్పష్టంగా కనిపించింది.

    ఆ వేళలో  అక్కడ  సంచరిస్తున్న  దెవరో  అర్ధం  కాలేదు. వెళ్ళడమా, మానడమా  అన్న సందిగ్ధంలో  కొంతసేపు  తటపటాయించిన  చైతన్య దట్టంగా  పెరిగిన  చెట్లమాటున  ఓ లారీ  కనిపించటంతో  క్షణంపాటు నిశ్చేష్టుడయ్యాడు.

    ఆ వేళలో  అక్కడ  ఏం జరుగుతున్నదీ  గుర్తించడానికి  అతడికి  అట్టేసేపు  పట్టలేదు.

    చేవగల  ఫారెస్టాఫీసరుగా  ఎందరో  అక్రమ  వ్యాపారస్తుల  వ్యవహారాల్ని  తెలిసికొని  అవసరమైనప్పుడు  ఒంటరిగానే  ఎదుర్కొన్నాడు.

    అంతే....

    వడివడిగా  అడుగులు  వేస్తూ  ఏటవాలుగా వున్న  రాళ్ళగుట్ట పై నుంచి  కిందికి  దిగడం  మొదలుపెట్టాడు.

    ఆ  చీకట్లో  ఓ రాయి  అతని  కాలికి  తగిలి  వేగంగా  కిందికి  దొర్లింది.

    ఆ మాత్రం  సూచన చాలు  అడవిని  దోచుకునే  దొంగ వ్యాపారస్తులకి!

    హఠాత్తుగా తీతువులా  ఓ కూత  వినిపించింది. సమాధానంగా దిగువ భాగం  నుంచి  మరో కూత.

    కదులుతున్న ఆకారాలు  హడావుడిగా  పరుగెత్తాయి. ప్రమాదాన్ని పసికట్టిన  వెంటనే  అలాంటి  కూతలతోనే  సంకేతాన్ని  అందించుకునే  ఆ సాంప్రదాయం చైతన్యకి  కొత్తకాదు.

    తృటిలో  లారీ  ఇంజను  స్టార్టు  చేయబడినది.

    చైతన్య  ఆలస్యం  చేయలేదు.

    ఆ మసక  చీకటిలోనే  లారీ  హెడ్ లైట్స్ ను ఆధారంగా  చేసుకుని  కాస్త  దిగువగా  నేలపైకి  గురి చూసి తుపాకి  పేల్చాడు.

    లారీ  బాడీని  తాకి  పైన  పేర్చబడి  వున్న  కొన్ని  దూలాల కిందికి  దొర్లాయి.

    మరుక్షణం  లారీ వేగంగా  దూసుకుపోయింది.

    ప్రత్యర్ధులు  అలాంటి వేళ  ప్రాణాలు  తియ్యడానికయినా  వెనుకాడరు. కాని  విధి  నిర్వహణలో  ప్రాణాలకు  తెగించే  తత్వంగల చైతన్య ముళ్ళకంచెల్లోంచి  దూసుకుంటూ  బాటపైకి  పరిగెత్తాడు.

    అప్పటికే  లారీ చాలా  దూరంగా  వెళ్ళిపోయింది. కనీసం సమయానికి  జీప్ వున్నా  వారిని  వెంబడించేవాడు. శత్రువులు  తప్పించుకున్నారు.

    ఆ నీరస నిశీధిలో  నేలపై  జారిన  దూలాల్ని  పరిశీలనగా చూసిన చైతన్య కొన్ని  క్షణాలవరకూ  ఆశ్చర్యం నుంచి  తేరుకోలేకపోయాడు.

    ప్రభుత్వానికి  ఎంతో  రాబడినిచ్చే  అతి విలువయిన  ఎర్రచందనం.

    ప్రభుత్వాధికార్లు, అటవీశాఖ  సిబ్బంది  కుమ్మక్కై  విపరీతమయిన  లంచాలకు  ఆశించి  ఎందరో  స్మగ్లర్లను  కోటీశ్వరులుగా  మార్చిన  ఎర్ర చందనం  షామోసిన్ వంటి వాద్య పరికరాల  ఉత్పత్తికి కారణమై  జపాన్ వంటి  దేశాలకు  ఎగుమతి  చేయబడుతుంది.

    చిత్తూరు, కడప, పాడేరు  అడవులలో  తప్ప  మరెక్కడా  లభ్యం కాని   ఎర్రచందనం  సునాయాసంగా  దోచుకోబడుతూంది.

    రాష్ట్రం  నుంచి  ఎర్రచందనం  దొంగతనంగా  రవాణాచేసి  కోటీశ్వరుడయిన  తమిళనాడుకు  చెందిన  ముగుగేశ్ నాడార్  ఆట కట్టించింది  చైతన్య.

    గెడ్డాన్ని  సవరించుకుంటూ  సాలోచనగా  చూసిన  చైతన్య  అనుకున్నాడు  మేనీటర్ ఉనికిని  చాలా తెలివిగా  కాష్ చేసుకుంటున్నారన్నమాట.

    అతను  ప్రత్యేకంగా  అక్కడికి  రప్పించబడింది  మేనీటర్ ను మట్టుపెట్టడానికి. కానీ  తొలి రోజునే  చాలా  పకడ్భందీగా  అడవినిదోచుకుంటున్న  స్మగ్లర్ల  ఏక్టువిటీస్ ని కనిపెట్టిన  చైతన్య మరో  బలమయిన  బాధ్యతనుకూడా  తనపై  వుందన్న  సత్యాన్ని  గ్రహించాడు.

    సమీపంలోని  ఎర్రచందనపు  అడవిలోకి  అతను  వెళ్ళలేదు.

    మరుసటిరోజు  అక్కడి  పరిస్థితిని  స్టడీ  చేయాలని  నిర్ణయించుకుని  రెస్టుహౌస్ కి బయలుదేరిన  చైతన్యకు  తెలీదు.

    రెండు ఆకారాలు  చెట్లమాటున  నిలబడి  అతన్నే  పరీక్షగా  గమనిస్తున్నాయని.


                                                                              11


    పిడుగుమోతలా  వినబడ్డ  పులి  గాండ్రింపుతో  ఉలికిపడి  నిద్రలేచాడు  చైతన్య. నిజానికి  అతడు  అలసట  మూలంగా  గాఢనిద్రలో  మునిగిపోయివున్నాడు. గగుర్పాటుతో  చూశాడు  రెస్టుహౌస్ కిటికీలోంచి.

    దట్టంగా  అలుముకుని  వున్న  చీకటిలో  ప్రకృతి  చెరచబడిన  స్త్రీలా  వజవజా  వణుకుతూన్నట్టనిపించింది.

    దూరంగా  ఎక్కడో  ఓ కణుసు  పులి  ఆగమనాన్ని  సూచిస్తూ  కేక పెట్టింది.

    అర్దరాత్రి దాటేక  తెల్లవారేవరకూ  క్రూరమృగాలతోపాటు  పక్షులు  సైతం  విశ్రాంతిని  తీసుకుంటాయి. ప్రకృతి సిద్ధమయిన  ఈ సంప్రదాయం మేనీటర్స్  తిరిగే  అడవుల్లో  మాత్రం  వీగిపోతూ వుంటుంది. అనుమానాస్పదమయిన  పరిస్థితులు  అణుమాత్రం  ఏర్పడినా, అడవంతా  ప్రేతాత్మల హోరుగా మారిపోతుంది.

    అదురుతున్న  గుండెతో  కిటికీ తెరల్ని  పూర్తిగా  తొలగించి బయటకు  చూసిన  చైతన్య చీకటి  వెల్లువలో  ఊపిరాడనట్లు  ఉండిపోయాడు  కొన్ని క్షణాలవరకూ.

    చాలా సమీపంలో  భారీగావున్న  జంతువేదో  నడుస్తున్నట్టు భూమి ప్రకంపిస్తూంది.

    చెవులు  రిక్కించి  విన్నాడు. అనుమానం లేదు. అది పెద్దపులే. కాని, ఏ పక్కనుంచి వినవస్తున్నదీ  అతడు నిర్దారణే  చేసుకోలేకపోయాడు.

    వెనుకగా  చాలా  దగ్గర్లో  గుర్రుమన్న  చప్పుడు  కావడంతో  గిరుక్కున  వెనక్కి  తిరిగాడు.

    ద్వారంమూసే  వుంది. అంటే  కాంపౌండువాల్ ను సమీపించి లోపలికి  ప్రవేశించే అవకాశం లేక ఉక్రోషాన్ని  వ్యక్తం చేస్తూందన్నమాట.

    తన స్థావరంలో  అడుగుపెట్టిన  శత్రువును మట్టుపెట్టే అవకాశం  కోసం  కసిగా  నిలబడింది చీకటిలో.

    బయట  కాంపౌండ్  వాల్  ఇనుపగేటుపై  పంజాతో  క్రోధంగా రాస్తున్న  చప్పుడు.

    అదే చిరుతపులి  అయ్యుంటే  ఎత్తుగావున్న  కాంపౌండ్ వాల్ దాటి  సునాయాసంగా లోపలికివచ్చి  వుండేది.
    తను బోనులో  నిలబడి  బయట  స్వేచ్ఛగా  తిరుగుతున్న  పులి నుంచి  తనను తాను  కాపాడుకుంటున్నట్టుంది  చైతన్య పరిస్థితి.

    తలుపు  తెరిచి  బయటకు  వెళ్ళాలనుకున్న  కోరికను  చాలా బలంగా  అణుచుకున్నాడు.

    బెడ్ లైట్ కాంతిలో  గోడకి  అమర్చిన  రైఫిల్ ను అందుకున్నాడు.

    దక్షిణంవేపున  వున్న కిటికీని  సమీపించి  కాంపౌండ్  వాల్ కేసి చూశాడు. మెయిన్ గేటు తూర్పుభాగాన  ఉండటంతో  ఎంత  పక్కకి  జరిగినా  స్పష్టంగా  కనిపించడంలేదు. ఒకవేళ  పులిపై  తూటాని ప్రయోగించాలి  అనుకుంటే  ద్వారం  తెరవడం తప్ప మరో దారిలేదు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra