Home » Mainanpati bhaskar » Claimax

ఇదంతా నిరాసక్తితో గమనిస్తోంది హీరోయిన్ మధుమతి. అప్రయత్నంగానే ఆమెకు ఇదివరకెప్పుడో హరీన్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.
"ఏదన్నా షాట్ చేస్తున్నప్పుడు అవాంతరం కలిగి మనం భయపడ్డామానుకో ......మళ్ళీ అదే షాట్ ని వెంటనే చెయ్యడానికి ప్రయత్నించాలి. అప్పుడా భయం తొలిగిపోతుంది. లేకపోతే ఆ భయం తాలూకు ఎఫెక్ట్ మనసులో ఉండిపోయి, తర్వాత అలాంటి షాట్స్ ఇంక చెయ్యలేం .......చేసినా సరిగ్గా రావు."
ఒకసారి మంటల్లో దూకే సీను ఒకటి చేస్తున్నాడు హరీన్. చాలా ప్లాన్ చేసి తీస్తున్న షాట్ అది. కానీ ఎవరి అజాగ్రత్త వల్లో హరీన్ బట్టలు అంటుకున్నాయి. వీపు బాగా కాలింది అతనికి.
కానీ, అయిదు నిమిషాల్లోనే తేరుకుని, ఆ బాధని పళ్ళబిగువున సహిస్తూ మళ్ళీ అదే షాట్ చేశాడు హరీన్ - ఈసారి ఏక్స్ లెంట్ రిజల్టుతో.
అది తలుచుకుంటే పెదవులమీద చిరునవ్వు కనుకొలుకుల్లో కన్నీరూ నిలిచాయి మధుమతికి.
అసలు హరీన్ సైకాలజీ వేరు. చాలా విశిష్టమైన, చిత్రమైన వ్యక్తిత్వం అతనిది. డబ్బంటే తనకు విరోధం అన్నట్లు ప్రవర్తించేవాడు. డబ్బుని ఇన్సల్ట్ చెయ్యడమే తన లక్ష్యం అయినట్లు రెండు చేతులతో సంపాదించేవాడు. రెండుచేతులా ధారాళంగా ఖర్చు పెట్టేవాడు. రఘుపతి స్టూడియోలో ఒక ఎయిర్ కండిషన్డ్ గది వుంది హరీన్ కి. అందులోనే మేకప్ క్చూబికల్. అందులోనే ఒక కప్ బోర్డు కూడా వున్నాయి.
ఆ కప్ బోర్డులో పడేస్తుండేవాడు వచ్చిన డబ్బంతా. రెండు మూడు రోజులకోసారి ఇంటికి పట్టుకెళ్ళేవాడు.
డబ్బంటే అంత నిర్లక్ష్యం హరీన్ కి.
ఒకసారి ఔట్ డోర్ షూటింగ్ కి వెళ్ళినప్పుడు -వరంగల్ - వెయ్యి స్తంభాల గుడిదగ్గర - ఎందుకో అవసరం వచ్చి జేబులో వున్న వంద రూపాయలనోట్ల కట్ట బయటికి తీశాడు హరీన్. పక్కనే వున్న ఒక బిచ్చగత్తె - నిండా పదేళ్ళు వుండవు ఆ అమ్మాయికి - "ఒక పదిరూపాయలు నాకు ఇవ్వకుడదా దొరా! పోనీ అప్పుగా ఇవ్వులే! పండగ అయిపోయాక తిరిగి ఇచ్చేస్తా" అంది. అవి తెలిసి మాట్లాడుతున్న మాటలో తెలియక మాట్లాడుతున్న మాటలో ఎవరికీ అంతుబట్టలేదు.
కానీ ఆ మాటలని చాలా సీరియస్ గా తీసుకున్నాడు హరీన్. రెండడుగులు ముందుకు నడిచిన వాడు తిరిగి వెనక్కి వచ్చి, ఆ నోట్ల కట్ట మొత్తం ఆ పిల్ల చేతిలో పెట్టేశాడు.
పదివేలు  - భిచ్చగత్తెకి!
అది కూడా ముష్టివేస్తున్నట్లుకాదు - చిన్నారి చెల్లికి అన్న ఇస్తున్నట్లు ఆమె చేతిలో పెట్టి, తలనిమిరి వెళ్ళిపోయాడు.
అది చూసి హరీన్ కి "పిచ్చి' అన్నారు కొందరు. 'గొప్ప' అన్నారు. 'పబ్లిసిటి కోసం జిమ్మిక్కు అది ' అని పెదవి విరిచారు మరి కొందరు.
అవేవీ నిజంకాదని తనకు తెలుసు. హరీన్ ఏంచేస్తే దానికి పబ్లిసిటి వస్తుంది.
పబ్లిసిటి కోసం అతనేమీ చెయ్యడు - ఎప్పుడూ కూడా.
మరోసారి ఏమయిందంటే -
హరీన్ ఇంట్లో ఒక గజదొంగ పడ్డాడు. అతని చేతిలో గునపం వుంది. ఆ అలికిడి విని లేచిన హరీన్ సందేహించకుండా అతనితో కలబడ్డాడు. హరీన్ దగ్గర రివాల్వర్ వుంది. కాని అది ఉపయోగిస్తే తీవ్రంగా గాయలవుతాయని భయపడి, ఉత్తచేతులతో దొంగనీ లొంగదీశాడు. తర్వాత వాణ్ని వెళ్ళిపోనివ్వనూలేదు - పోలిసులకీ అప్పగించానులేదు. కూర్చోబెట్టి, అన్నంపెట్టి, వాడి వృత్తాంతం అంతా వెలికిదీశాడు హరీన్.
దానితో దిమ్మెరపోయిన ఆ దొంగ ఏదీ దాచకుండా నిజాలే చెప్పాడు. అందరికి వుండే కష్టాలవంటివే అతనికి వున్నాయి. అతని తల్లి రోగిష్టిది. అతని భార్య పిచ్చిది. రోజూ ధర్మసుపత్రికి, పిచ్చాసుపత్రికి తిరగాడంతోనే అతని సమయమంతా గడిచిపోతుంది. ఇంట్లో పిల్లలు పస్తులూ - వైద్యానికి, ఇల్లు జరగడానికి డబ్బు కావాలి. అందుకే దొంగతనాలు అలవాటయ్యాయి.
అతని కష్టాలు విని కరిగిపోయాడు హరీన్. తన డ్యూటీని నిర్లక్ష్యంచేసి నిద్రపోయి, ఇంట్లోకి దొంగని రానిచ్చిన వాచ్ మెన్ ని ఉద్యోగంలో నుంచి తీసేసి, ఈ దొంగనే తన వాచ్ మేన్ గా పెట్టుకున్నాడు.
అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఇప్పుడు ఆ మాజీ దొంగకంటే నమ్మకమైన స్వామిభక్తీ పరాయణుడు మరొకడు వుండడు.
ఇలాంటి పనులు ఎన్నో చేశాడు హరీన్. రక్తదానం చేసి ఎంతో మంది ప్రాణాలు రక్షించాడు. గుప్తదానాలు చేసి చాలామంది బతుకులు నిలబెట్టాడు.
అంతెందుకు?
ఇప్పుడు ఈ యూనిట్ లో వున్న వాళ్ళలో ప్రతివాడూ హరీన్ చేత ఉపకారం పొందినవాడే. ప్రతివాడూ హరీన్ దేవుడని కీర్తించినవాడే.
కానీ
'పబ్లిక్ మెమరీ ఈజ్ షార్ట్' అంటారు. ప్రజలకి జ్ఞాపకశక్తి తక్కువ. అందులో ఈ సీనిజనాలకి మరీ తక్కువ.
ఇప్పుడు వీళ్ళకి కనబడుతున్న కొత్తదేవుడు కిశోర్.
ఒకవేళ హరీన్ గనక బతికివుంటే ..........అతను తిరిగివస్తే ...........అతని పరిస్థితి ఎలా ఉంటుంది?
అసలు బతికి వున్నాడా హరీన్?
కొండకొమ్ము అంచుకి వెళ్ళి ఆర్తిగా తొంగిచూసింది మధుమతి. హటాత్తుగా ఆమెకి కళ్ళు తిరగడం మొదలెట్టాయి.

                                               * * *
కింద లోయలో..........
చనిపోయిన ముసలమ్మ భౌతికకాయాన్ని కొండ కొమ్ముమీదికి తీసుకు వెళ్ళడానికి ఏర్పాట్లు పూర్తీ అయ్యాయి.
అన్నిటినీ జాగ్రత్తగా గమనిస్తున్నాడు హరీన్.
ఆ కొండని ఒక మహా సర్పం పెనవేసుకుని ఉన్నట్లు దానిచుట్టి అతి సన్నటి కాలిబాట కనబడుతోంది.
ముసలమ్మ శవాన్ని మోసుకుంటూ పైకి నడవటం మొదలెట్టారు ఆటవికులు. ఒకే నెలలో తల్లినీ, కొడుకునీ కూడా పోగొట్టుకున్న ఆటవికుల నాయకుడు, ఆ దైన్యం మోహంలో కనబడుతుండగా ముందు దారితీస్తున్నాడు. ఆ బాట ఎక్కువ వెడల్పు లేదు. కాలుజారి అంత ఎత్తు నుంచి కిందపడితే మరణం తధ్యం.
కొండకొమ్ము మీదికి చేరడానికి ఇంకో అరగంట నడక ఉందనగా, అక్కడ శవాన్ని దింపి, కొద్దిసేపు ఏవో మంత్రాలు చదివాడు మల్లయ్య.
నెమ్మదిగా హరీన్ పక్కన చేరాడు నాయకుడు. చాలా తగ్గు స్వరంతో అన్నాడు -
"మళ్ళీ నీకు చెప్పే అవకాశం వస్తుందో లేదో! అందుకని ఇప్పుడే చెబుతున్నాను. ఈ లోయలో నుంచి బయటపడటానికి ఒకే ఒక్క మార్గం వుంది. అది ఎక్కడ ఉందంటే ........."
నాయకుడు హరీన్ తో గుసగుసగా ఏదో మాట్లాడుతుండటంగమనించి ఒక్క ఉదుటున అక్కడికి చేరుకుంది చిక్ లీ.
"నాయకా ........బాగా డస్సిపోయినట్లున్నావు . గొంతుతడుపుకో!" అంటూ ఇప్పసారా నింపిన ఎండుసొరకాయ బుర్రని అతనికి అందించింది.
చిక్ లీ గడుసుతనాన్ని మనసులో అసహ్యించుకుంటునే ఆ సొరకాయ బుర్రను అందుకుని, ఎత్తి, సారాని కొద్దిగా తాగాడు నాయకుడు.
చిక్ లీ తాపత్రయం హరీన్ కి అర్ధమయింది. తను నాయకుడితో సన్నిహితంగా వుంటే, నాయకుడికి కలగబోయే చిక్కులు గ్రహించి అక్కడినుంచి దూరంగా వెళ్ళిపోయాడు హరీన్.
అది చూసి అలవోకగా నవ్వుకుంది చిక్ లీ. తర్వాత దేశింగ్ దగ్గరికి నడిచి, అతనొక్కడికి మాత్రమే వినబడేటంత మెల్లగా అంది.
"దేశింగ్ .........ఈ నాయకుడి ప్రవర్తన అనుమానాస్పదంగా వుంది నాకు. రహస్యమార్గం బయటపెట్టేసి, జింబురూనీ, ఆ పట్నంపిల్లనీ ఇక్కడినుంచి పంపించే ప్రయత్నంలో ఉన్నాడాయన. అలా జరగడానికి వీల్లేదు. వాళ్ళు పారిపోకుండా వెయ్యి  కళ్ళతో కనిపెట్టి ఉండాలి మనం - ఏమంటావ్?"
అదోలా గొంతుపెట్టి అన్నాడు దేశింగ్.
"ఆ జింబురూ తప్పించుకుపొతే నాకు లాభమేకదా చిక్ లీ!"
"లాభమా? ఏం లాభం?"
"వాడు కనబడకుండా పొతే, నా నాయకత్వానికి సవాలు వుండదు. నిన్ను పెళ్ళాడటానికి అపుడు నాతొ పోటీ పడేవాళ్ళు ఎవరూ వుండరు."
నవ్వింది చిక్ లీ.
"హొయ్ హొయ్ హొయ్! ఉహాలకేం తక్కువలేదు. కానీ ఒక్కవిషయం మర్చిపోతున్నావు దేశింగ్!"
"ఏమిటిది?"
"జింబురూ తప్పించుకుపోయినంత మాత్రాన నీ నాయకత్వానికి ఎదురు ఉండదని ఎందుకనుకుంటున్నావు? ఏదో ఒకరోజున జింబూరూ మళ్ళీ తిరిగిరావచ్చు, నిన్ను మట్టుపెట్టవచ్చు. శత్రుశేషాన్ని మిగల్చకూడదు దేశింగ్. అందుకని ......"
ఆశ్చర్యంగా చూశాడు దేశింగ్. చిక్ లీనేనా ఈ మాటలు మాట్లాడుతోంది? అంటే ఆమె ఉద్దేశ్యం ఏమిటి? జింబురూని చంపమనా? మరి జింబురూని ఈమె అంతగా ప్రేమిస్తోంది కదా?
అతని సందేహాన్ని కనిపెట్టింది చిక్ లీ "వీళ్ళ ప్రవర్తన నాకు నచ్చలేదు. పంచాయితీ పెట్టించి బెదిరించి లొంగదీసి , పెళ్ళిచేసుకున్నా నేనంటే ఇష్టం లేని ఈ మొగుడితో నేనేం సుఖపడగలను? దేశింగ్ ........నా మనసులో మాట ఉన్నది ఉన్నట్లు చెబుతున్నాను. నిన్ను కాదని అవమానపరిచాడు జింబురూ. దానితో నా మనసు విరిగిపోయింది. అందుకు బదులుగా అతన్నీ అతని తండ్రిని అవమానపర్చి, వాళ్ళనీ అందరి ముందు దోషులుగా నిలబెట్టి, నాయకత్వాన్ని నీకు దాఖలు పరచడానికే ఇంత నాటకమాడుతున్నాను నేను. నన్ను నమ్ము!" అంది కనురెప్పలు అల్లల్లార్పుతూ.
ఆమె మాటలు నిజమో, అబద్దమో తేల్చుకోలేక పోయాడు దేశింగ్.
"మరి వాళ్ళని ఇప్పుడే మట్టు పెట్టచ్చుగా?" అన్నాడు సందేహంగా.
ఉలికిపడి మళ్ళీ అంతలోనే తమాయించుకుని అంది చిక్ లీ.
"ఇప్పుడే వాళ్ళని చంపితే అందరి దృష్టిలో నువ్వు అపరాధివవుతావు. నా భర్త అపరాధిగా అందరి ముందూ తలవంచుకోవలసి రావడం నేను భరించలేను."
ఒక్కసారిగా అనందం ఉప్పొంగింది దేశింగ్ గుండెలో.
"భర్తా! ఏమిటి చిక్ లీ.........ఎమంటున్నావ్?"
"తొందరపడవద్దంటున్నాను. ఈ ఒక్కనెల గడువూ గడిచి పోనివ్వమంటున్నాను. ఆ తర్వాత ముసలమ్మ శరీరాన్ని పక్షిరూపంలోని పూర్వికుడు తినేసిన తర్వాత, ఏదో మిషమీద వీళ్ళందరినీ సఫా చేసి, నువ్వు నాయకుడివవుదువుగానీ, నేను నీ రాణినవుతాను. అప్పటిదాకా నీ బాధ్యత ఏమిటంటే, వీళ్ళు తప్పించుకుపోకుండా చూడటమే!"
దేశింగ్ ఛాతి ఉప్పొంగింది.
"సరే! అన్నాడతను ఆనందంగా.
అప్పుడు వినబడింది తుమ్మెద ఝుంకారంలాంటి శబ్దం. చాలా దూరంనుంచి వినబడుతోంది అది. బహుశా కొండకొమ్ము మీద నుంచి వస్తుండవచ్చు ఆ శబ్దం. అందరూ చెవులు రిక్కించి విన్నారు ఆశబ్దాన్ని.
కానీ హరీన్ కీ, కరుణకీ మాత్రం అర్ధం అయింది ఆ శబ్దం ఏమిటో.
అది హెలికాప్టర్ ఇంజన్ శబ్దం.
అప్పుడు చటుక్కున గుర్తొచ్చింది హరీన్ కి షెడ్యుల్ ప్రకారం ఆరోజే తన కొత్త పిక్చరు మొదలవ్వాలి.
ఇక్కడే షూటింగు! హెలికాప్టరు సీన్సు!
తను లేకుండా పిక్చరు ఇలా మొదలవుతోంది?
అంటే, తన బదులు మరెవరయినా........?
ఆలోచనతో అతని నొసలు ముడిపడ్డాయి.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra