Home » Mainanpati bhaskar » Daimond Raja Aathin Rani

 

    "ఈ లవ్ అట్ ఫస్టు సైట్ అనేది ఉన్నట్లే! హెట్రేడ్ అట్ ఫస్టు సైట్ అని కూడా ఉంటుంది రాజా! మొదటి చుపూలోనే ద్వేషం! అర్ధమయిందా? నీకు తెలియకుండానే నువ్వు ఆఠీన్ రాణీ మీనాక్షితో మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతే, మీనాక్షి మొదటి చూపూలోనే నువ్వంటే ద్వేషం పెంచుకుంది! కారణం ఏమిటో తెలుసా! నౌ యూ ఆర్ ఎ మనీ బాగ్! డబ్బు బస్తావి నువ్వు! డబ్బు బస్తా గాళ్ళంటే మీనాక్షికి మహా అలర్జీ. సింగర్ అయిన డైమండ్ రాజాని చూస్తే ఇష్టపడి ఉండేదేమో మీనాక్షి....... కానీ రాజా ఆఫ్ రాణీపూర్ అయిన నిన్ను చూస్తే మాత్రం అసహ్యించుకుంటుంది! ష్యూర్!" అన్నాడు.


    "బాస్టర్డ్!" అని మల్ హోత్రా షర్టు పట్టుకుని అతన్ని ఊపేశాడు రాజా ........అంతలోనే అతనికి తమకి దగ్గరలోనే మరో మనిషి నిలబడి ఉన్నట్లు అనిపించింది. మల్ హోత్రాని వదిలేసి తిరిగి చూశాడు.


    అక్కడో మహా చిత్రమైన మనిషి నిలబడి ఉన్నాడు!


    సూట్ వేసుకుని ఉన్నాడతను! ప్యాంటు ఒకవైపు మోకలిదాకా పైకి మడిచి ఉంది. కాళ్ళకి బూట్లు లేవు. షర్టు ప్యాంటులోకి టక్ చెయ్యకుండా కోటులో నుంచి కిందికి వేళ్ళాడుతూ కనబడుతోంది. నెక్ టైని తలపాగాలా చుట్టి కట్టుకున్నాడు. జుట్టు ఎదుపంది ముళ్ళలా లేచి వుంది. మొహానికి మట్టి పూసుకుని ఉన్నాడు. హాట్ ని చేతిలో పట్టుకుని "అయ్యా! ధర్మం! అమ్మా ధర్మం!" అంటున్నాడు.


    మంచి కుటుంబానికి చెందిన వ్యక్తుల్లో కూడా కొందరికి పిచ్చిపట్టినప్పుడు , ఇల్లు వదిలేసి , పిచ్చి చేష్టలు చేస్తూ తిరుగుతూ ఉండడం డైమండ్ రాజాకి అనుభవమే! అందుకని అతను అట్టే ఆశ్చర్యపోలేదు.


    కానీ .........


    పిచ్చిబిచ్చగాడి గెటప్ లో ఉన్నది ట్రస్టీ సుందరమేనని మాత్రం రాజా గ్రహించలేకపోయాడు! పొద్దున్న పాలెస్ లో సందట్లో సడేమియాలాగా ఒక్క క్షణం పాటు తనకి కనబడ్డ సుందరం రూపం అతని మెదడులో సరిగా రిజిస్టర్ అయి ఉండలేదు.


     "ధర్మం చెయ్ తల్లే!" అన్నాడు సుందరం డైమండ్ రాజా వైపు చూస్తూ......


    జేబులో చెయ్యపెట్టి ఒక వంద రూపాయల నోటు తీశాడు డైమండ్ రాజా. దాన్ని సుందరం టోపీలో వేశాడు.


    డైమండ్ రాజా అంత చులాగ్గా వందరూపాయల నోటు దానం చేసెయ్యడం చూస్తే సుందరం ప్రాణాలు కడబట్టినట్లయింది. "వీడు ఇట్లా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు వంద రూపాయల నోట్లు పందారం చేసేస్తుంటే ఆస్తి కరిగిపోదూ?" అనుకున్నాడు దిగులుగా.


    "వందరుపాయలు వద్దు తల్లే! ఒక్క రూపాయి చాలు!" అన్నాడు సుందరం తికమకగా.


    "ఫర్లే! ఉంచుకో!" అని చెప్పి, మల్ హోత్రా వైపు తిరిగాడు రాజా :గుర్తుందా! ఆఠీన్ రాణీకి అపకారం జరిగిందో ......." అని బెదిరింపుగా తర్జని చూపించి , లోపలికి నడిచాడు.


    బట్టలు దులుపుకుని అతన్ని అనుసరించాడు మల్ హోత్రా.


    వాళ్ళిద్దరూ వెళ్ళిపోగానే, సుందరం కర్చీఫ్ తో మొహానికి ఉన్న మట్టి తుడిచేసుకుని, పొట్లం కట్టి ఉన్న ఫేస్ పౌడరు కాస్త రాసుకుని, కారులో ఉన్న బూట్లు వేసుకుని, షర్టు టకప్ చేసి, తల దువ్వుకుని గెటప్ మార్చేసి, హోటలు వెనక దారి గుండా గ్రీన్ రూంలోకి వెళ్ళిపోయాడు.


    పాటల మధ్య బ్రేక్ వచ్చి అప్పటికే గ్రీన్ రూంలో కూర్చుని ఉంది ఆఠీన్ రాణీ. ఇందాక ఒక మొగాడు తనతో కలిసి డాన్స్ చెయ్యబోవడం, తనకి వంద రూపాయల కట్ట ఇవ్వబోవడం......అదంతా గుర్తొచ్చి అసహ్యంగా అనిపిస్తోంది మీనాక్షికి.


    సరిగ్గా అదే టైంలో గ్రీన్రూంలోకి వచ్చాడు సుందరం.


    "మిస్ మీనాక్షి?" అన్నాడు ప్రశ్నార్ధకంగా.


    "యస్?" అంది మీనాక్షి, నుదురు చిట్లించి చూస్తూ.


    "నువ్వు నిరాకరించలేని ఒక అద్భుతమైన ప్రపోజల్ చెయ్యడానికి వచ్చాను" అన్నాడు సుందరం మిస్టీరియస్ గా.


    డైమండ్ రాజా మళ్ళీ లోపలికి వెళ్ళి తన టేబుల్ ని సమీపించాడు. అప్పటికే అక్కడ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నాడు జస్వంతరావు. జస్వంతరావు పక్కనే ఉన్నాడు ఒకతను...బహుశా యూరోపియన్. అయి ఉండవచ్చును. వయసు నలబై లోపలే వుంటుంది. మంచి అద్లేటిక్ పర్సనాలిటి. రోజూ ఎక్సర్ సైజు చెయ్యడం వల్ల బాడీ కంట్రోల్ లో ఉండడం వేరు........చాలా అడ్వెంచరస్ గా బతకడం వల్ల ఒళ్ళు కొవ్వెక్కకుండా వుండడం వేరూనూ! ఇతను రెండో కేటగిరికి చెందినట్లు కనబడుతున్నాడు. బంగారు రంగులో వున్న బ్లాండ్ హెయిర్ ముందు వైపు పలచబడుతూ బట్టతల రాకని సూచిస్తోంది. అతని బాడీ యంగ్ గానే వున్నా కూడా మొహం మీద మాత్రం రాబోయే ముడతల తాలూకు గీతలు ప్రస్పుటంగా కనబడుతున్నాయి. ఒక రొటీన్ అంటూ లేని లైఫ్ గడపడం, రోజూ లేట్ నైట్స్ స్పెండ్ చెయ్యడం దానికి కారణం అయి వుంటాయని అనుకున్నాడు రాజా.


    రాజా టేబుల్ ని సమీపించగానే, పలకరింపుగా కనుబొమ్మలు ఎగరేశాడు అతను.


    జస్వంతరావు గొంతు సవరించుకుని, గంభీరంగా అన్నాడు "మీల్ ద రాజా ఆఫ్ రాణీపూర్........... రాజశేఖర సింహా! అండ్ దిస్ ఈజ్ క్లయివ్ స్పెన్సర్" అన్నాడు ఫార్మల్ గా పరిచయాలు చేస్తూ.


    మాట్లాడకుండా, కరస్పర్శ కోసం చెయ్యి జాచాడు స్పెన్సర్.


    షేక్ హాండ్ ఇచ్చాడు రాజా. షేక్ హాండ్ ఇస్తూనే ఇంకోసారి క్లయివ్ స్పెన్సర్ వైపు పరిశీలనగా చూశాడు. "పీస్" అని ఇంగ్లీషులో పెద్ద అక్షరాలు స్టేన్సిలు చేసి వున్న తెల్ల బనీను వేసుకుని వున్నాడు క్లయివ్ స్పెన్సర్. ఫేడేడ్ డేనిమ్స్ , రిమ్ లెస్ బ్లాక్ గ్లాసెస్.


    "ఫైట్ ఫర్ సీస్! ప్లైట్ ఫర్ దబోల్డ్ న్యూవరల్డ్ ఆర్డర్!" అన్నాడు క్లయివ్ వుపోద్ఘాతంగా.


    అతను ఒకటి రెండుమాటలు మాట్లాడగానే ఒక విషయం గ్రహించాడు రాజా. అతని ఇంగ్లీషు వుచ్చారణ అంత నిర్దుష్టంగా లేదు. అతను ఇంగ్లీషువాడు కాడు. అమెరికన్ కూడా కాదు. బహుశా వార్దిక్ కంట్రీస్ కి చెందిన వాడయి వుంటాడు. ఏ నార్వేనో, స్వీడనో........అతని బ్లాండ్ హెయిర్ చూస్తేనే అలా అనిపిస్తోంది.


    అందుకే అతని ఇంగ్లీషు సరిగ్గా లేదు. చాలామంది అనుకునేటట్లు ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడబడే భాష ఇంగ్లీషు కాదు - అసలు యూరోపియన్ దేశాల్లోనే చాలామందికి ఇంగ్లీషు రాదు - జర్మన్లు, ఫ్రెంచివాళ్ళు ఇంగ్లీషు వచ్చినా కూడా మాట్లాడరు.


    "\జస్వంతరావు అప్పటికే నీకు కొంచెం చెప్పి ఉండాలే!" అన్నాడు క్లయివ్ స్పెన్సర్. ఇంగ్లీషులో ఏకవచనానికి, బహువచనానికి ఒకే పదాలు ఉపయోగించినా కూడా , క్లయివు స్పెన్సర్ మాట్లాడుతున్న విధానంలో "నువ్వు , నువ్వు" అంటున్నట్లే ధ్వనిస్తోంది.


    "నీ అసలు పేరేమిటి?" అన్నాడు రాజా.


    ఒక్కసారి ఆశ్చర్యంగా రాజావైపు చూశాడు క్లయివు స్పెన్సర్.

 

    నా అసలు పేరు ఏదయితేనేం గాని - క్లయివు అని పిలువు - చాలు!"


    "గతంలో ఇండియాలో బ్రిటిష్ వారి తరపున క్లయివు పోషించిన పాత్ర చాలా వుంది!


    నాకు అతను రోల్ మోడల్!" అన్నాడు క్లయివు.


    "నువ్వు బ్రిటీష్ వారి తరపున పనిచేస్తున్నావా?"


    "ఐ వర్క్ ఎంటైర్ లీ అన్ మై ఒన్! కానీ కొన్ని దేశాలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి - ఆ సిండికేట్ నావెనక వుంది."


    "ఏఏ దేశాలు?"


    "అది నీకు తర్వాత తెలుస్తుంది."


    "నీకేం కావాలి?"


    "ఇండియా ఇప్పుడున్న షేపులో ఉండటానికి వీల్లేదు."


    "మరి?"


    గాజుపువ్వులా ఉన్న గ్లాసులోని స్కాచ్ ని ఎత్తి నోట్లో పోసుకుని, గుటక వేశాడు క్లయివ్. తర్వాత గట్టిగా శబ్దం అయ్యేటట్లు పెదిమలు చప్పరించి అన్నాడు.


    "చరిత్రకి ముఖ్యలక్షణం ఏమిటో నీకు తెలుసా?" మాట్లాడకుండా చూశాడు రాజా.


    తనే మళ్ళీ చెప్పాడు క్లయివు.


    "చరిత్రకి ముఖ్యలక్షణం ఏమిటంటే - చరిత్ర పునరావృత్తం కావడం జరిగిపోయిన పొరపాట్లలో నుంచి పాఠాలు నేర్చుకోరు జనం! ముఖ్యంగా మీ ఇండియన్సు!"


    "వాట్ డూయూ మీన్?"


    "బ్రిటీన్ మిమ్మల్ని పాలించింది - అంతకుముందు మొగలలు , అంతకుముందు హుణులు, యవనులు, శకులు - అలా అలా అనేక జాతులు మిమ్మల్ని పాలించాయి. తరతరాల దాన్యం తర్వాత ఈ మధ్యనే - అంటే ఒక నలబైఏళ్ళపాటు మీరు స్వాతంత్రం అనుభవించారు!"


    ఈ నలబై ఏళ్ళలో మీరు ప్రపంచానికి ఒకే ఒక్క విషయం నిరూపించగలిగారు. అదేమిటంటే మిమ్మల్ని పాలించుకునే అర్హత మీకు లేదని!"


    అతి కష్టం మీద ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకున్నాడు రాజా.


    ఇంకో గుక్క విస్కీ తాగి, చెప్పడం మొదలెట్టాడు క్లయివు.


    "ఒక్కసారి మీ అసెంబ్లీకో, పార్లమెంటుకో వెళ్ళి చూడు! అసెంబ్లీలో జరగాల్సింది ఏమిటి? ప్రజల సమస్యల గురించి పెద్దలంతా కూర్చుని కులకుషంగా చర్చించి, సామరస్యంగా ఒక అంగీకారానికి వచ్చి ఆ ప్రకారం పధకాలు వేసి పనులు చెయ్యడం! అవునా? కానీ మీ శాసనసభల్లో జరిగేది ఏమిటి? అల్లర్లు , నిందారోపణలు, ప్రతినిందలు, సవాళ్ళు, ప్రతిసవాళ్ళు, మైకులు విరగోట్టడాలు, తొడలు చరచడాలు, స్పీకర్ దగ్గరికి పరిగెత్తడాలు, ఆరోపణలు, ప్రత్యోరోపణలూ, అభాండాలు, కుంభకోణాలు, నాకౌట్లు, వీటికే పుణ్యకాలమంతా గడిచిపోతుంది. ప్రజల సమస్యల గురించి చర్చించే టైమ్ ఉండదు "ప్రజా ప్రతినిదులకి."


    ఉదాహరణకి వాటర్ ప్రాబ్లమ్ తీసుకుందాం! ఆశ్చర్యపోకు - నేను ఫారినర్ నే అయితే మీ దేశం గురించి స్పెషల్ ఇంట్రెస్టు తో చాలా రిసెర్చి చేశాను - వాటర్ ప్రాబ్లమ్ మీ దేశంలో ముఖ్యంగా మీ రాష్ట్రంలో చాలా తీవ్రంగా వుంది! ఒక అంచనా ప్రకారం - ఆంధ్రప్రదేశ్ లో నూట పద్నాలుగు మునిసిపాలిటిలు ఉంటే అందులో ఏడు మునిసిపాలిటిలలో డెబ్బయ్ అయిదు శాతం కంటే తక్కువే నీళ్ళు సప్లయి అవుతున్నాయి. పొతే ఒక్క పదమూడు మునిసిపాలిటిలలో మాత్రమే పరిస్థితి కాస్త ఆశాజనకంగా ఉంది. ఓ మోస్తరుగా వాటర్ సప్లయ్ అవుతుంది. ఈ లెక్కలన్నీ, పెద్ద పట్టణాల గురించి -


    ఇంక పల్లె ప్రాంతాల సంగతి ఎలా వుంటుందో ఉహించుకో! ఇకపోతే హైద్రాబాద్ . ఎప్పుడో నైజాం కాలంలో 4 లక్షల జనాభా కోసం ఏర్పాటు చేసిన వాటర్ సిస్టం అది. హైదరాబాద్ మెగా సిటి అవుతున్నా కూడా ఇంకా ఆ సిస్టమ్ ద్వారానే నీళ్ళు వస్తునాయి. భాగ్యనగరంలో రెండురోజులకోసారి మంచినీళ్ళు - రాజధానిలో నీటి ఎద్దడి. ఎంత సిగ్గు చేటు. మీకు స్వాతంత్ర్యం వచ్చి నలబైఏళ్ళయింది!


    కానీ దీనిని గురించి ఎవరూ అడగరు, చర్చించరు - అనవసరమైన విషయాల మీద అసమానం రగడ! ఉత్తరప్రదేశ్ విదానసభలో సభ్యులు రక్తం కారెటట్లు కొట్టుకున్నారు. ఒక అసెంబ్లీలో ఒక నాయకురాలిని వస్త్రాపహరణం చేయ్యబోయారు. అక్కడే ఇంకో సందర్భంలో ప్రతిపక్ష సభ్యుల పంచెలు ఉడదీయ్యడం జరిగింది సరే - మీ ఆంధ్రా అసెంబ్లీలో జరిగే అద్భుతాల గురించి ఒక బృహద్రంధమే రాయోచ్చనుకో!"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra