Home » Kommanapalli ganapathi rao » Nestham Neepere Nishshabdham

   
    "అయినా నేను తొందరపాటు ప్రదర్శించకుండా ఓపిక పట్టాను. వ్యక్తిగతమైన కక్షని ప్రదర్శించబోయిన కమిటీ మెంబర్స్ కొందరు నేను చేయని తప్పుకి హితభోద చేయబోతే జరుగుతున్న ప్రభుత్వ విధానాల గురించి మనుషులకి పట్టని విలువల గురించి జవాబు చెప్పాను....అంతే.....అది కాదు సామ్రాజ్యం....నేను కమిటీని సంతృప్తిపరిచే స్థాయిలో నా తెలివిని ప్రదర్శించకపొతే నన్ను సమర్ధించిన కమిటీ చైర్మెన్ శరత్ చంద్ర గారు రాజీనామా ఎందుకు చేశారు?"

 

    "నీలా సంఘంలో ఇమడలేని ఇంకో వ్యక్తీ కాబట్టి" టక్కున అంది సామ్రాజ్యం. "అవును ధన్వి....అసలు ఆ పెద్ద మనిషికి చేవ వుంటే పిరికివాడిలా పారిపోయే వాడు కాదు.....కమిటీలో వుండి పోరాడి మరీ నీ విషయంలో సాయం చేసేవాడు...."

 

    "పోరాడాలనే ఆలోచన అందరికీ వుండదు సామ్రాజ్యం....."

 

    "అప్పుడు వాళ్ళని ఎస్కేపిస్ట్ లు అనాల్సి వుంటుంది ధన్వి."

 

    ఆవేశంగా అంది సామ్రాజ్యం...."మేధావులనిపించుకునే అలాంటి వ్యక్తులే న్యాయాన్ని నిలబెట్టలేక ఆర్మ్ చైర్ ఆప్టిమిస్టుల్లా పలాయనానికి సిద్దపడితే సామాన్యుల మాటేమిటి....? సంఘానికి వుపయోగపడని తెలివిని మెదళ్లలో దాచుకుని అద్దాల తలుపులు వెనుక కూచుని సంఘం ఏమైపోతుంది అని ఆలోచించే ఇలాంటి మేధావులు ఆకలి కోసం రొట్టెముక్కని దొంగతనం చేస్తూ పట్టుబడ్డాక తన పరిస్థితిని ధైర్యంగా తెలియచెప్పే మాములు మనుషుల కన్నా అధములు ధన్వి...."

 

    డాక్టర్ శరత్ చంద్ర గురించి సామ్రాజ్యం అలా మాటాడ్డం నచ్చలేదు.

 

    "వద్దు....లెట్స్ డ్రాప్ ది మేటర్."

 

    "ఎంత స్వార్ధంగా ఆలోచిస్తున్నావో చూశావా ధన్వి?" నిర్లిప్తంగా నవ్వింది సామ్రాజ్యం. "నీ కోసం ఓ వ్యక్తీ అక్కడ అందరితో యుద్దానికి సిద్దపడ్డాడని తెలిసేసరికి నీకు అయన మీద హటాత్తుగా సానుభూతి పెరిగిపోయింది....యుద్ధం చేసినా గానీ చివరికి ఏం సాధించాడు అన్న ఆలోచన నీకు లేదు....అసలు...."

 

    విశ్లేషణలా ఆగింది అరక్షణం పాటు....

 

    "నువ్వేమవుతావో తెలిక నీ ప్రవర్తన గురించి బాధపడే మీ నాన్నకి, నీ గురించి ఏమి చేయలేక అస్త్రసన్యాసం చేసిన శరత్ చంద్రకి తేడా ఏమిటి....ఇద్దరూ ఒకటేగా?"

 

    "ఇక్కడ సమస్య నేను గెలవడం ఓడటం కాదు సామ్రాజ్యం.....నీతిగా బ్రతకడమా లేక అవినీతితో అయినా జీవితాన్ని గెలుచుకోవడమా అన్న విషయం....అలా వాస్తవాన్ని ఎనలైజ్ చేస్తే డాక్టర్ శరత్ చంద్ర అవినీతికి తల ఒగ్గలేక తన లాభాన్ని త్యాగం చేశాడు. నన్ను గెలిపించలేక పోతేనేం? తను ఓ ఆదర్శానికి కట్టుబడి వున్నాడుగా....అంటే అయన నైతిక విలువల్ని పాటించిన ఉత్తముడైన వ్యక్తేగా......"

 

    "ఆచరణయోగ్యంగా విలువల్ని మలచుకోలేని మేధావులు నా వుద్దేశంలో లైబ్రరియన్స్లాంటి వాళ్ళు ధన్వి.....లైబ్రరీలో ప్రపంచానికి చెందిన చాలా గ్రంధాలు వున్నా ఏ ఒక్కటి చదవలేని లైబ్రరియన్స్ కన్నా తెలివుండి వినియోగించని ఈ సోకాల్ట్ మేధావులు ఎలా గొప్పవాళ్ళలనిపించుకుంటారు...."

 

    ఈరోజు సామ్రాజ్యం చాలా గట్టిగా అర్గ్యు చేస్తుంది....

 

    అది అమ్మ సమక్షంలో.

 

    అమ్మ లోతుగా ఆలోచించలేని ఆడది....అందుకే విషయం కుదిస్తే తప్ప ప్రయోజనం లేదనిపించింది ధన్వికి.....సామ్రాజ్యన్ని నిరోధించటానికి అన్నట్టుగా అన్నాడు. "యుద్దంలో గైడ్ చేసే సైన్యాధిపతి సైనికుడిలా పోరాడకు సామ్రాజ్యం.....పోరాటానికి కావాల్సిన స్పూర్తి అందిస్తాడు. మేధావి వర్గం ఆ కోవకి చెందిందే....."

 

    "మాటకారివి ధన్వి....." నవ్వేసింది. "నికనుగుణంగా అర్గ్యు చేయగల సమర్దుడిని" సమీపంలో సావిత్రి లేకపోవటం చూసి అంది సామ్రాజ్యం. నీలాంటి ఓ పెద్ద మనిషి ఓ రైలు భోగిలో ప్రయాణం చేస్తూ న్యూస్ పేపర్ ముక్కల్ని కిటికీలో నుంచి అదేపనిగా విసురుతున్నాడట....ఎదురుగా కూర్చున్న నాలాంటి ఓ ఆడదానికి చిరాకేసి ఏం ఆశింఛి ఆ కాగితపు ముక్కలు విసురుతున్నారు అని అడిగింది. దానికి ఆ యువకుడేమన్నాడో తెలుసా?"

 

    "చెప్పు?"

 

    "ట్రైను మీద కలియబడే ఏనుగుల్ని తరమటానికి కాగితపు ముక్కల్ని విసురూతున్నా అన్నాడు. ఆ యువతి ఆశ్చర్యపోయి బయటికి చూసింది. అసలు ఏనుగు లెక్కడుతున్నాయీ అని అడిగింది. ఫకాల్న నవ్వేసిన సదరు యువకుడు కాగితపు ముక్కలు విసురుతుంటే ఇంకా ఏనుగులు ఎక్కడుంటాయీ అన్నాడు."

 

    అంత టెన్షన్ లొనూ నవ్వకుండా వుండలేకపోయాడు ధన్వి.

 

    "ఇప్పుడీ జోక్ చెప్పడంలో నీ అభిప్రాయం ఏమిటో తెలుసుకోవచ్చా?' అన్నాడు.

 

    "సింపుల్ ధన్వి! తెలివైనావాడు ప్రతి చర్యని సమర్దించుకోగలడు . ఆ ట్రైన్ లో యువకుడిలా.....నువ్వు ఓ మేధావిని సమర్ధించడం కూడా నాకు అలానే అనిపించింది."

 

    ఆ తర్వాత గొంతు స్థాయి తగ్గించి నెమ్మదిగా అంది సామ్రాజ్యం. "నా సమస్య అది కాదు ధన్వి! నువ్విలా ఎక్కడా సెటిల్ కాకుండా వుండిపోతే రేపు నా దగ్గర ఓడిపోవాల్సి వస్తుంది."

 

    హటాత్తుగా ధన్వి మొహం వివర్ణమైంది.

 

    "నో ప్రాబ్లమ్! నేను గెలవటానికి ఇంకా వ్యవధి వుంది."

 

    "ఓ.కే." అది బిడియమో లేక గుండెలోతుల్లో ఉవ్వెత్తున లేచిన ఆలోచనల ఒరిపిడికి ఆమెలో మొదలయిన అందోళనో ఆమెకి తెలీదు....."గుర్తుందిగా! రేపు సాయంకాలం అయిదు గంటలకి మా ఇంట్లో మనం సమావేశమవుతున్నాం."

 

    సామ్రాజ్యం కదిలింది రాయంచలా.

 

    బడలికగా బెడ్ మీద వాలిపోయిన ధన్వి ముందు మధూళీ రూపాన్ని వుహించుకున్నాడు.

 

    ఎందుకో మధూళీ అడిగింది చాలా చిక్కు ప్రశ్న అనిపించింది.

 

    అలా ఎంతసేపు ఆలోచించాడో అతడికి గుర్తులేదు.

 

    మాగన్నుగా నిద్రపట్టిన ధన్వి ఎవరో తట్టినట్టనిపించి కళ్ళు తెరిచాడు.

 

    గదిలో విద్యుద్దిపపు కాంతి.

 

    వాల్ క్లాక్ రాత్రి తొమ్మిదిగంటలు సూచిస్తుంది. సమీపంలో అన్నం ప్లేటుతో అమ్మ నిలబడి వుంది. వాతావరణం ఇంత ప్రశాంతంగా వుందేం!

 

    విస్మయంగా చెవులు రిక్కించాడు.

 

    ఆ సమయంలో లెక్కప్రకారం నాన్న తాగి తనను తూలనాడుతుండాలి.

 

    అసలు ఈ రాత్రి తండ్రి ప్రవర్తన తారాస్థాయిలో వుంటుందనుకున్నాడు.

 

    అలాంటి ఛాయలు కనిపించకపోవడంతో "నాన్నగారూ లేరా....?" అన్నాడు రహస్యంగా.

 

    "మనసు బాగోలేదట్రా! తొందరగా భోంచేసి పడుకుండిపోయారు" అన్నం ముద్దలుగా కలుపుతుంది అమ్మ.

 

    భోంచేసిన తర్వాత నెమ్మదిగా అప్పుడు అదించింది సావిత్రి ఓ కవరుని.

 

    మరో వారం రోజుల్లో డిల్లీ లోని తమ కార్యాలయానికి ఇంటర్వ్యూకి హాజరు కమ్మంటు "ఇంజనీర్స్ ఇండియా" వాళ్ళు పంపించిన కాల్ లేటరధి . ఆ ఎనవలప్ ఏమిటో బోధపడినట్టు "న్నాన్నగారికి చూపించలేదురా."అంది రహస్యంగా.

 

    విస్మయంగా అడిగాడు "అదేంటమ్మా?"

 

    "అదికాదురా....." అటు ఇటు చూసి నెమ్మదిగా అంది. "ఒకవేళ ఈ ఉద్యోగం కూడా రాలేదనుకో. నువ్వక్కడేడో అరిచి గోలపెట్టావు అంటారు మీ నాన్న. అందుకే ఆయనకి చూపించకుండా ఇప్పుడీస్తున్నా."

 

    ధన్వి మనసు అదోలా అయిపోయింది.

 

    కట్టుకున్నవాడికి, కన్నబిడ్డకి మధ్య నలిగే అమ్మ తనకి రావాల్సిన ఉద్యోగం కన్నా ఇంట్లో గొడవకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి మాట్లాడుతుంది.     

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra