Home » Yerramsetti sai » Death Chamber


    "వాళ్ళెవరో చెప్తారా?" భయపడుతూనే అడిగాడతను.
    "నేనూ...... ప్రేమ్ కుమార్ లాంటిగోముఖవ్యాఘ్రాలగురించి తిడుతూరాయండి. అతను తెరమీద చూపే నీతికీ, తెరవెనుకచేసే దుర్మార్గాలకూ పొంతన లేదనీ అందరికీ తెలియచేయండి."
    "సరేనండీ! మీరు చెప్పిందిచెప్పినట్లు రాస్తాం. మళ్ళీ మీరేం అఫెండ్ అవరుకదా!"
    "లేదు నేనుచెప్పినప్పుడు ఇంక నాకెందుకు కోపం?"
    "థాంక్యూ! ఇవాళే ఈ న్యూస్ పంపిస్తే ఆదివారం వచ్చే ఇష్యూలో ప్రింటయిపోతుంది" లేచి  ఆమెకు నమస్కరించి బయటకు వెళ్ళిపోయాడతను.
    అతను వెళ్ళిపోయాక కొద్దిసేపు కదలకుండా కూర్చుండి పోయింది. మనసులో రగులుతున్న అగ్ని చాలా వరకూ చల్లారినట్లనిపించింది.
    తను చేసిన పని మంచిదో, చెడుదో తనకు తెలీదు. మంచిదయినా చెడుదయినా ఫరవాలేదు. తనకు ఎంతో ఊరట కలిగించేవిషయం అది.
    స్టూడియోకి చేరుకుంది.
    "నాకు రెండు రోజులపాటు పని వుంది. మీరు ఎడ్జస్ట్ చేసుకోగలరా?" డైరెక్టర్ నడిగింది.
    "ఓ రెండురోజులు కాకపోతే మూడురోజులు తీసుకోండి. కాకపోతే తరువాత ఎక్కువ టైం వర్కు చేయాల్సి వుంటుంది."
    "ఫరవాలేదు. అలాగేచేస్తాను. అయితే రేపూ..... ఎల్లుండీ నేనురావడం లేదు."
    "ఓకే! మిగతా ఆర్టిస్టుల కాంబినేషన్స్ పూర్తి చేస్తాన్లెండి ఈలోగా."
    మర్నాడు ఉదయం ఎనిమిది గంటలకల్లా సరోజిని ఇంటికి చేరుకుంది చంద్రిక.
    సరోజిని ఆమె కోసమే ఎదురుచూస్తూవుంది. ఇద్దరూ మెడపై అంతస్తులోని గదిలోకి చేరుకున్నారు.
    ఆ  గది హాస్పిటల్ లోని గదిలాగానే వుంది. ఒక పక్క మంచం, మరో పక్క డెక్ లాస్ టేబులూ, కుర్చీలూ, ఓ సోఫా కమ్ బెడ్, ఎయిర్ కూలరూ, ఎటాచ్ డ్ బాత్.......ఓ మూల టీపాయ్ పైన రకరకాల మాగజైన్లు వున్నాయి. మరో పక్క పేషెంట్లు పడుకునే బల్ల దానిపై తెల్లటి దుప్పటి.
    "ఈ రెండ్రోజులూ మీరీగదిలోనే బందీ అన్నమాతజ్!" నవ్వుతూ అంది సరోజిని.
    "థాంక్యూ! మంచి ఏర్పాట్లుచేశారు."
    "మీకు సహాయంగా వుండడానికని మా నర్సింగ్ హోమ్ నుంచి ఓ మళయాళి నర్సుని కూడా తీసుకొచ్చాను. అఫ్ కోర్స్! ఆమెకి మీరెవరో తెలీదులెండి. గుర్తు పట్టకుండా ఉండాలనే ఆమెను తీసుకొచ్చాను."
    చంద్రికకు సిగ్గుగా వుంది.
    సరోజిని ఎంత చనువుగా, స్వేచ్చగా మాట్లాడుతున్నా తనకు ఇంకా గిల్టీగానే వుంది.
    నిజంగా చాలా అసహ్యకరమైన పరిస్థితి తనది. దీని కంతటికీ కారణం ప్రేమ్ కుమార్.
    ఇంకా నాలుగురోజులు అంతే! ఆ తర్వాత ఎలాగూ ఆ పత్రిక విడుదల అవుతుంది. ప్రేమ్ కుమార్ కి మతిపోతుంది ఆ దెబ్బతో మొత్తం సినిమా ఫీల్డంతా గగ్గోలెత్తిపోవాలి తన చర్యకు.
    మరి కాసేపటికి సరోజిని వైద్య పరికరాలతో అక్కడకు చేరుకుంది.
    రెండు రోజులూ కదలకుండా ఆ గదిలోనే గడిపింది చంద్రిక. ఆమెతోపాటు సరోజిని కూడా అక్కడే ఎప్పువసేపు గడిపింది. మూడోరోజు తనింటికి చేరుకుంది చంద్రిక. వంట్లోబావుండలేదని చెప్పి షూటింగులో ఎక్కువసేపు వుండకుండా ముఖ్యమైన సీన్లు మాత్రమే నటిస్తూ మరో రెండు మూడ్రోజులు గడిపిందామె.
    ఆ రోజు ఆమె స్టూడియోకొచ్చేసరికి ఆ ఫోర్ లో అందరూ ఓచోట గుమికూడి ఏదో చర్చించుకోవడంకనిపించింది. తనను చూడగానే అందరూ మాటలాపేశారు. దాన్ని బట్టివాళ్ళందరూ తనగురించే మాట్లాడుకుంటున్నారని అర్ధమైపోయింది.
    మేకప్ రూమ్ లో వుండగా ఆ చిత్రం డైరెక్టరు హడావిడిగా అక్కడికి వచ్చాడు.
    "చంద్రిక గారూ! ఈ పేపరు చూశారా!" సినిమా పత్రిక ఒకటి ఆమెకందిస్తూ అన్నాడతను.
    "చూళ్ళేదు ఎందుకు?" అనుమానంగానే అడిగింది ఆమె.
    "మీ గురించి, ప్రేమ్ కుమార్ గురించీ మీరేవేవో చెప్పినట్లు చాలా అసహ్యంగా రాశారందులో."
    చంద్రిక త్వరత్వరగా ఆ పత్రికలోని పేజీలు  తిరగేసింది. మొదటిపేజీలోనే పెద్దపెద్ద అక్షరాలతో హెడ్డింగ్ వుంది. దానికింద తనపేరు. మధ్యలో తన పెద్ద ఫోటో.
    "ప్రేమ్ కుమార్ తీయనిమాటలు నమ్మి మోసపోయాను." అని ఉందక్కడ.
    "చూశారా ఎంత ఘోరమో.....! మీరు నిజంగా ఇవన్నీ చెప్పివుండరనే నా ఉద్దేశ్యం" ఆమె ముఖ కవళికలు పరిశీలిస్తూ సందేహంగా అన్నాడతను.
    "ఇందులో నేను చెప్పని న్యూస్ ఏమీ లేదు. ఆ స్టేట్ మెంట్ నేనే ఇచ్చాను" తాపీగా అంది చంద్రిక.
    అతను ఉక్కిరి బిక్కిరయ్యాడు.
    "కానీ చంద్రికగారూ! ఇప్పుడిదెంత గందరగోళాన్ని సృష్టిస్తుందో మీకు తెలుసా?
    ఫీల్డులో అందరికీ తలనొప్పిగా తయారవుతుందీ గొడవ!"
    "అయినా ఫరవాలేదు!"
    ఇంక అతనేం మాట్లాడలేకపోయాడు.
    షూటింగ్ కొంచెం ఆలస్యంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం లంచ్ సమయమయ్యే సరికి ప్రొడ్యూసర్ ఆమె దగ్గరకు పరుగుతో వచ్చాడు.
    "మిమ్మల్ని కలుసుకొని మాట్లాడాలని డైరెక్టర్ ఆనంద్ గారు వచ్చారు"
    ఆనంద్ ఫీల్డులో చాలా పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి ప్రేమ్ కుమార్ కి అతనికీ ఎంతో స్నేహం వుంది. బహుశా అతనిని ప్రేమ్ కుమారే పంపించి వుంటాడని ఊహించింది చంద్రిక.
    "పదండి వెళదాం! ఎక్కడున్నారాయన?" అడిగింది చంద్రిక.
    "ఆఫీసులో!"
    ఇద్దరూ ఆఫీస్ రూమ్ చేరుకున్నారు.
    "నమస్తే!" ఆయన కుర్చీలో నుంచి లేచి నమస్కరించాడు.
    ప్రతి నమస్కారం చేసింది చంద్రిక.
    "కూర్చోండి" కుర్చీ చూశాడతను.
    చంద్రిక కుర్చీలో కూర్చుంది.
    "తార పత్రికలో వచ్చిన న్యూస్ మా కందరికీ బాధ కలిగించింది. ఇది మీరు ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని నాసందేహం."
    "మీ సందేహం తప్పు నేనే ఆ పత్రికకు ఆ విషయాలు చెప్పాను" ఖండితంగా అంది చంద్రిక.
    అతను రెండు నిమిషాలు మౌనంగా ఆలోచిస్తూండిపోయాడు.
    "చూడమ్మా! చాలా దురదృష్జ్తకరమైనవిషయం యిది. నాకు ప్రేమ్ కుమార్- నువూ యిద్దరూ సమానులే! ఎవరిది తప్పని నేను యిక్కడ చర్చించుదల్చుకోలేదు. కానీ ఇలా రచ్చకెక్కడంవల్ల నష్టం నీదీ, అతనిదీ - మొత్తం మనందరిదీనూ నీకు నామీద ఏమయినా గౌరవం వుంటే నా మాటవిను! ఈ పరిస్థితి మరింత విషమించకుండా రాజీకొస్తేబావుంటుంది."    
    "అంటే నన్నేం చేయమంటారో చెప్పండి" అతనినిచిన్న బుచ్చడం ఇష్టంలేక అందామె.
    "ఏమో! అది ఇంకా ఆలోచించలేదు. సాయంత్రం మీయింటికొస్తాను. వీలయినంతవరకూ ఇది సామరస్యంగా పరిష్కరించుకోవాలి. నేను ప్రేమ్ కుమార్ తో మాట్లాడడతను ఈలోగా!"
    తలూపింది చంద్రిక.
    "సరే వస్తానమ్మా! నా మాటకు ఈ మాత్రం గౌరవం ఉందంటే నాకు ఆనందంగా వుంది. సాయంత్రం వస్తాను మళ్ళీ!"
    అతను వెళ్ళిపోయాడు.
    చంద్రిక అక్కడినుంచి వచ్చేసింది. ఆమె కెంతో ఆనందంగా వుందిప్పుడు. ప్రేమ్ కుమార్ కి తననుకున్నట్లుగానే గట్టి దెబ్బతగిలింది. అనుభవించి వదిలేయడం తన జన్మహక్కు అనుకున్నాడేమో!

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra