నేను సార్జంటు మేజరుతో అన్నా-
    "మేజర్ సాబ్! ఈ దుస్తులన్నీ ధ్వంసం చెయ్యడమెందుకూ, బీద వాళ్ళకి పంచిపెడదామా"
    "వీల్లేదు. ధ్వసవంటే ధ్వంసవే! ఏదీ? నీ దగ్గిరేమున్నాయి చూన్నీ..." అతను నాతో వచ్చేడు.
    నా దగ్గిర స్వంతం డజను పంట్లాలు, చొక్కాలున్నాయి, రెండుడజన్ల బనీన్లున్నాయి. ఎన్నో జోళ్ళు మేజోళ్ళున్నాయి, అన్నీ సార్జంటు మేజరు ఫర్రు ఫర్రున చింపేడు,
    "ఎందుకలా చింపేస్తావ్?"
    "ఇది యుద్ధం, నా దగ్గరున్నవి చూద్దూగాని రా... కమాన్.
    అదొక వెర్రి. దానికర్ధమేమిటో! అదొక కసి. ఎవరిమీదో! సామాన్య సిపాయి మొదలు ఆఫీసరు దాకా. అంతా పిచ్చెత్తినట్టు చెలరేగేరు. తనదీ యింకోడిదీ అనే భేదం లేకుండా. కట్టుకునేది. తినేది అనే తేడా లేకుండా, యూనిటంతా గాలించి ఒక పర్వతమంత సరుకు పెరేడ్ గ్రౌండులో చేర్చేరు. దానిమీద ఒక డబ్బా పెట్రోలు వేసి నిప్పంటించేరు. క్షణంలో అగ్ని ఆకాశాన్నందుకుంది. అరకాన్ రోడ్డుమీద గుమిగూడి ప్రజలీ దహన కాండ చూస్తూ నిలబడి పోయేరు. మంట లెగుస్తూంటే మా వాళ్ళంతా చేతులు చేతులు కలిసి నృత్యం చేసేరు. నృత్యం చేస్తూన్న మంటలకి తాళం వేసినట్టు.
    అరగంటలో లంకాదహనం పూర్తయింది.
    మాదగ్గిర మిగిల్నివి. కట్టుకొన్న బట్టలు, మరి మూడు జతల డ్రస్సు. కిట్ బ్యాగ్. హావర్ సాల్ వాటరు బాటిలు. వారంరోజులకి సరిపడ్డ రేషన్లు,
    తొమ్మిదిగంటలైంది. పుణ్య కాలానికి మరో గంట వ్యవధుంది. అంతా టీకి వెళ్ళిపోయేరు.
    నేను ఆఫీసుకి వెళ్ళా. ఆఫీసు బావురుమంటూంది. ఓసీ నల్లమందు తిన్నట్టున్నాడు.
    "హవల్దార్"
    నేనతని గదిలోకెళ్ళా, కూచోమన్నాడు. కూచుని అతనికో సిగరెట్టిచ్చి, నేనోటి ముట్టించా. రెండు దమ్ముల్లాగి, సీరియస్ గా చూసి "ఇదీ జీవితం" అన్నాడు. జేవురించిన మొహంతో, నేను జవాబు చెప్పలేదు. తన పర్సు నామీదికి విసిరేడు. దాంట్లో ఫోటోవుంది. అది నేను చాలాసార్లు చూసేను. ఇప్పుడు తిరిగి చూసేను. ఆ ఫోటోలో అతని బార్య, ఐదేళ్ళకొడుకు వున్నారు.
    "బహుశా....బహుశా....నేను వీళ్ళని మరి చూళ్ళేను.." ఒసీ. అతని కళ్ళెర్రగా వున్నాయి.
    "అలా అనుకోకండి. తప్పక చూస్తారు. అచిరకాలంలో చూస్తారు. నా మనస్సాక్షి చెప్తూంది." నేనతనికి దిలాసా యిచ్చేను. అతను మొహం తీవ్రంగా పెట్టి "బహుశా" అని, తిరిగి "నాకా ఆశ వుంది" అన్నాడు. నేను "తప్పక" అన్నా.
    సార్జంటు మేజరొచ్చి సెల్యూట్ చేసి "అంతా సిద్ధం సరి"అన్నాడు. ఓసీ "ఒకే" అన్నాడు. పదిగంటలైంది.
    ఇంతలో బ్రిగేడ్ నించి కొరియరు వుత్తరం తెచ్చి ఓసీకిచ్చి వెళ్ళిపోయేడు ఓసీ కవరు చింపి చదివేడు. చదూతూంటే అతని మొహం ఎన్నో రంగులు మారింది. చిన్న నవ్వు నవ్వేడు. అది పెరిగి పెద్దదై "ఆహ్హహ్హహ్హ" అని, ఆగకుండా "ఓ హ్హో హ్హో హ్హో" అని దీర్ఘంగా "హో" ని మూలిగిట్టు అంతమైంది. అతను టేబిలు మీద అరిచేతుల్లో మొహం పెట్టుకుని మూలిగేడు. నేను సార్జంటు మేజరు మొహంకేసి చూశా. అతను నా మొహంకేసి చూసేరు మాకేం అర్ధం కాలేదు.
    ఓసీ నిమ్మళంగా తలెత్తేడు, మా యిద్దరివేపూ చూసేడు.
    "మనం కదల్డం లేదు, మూవ్ మెంటు కేన్ వెల్డ్" అని తిరిగి ఒకటే వెర్రినవ్వు నవ్వేడు. సార్జంటు మేజరు ఆనందం పట్టలేకపోయేడు.
    "సర్! నన్ను వెళ్ళనివ్వండి. అందరికీ చెప్తా..." సార్జెంట్ మేజర్.
    "ఒద్దు. అందర్నీ పెరేడ్ చేయించు. నేనే స్వయంగా ఈ వార్త చెప్తా. హవల్దార్. నువ్వు ఆఫీసులో వుండు, ఏవైనా అర్జంటు వార్తలు రావచ్చు. సార్జంటు మేజర్! తొందరగా వెళ్ళు...హరియప్....!"
    ఆవాళ 1945 ఆగస్టు ఆరో తారీఖు. ఉదయం ఎనిమిది గంటలకి మా యూనిట్ గ్రౌండు లో దహనకాండ జరుగుతూంటే, ప్రపంచంలో మరో చోట అదే సమయంలో ఒక మహాధారుణ దహనకాండకి ప్రయత్నం సాగిపోతుంది.
    హిరోషిమా నగర వాసులు అమాయకంగా ఎవరి పన్లలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎనిమిది గంటల పదిహీను నిమిషాలకి ఒక అమెరికను B-20 చాంబరు, మరి రెండు విమానాలతో సహా సుమారు యిరవై యెనిమిది వేల అడుగుల యెత్తు నుంచి నగరం మద్యని ఒకే బాంబు విడిచిపెట్టింది.
    అది అణుబాంబు. నిముషం తరవాత ఆ బాంబు భూమికి పద్దెనిమిదివందల అడుగుల యెత్తున పేలింది. వెంటనే మూడులక్షల డిగ్రీల వేడితో, నూట యనభై అడుగుల వ్యాసంగల ఒక ప్రళయాగ్ని గోళం జాజ్వల్యమానంగా ప్రభ విల్లింది.
    ఈ భయంకర విస్ఫోటం నగరాన్ని దుంప ధూళి చేసింది.
    ఈ వార్త మాకా సాయంత్ర తొమ్మిదింటికి తెలిసింది. వెంటనే ఓసీ పరుగెత్తుకు నా గది కొచ్చేడు.
    "హవల్దార్! నీ దగ్గిర యెన్ని పిపా లున్నాయి?"
    "ఆరవందుంటై..."
    "ఓకె! అన్నీ సిద్ధం చెయ్యి...ఏ
    ఓసీ కోరిక ప్రకారం అందర్నీ రిక్రియేషను క్లబ్బులో సమావేశపరిచా. అందరి గ్లాసులూ నిండుగా వున్నాయి! ఓసీ కూడా ఓ గ్లాసు పట్టు కున్నాడు.
    'వినండి! మనం యిప్పుడీ చిన్న పండుగ యెందుకు చేసుకుంటున్నా మో తెలుసా?
    ఎవ్వరూ జవాబు చెప్పలేదు. వాళ్ళకి తెలీదు.
    "వినండి! ఈ వుదయం జపానునగరం హిరోషిమా మీద మనం అణుబాంబు పేల్చేం. నగరం అంతా ఒక్క తృటిలో నాశనమైంది. శత్రువుల నడ్డి విరిగి పోయింది. నాలుగురోజుల్లో బేషరతుగా లొంగిపోకపోతే జపానుదీవులు ప్రపంచపటంలోంచి తొలకిపోతాయని వాళ్ళకి తుది హెచ్చరిక అందజేసేం. ఇప్పుడె రేడియోలో ఆ వార్త విన్నా. నాలుగురోజులకి ముందుగానే శత్రువులు బేషరతుగా లొంగిపోవాలని ఆశిస్తూ-ఆ ఆశతోనే, యిప్పుడు.....చీరియో!
    అంతా తాగేరు.
    "ఇక జపాను బేషరతుగా లొంగిపోగానే వెంటనే నిజవైన విందు ఘనంగా చేసుకుందాం..వెళ్ళి పడుకోండి గుడ్ నైట్!"
    
                                    20

    ఆగస్టు తొమ్మిదో తారీఖున మళ్ళీ ఆటంబాంబు పేలింది. మర్నాడే జపాన్ బేషరతుగా లొంగి పోయినట్టు ప్రకటించింది.
    ఆనాడు వుదయం నించి సాయంత్రం వరకూ ఒకటే కోలాహలం ఏడుగంటలకి విజయసూచకంగా శతఘ్నులు పేలేయి. సైరన్లు మ్రోగేయి. అవి చాలక అంతా దొరికిన డబ్బాలు, డొక్కులు పట్టుకు వాయించేరు. అలా పావుగంట సేపు ఆగకుండా శబ్దంతో భూమి, ఆకాశం నిండింది.
    ఆవేళ మా యూనిటులొ యెన్ని కోళ్ళ మెడకాయలు తెగేయో చెప్పలేం.
    అది విచ్చలవిడిదినం. సిపాయిలు ఒంటి మీద అంగుళం గుడ్డయినా లేకుండా అంతటా తిరిగేరు. ప్రజలు వాళ్ళనిచూసి నవ్వుకున్నారు. బైట కొచ్చిన స్త్రీలు కొందరు యిళ్ళలోకి పారిపోయేరు.
    ఆవేళ కొందరు అమెరికను సోల్జర్లు ఆనందం పట్టలేక మితిమీరిన పన్లు చేసేరు.
    ఒక సబ్ యిన్ స్పెక్టరు కూతురు, ఇరవై ఏళ్ల పిల్ల మా యూనిటు పక్క నించే కాలేజీకి వెళ్ళి పోతుంది. అక్కడే ఒక అమెరికను ఆసుపత్రి వుంది- అందులోంచి పదిమంది బాగా తాగొచ్చేరు. ఆ పిల్లని చుట్టముట్టి. కడియం కట్టి దొమ్మరి డాన్సుచేసేరు. తరవాత ఆమెమీద పడి ఆప్యాయంగా ముద్దులు కురిపించేరు. అంత వరకూ ఆమె సహించింది. చివాల్న పైట వారనుంచి పిస్తోలు తీసి మీదికి రెండు గుళ్ళు పేల్చింది. ఒక్కసారి అంతా వెనక్కి తగ్గేరు. కాని వెనక నించి ఒకడు ఆమె చేతిలో పిస్తోలు లాక్కున్నాడు. ఎదురుగా ఒక రిక్షా వస్తూంది. ఇద్దరు గబగబ వెళ్ళి రిక్షావాన్ని రెండు వేసేడు. వాడు రిక్షా దిగి పారిపోయాడు. వాళ్ళా రిక్షాలో వున్న పెద్ద మనిషిని కిందికి లాగేసేరు. వెంటనే ఆ అమ్మా యిని గంజీ కావడిపట్టి తీసుకొచ్చి రిక్షాలో కూచో పెట్టేడు. ఆమెతో పాటు మరో యిద్దరు చంగున రిక్షా యెక్కారు. ఒకడు రిక్షా తొక్కుతూ తీసుకుపోయేడు. వీథి కోపాని రిక్షాని, అమ్మాయిని వదలి నవ్వుకుంటూ వచ్చేరు.
    వాళ్ళా వీథిని కారోచ్చినా, బస్సొచ్చినా. మనిషొచ్చినా, ఆడగానీ, మగకానీ, కడియం కట్టి నృత్యంతో కొంతదూరం దిగబెట్టి, అక్కడ నాలుగు ముద్దులు పెట్టుకుని మరీ వొదుల్తున్నారు.
    రాత్రి దీపాలతో చిట్ట గాంగు ధగధగ మెరిసి పోయింది. బాణ సంచా కాల్చేరు. తిరిగి శతఘ్నులు మ్రోగేయి.
    "బార్" మా రిక్రియేషను క్లబ్బులోనే యేర్పరచేం, అంతా ఒక పద్ధతిప్రకారం నడిపించడానికి నేనొక పథకం వేశా, ఓ సీ కి సార్జంటు మేజరుకి చెప్పా.
    "రాత్రి సరిగ్గా తొమ్మిది గంటలకి సార్జంటు మెస్సుకి కబురు పెడతా, తొమ్మిదిగంటల పదినిమిషాలకి ఆఫీసర్ల మెస్సుకి కబురంపుతా. తొమ్మిదింపావుకి ఆరంభం." ఇద్దరూ ఓకే అంటే ఓకే అన్నారు.
    బీరు, రమ్ము, జిన్ను మొత్తం సుమారు నాలుగువందల సీసాలున్నాయి. క్లబ్బుహాలు చక్కగా కాయితపు పువ్వులు, గొలుసులతో అలంకరించేరు. హాలుకి నాలుగు ద్వారాలున్నాయి. ఎడమవేపు "కౌంటరు" వుంది. ఓ పక్కన ఐదువందల ఖాళీ గ్లాసులున్నాయి. దూరంగా మనిషి చేతికి దొరక్కుండా గోడ దగ్గిర సీసాలున్నాయి. రెండు వందల మంది కూచుందికి కుర్చీలు, టేబిళ్ళు, బెంచీలు సర్దేరు. కౌంటరు పెద్ద లహరీ. అతనికి ముగ్గురు సిపాయిలు తోడు.
    ఓసీ ఆరుగంటల కొచ్చి చూసి యేర్పాట్లు బాగున్నాయని మెచ్చుకొన్నాడు.
    ఎనిమిదిన్నర దాటిన దగ్గర్నించీ సిపాయిలు తహతహలాడిపోతున్నారు. వాళ్ళ ఓర్మి తగ్గి పోహూంది. బాబూ! ఇంకా యెంతసేపు? సారూ యిన్ను యెత్తస నేరం? ఆబ్ క్యా దేరీ హై సాబ్! శురూకరో! ఒకటే తపన, హాలుచుట్టూ పులుల్లా తిరుగుతున్నారు. కాని, "లోనికి ప్రవేశం లేదు," చాలా కట్టుదిట్టం చేశా. న చాకచక్యానికి నేనే మురిసిపోయా.
    సరిగ్గా ఐదు నిముషాలు తక్కువ తొమ్మిదికి అంతా లోన ప్రవేశించేరు. సుమారు రెండు వందల మంది. ఆర్డర్- ఆర్డర్- అంతా కూచోండి- ఊ- వన్ బైవన్- ఒక్కొక్కరే- ఏకేక్కర్కే నిమ్మళంగా కౌంటరు దగ్గరకెళ్ళి. ఒక్కొక్క ఖాళీగ్లాసు తీసుకుని తిరిగి సీటుదగ్గిర కెళ్ళి నిశ్శబ్దంగా కూచోండి. నెమ్మది. నెమ్మది. అదిగో! ఏవిటా తోపులాట!! ఎటెన్.......షన్!! అది బాగుంది. ఇప్పుడు ఒక్కొక్కరే......ఒక్కొక్కరే.....ఎవరా గుసగుసలు? కిచకిచలు?
    మొత్తానికందరూ గ్లాసులు పుచ్చుకున్నారు.
    తొమ్మిధైంది. "మాత్యూస్." వెళ్ళి సార్జంట్ల మెస్సుకి కబురు చెప్పిరా..."
    మాత్యూస్ వెళ్ళొచ్చేడు. "సార్జంట్ల మెస్సులోయెవరూ లేరు సార్..."
    "భేఠా! ఏమైపోయేరు?"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra