Home » Kasinudhuni suvarchala devi » Aakhari Majili

 

    ఎవడో ఒకడు తనను లాక్కు పోతాడు. కుక్కలు చింపిన విస్తరి లాగ తన జీవితం నాశనమయిపోతుంది. అ నిమిషంలో రోడ్డు మీద జనమంతా తననే చూస్తున్నట్టనిపించింది భార్గవికి.
    "అమ్మా! ఇక పోదాం రండమ్మా! చాలా దూరం వచ్చేశాం"
    ఆలోచనా సముద్రంలో మునిగిపోయిన భార్గవి ఈ మాటలకు గబుక్కున వెనక్కి తిరిగి చూసింది. ఆశ్చర్యంతో, సంతోషంతో ఆమె నోట మాట రాలేదు.
    "రంగా" అమాంతం రంగడ్ని ఎత్తుకుని గిరగిరా తిప్పాలనిపించింది.
    "పదండమ్మా!" రంగడు మళ్ళీ హెచ్చరించాడు. ఇక భార్గవి మాట కోసం ఎదురు చూడకుండా టాక్సీ ని కేకేసి భార్గవి ని ఎక్కమన్నట్టుగా చూశాడు. భార్గవి మారు మాట్లాడకుండా ఎక్కి కూర్చున్నది.
    ఇంటి ముందు టాక్సీ ఆగగానే ఒక్కటే పరుగులో మేడ మీద కెళ్ళి పోయి తన గదిలో కెళ్ళి తలుపులు వేసుకుంది. బరువుగా ఊపిరి పీల్చుకుని మంచంమీద కూలపడ్డ భార్గవి పక్కకు చూసి ఉలిక్కిపడింది. అక్కడే కిటికీ కానుకుని చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు శేఖరం. శేఖర్ ను చూస్తూనే వణికి పోయింది భార్గవి.
    శేఖర్ అక్కడే ఉన్న కూజాలో నీళ్ళు గ్లాసులో పోసి భార్గవి దగ్గరకు తీసుకుని వచ్చాడు. భార్గవి కళ్ళప్పగించి చూస్తూ కూర్చున్నది ముందు మంచి నీళ్ళు తాగు. తరువాత నన్ను చూద్దువు గాని.
    శేఖర్ గొంతు సీరీయస్ గా ఉంది. అతని చేతిలో గ్లాసు తీసుకుని గడగడా తాగేసింది.
    "ఇప్పుడు చెప్పు! కాళ్ళ నొప్పులు బాగా తగ్గినయ్యా! యెట్లా ఉంది కలకత్తా" అతని గొంతులో హేళనకు భార్గవి రోషంగా తలెత్తి చూసింది.
    "అంటే మీరు నన్ను వెంటాడుతున్నారన్న మాట. ముందు మీరీ విషయం చెప్పండి. మీకే దురేద్దేశ్యమూ లేకపోతె నన్ను కాకినాడ మా అక్కయ్య దగ్గర కెందుకు పంపలేదు." కోపంతో ఆమె ముఖం అరుణిమ దాల్చింది.
    "నిన్ను మీ అక్కయ్య దగ్గరకు పంపమని మీ అన్నయ్య నాకు చెప్పలేదే"
    శాంతంగా అంటున్న శేఖర్ని చూస్తుంటే భార్గవి కి అతని మీద పడి కొరికి చంపాలన్నంత కోపం వచ్చింది.
    "ఇన్ని రోజులు మీ ఇంట్లోనే అట్టే పెట్టుకుని నా బాగోగులు చూడమని ప్రాధేయపడ్డాడా మా అన్నయ్యా...."
    "అనే నేనంటే ఏం చేస్తావు నువ్వు? మీ అక్కయ్య దగ్గరకు వెళ్ళి పోవాలనుకుంటే ఆ విషయం నాతొ చెప్పవచ్చుగా--?"
    "చెప్పకపోతేనేం వెంటబడి లాక్కొచ్చిన వారు చెప్తే పంపుతారా?"
    ఆ క్షణంలో భార్గవి -- తను ఈరోజు ఎవరి చేతుల్లో పడి ఎవరికో అమ్ముడు పోక తప్పదు అని వణికి పోయిన క్షణం మర్చిపోయింది.
    ఆమెలో రోషం పడగ విప్పింది.
    "మీ మగవాళ్ళే అంత! అందమైన ఆడపిల్ల కనబడితే చాలు , మీరానాడే వల విసిరారు. ఆ వలలో చేప పిల్లలా చిక్కుకుని ఎటూ పోలేక గిలగిల లాడుతున్నాను."
    "భార్గవీ! ప్రపంచంలో నువ్వే అందమైన దానననుకోకు"
    హేళనగా అన్నాడు శేఖర్.
    విసురుగా కళ్ళెత్తి సూటిగా అతని కళ్ళలోకి చూసింది.
    మీకే దురేద్దేశ్యము లేకపోతె నన్ను మా అక్కయ్య దగ్గరకు పంపండి.
    "వెళ్ళి ఏం చెప్తావు? ఇన్ని రోజులు శేఖర్ దగ్గర ఉన్నానని చెప్తావా?"
    అతని మాటల్లో ఏ మాత్రం తొందర గాని, ఆవేశం గాని లేదు. ప్రశాంతంగా ఉందతని గొంతు.
    "అంటే....అంటే?" వస్తున్న ఏడుపును దిగమింగుతూ అంది భార్గవి.
    "ఇన్ని మాటలెందుకు? నిన్ను నేను పంపను" నిశ్చలంగా అన్నాడు శేఖర్.
    భార్గవి రెండు చేతుల్తో ముఖం కప్పుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ దిండులో తల దూర్చింది.
    శేఖర్ భార్గవి పక్కనే మంచం మీద కూర్చుంటూ భార్గవి ని రెండు చేతుల్తో లేవనెత్తి "భార్గవీ! అనవసరమైన ఆలోచనల్తో మనసుని కలుషితం చేసుకోకు. నేను నీ పట్ల మితిమీరి ఎన్నడైనా ప్రవర్తించానా? నీకెందు కంత భయం. ఆవేశంతో అర్ధం లేని కోపంతో నన్నర్ధం చేసుకోలేక పోతున్నావు గాని అమృత హృదయం తో ఒక్కసారి నన్ను గురించి ఆలోచించమని అర్ధిస్తున్నాను. మీ అన్నయ్య వచ్చిన తరువాత అంతా నీకే అర్ధమవుతుంది. అప్పుడు నువ్వనుకుంటావు గదా ...." అతని మాటలు మధ్యలోనే తుంచేస్తూ "ఛీ! వదలండి. మీరు నాకు తలపెట్టిన అన్యాయం నాకర్ధమైపోయింది" ఒక ఊపుతో అతని చేతుల నుంచి తప్పించుకుని దూరంగా వెళ్ళి నిలబడింది. శేఖర్ నెమ్మదిగా అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయాడు.

                            *    *    *    *
    "ఇందూ! చిన్న ప్లానయితే చాలు. ఇద్దరమెగా"
    ఆరోజు తీరుబడిగా మధ్యాహ్నం భోజనాలు చేసి పడుకున్న తర్వాత అంది నీరజ.
    శాంతిని పొట్ట మీద పడుకో బెట్టి ఆడిస్తున్న ఇందిర పాపను పక్క మీద పడుకో బెట్టి నీరజ వైపు తిరిగి "ఏమైనా గట్టిదానివి. పట్టు పట్టావంటే వదలవు" అంది నిష్టూరంగా.
    "పక్కనే ఉంటాగా ఇందూ! నేను మీ యింట్లో ఉండటం అంత శ్రేయస్కరం కాదు!'
    "అదేం మాట! ఎవరికి శ్రేయస్కరం కాదంటావు?"
    కోపంగా అంటున్న ఇందిరను ప్రశాంతమైన చిరునవ్వుతో చూసింది నీరజ.
    "అయితే ఒక షరతు! నేను ఇంట్లో ఉన్నంతసేపు నువ్వూ, పాప ఇక్కడే ఉండాలి!
    'అమ్మయ్య! ఈ సమస్య ఇంత తేలిగ్గా పరిష్కారమవుతుందనుకోలేదు.
    "రాజారావు స్టేట్స్ కి వెళ్తున్నాడన్నావు? పెళ్ళయిన తరువాతా"
    "పెళ్ళేమిటి?--"
    "మీ పెళ్ళి మాటే నేనడిగేది...."
    "నీరజా! నీకు తమాషాగా ఉన్నట్టుందే"
    "తమాషా ఏమిటి ఇందూ! మొన్నో రోజు అతనే అన్నాడు."
    "ఏమన్నాడు?"
    "పెళ్ళెప్పుడు ? అన్నాను -- పెళ్ళయింతర్వాతే తన ప్రయాణం" అన్నాడు.
    ఇంతలో రాజారావే అక్కడకు వచ్చాడు.
    "రాజూ! నీ పెళ్ళటగా -- ఎప్పుడేమిటి" నవ్వుతూ అంది ఇందిర.
    "నా పెళ్ళా!" ఆశ్చర్యంగా అన్నాడు రాజారావు.
    "మొన్న మీరు అనలేదా" అని జరిగిన విషయం జ్ఞాపకం చేసింది నీరజ.
    "ఓ అదా! ఇందిర పెళ్ళేప్పుడు -- మీ ప్రయాణం ఎప్పుడు అన్నారు -- పెళ్ళయిన తరువాత ప్రయాణం అన్నాను- అంతే కదా!'
    నీరజకు అర్ధం కాలేదు. ఇందిర కోపంతో లేచి వెళ్ళిపోయింది.
    ఇందిర వెనకాలే రాజారావు వెళ్ళాడు.
    "ఇందూ! రాత్రికి నేను ఊరికి వెళుతున్నాను"
    "ఏ ఊరు ...ఎందుకు?"
    "ఖరగ్ పూర్ లో నా స్నేహితుడున్నాడు-- అక్కడికి వెళ్ళి -- తర్వాత ....?
    "కలకత్తా వెళ్తావు-- అంతేగా"
    రాజారావు మాట్లాడలేదు.
    "రాజూ, ఏదైనా పొరపాటు జరిగిందా నాకు ఆత్మహత్యే శరణ్యం. ఈ మాత్రంగా నయినా నేను బ్రతకటం ఇష్టం లేకపోతె నీ ఇష్టమొచ్చి నట్టుగా చేసుకో"
    "సరే! వెళ్ళను;లే! నాకెందుకీ గొడవ"
    రాజారావు వెళ్ళిన వేపే చూస్తూ కూర్చుంది ఇందిర.
    శ్రీధర్ తో అంతదూరం అమర్యాదగా, ఆలోచనా రహితంగా ప్రవర్తించకుండా ఉండవలసింది. ఆనాటి ఆ స్పర్శ లో ఏం మహాత్యముందో కాని తనలో ఎంత మార్పు వచ్చింది. ఆ పరిష్వంగంలో తనలోని చిలిపితనాన్ని, అహంభావాన్ని తన వశం చేసుకున్నాడు శ్రీధర్. మళ్ళీ తను ఎవ్వరి తోనూ మనసిచ్చి మాట్లాడలేదు. ఒకరి వంక హేళనగా చూసి నవ్వలేదు. తనకు తెలియకుండానే తనలో గంబీర్యం చోటు చేసుకుంది. తనలోని సర్వశక్తులు , సమస్త చైతన్యమూ శ్రీధర్ వశమై పోయాయి. ఉక్కు కడ్డీల్లా ఉన్న అతని బాహువుల్లో చిక్కుకుపోయిన తనకు స్పృహే లేదు .స్పృహ వచ్చేటప్పటికి అతను కౌగిలి సడలించి "అనవసరంగా నన్ను రెచ్చగోట్టావు ఫలితం చూశావుగా? ఎంత ఘోరం జరిగింది. ఏది ఏమైనా ఇందిరా -- ఈ క్షణాన్ని నేను హృదయంలో పదిలంగా, దాచుకుంటాను-- నీ స్పర్శ లో నేనేదో పోగొట్టుకున్నాను. అదేమిటో నాకు తెలియడం లేదు" అన్నాడు. ఆ మాటలు ఇప్పటికీ తన చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. తరువాత ఒక రోజు కాదు దాదాపు ఎనిమిదేళ్ళు ఆలోచించింది. అప్పటికి పసితనంగా ఉన్న తన మనసు ఇప్పుడు పరిపక్వం చెందింది. దానితో పాటు తన ఊహలు కూడా రూపు దాల్చినాయి.
    "పెళ్ళి- పెళ్ళి " అంటుంది నీరజ. ఇక జీవితానికి ముఖ్యమైనది పెళ్ళేనేమిటి?
    ఆనాడు భార్గవి కి, నిర్మల కు చీరలు, పసుపు, కుంకం ఇచ్చేనాడు తను ప్రశాంతంగా నిండు మనసుతో ఇవ్వలేదూ.
    నిర్మల, శ్రీధర్ కలకాలం అన్యోన్యంగా ఉండటం కంటే తనకు మాత్రం ఏం కావాలి?
    నీరజ పిలుపుతో ఆలోచనల నించి తేరుకుని కిందికి వెళ్ళింది ఇందిర.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra