Home » Vasireddy seeta devi novels » Matti Manishi


    మాణిక్యానికి గుండెలు జారిపోయినయ్.
    "ఎన్నోలేవు దొరా!"
    "చత్! ఇంకా మాట్లాడతావ్. ఓదెలు నుసిమి బుట్టలో పోసుకున్నావ్. పద ఊళ్ళోకి. ఇవ్వాళ నీ చమడా వలిపిస్తా." సాంబయ్య మాణిక్యాన్ని కర్రతో గనెం మీదనుంచి నెట్టాడు.
    కిందపడ్డ మాణిక్యం లేచి, జారిపోయిన కుచ్చెళ్లు దోపుకుంటూ "నేనేం దొంగతనం చేశావా దొరా?" అంది. దాని గొంతులో తిరుగుబాటు ధ్వని వినిపించింది సాంబయ్యకు.
    "కాకపోతే ఎవరిచ్చారే నీకీధాన్యం?" సాంబయ్య కొంచెం వెనక్కి తగ్గి అన్నాడు.
    "చిన్న దొరగారే!"
    సాంబయ్య నిశ్చేష్టుడైపోయాడు.
    మాణిక్యం బుట్టలోనుంచి జారిన పరిగ ఎత్తి బుట్టలో వేసుకొంది. బుట్ట నెత్తిన పెట్టుకొని, సాంబయ్యకేసి నిర్లక్ష్యంగా చూసి, దూరంగా కనిపిస్తోన్న కుప్పకేసి తిరిగి, పై పళ్ళతో పెదవిని నొక్కిపట్టి, అలవోకగా చూసి అదే పోత పోయింది.
    సాంబయ్య కుప్పకేసి చూశాడు. వెంకటపతి కుప్ప సర్దుతూ తల పక్కకు తిప్పలేదు. దూరంగా తండ్రి నిలబడి వున్నంతసేపూ వెంకటపతి, అదీ ఇదీ సర్దుతూన్న మిషమీద అక్కడే ఉండిపోయాడు. సాంబయ్యకు ముందుకు వెళ్ళటానికి కాలాడలేదు. గిర్రున వెనక్కు తిరిగాడు. అక్కడ వంచిన తల ఇంటికి వచ్చిగాని ఎత్తలేదు సాంబయ్య.
    వెంకటపతిని అని ఏం లాభంలేదు. తప్పు తనదే. ముఫ్ఫై ఏళ్ళు వస్తున్నాయ్. అయినా వాడికి తను పెళ్ళి చేయలేదు. ఉప్పూ, కారం తినే శరీరం! వాడి తప్పేముంది? వాడు కట్టడి తప్పుతున్నాడు. ఇంక సాచాత చేసి లాభంలేదు. తను ఇంకా చూస్తూ కూర్చుంటే వెంకటపతి తన వశం తప్పుతాడు. పొలంలో పండిన ధాన్యం సరిగా ఇంటికి చేరదు. అట్టా ఆడదానికి అలుసు ఇస్తే వాడెందుకు పనికొస్తాడు? ఎవతిబడితే అదే అందినంతవరకు పట్టుకుపోతే? ఇవ్వాళ వోదెలు నలిచింది. రేపు కల్లంలో వడ్లే తట్టతో తీసుకెళ్ళచ్చు. దాన్ని చూసి మరొకతి ఎగబడుతుంది. మినుమూ, పెసరా అయితే ఇంటికి సగమే చేరుతుంది. ఇంతకాలంగా వెంకటపతికి ఎందుకు పెళ్ళిచేయలేదూ? సాంబయ్య అంతరాంతరాల్లో అనంతకాలంగా నిద్రిస్తున్న కోరిక మేలుకోకుండానే అణగారిపోక తప్పదనే బాధలో పడిపోయాడు.
    వారం రోజులుగా మనిషిమీద మనిషిని కనకయ్య ఇంటికి పంపిస్తున్నాడు సాంబయ్య. కనకయ్య ఊళ్ళో లేడు - "ఇదిగో! రేపేవస్తా"నని ఇంట్లో చెప్పి వెళ్ళిన మనిషి.
    వెంకటపతి తండ్రి ఎదురైతే ముఖం చాటేసి తిరుగుతున్నాడు. సాంబయ్యకు కొడుకుని తలెత్తి చూసేందుకు కూడా మనస్కరించటంలేదు. ఊరికి వెళ్ళిన కనకయ్య ఎప్పుడొస్తాడా అని అదేపనిగా ఎదురుతెన్నులు చూస్తున్న సాంబయ్యకు ఓ రోజు మునిమాపువేళ గొంది మలుపు తిరిగి తన ఇంటివైపే వస్తూన్న కనకయ్యను చూసేసరికి ప్రాణం లేచివచ్చింది.
    "ఏమిటంటా అంత అర్జంటు పని? కబురుమీద కబురు పెట్టావంట?" వరండాలోకి వస్తూనే అడిగాడు కనకయ్య.
    "అవునయ్యా! రేపే వస్తానని వెళ్ళావటగా? ఎప్పుడొచ్చావ్ ఊళ్ళోకి?" సాంబయ్య అప్యాయంగా అడిగాడు.
    "ఎప్పుడో రావడమా! ఇంట్లోకి అడుగు పెడ్తుండగానే మా ఆవిడ చెప్పింది. ఇంట్లో కన్నా వెళ్ళకుండా తిన్నగా నీ దగ్గరకే వస్తున్నా! ఏమిటి విశేషం? ధాన్యం నూర్చారా? ఎప్పుడూ ఎనక చిక్కున అమ్మేవాడివి. ఏం, ఈ యేడు తొందరపడుతున్నావ్?"
    "ధాన్యం రేటు ఎట్టుందేం?" మాటవరసకన్నట్టు అడిగాడు సాంబయ్య.
    "రోజుకు అణా, అర్ధణా పెరుగుతూనే వుంది. పై ముఖమే తప్ప తిరుగు ముఖం ఉన్నట్టులేదు. ఇప్పటికే ఐదు లక్షల దాకా కొనుగోలు చేశాం. అందుకే తెల్లారే వద్దామనుకొని వెళితే వారంరోజులు పట్టింది. అంతా గందరగోళంగా వుందనుకో. ఈ వారం దాటితే రేపెట్టా వుంటదో చెప్పలేం" ఊపిరి సలపకుండా మాట్టాడ సాగాడు కనకయ్య.
    "ఇంకా నూర్పిళ్ళన్నా కాలేదు మాకు. మొన్ననేగా కుప్పవేతలు పూర్తయింది?"
    "అయితే నీ పైకం సంగతేనా? మళ్ళీ అమ్మకాలు సాగితేనేగాని డబ్బు తిరగదు. ఒక నెలాగితే సర్దుతా" ఆ మాట చెప్పి కనకయ్య లేవబోయాడు.
    "ఆగవయ్యా స్వామీ, ఇప్పుడు డబ్బు సంగతి నిన్నెవడడిగాడూ?" కనకయ్య తేరుకున్నాడు. మరెందుకు పిల్చినట్టు? ఆలోచనలో పడ్డాడు.
    "కనకయ్యా!" సాంబయ్య కంఠంలో ఆర్ద్రత తొణికింది.
    "ఏవిటి సంగతి సాంబయ్యా? తేల్చు మరి" సర్దుకొని కూర్చొని కుతూహలంగా అడిగాడు కనకయ్య.
    "ఆ బుర్రిపాలెం సంబంధం ఏమయింది?"
    వెంకటపతికి అనేక సంబంధాలు తెచ్చీ, సాంబయ్యచేత తిరస్కరించబడింతర్వాత కనకయ్య వెంకటపతి పెళ్ళి గురించిన ఆలోచనల్నే బుర్రలోనుంచి పూర్తిగా తోసేశాడు. ఇది అయ్యేదీ పెట్టేదీ కాదు అనే నమ్మకంలో వున్న కనకయ్య "ఆ -నీతో కుదర్దు లేవయ్యా!" అన్నాడు.
    సాంబయ్య ముఖంలోకి నవ్వు తెచ్చుకొని "నేరం నామీదే పెడుతున్నావ్? నేను కోరిన సంబంధం నువ్వు తెస్తే నేను కాదన్నదెప్పుడు?" అన్నాడు.
    "అయితే ఆ బుర్రిపాలెం అమ్మాయి పెళ్ళి ఇంకా కుదిరినట్టులే. సంబంధం ఖాయం చేయించమంటావా?"
    "మళ్ళీ అదే పాటా? నీ వరస నీదేగాని నా మాట చెవున పడనీయవేం?" అన్నాడు సాంబయ్య.
    ఈసారి కనకయ్య చిత్తయిపోయాడు.
    "ఏవిటి సాంబయ్యా? నాన్చక నీ మనసులో వుందేమిటో తేల్చి చెప్పు."
    "బలరామయ్యగారి ఆఖరి అమ్మాయి లేదూ?" ఆ మాట వింటూనే కనకయ్య బిల్లంగోడులా లేచిపడ్డాడు!
    "మూడేళ్ళనాడు రెండోపిల్ల సంబంధం అడిగితే బలరామయ్య ఏమన్నాడో తెలుసా?"
    "ఏమన్నా డేమిటి?" సాంబయ్య గుబురు కనుబొమలు కదిలాయి.
    "ఊరుబోయిన వెంకయ్య మనవడికి నా కూతుర్ని అడగటానికి వచ్చావా? మళ్ళీ ఆ ఊసు ఎత్తితే చెప్పు  తీసుకు కొడ్తా అన్నాడు బలరామయ్య."
    "కొట్తానన్నాడు కాని కొట్టాడా?" సాంబయ్య చలించకుండా అన్నాడు.
    "ఈసారి కొడతాడు. వీధిలో పడేసి మరీ కొడ్తాడు! సాంబయ్యా! నువ్వు ఆలోచించే మాట్లాడుతున్నావా?" అన్నాడు కనకయ్య.
    "నువ్వు చెప్పింది మూడేళ్ళనాటి బలరామయ్య సంగతి! ఇవాళ్టి బలరామయ్య సంగతికాదు. వెంకటపతి ఊరుబోయిన వెంకయ్య మనవడేకాదు, షావుకారు సాంబయ్య కొడుకు!" మీసం దువ్వుతూ, గంభీరంగా ముఖంపెట్టి, నిండుగా అన్నాడు సాంబయ్య.
    కనకయ్య బుర్ర నిప్పుశగకు మంచు కరిగినట్టు కరగసాగింది.
    'అమ్మ సాంబయ్యా? ఏమోననుకున్నాను! ఎంతవాడివయ్యావ్?' అనుకొన్నాడు మనసులోనే.
    అవును, సాంబయ్య చెప్పిందే వాస్తవం. ఈనాడు పరగణాలో వున్న పెద్ద మోతుబరి ఆసాముల్లో ఒకడు సాంబయ్య. సాంబయ్య కేం తక్కువ. ఒక్కడే కొడుకు. ఇంట్లోకి వచ్చేదేకాని బయటకు పోయేది ఏమీలేదు. నిజం చెప్పాలంటే ఈరోజున బలరామయ్య కేముంది? నలుగురు కొడుకులూ నాలుగు దార్లయారు. ముగ్గురు కూతుళ్ళు పెళ్ళిళ్ళయి కాపరాలకు వెళ్ళారు. ఇహ వున్నది ఆఖరు పిల్లే. వెనకటిస్థితిలో వుంటే ఆ పిల్ల పెళ్ళి ఏనాడో చేసేవాడే. ఇప్పుడు బలరామయ్య దగ్గిరేముంది? పిల్లకు కట్నం ఇవ్వటానికి - ఉన్నదేదో అప్పులకే సరిపోదే!
    "ఏమిటి కనకయ్యా ఆలోచిస్తున్నావ్? నేను ఆస్తిపరున్నన్నది నిజంగాదా? ఈనాడు బలరామయ్య ఏమీ లేనివాడనేది అబద్దమా?" సాంబయ్య మాటలు సూటిగా వచ్చి కనకయ్య గుండెలమీద తన్నాయి. కనకయ్య కాసేపు తటపటాయించి గుటకలు మింగుతూ అన్నాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra