Home » Mainanpati bhaskar » Daimond Raja Aathin Rani

 

    ఇంకా దీన్లో రిగ్గింగు, బూత్ కాప్చరింగూ, ఒకేమనిషి అనేకమైన ఓట్లు వెయ్యడం -


    ఈ తతంగం ఎంత ఉంటుందో చెప్పలేం!


    అందుకనే ఈ మైనం ముద్ద మెజారిటీ గురించి మనం వర్రీ కానక్కర్లేదు.


    అయితే -


    ఈ మైనంముద్దలని పూర్తిగా మన అవసరాలకి తగినట్లు మలుచుకోవాలంటే, మనం చెయ్యల్సింది ఒక్కటే - రౌడీల, కేడీల గూండాల, యాంటీ సోషల్ ఎలిమెంట్ల సాయం కోరాలి!


    ఇప్పుడు అందరూ చేస్తున్నది అదే! కేవలం రాజకీయ నాయకులే కాదు - చివరికి దేశాలు కూడా రౌడీల, డాన్ ల సాయం కోరుతున్నాయి.


    ఉదాహరణకి పాకిస్తాన్ నే తీసుకుందాం.


    బాంబే బ్లాస్ట్ లలో పాకిస్తాన్ అదృశ్యహస్తం ఉందని అందరికి తెలిసిందే! బాంబేలో బ్లాస్ట్ లు గురించి , భీభత్సం సృష్టించడానికి పాకిస్తాన్ ఎవరి సాయం కోరింది?


    ఇండియాలో \నెంబర్ వన్ డాన్ అయిన దావూద్ ఇబ్రహీం ని! అవునా?

 

    అయితే, ఈ రౌడీలని మెయిన్ టెయిన్ చెయ్యడానికి భారీగానే ఖర్చవుతుంది. ఎంత ఖర్చయినా కూడా అది యుద్దాలకంటే చౌకే కదా!


    ఖర్చులన్నీ కంప్యూటర్ మీద అంచనాలు వేశాం మేము. దాని ప్రకారం - రోజుకి పాతిక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగితే ఎవరైనా సరే ఈ ఇండియాని ఎలేయ్యవచ్చు. " అని కొద్దిగా ఆగాడు జస్వంతరావు.


    అతి కష్టంమీద తనని తానూ నిగ్రహించుకుంటున్నాడు రాజా.


    "వింటున్నావా! రోజుకి పాతిక కోట్లు రౌడీల మీదా, పొలిటికల్ పోలిస్ గుండాల మీద ఖర్చు పెట్టగాలిగినవాడు ఈ దేశాన్ని ఏలేయ్యగలడు! నిజం చెప్పాలంటే ..........మీ పూర్వికులు కూడా రౌడీల సాయంతోనే రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు ........ఆఫ్ కోర్స్ ..........ఆ రౌడీలకి సైనికులని పేరు పెట్టారనుకో! రాజా! ఇండియాని చులాగ్గా లొంగదీసుకోవాలంటే సైలెంట్ మెజారిటీ అయిన జనాన్ని టెర్రరైజ్ చెయ్యాలి. కంబోడియాలో అదే చేశారు!


    అంగోలాలో అదే చేశారు. టెర్రరైజ్ చెయ్యాలంటే తుపాకులు పనికిరావు! మాములు బాంబులు .....చివరికి ........అటంబాంబు కూడా పనికి రాదు.....


    .ఈ రోజుల్లో జనాన్ని విపరీతంగా టేర్రరైజ్ చేసేవి లాండ్ మైన్స్! మాములు తెలుగు నవల సైజులో ఉండే చిన్న బాంబులు ........భూమిలో పాతి ఉంచుతారు. వీటిని ......వీటి దుష్టశక్తి అపారం! రాజా! ప్రజలకు వర్ణనాతీతమైన కష్టనష్టాలు కలిగించే ఈ లాండ్ మైన్స్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అయితే .......ఒక్కొక్కటీ ఐదారు అమెరికన్ డాలర్లు మాత్రమే ఖరీదు ఉండే ఈ 'రాక్షస పుత్రికలని" మనం అమెరికా నుంచి , చైనా నుంచి సులభంగా కొనవచ్చును. శత్రుదేశాల సిండికేట్ ఈ విషయంలో మనకి అన్ని విధాల సహకరిస్తుంది. ప్రస్తుతం మనం చర్చించవలసింది ఈ శత్రుదేశాల సిండికేట్ గురించే! సిండికేట్ తరపున మనకి చాలా మంచి ఆఫర్ ఉంది.........నువ్వు రెడీ అను! నేను వాళ్ళతో మాట్లాడతాను. ఈ ప్రపోజల్ గనక ఓకే అయి......రాజా ..........నువ్వే ఈ రెస్పాన్సిబిలిటి తీసుకుంటే ............


    ఈ ఎస్టేట్ ఆస్థి పదివేల కోట్లు "ఆప్ట్రరాల్" అనిపిస్తుంది నీకు! లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉండే ఇండియా మొత్తాన్ని నీ గ్రిప్ లోకి తెచ్చుకోవచ్చు! వాట్ డూయూ సే?" అన్నాడు.


    స్ప్రింగులాగా లేచి నిలబడ్డాడు రాజా.


    ఒక్క అంగలో జస్వంతరావుని సమీపించాడు. మరుక్షణంలో అతని చేతులు జస్వంతరావు మెడచుట్టూ బిగుసుకుపోయాయి.


    "దేశద్రోహి! నీలాంటి వాణ్ణి తక్షణం చంపకపోవడం మహాపరాధం! నిన్ను చంపేసి  ఆ తర్వాత నేను ఉరికంభం ఎక్కినా ఫర్వాలేదు." అన్నాడు ఉద్రేకంతో వణికిపోతూ.


    అతికష్టం మీద రాజా పట్టుని విడిపించుకోగలిగాడు జస్వంతరావు. ఉపిరాడక అతనికి పొడిదగ్గు వస్తోంది. కానీ అతని కళ్ళు మాత్రం నవ్వుతున్నాయి.


    "ఒకే! ఓకే! యూ విన్! టేకిట్ ఈజీ!" అన్నాడు జస్వంతరావు నవ్వుతూ.


    "ఏమిటిదంతా?" అన్నాడు రాజా కఠినంగా.


    ప్రసన్నంగా చూస్తూ అన్నాడు జస్వంతరావు.


    "నేను పెట్టిన పరీక్షలో నువ్వే గెల్చావు యంగ్ మాన్!"


    అనుమానంగా చూస్తూ ఉండిపోయాడు రాజా.


    చిరునవ్వుతో చెప్పడం మొదలెట్టాడు జస్వంతరావు.


    "రాజా! నువ్వు గనక ఈ ప్రపోజల్ కి ఒప్పుకున్నట్లయితే, నీ కొలువుకి గుడ్ బై చెప్పి తక్షణం ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వుండేవాణ్ణి నేను! కానీ నా అంచనా నిజం అయింది. యూ ఆర్ ఏ రియల్ హీరో! కమాన్ లెటజ్ షేక్ హాండ్స్! అండ్ లెటజ్ సేవ్ ద కంట్రీ! ఇక నుంచి ఇద్దరం కలిసి పని చేద్దాం. నేను చెప్పిన ప్రపోజల్ అబద్దం కాదు - ఆ ప్రపోజల్ నిజంగానే ఉంది - కొన్ని సంపన్న దేశాలు కలిసి ఈ ప్రతిపాదనని విక్రమదేవరావు గారికి పంపారు - కానీ ఆలోగానే విక్రమదేవరావుగారు చనిపోయారు. ఇప్పుడింక ఆ ప్రపోజల్ నీకు రాబోతుంది. అయితే - నువ్వు దానిని వెంటనే కాదనకు - వాళ్ళ పూర్తీ వివరాలు, అవీ తెలుసుకోవడం మనకి అత్యవసరం - మనం వాళ్ళ ప్రతిపాదనని వొప్పుకున్నట్లే నటిద్దాం - లెటజ్ ప్లే అలాంగ్" అన్నాడు జస్వంతరావు.


    "అంటే ..........మనమేం చెయ్యాలి?" అన్నాడు రాజా.


    "ఆ సిండికేట్ తాలూకు రిప్రజెంటేటివ్ గ్రాండ్ హోటల్ కి వస్తాడు ఇవాళ. అక్కడ అతన్ని మనం మీటవుదాం! వాట్ యూ సే?"


    ఇటీజ్ ఓకే విత్ మీ!" అన్నాడు రాజా.


    సాయంత్రం -


    రాజా జస్వంతరావు కలిసి వింటేజ్ "సిల్వర్ ఘోస్ట్" లో ఎక్కి గ్రాండ్ హోటల్ కి వెళ్ళారు.


    వెళ్ళి వెళ్ళగానే -


    అక్కడ ఉన్న పెద్ద బోర్డు ఒకటి రాజా దృష్టిని ఆకర్షించింది.


    సెక్సీ -

    
    సెన్సేషనల్ -


    సింగింగ్ , స్వింగింగ్ స్టార్


    ఆఠీన్ రాణీ!


    సింటిలేటింగ్ ప్రోగ్రాం!


    టు నైట్ అండ్ ఎవ్విరి నైట్!


    గ్రాండ్ హోటల్లో "ఆఠీన్ రాణీ" అని బోర్డు మీద పేరు కనబడగానే డైమండ్ రాజా మొహంలో ఆలోచన కనబడింది.


    ఆరోజున ఇంకో హోటల్లో తనతో బాటు డాన్సు చేసి ఉండవలసిన అమ్మాయో కాదో ఈ ఆఠీన్ రాణీ అంటే?


    ఆ రోజున ఆ అమ్మాయి డైస్ మీదికి రాలేదని తను అసహనంగా ఎదురు చూస్తూ ఉంటే ......ఆ లోగానే ప్లేన్ క్రాష్ కావడం - అందరూ కకావికలాయిపోవడం జరిగింది. డైమండ్ రాజా - ఆఠీన్ రాణీ కాంబినేషన్ మిస్సయిపోవడం జరిగింది కూడా!


    అలా ఆలోచిస్తూనే జస్వంతరావుతో బాటు గ్రాండ్ హోటల్లోకి నడిచాడు డైమండ్ రాజా.


    చాలా ఫైవ్ స్టార్స్ హోటల్స్ లాగానే ఆ గ్రాండ్ హోటల్ కూడా గాలి వెలుతురూ రాకుండా చలువరాతి సమాదిలాగా కట్టి ఉంది.


    అలాంటి "లగ్జరీ" హోటల్స్ లో ఉండే వాళ్ళంటే డైమండ్ రాజాకి చాలా సానుభూతి! ఫైవ్ స్టార్ హోటల్స్ అంటే అతని దృష్టిలో పాలరాతి సమాధులు! అందులో చలువరాతి తేనెతుట్టలాంటి గదులు! సహజమైన గాలి రాదు. సహజమైన వెలుతురు రాదు! అక్కడ సహజమైన మనుషులు ఉండరు. అంతా కృత్రిమత్వం - కపటం - అక్కడ పైసానే పరమాత్మ!


    గ్రాండ్ హోటల్ సెల్లార్ లో సెంట్రల్ ఎయిర్ కండిషన్డ్ నైట్ క్లబ్బు ఉంది.


    దాన్లోకి వెళ్ళారు జస్వంతరావు , రాజా.


    లోపలికి వెళ్ళగానే క్లబ్బు నాలుగువైపులా పరికించి చూశాడు జస్వంతరావు.


    రావలసిన వ్యక్తీ కనబడలేదు!


    "ఆ వచ్చేది ఎవరన్నారూ?" అన్నాడు రాజా.


    "క్లయివ్ అనీ - ఒక ఏజెంట్.


    "మరి వచ్చినట్లు లేడే?"


    "అతను మాములుగా అయితే మాట తప్పే మనిషి కాడు. రాజా! నువ్విక్కడే కూర్చో! నేను వెళ్ళి ఒకసారి హోటలంతా చూసి వస్తా! అతను బార్ లో గాని ఇంకెక్కడన్న కూర్చున్నాడెమో!"


    "అల్ రైట్!" అన్నాడు రాజా - ఒక టేబుల్ దగ్గర కూర్చుంటూ -


    జస్వంతరావు బయటికి వెళ్ళిపోయాడు.


    చుట్టూ పరికించి చూశాడు రాజా.


    రిజర్వు అయిన ఒకటి రెండు టేబుల్స్ తప్పించి , మిగతా టేబుల్స్ అన్నీ అప్పటికే నిండిపోయాయి. వచ్చిన క్రౌడ్' లో ఇంటర్నేషనల్ లుక్ వుంది. అదిగో అక్కడ కూర్చున్న జంట - అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికీ బంగారం రంగు జుట్టు ఉంది - వాళ్ళు ఈస్ట్ యురోపియన్స్ అయి ఉంటారు. ఆ టేబుల్ దగ్గర కూర్చున్న నలుగురూ ఆఫ్రికన్స్ - బహుశా జోలూ తెగ అయి ఉండవచ్చు - ఒక టేబుల్ దగ్గర ఒక అరబ్ షేక్ ఒక్కడే కూర్చుని జిన్ తాగుతున్నాడు.


    అంతలోనే -


    క్లాష్ ఆఫ్ సింబల్స్!


    వెంటనే ఆర్కెస్ట్రా అందుకుంది.


    అందరూ ఒక్కసారిగా డైస్ వైపు చూశారు!


    డైస్ మీద లైట్లన్నీ ఆరిపోయాయి!


    తర్వాత, మళ్ళీ, కాస్త డిమ్ గా వెలిగాయి లైట్లు.

    
    ఆ తర్వాత మెల్లి మెల్లిగా ప్రకాశవంతం కావడం మొదలెట్టాయి అవి.


    చీకటినే తన వంటికి చుట్టేసుకున్నట్లు అతి నల్లటి , అతి పల్చటి అరబ్ డ్రెస్ లో ఉంది మీనాక్షి - ఉరఫ్ ఆఠీన్ రాణీ!


    పల్చటి , నల్లటి ఆ డ్రెస్సు మీద నాజూకైన వెండి తీగెల నగషి ఉంది.


    ఆర్కెస్ట్రా ఉపు అందుకుంది.


    ఆఠీన్ రాణీ డాన్స్ మొదలయింది.


    తమాషాగా - తెలుగుపాట - దానికి వెస్టర్న్ బాణీ - ఆఠీన్ రాణీ అరబ్ డ్రెస్సు - చిత్రమైన కాక్ టెయిల్!


    అందరూ కళ్ళార్పకుండా చూస్తున్నారు.


    తనకి తెలియకుండానే పాటని ఆలకిస్తూ ఆఠీన్ రాణీ స్టెప్స్ ని గమనిస్తున్నాడు రాజా -


    ఆ తర్వాత - అప్రయత్నంగా లేచాడు అతను. అతని కాళ్ళు అతని ప్రమేయం లేకుండానే డైస్ దగ్గరికి నడిపించాయి.


    మరుక్షణంలో -


    రాజాలోని గాయకుడు గళం విప్పాడు.


    హటాత్తుగా తన పక్కకి వచ్చేసి పాట అందుకున్న ఒక మొగాణ్ణి చూసిన ఆఠీన్ రాణీ మీనాక్షి మోహంలో రంగులు మారాయి. కనుబొమ్మలు ముడిపడ్డాయి. ముక్కుపుటాలు కాస్త పెద్దవయ్యాయి.


    అదిగో!


    సరిగ్గా ఆ క్షణంలోనే అర్ధమయింది డైమండ్ రాజాకి - ఆఠీన్ రాణీలో ఉన్న ప్రత్యేకత ఏమిటో!


    పాడుతూనే ఆఠీన్ రాణీ వైపు చూస్తున్నాడు డైమండ్ రాజా, చూస్తూనే ఆలోచిస్తున్నాడు.


    ఆఠీన్ రాణీ ఆడుతూనే బుసకొడుతున్నట్లు అతని వైపు చూస్తోంది.


    డైమండ్ రాజాకి అనిపించింది -


    ఈ అమ్మాయి చాలా బావుంటుంది!


    నో డవుట్!


    అయితే మరీ అప్సరసలాంటి అందం అని చెప్పలేం!


    కానీ !


    అప్సరసల్లో కూడా ఉండదేమో అనిపించేటంత ఆకర్షణ ఈ అమ్మాయిలో ఉంది!


    ఏమిటిది?

    
    ఆమె మొహంలో ఎక్స్ ప్రెషన్! అదేనా? అవును!


    తిరుగుబాటు మనస్తత్వం! తనమీద తనకి అపరిమితమైన నమ్మకం, లోకం అంటే పూర్తీ అపనమ్మకం - అతబోమ్మలా చూస్తే అంతు చూస్తాననే బెదిరింపు - లోకాన్ని షేపు మర్చేయ్యాలనే తహతహ - ముల్లోకాలని తన కొంగుకి ముడివేసుకోగలననే ఆత్మవిశ్వాసం -


    గాడ్!

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra