Home » Mainanpati bhaskar » Bhama Kalapam

 

    టాంకర్ని చూడగానే షాపు ఓనరుకి వీరావేశం వచ్చింది. అందరిని గదమాయిస్తూ 'జరుగుండ్రి! జరుగుండ్రి!" అంటూ కర్రపెత్తనం చెయ్యడం మొదలెట్టాడు.

 

    కానీ టాంకరు అతని దుకాణం ముందు ఆగలేదు. సరాసరి భరత్ ఇంటి ముందు ఆగింది.

 

    ఇదంతా ఏమిటో అర్ధం కాని కిరోసిన్ షాపు అతను వెర్రి మొహం వేసి నిలబడ్డాడు.

 

    నవ్వుతూ భరత్ వైపు చూసింది సుదీర. 'ఇప్పుడు హయిగా ఉందా మీ ప్రాణం? ఇంక ఎప్పుడూ కిరోసిన్ కరువు ఉండదు మీకు. ఎప్పుడూ కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత కిరోసిన్ దొరుకుంతుంది. అది సరే! మీకు గ్యాస్ కనెక్షన్ లేదా? ఇప్పించమంటారా?"

 

    మాట్లాడకుండా క్యూలో నిలబడ్డ జనం వైపు, తన ఇంటిముందు నిలబడ్డ టాంకరు వైపు మర్చి మార్చి చూశాడు భరత్.

    
    "సారీ! సుదీరగారూ! సాటి మనుషులు అంతమంది- ముసలి వాళ్ళు పసిపాపలని ఎత్తుకున్న ఆడవాళ్ళు మండుటెండలో క్యూలో నిలబడి ఉంటె నేను ఇప్పుడనగా వచ్చి అందరికంటే ముందే కిరోసిన్ పోయించేసుకోవడం అన్యాయం! కోటా కూడా అందరికి పంచితేనే నేను కూడా తీసుకుంటాను. గాస్ కనెక్షన్ కి బుక్ చేశాం మేము. వరస ప్రకారం సినియారిటి ప్రకారం వచ్చినప్పుడే వస్తుంది అది. ఇలా గోడదూకి ముందుగా పనులు చేయించుకునే పద్దతులు నాకు గిట్టవు.

 

    చిత్రంగా చూసింది సుదీర అతడ్ని.

 

    భరత్ త్వరత్వరగా ఇంట్లోకి వెళ్ళి డబ్బా తెచ్చి క్యూలో నిలబడ్డాడు.

 

    జరుగుతున్న దేమిటో పూర్తిగా కాకపోయినా కొద్ది కొద్దిగా అర్ధమయింది చాలామందికి. మాములుగా అయితే, చిన్న ఎద్దుబండికి అమర్చిన టాంకరు వస్తుంది ఆ షాపుకి. ఆ కాస్త కిరోసిన్ ని, కొంతమందికే దయాధర్మంగా పోస్తున్నట్లు పోస్తాడు ఓనరు. కొంతమందిని ఉత్త చేతులతో తిప్పి పంపించేస్తాడు. అలా మిగిల్చిన కిరోసిన్ బ్లాక్ లో అమ్ముకుంటాడు.


    బ్రహ్మాండమైన టూత్ పేస్ట్ ట్యూబులా ఉన్న ఇంత పెద్ద టాంకరుతో కిరోసిన్ రావడం ఒకేసారి అందరికి అందడం ఆ పేట ప్రజలు ఎప్పుడూ ఎరుగరు.

 

    అందరూ భరత్ వైపు అభిమానంగా చూశారు.

 

    సుదీర కారులోంచి భరత్ దిగడం, వచ్చి క్యూలో నిలుచోవడం, సుదీర ప్రసన్న వదనంతో అతన్నే చూస్తూ ఉండడం గమనించి తబ్బిబ్బయిపోయాడు షాపు ఓనరు. మాములుగా అయితే, గంటసేపు ఏడిపించి గానీ కిరోసిన్ పోయ్యనివాడు చకచక పని చేస్తూ పావుగంటలో అందరిని పంపించేశాడు.

 

    "సార్! ఇంక మీ కిరోసిన్ బెంగ తీరిందా? నాతొ వస్తారా?" అంది సుదీర నవ్వుతూ.

 

    డబ్బా ఇంట్లో పెట్టి వచ్చి కారెక్కాడు భరత్.

 

    "మనం బ్యాంకుకు వెళ్ళి ఈ నెక్లెస్ సేఫ్ డిపాజిట్ లాకరులో పెట్టి అక్కడే ఒక చిన్న పని చూసుకుని ఆ తర్వాత .........."

 

    "ఆ తర్వాత?"

 

    "అది ఇప్పుడే చెప్పను."

 

    బాంకు కెళ్ళారు.

 

    అండర్ గ్రౌండ్ ఎయిర్ కండిషన్డ్ వాల్డులో తన లాకరు తెరచి ఒరిజినల్ నెక్లెస్ ఉంచి వచ్చింది సుదీర.

 

    ఈలోగా మెయిన్ హాల్లో కూర్చుని ఉన్న భరత్ కి మేనేజర్ కేబిన్ లోంచి దుమదుమలాడుతూ బయటికి వస్తున్న దయాకర్ కనబడ్డాడు. దాదాపు అతని మెడ మీద చెయ్యేసి గెంటుతున్నట్లు గెంటుతున్నాడు చేతిలో గన్ పట్టుకున్న గూర్ఖా.


    "దయాకర్!" అన్నాడు భరత్.

 

    దయాకర్ తిరిగి చూశాడు. "మీరా సార్!" నమస్కారం సార్!"

 

    "నేనే వద్దామనుకుంటున్నాను నీ దగ్గరికి" అన్నాడు భరత్. అతని మొహం ఆనందంతో వెలిగిపోతోంది.

 

    కొద్దిగా సిగ్గుపడ్డాడు దయాకర్. ఈపాటికి భారతి ఇంట్లో చెప్పేసే ఉంటుంది. ప్రసన్నంగా ఉన్న భరత్ మొహం చూస్తుంటే అంతా సవ్యంగానే జరిగేటట్లు ఉంది.

 

    అతన్ని ఆప్యాయంగా చూశాడు భరత్. ఇతను తన చెల్లెలికి కాబోయే భర్త! యోగ్యుడు!

 

    "ఇలా వచ్చేవేమిటి దయాకర్?"

 

    "హొటల్ లో మిల్స్ సెక్షన్ కూడా పెడదామని బాంకు లోనుకి అప్లయి చేశాను సార్! అవి లేవు ఇవి లేవు అని పదిసార్లు తిప్పించుకుని ఇప్పుడసలు లోను లేదు, గీను లేదు పొమ్మంటున్నారు సార్! అదేమిటని అడిగితే గూర్ఖా చేత గెంటిస్తున్నారు."

    
    "ఏం కావాలిట వాళ్లకి?"

 

    "సెక్యురిటి ఏదన్నా తనఖా పెట్టమంటున్నారు సార్! నా దగ్గర ఉన్న గ్లాసులు, ప్లేట్లు, అన్ని కలిపినా వెయ్యి రూపాయల ఖరీదు చెయ్యవు. సెక్యురిటి పెట్టడానికి నా దగ్గరేముంటుంది సార్?"

 

    ఒక్క క్షణం ఆలోచించాడు భరత్.

 

    "మా ఇల్లు సెక్యురిటిగా చూపించవచ్చు గానీ, అది ఇప్పటికే కాలేజ్ కి తాకట్టులో ఉంది. ఏం చేద్దాం?"

 

    "పోన్లెండి సార్! ఎవరి కెంత ప్రాప్తమో అంతే! వస్తాను సార్!"

 

    "ఇంకేదన్నా మార్గముందేమో నేను ఆలోచిస్తాలే దయాకర్ "అన్నాడు భరత్. అతని మనసులో సుదీర మెదిలింది.ఆ అమ్మాయి తలుచుకుంటే జరగనిది లేదు.

 

    "వస్తాను సార్!"

 

    "దయాకర్!"

 

    "సార్!"

 

    "ఇక నుంచి నన్ను సార్ అని పిలవకు!"

 

    "అలాగే సార్!" అని వెళ్ళిపోయాడు.

 

    దయాకర్ అటు వెళ్ళగానే వచ్చింది సుదీర.

 

    ఆమె అప్పుడే , అక్కడే గనక దయాకర్ ని చూసి వుంటే కధ మరోలా వుండేది.

 

    కానీ, అలా జరగలేదు.

 

    "రండి!" అని భరత్ ని వెంట పెట్టుకుని మేనేజర్ కాబిన్ లోకి దారి తీసింది.

 

    మేనేజరు చిన్నవాడే. డైరెక్టుగా ప్రోబెషనరి ఆఫీసరుగా చేరడం వల్ల త్వరగా పెద్ద పోస్టులోకి వచ్చేశాడు. అతనికి సుదీర బాగా తెలుసు.

 

    "గుడ్ ఆప్టర్ నూన్ మేడమ్! వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ?"

 

    "కొత్త హొటలు కడుతున్నాము. ఫైనాన్సు కావాలి."

 

    "ష్యూర్, ష్యూర్. చెప్పండి ఎంత కావాలి?"

 

    ఎంత కావాలో చెప్పింది సుదీర.

 

    అతను దీర్ఘంగా శ్వాస తీసుకున్నాడు. "వెల్! ఇది చాలా పెద్ద అమౌంట్ . మా చీఫ్ ఒప్పుకోవాలి"


    "ఎవరూ మీ చీఫ్?"

 

    చెప్పాడతను.

 

    "మా డాడీ చేత మాట్లాడించమంటారా?"

 

    "మీ డాడీ మాట్లాడితే ఈజీగా పని అయిపోతుంది. ఉరికే ఫార్మాలిటి ! అంతే! సో! మీరు పెద్ద ఎత్తున బిజినెస్ లోకి దిగితున్నారన్నమాట?"

 

    నవ్వింది సుదీర.

 

    "మా బ్యాంకు మీ సేవ కోసమే!" అన్నాడతను తమాషాగా.

 

    "థాంక్స్ ఏ లాట్!" అని చెప్పి నిలబడింది సుదీర.

 

    "ప్లీజ్ హవ్ కాఫీ!"

 

    "నో ఫార్మాలిటీస్ ప్లీజ్! థాంక్స్" అని బయటికి వచ్చింది సుదీర.

 

    అయిదు నిమిషాలు కూడా పట్టలేదు ఆమె పని! దయాకర్ అయిదు రోజులు తిరిగినా కానీ పని.

 

    'అసలు దయాకర్ లాంటి పేదవాళ్ళకు బాంకులో అప్పు తీసుకునే అవసరం ఉంటుంది. కానీ సుదీర లాంటి కోటిశ్వరులకు ఎందుకు?" అనిపించింది భరత్ కి.


    అదే అడిగాడు.

 

    చాలా సహనంగా జవాబు చెప్పింది సుదీర. బాంకు లోను తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు వున్నాయి. వ్యాపారంలో అంతా నష్టమే వస్తున్నట్లు! ఇంకే గతి లేక అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతూ వున్నట్లు రికార్డులలో వుండాలి. అది గవర్నమెంటు లెక్కల కోసం. లేకపోతే ఇన్ కమ్ టాక్స్ వాళ్ళు వెంట పడతారు.


    అది కాక , తమ సొంత డబ్బుని ఇలాంటి వాటిల్లో పెట్టుబడి పెట్టడం అంత తెలివైన పనికాదు. దాన్ని నూటికి రెండొందలు వచ్చే కొన్ని రకాల వ్యాపారాలలో మాత్రమే తిప్పుతారు. బాంబే సినిమా వాళ్ళకి అప్పులు, రాజకీయాలు అలాంటి వాట్లో. తాము మాత్రం బ్యాంకుల్లో అప్పులు సంపాదించి నూటికి పద్దెనిమిది శాతం వడ్డీ మాత్రమే కడతారు తీరుబడిగా- అసలు కట్టడం అంటూ జరిగితే, గిరిగితే. దాదాపు ఉరికే వచ్చిన డబ్బు లాంటిది ఇది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra