Home » Rabindranath tagore » Panchabhuthaalu

      దానిమీద పృద్వీరాజ్ "ఇది విని నాకు అపార హర్షం కలిగింది. మనలో ప్రతి ఒక్కరిలో యింత కార్యయుద్దం ప్రారంభమయింది. కాని దీనిని అంగీకరించడానికి ప్రకృతి కాయానికి విరుద్దంగా  చంచలజీవి ఆచరణ సంతోష ప్రదం కాలేదు. నా ఆత్మ జీవాత్మ ఈ విధంగా చంచలతను ప్రకటించకుండా వుండడానికి కొద్దిరోజులు దేహ దేవయాని ఆశ్రమంలో సిద్దంగా వుండాలని నా ప్రబల ఆకాంక్ష . మీకు కూడా ఇదే ప్రార్దించండి." అని అన్నాడు.
     "భాయీ గగన్! ఏమిటిదంతా? నీకేమయింది? నీ నోటినుంచి శాస్త్ర విరుద్దమయిన మాటలు యెన్నడూ వినలేదే! యివాళ క్రైస్తవునిలాగ మాట్లాడుతున్నావేమిటి?జీవుడు స్వర్గంనుంచి ప్రపంచంలోనికి పంపితే వచ్చి దేహంలో నివసిస్తున్నాడు. సుఖదుఃఖాలను అనుభవించి పూర్తిగా వికసిస్తున్నాడు. బావానికి నీ పాత భావాలకు పొంత కుదరడంలేదు" అని అన్నాడు పవన్.
     అపుడు గగన్, "ఈ సర్వవిషయాలలోని భావాల సామరస్యం కొరకు నేనేమీ చేయలేదు. పాత భావాలకు నేటి భావాలకు సామరస్యం కలిగించడానికి నేను పోరాడడం లేదు. జీవిత యాత్రీకుల వ్యాపారంలో ప్రతిజాతీ తన దేశగమద్రలో ములధనాన్ని కూడబెట్టుకుంటుంది. చూడడానికి వానికి సంబంధించిన వ్యవహారం సాగిపోతుంటుంది. లేదా సాగదు. జీవుడు సుఖదుఃఖాలలో శిక్షణ పొందడానికి ప్రపంచంలోనికి వచ్చాడు. ఈ అభిప్రాయ సంపత్తిని స్వీకరించి జీవితయాత్రను ఉచిత రీతిని సాగించగలం. అపుడయినా శిక్షణ కృత్రిమమైందే నా అభిప్రాయం. ప్రసంగక్రమంలో ఏదయినా తేడావస్తే, ఏ బ్యాంకునోటుతో జీవిత వ్యవహారము ప్రారంభమయిందో అది ప్రపంచ సృష్టికర్త బ్యాంకులో కూడా చెలామణి అవుతుందని తెలిజేయదలిచాను" అని అన్నాడు.
     పృద్వీరాజ్ ఆర్ద్రస్వరంతో "దేవర వారికి ఒక్క మనవి. నీ ప్రేమ విషయం కఠినమయిందని ప్రతీతి. నువ్వు వ్యాపారానికి దిగితే నీతో కూడా విడిపోవలసి వస్తుంది. అది నాకు మించిన పని. కాని అనుమతిస్తే నేను కవితాభిప్రాయం వ్యక్తీకరిస్తాను" అని తెలిపాడు.
      గగన్ దేవ్ నలచరం పీటలమీద కూర్చుని గవాక్షం మీద కాళ్లు చాపాడు.
     పృధ్వీరాజ్, "అభివ్యక్తివాదం, పరిణామవాదం - వీటి అసలు విషయం కవితలో గోచరిస్తాయి. సంజీవినీ విద్య అంటే జీవిత విద్య. ప్రతి ఒక్క మనిషీ ఈ విద్యను పొందడానికి నిరంతరాభ్యాసం చేస్తూంటాడని ప్రపంచంలో స్పష్టమవుతూనే వుంది. ఒకటి రెండు సంవత్సరాలు కాదు, ఈ విద్యను నేర్చుకోవడానికి లక్ష సంవత్సరాలు తపస్సు చేయాలి. కానిదేని సహాయంతో ఈ విద్యను అభ్యసిస్తాడో, దాని ప్రాణివేణువుకు ప్రతిగా దానిప్రేమ క్షీణస్థాయి అవుతుంది. ఒక అద్యాయం సమాప్తం చేసి  ఆ నిష్ఠుర ప్రేమికుడు ఆమెను చెత్తలో పారవేసి వెళ్లిపోతాడు. ధరిత్రిమద అడుగడుగునా నిష్టుర వియోగ విలాప గాన ఝూంకారం వినిపిస్తున్నది" అని అన్నాడు.
     పృధ్వీరాజ్ వాగ్ఝరి యిపుడు మందగించింది. మధ్యలోనే విరక్తి చెంది ప్రకాశవతి, "మీరీ లాగున తాత్పర్యం ప్రకటించుకుంటూపోతే తాత్పర్యసీమ అంటూ వుండదు. కట్టెను జ్వలింపజేసి నిప్పు సెలవు పుచ్చుకుంటుంది. పట్టుగూడను చీల్చుకుని పట్టుపురుగు బయటకు వస్తుంది. పూలు యెండిపోయి ఫలాలను యిస్తాయి; బీజాన్ని చీల్చుకుని అంకురం బయటకు వస్తుంది. అలానే లక్ష తాత్పర్యాలు పుట్టుకొస్తాయి" అని అన్నది.
    గగన్ గంభీరంగా "ఈ విషయం పదహారణాలా నిజం. ఇదయితే తాత్పర్యం కాదు. ఉదాహరణ . దానిలోని అసలు విషయం ఇది: రెండుకాళ్లను ఉపయోగిస్తేనే ముందుకు సాగిపోగలుగుతాం. ఎడమ కాలు వెనకపెట్టి కుడికాలు ముందుపెడితే  ఎడమకాలు తన బంధమును వదిలించుకుని ముందుకు సాగిపోతుంది. మనం ఒకసారి మనలను మనం బంధించుకుంటే క్షణంలో బంధనమును యింకొకరు విప్పుతారు. మనం ప్రేమించగలం. ప్రేమను విచ్చేదించగలం. ఇది ప్రపంచంలోకెల్లా అన్నింటికంటే  విషాదములకు నియమత. ఈ నియమానుసారమే మనం నడుచుకుంటున్నాం. సమాజ విషయంలో కూడా ఈ మాట అన్వయిస్తుంది. నూతన నియమం కారక్రమేణా పాతఆచారాల  రూపంగా పరిణమించి మనలను ఒకచోట అడ్డగిస్తుంది. బంధనంతో పోరాడుతుంది. అపుడు సమాజంలో పెద్దయెత్తున విప్లవం వస్తుంది. దీని ఫలితంగా ఈ బంధనం ముక్కలుముక్కలవుతుంది. ఏ కాలును మనం ఆధారం చేసుకుంటామో శీఘ్రంగా దానిని పైకెత్తగలుగుతాం.  లేకపోతే నడవడం కష్టం. అందువల్ల ఉన్నతి ఉన్నచోట, ప్రగతి వున్నచోట వియోగం వుంటుంది. ఇది ఈశ్వర నియమం" అని అన్నాడు.
     "కథ చివర ఒకానొక శాపం వుంది. మీలో ఎవరూ దాని విషయం చర్చించలేదు. కచుడు విద్య సంపాదించి దేవయాని ప్రేమ బంధనాన్ని త్రెంచి వేసుకుని స్వర్గానికి వెళ్లిపోసాగాడు. అపుడు దేవయాని 'నువు నేర్చిన విద్య నువు యింకెవరికయినా నేర్పవచ్చుగాని స్వయంగా వ్యవహరించలేకపోదువు గాక!' అని శాపం పెట్టింది. ఆ అభిశాపానికి యింకొక అర్దేం లాగాను ధైర్యంగా వింటూ వుంటే చెపుతాను" అని పవన్ దేవ్ అన్నాడు.
     అప్పడు పృద్వీరాజ్ ధైర్యంగా వినగలుగుదుమో లేదో ముందుగా యెలా చెప్పగలం? ప్రతిజ్ఞ చేసి దానిని పాలించకలేకపోతే ఏమవుతుంది? నువు మొదలుపెట్టు, పరిస్థితి చేజారితే నా మీద దయ యుంచి ఆపివేద్దువుగాని" అని అన్నాడు.
     "సంజీవినీ విద్య అంటే సురక్షిత జీవనాధారణ విద్య. ఒకానొక కవి ఆ విద్యను స్వయంగా నేర్చుకుని యింకొకరికి నేర్పడానికి ఈ ప్రపంచంలో పుట్టాడని భావించుకోండి. అతను తన ప్రాకృతిక శక్తి ద్వారా  ప్రపంచాన్ని సమ్మోహితం చేయడానికి దాని సమీపంలో ఆ విద్యను వున్నతికి తెచ్చాడు. అతను ప్రపంచాన్ని ప్రేమించలేదని అనలేం, కాని అసలు విషయేమంటే - ప్రపంచం ప్రేమించలేదని అనలేం, కాని అసలు విషయమేమంటే - ప్రపంచం అతనిని 'నా కౌగిలిలోకిరా, నా పాశమును నీ కంఠానికి తగిలించనీ' అంటుంది. అపుడు కవి: "నేను  ఆత్మ సమర్పణ చేస్తే నేను నేర్చుకున్న సంజీవనీ విద్యను యింకెవరికీ నేర్పలేను. ప్రపంచంలోని సకల జనావళిలోనూ వుండి కూడా అనాసక్తుడనుగా వుండాలని నీ కోరిక" అని చెపుతాడు. దానిమీద ప్రపంచం అతనికి, వుండాలని నీ కోరిక'  అని చెపుతాడు. దానిమీద ప్రపంచం  అతనికి, "నువ్వు నా దగ్గర నేర్చిన విద్య యింకొకరికి నేర్పు. నువు స్వయంగా  దానిని వ్యవహరించలేక పోవుదువు గాక!" అని శాపమిచ్చింది. గురువును దీక్షతో సేవించి విద్యాలాబం పొందాడు. కానిసంసార దృష్టిలో గురువుకేమీ లాభించలేదు. ఇదే శాపానికి కారణమని తోస్తుంది. ఈ విషయంలో ఆ పిల్లవాడు కూడా అజ్ఞాని. నిర్లిప్త భావంతో బయట నుంచి విద్య నేర్చుకోవచ్చు. కాని అందులో లీనమై వ్యవహారిక  శిక్షణను గ్రహించక పోతే దానిని ప్రయోగించలేము.  అందువల్లనే పూర్వకాలంలో  బ్రాహ్మణుడు మంత్రి, క్షత్రియుడు రాజు. అతని సలహా పొందేవాడు.  బ్రాహ్మణుడే గనుగ సింహాసనం మీద కూర్చుండబెట్టితే బ్రాహ్మణుడు కర్మ సాగర అగాధజలంలో మునిగిపోయేవాడు. రాజ్యాన్ని కూడా ముంచి వేసేసే వాడు.
     "మీరు విమర్శించిన విషయాలు అతి సాధారణమైనవి. రాజు యింట పుట్టినా కూడా అనేక సుఖదుఃఖాలు సంభవిస్తూంటాయి. అనేదే మన కదానుసారం. రామాయణ తాత్పర్యం. ఉపయుక్తావసరంలో స్త్రీ  పురుషుల హృదయంలో పరస్పర ప్రేమ సంచారం అసంభవం కాదనేది శకుంతల కథా తాత్పర్యం. మరీ దీనిని నూతన శిక్షణ అని మీరంటారెందుకు?" అని అడిగాడు పవన్.
     నిర్ఘరిణి వెనకా ముందు ఆలోచిస్తూ, "సాధారణ విషయంకూడా కార్యవస్తువేనని నా భావం. యింట జన్మించి అన్ని విధాలా సుఖించే యోగ్యత కలిగి కూడా జీవితాంతం సీతారములు ఒక విపత్తు, తరువాత యింకో విపత్తును యెదుర్కొనవలసి వచ్చింది. ఇది మామూలు విషయమే. కానియోగ్య విషయాలను చదివి కన్నీళ్లు జలజలా రాలతాయి.  ఈ దుఃఖ భరితగాధ బహు పురాతనమైనదని తెలిసికూడా  దీనిని వేదంగా భావిస్తారు. శకుంతల ప్రేమ దృశ్యంలో నిజానికి విశేషమేమీ లేదు. ఒకానొక పురాతన సంఘటన ప్రేమ సమయాసమయాలను  పాటించకుండా హఠాత్తుగా మహావేగంతో ఆక్రమించుకొని స్త్రీ పురుష హృదయాలను దృఢబంధనంలో బంధించి  ఒకటి  చేస్తుందనేదే శకుంతల  కథ తాత్పర్యం. ఈ సామాన్య విషయాన్ని సకల జనులు ఎంతో అనురాగంతో ఆదరిస్తారు. మృత్యువు ఈ జీవ జంతువులను, చెట్లు చేమలను, చెత్తాచెదారం మొదలయిన వాటిని మింగివేసి ధాత్రీవస్త్రాపహరణం చేస్తాడు. కాని విధాత దయవల్ల ఆ వస్త్రానికి అంతూ వుండదు.  నూతన వస్త్రాలతో సుసంజిత మవుతూంటుందనే ద్రౌపదీ వస్త్రా పహరణ కథా తాత్పర్యం అని చెప్పవచ్చు.
     "సభాపర్వంలో మన హృదయ రక్తం వుడికిపోతుంది. భక్త స్త్రీ కి సంభవించిన ఆపదను చూసి దుఃఖంతో కన్నీరు ప్రవహిస్తుంది. ఇందుకు కారణం నవీన, విశేషార్దాలు కావు. అత్యాచార పీడిత స్త్రీ గౌరవము, రక్షాకానుక అత్యంత పురాతన స్వాభావిక సాధారణ సత్యం. కచదేవయాని సంవాదంలో కూడా మానవ హృదయ పురాతన సాధారణ దుఃఖ గాధా వర్ణన వుంది. దానిని తుచ్చమని  భావించేవారికి, విశేష సత్యాన్నే ముఖ్యమని భావించేవారికి నిజానికి కావ్యం అర్దం చేసుకునే శక్తి లేదనే చెప్పాలి" అని అన్నది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra