Home » Yandamuri veerendranath » లేడీస్ హాస్టల్

  

       "పోలీసుల దగ్గర బలమైన సాక్ష్యాలున్నాయి. అవన్నీ నమ్మి నేను అనుమానంతో అడగటం లేదు. నాకు అన్ని వివరాలు కావాలి. లక్ష్మితో మీ పరిచయం నించి లక్ష్మి చనిపోయింది అని తెలిసేంతవరకు మొత్తం అంతా చెప్పండి."
   
    "తను నిర్దోషి అని ఆయన నమ్మారు" అనుకోగానే రాయన్న ముఖంలోకి కాంతి వచ్చింది.
   
    "చెప్పడానికేమీలేదు లాయర్ గారూ! అపురూపలక్ష్మి నాకు తెలిసిన అమ్మాయి, అం ఏనాతే నకు అభోమానం వుంది. అంతకుమించిన భావం నాకు కలలో కూడా కలగలేదు. అయినవాళ్ళందరికీ దూరంగా, వంటరిగా ఈ సిటీలో వుంటున్న వాళ్ళం కాబట్టి కాస్సేపయినా ఒకరికొకరం తోడుగా ఉండలనుకుని అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళం. నా పెళ్ళికి తనను పిలిచాను తప్పకుండా వస్తానంది. మా మధ్య మరొ రకమైన సంబంధం వుంటే ఆ రోజే గొడవ పెట్టేది కదా. మాట యిచ్చింది కాని పెళ్ళికి రాలేదు. ఎందుకో తెలియదు. నేను అంత సీరియస్ గా తీసుకోలేదు. మర్నాడు ఒకసారి వచ్చి కలవమని నోట్ వ్రాసి పంపింది. వెళ్ళాను. చాలా అప్ సెట్ అయివుంది. కారణం ఏమిటని ఎంతడిగినా చెప్పలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు గుర్తొచ్చినప్పుడల్లా అలా ఏడుస్తూనే వుంటుంది. కాబట్టి నేను సీరియస్ గా తీసుకోకుండా కాస్సేపు ధైర్యం చెప్పి వచ్చేశాను. ఆ తర్వాత రోజు అర్ధరాత్రి పోలీసులు వచ్చి చెప్పేవరకు తను చనిపోయిందన్న విషయం నాకు తెలియదు. నాకు తెలిసింది ఇంతవరకే."
   
    వెంకటరత్నం అతడి కళ్ళల్లోకి నిశితంగా చూశాడు. "మిస్టర్ రాయన్నా! లక్ష్మితో మీకున్నది కొద్దిపాటి స్నేహం మాత్రం అంటున్నారు. కాని రోజూ హోటళ్ళకి తీసుకెళ్ళి, అర్దరాత్రి వేళ హాస్టల్ లో దింపి వెళుతూండేవారని పోలీసులు అంటున్నారు. అంత నిజాయితీగా వుండే వాళ్ళు ఇలాంటి పనులెలా చెయ్యగలిగారు?" అన్నాడు.
   
    రాయన్న ఆయన కళ్ళలోకి సూటిగా చూశాడు. "ఇందాక ఇన్ స్పెక్టర్ ఇదే ప్రశ్న అడిగాడు లాయర్ గారూ. అప్పటినుంచీ నాలో నేను ఇదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ వేసుకుంటున్నాను. అమ్మాయిలతో కలిసి హోటళ్ళకు వెళ్ళి, అర్దరాత్రిదాకా కబుర్లు చెప్పి, తీసుకొచ్చి అందరూ చూస్తుండగా హాస్టల్ లో దింపి వెళ్ళేంత ధైర్యం నాలో ఎప్పటినించి కలిగిందా అని! నిజం చెప్పాలంటే ఇంటర్ కాలేజీ క్రికెట్ పోటీల్లో ఆడి మంచి పేరు సంపాదించుకున్న, నా కప్పట్లో ఆడపిల్లలతో పరిచయం లేదు. నన్నూ, నా ప్రతిభనీ గుర్తించి అభిమానించే అమ్మాయిలు తారసపడలేదు. రంజీ ట్రోఫీలో ఆడేవరకు నాకు గుర్తింపు లేదసలు. నేను కూడా నా ఆటని గవాస్కర్, కపిల్ దేవ్ ల ఆటతో పోల్చుకుని నా స్థాయి చాలా తక్కువని బాధపడుతూండేవాడిని. ఆటని అభివృద్ధి చేసుకోవాలనే తపనతో దాంట్లోనే మునిగితేలుతూండేవాడిని. అప్పటి నా కుటుంబ పరిస్థితులు, బాక్ గ్రౌండ్ కూడా నాలో ఇన్ ఫీరియారిటీని బాగా పెంచాయనుకుంటాను. రంజీట్రోఫీ సెమీ ఫైనల్స్ లో బాంబే జట్టుతో ఆడినప్పుడు మొదటిసారిగా నేను బాగా ఆడానన్న సంతృప్తి నాకు కలిగింది. అప్పటినుంచే అభిమానులు నా చుట్టూ చేరడం, ఆటోగ్రాఫు లడగడం మొదలయింది. మొదట్లో బాగా సిగ్గు పడేవాడిని. నేను నిజంగా గొప్పవాడినయ్యానా అనే అనుమానం, తర్వాత్తర్వాత అది థ్రిల్ గా మారింది. బాగా ఆడి విజయం సాధించిన థ్రిల్ కంటే పదిమందికీ ముఖ్యంగా అమ్మాయిలచేత 'ఐడియల్ హి'గా గుర్తింపబడుతున్నది థ్రిల్ నన్నో ట్రాన్స్ లోకి లాగేసింది. నాలో బిడియాన్ని, ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టటానికా అన్నట్లు నా స్నేహితుడు రాజారావు నన్ను బలవంతంగా క్లబ్బులకీ, హోటళ్ళకీ తీసుకెళ్ళేవాడు. ఈ నాగరికత ఫాస్ట్ నెస్, ఫ్యాషన్లు తెలియని ఒక అతి సామాన్యుడికి.....అందరూ వచ్చి ఆప్యాయంగా పలకరించటం, అందరి దృష్టీ తనమీదే కేంద్రీకరింపబడడం, హైసొసైటీ వ్యక్తులు కూడా ఆరాధనగా చూసి ఆటోగ్రాఫు లడగడం అంతా ఒక కొత్త ప్రపంచం! ఆ ప్రపంచంలో దాదాపు నన్ను నేను మర్చిపోయానేమో ఆ మత్తులో వుండగానే అప్పుడే లక్ష్మి పరిచయం అయింది. ఇంకా చాలామంది అమ్మాయిలు పరిచయం అయినా లక్ష్మి ఒక్కతే నాకు దగ్గరయింది. పోష్ హోటల్స్ లో అమ్మాయిలతో కలిసి పార్టీలు, అర్దరాత్రివరకు కబుర్లు, డ్రింక్సు తీసుకోవడాలు గొప్ప థ్రిల్లింగ్ గా అనిపించేది. 'కలలో కూడా వూహించని అనుభవాలని స్వంతం చేసుకొనే అవకాశం నీకు వచ్చిందిగాని అనేవాడు రాజారావు అనుభవించినంతవరకూ నిజంగా అద్బుతంగానే వుండేదిగాని అంతరాత్మ అప్పుడప్పుడూ తప్పుచేస్తున్నానని గొణుగుతుంటే 'కాని పనులేమీ చేయడం లేదు. ఈ రకమైన గుర్తింపు వచ్చినప్పుడు ఇట్లాంటివన్నీ తప్పవు' అని సమర్ధించుకుంటుండేవాడిని కాని ఒక్కమాట మాత్రం నిజం వెంకటరత్నంగారూ -ఈ రెండేళ్ళలో జీవితం ఎంత జాలీగా గడిపినా, ఎందరమ్మాయిలతో సంబంధం వున్నా, లక్ష్మితో మాత్రం నాకు శారీరక సంబంధంలేదు. అలాంటి ఆలోచనలే ఎప్పుడూ కలగలేదసలు."
   
    వెంకటరత్నం అతడివైపు జాలిగా చూశాడు. చెప్పాల్సింది ఇంకేమీ లేనట్టు మౌనంగా వున్నాడు అతడు. "రాజారావుకి మీమీద శత్రుత్వం ఏమైనా వుందా?" అడిగాడు వెంకటరత్నం.
   
    "ఊహు. నాకు చాలా మంచి స్నేహితుడతడు. సొసైటీలో ఎలా మెలగాలో నాకు నేర్పించాలని తాపత్రయపడేవాడు. భవిష్యత్తులో నేను మంచి ప్లేయర్ని అవుతానని అతడికి గట్టి నమ్మకం."
   
    "మీమీద పోలీసులకి అంత గట్టి అనుమానం ఎందుకొచ్చింది?"
   
    "మొన్న నేను హాస్టల్ కి వెళ్ళడం చూసిన అమ్మాయిలు చెప్పారట. అధీగాక సూయిసైడ్ నోట్ లో హాండ్ రైటింగ్ నాదే అని పోలీసుల అనుమానం."
   
    "సూయిసైడ్ నోట్ మీ హాండ్ రైటింగ్ లో ఉందా? అదెలా వచ్చింది?"
   
    "తెలియదు. ముందుగా నాచేత అలాంటి నోట్ వ్రాయించి చెక్ చేశాడు ఇన్ స్పెక్టర్."
   
    వెంకటరత్నం జేబులోంచి చిన్నడైరీ, పెన్నూ తీశాడు "మీతో ఇన్ స్పెక్టరు ఏమని వ్రాయించాడో అలాగే వ్రాయండి" అన్నాడు.
   
    రాయన్న నిస్సంకోచంగా డైరీ అందుకుని వ్రాసిచ్చాడు.
   
    "నేనీ కేసు టేకప్ చేస్తున్నాను రాయన్నా. ఈ రోజే మీ బెయిల్ కోసం ప్రయత్నిస్తాను. విష్ యు గుడ్ లక్" చెయ్యి చాపాడు వెంకటరత్నం. రాయన్న టీమ్ లో సెలక్టయిన విషయం అతడికి అప్పుడే చెప్పదల్చుకోలేదు. అది వినవలసిన సమయంలో, వినవలసిన వారి ద్వారానే తెలిస్తే బావుంటుంది అని వెంకటరత్నం ఉద్దేశ్యం.
   
                                    *    *    *
   
    వెంకటరత్నం వెళ్ళిపోతూండగా బయట రూంలో టెలిఫోన్ మోగింది. ఇన్ స్పెక్టర్ అందుకున్నాడు. అవతల వ్యక్తి స్వరం వినగానే ఆటోమేటిగ్గా అటెన్షన్ లో నిలబడ్డాడు.
   
    "ఒప్పుకున్నాడా?" అడిగాడు డి.సి.పి. అట్నుంచి.
   
    "లేదు సార్, చెయ్యలేదంటున్నాడు."
   
    "హత్యచేసినవాడు అంత సులభంగా వప్పుకుంటాడా? నాలుగుతంతే బయటపెడతాడు. సత్యనారాయణకి అప్పచెప్పాల్సింది.... మేజిస్ట్రేట్ దగ్గరకు ఎప్పుడు వెళుతున్నారు?"
   
    "ఇప్పుడు బయలుదేరుతున్నాం సర్."
   
    "సరే, వచ్చాక అతడిని సత్యనారాయణకి అప్పచెప్పండి." ని ఫోన్ పెట్టేశాడు.
   
    ఇన్ స్పెక్టర్ ముఖం మ్లానమయింది. తన చేతకానితనాన్ని ఎత్తి చూపినందుకు కాదు. ఇదే డి.సి.పి. ఉదయం ఫోన్ చేసినప్పుడు 'అతడసలే పబ్లిక్ ఫిగర్ జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా చెయ్యి చేసుకుంటే అభిమానులతో గొడవ' అని చెప్పాడు. ఇప్పుడిలా మాట్లాడుతున్నాడు. ఇన్ స్పెక్టర్ కి ఆ విషయంలో బాధగా లేదుగాని అతడు చాలా మంది నేరస్థులను చూశాడు. రాయన్నలాంటి చదువుకుని సంస్కారమున్న వ్యక్తి నేరం చేసివుంటే అది వప్పించటం చాలా తేలికయిన విషయం. ఎన్ని రకాలుగా ప్రశ్నించినా, హింసించినా నేరం వప్పుకోని వాడు అతి మొండివాడయిన రౌడీ అయినా అవ్వాలి లేదా నిర్దోషి అయినా అవ్వాలి. రాయన్న రెండోరకానికి చెందినవాడేమోననే అనుమానం అతనికి ఇంటరాగేషన్ టైంలోనే వచ్చింది. కాని తన కర్తవ్యం చివరివరకూ సరిగ్గానే నిర్వహిస్తూ రాయన్నని అన్ని రకాలుగానూ ప్రశ్నించాడు.
   
    రాయన్న మళ్ళీ క్రికెట్ బ్యాట్ పట్టుకోకుండా ఒళ్ళు కుళ్ళబొడవమని పైనుంచి ఆదేశం! నిజాయితీపరుడైన ఇన్ స్పెక్టరుకి ఇందులో రాజకీయం వుందని స్పష్టంగా తెలిసిపోతోంది.
   
    ఇన్ స్పెక్టర్ ఆలోచనలోపడి వెంకటరత్నం బయటకు వెళ్ళిపోవడం, వెంటనే సత్యనారాయణ లోపలకు వెళ్ళటం గమనించనే లేదు.
   
    సత్యనారాయణ క్రూరంగా నవ్వుతూ రాయన్న భుజంమీద చెయ్యివేశాడు.
   
    "ఇప్పుడు చెప్పు లక్ష్మిని ఎందుకు హత్యచేశావో" అన్నాడు అతడిని దగ్గిరగా లాగుతూ.
   
                                        *    *    *
   
    "మీ నిర్ణయం మార్చుకోకపోతే దేశం అంతా గగ్గోలెత్తిపోతుంది. ముఖ్యంగా మనదేశ ప్రతిష్టకే భంగం కలుగుతుంది. రాయన్నని టీమ్ లోంచి తీసేసినట్లు వెంటనే ప్రెస్ నోటీసు ఇవ్వండి" అన్నాడు రాఘవరెడ్డి.
   
    చందూబోర్డే అతడివైపు అసహనంగా చూశాడు.
   
    "ఓ నిర్ణయం తీసుకునేముందు మనం పూర్వాపరాలు ఆలోచించాలి రాఘవరెడ్డిగారూ, దాదాపు రెండేళ్ళ క్రితం అలాంటి పరిస్థితినే సిద్దూ విషయంలో ఎదుర్కొన్నాం. అప్పుడూ బోర్డులో మీరున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నాం? అప్పుడూ దేశంలో ప్రజలు గోలపెట్టారు. పత్రికలు విమర్శించాయి. అయినా అతడికి స్పెషల్ బెయిల్ తెప్పించి, విదేశాలకు వెళ్ళడానికి స్పెషల్ గా పర్మిషన్ కూడా మనమే తీసుకున్నాం. దేనికోసం? అతడు మనదేశ ప్రతిష్టను నిలబెట్టే ఆటగాడు కాబట్టి మనం తీసుకునే ఏ నిర్ణయమయినా మరెవరూ వేలెత్తి చూపలేనిదిగా వుండాలి. ఏ లాయరైనా, జర్నలిస్టయినా ఈ ప్రశ్న అడిగితే సమాధానం ఏం చెప్పగలం?"

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra