"రం....గ...." బెదిరిన లేడిలా చూసింది. రంగని గురించా! ఏమిటి బావా! ఏమిటి భయం? ఏమౌతుంది?.... ఈ రోజు కట్టు విప్పుతారు కదూ?"
    "ఏమౌతుందో చెప్పలేను__మొన్న కట్టు విప్పినపుడు మీకు చెప్పలేదు__రంగ నన్ను చూడలేకపోయాడు. అతన్నీ నిన్నూ మభ్యపెట్టాను__మీకసలు చెప్పనే లేదు_ఏమౌతుందోనని మనస్సంతా ఆందోళనగా వుంది. నా విజ్ఞానం మీద నాకే నమ్మకం పోతోంది__ఏం చేయను."
    "అలా అనకండి బావా! మీరున్నారనీ, మీ వైద్యమనీ, నేనూ నాన్నగారూ అంతా ధైర్యంగా వున్నాం. మీరే అలా బెంబేలు పడితే మా గుండె బెదిరి చెరువౌతుంది వద్దు బావా! అలా అధైర్య పడకండి.... అలా అనకండి...."
    కన్నీరు కారుస్తున్న ఆమెను చూసి మరీ గాబరాగా అన్నాడు. "ఏడ్వవద్దు సావిత్రీ! నేను చెప్పేది విను.... నాకు అనుమానం వల్ల భయంవేస్తోంది__అంతే మరేం లేదు. ఇంతకీ ఈ విషయం నీకెందుకు చెబుతున్నానో తెలుసా?
    తలూపింది తెలియదన్నట్టు. అప్పుడామె ముఖం మంచు బిందువులతో నిండిన గులాబీ పూవు కదిలినట్టుంది.
    మనసుని సంభాళించుకుని ఆమె కన్నీటిని తుడుస్తూ "నేను స్వయంగా కట్టు విప్పాలంటే భయమౌతుంది. ఎందుకో నా చేతి చలువ పనుకిరాదేమోననిపిస్తోంది. నర్సెస్ చేత చేయించడం యిష్టం లేదు. అందుకని__ఒక్క క్షణం ఆగి అన్నాడు. "నీ డ్రస్సింగ్ చేయడం, క్లీనింగు చేయటం నేర్పాను కదా, నీవే స్వయంగా వచ్చి పి హోమ్ లో అతని కట్టు విప్పమని అడగాలనుకున్నాను వస్తావా? వెళదామా? రా__" అన్నాడు.
    భయం భయంగా చూస్తూ అంది "ఎందుకు బావా? అలా అంటున్నారు? చెప్పండి ఏమిటీ మీ భయం? నేనెందుకు రావాలి? రానని కాదు. రాకూడదనీ కాదు వస్తాను. మీ మాట కంటే, రంగా కంటే నాకు కావలసింది ఏముంది? కానీ మీ సందిగ్ధతతో నన్ను చంపుతున్నారు. నా భయం ఎక్కువౌతుంది. అర్ధం కాని బాధ గుండెల్లో ముసురుకుంటోంది. చెప్పండి బావా! ఏమిటి మీ భయం? ఎందుకు మీకు అనుమానం?"
    తన గుండెలపై వాలిపోయి బేలగా అడుగుతున్న ఆమె వీపు నిమురుతూ ఓదార్చటానికి, ధైర్యం కలిగించాలని అన్నాడు. "భయం ఏమీలేదు సావిత్రీ! ఒక నమ్మకం నీ చేతితో పది జరిగినా మంచి జరుగుతుందని ఓ నమ్మకం అంతే! మరేం లేదు. మీ తమ్ముడి శ్రేయస్సు నేను నీకంటే ఎక్కువగా కోరతానా?"
    అతని గుండెలకి ఇంకా అంటుకుని పోతూ అంది. "మీ మనస్సేమిటో ఎప్పుడెలా వర్తిస్తుందో అర్ధమే కాదు బావా! మీరెంతమంచి వారు బావా! పదండి వస్తాను. నా హస్తవాసిలో మీకున్న నమ్మకం నేనెందుకు కాదనాలి? పదండి...."
    బయలుదేరుతూ అన్నాడు అక్కడ ఒక్క మాట కూడా మాట్లాడొద్దు మౌనంగా అతన్ని మాట్లాడ నివ్వకుండానే చెప్పినట్లు చెయ్. ఏమీ భయపడవొద్దు ఎప్పుడూ అందర్నీ ఓకంట రక్షణ వీక్షణాలతో చూసే వేంకటేశ్వరుడు సదా మన పాలిట వున్నాడు. నయన ప్రదాత అయిన నా తండ్రి మనల్ని అన్యాయం చేయడు. ఆ నమ్మకంతోటే ఆ దేవ దేవుడిపై విశ్వాసంతోటే నేను యిన్నేళ్ళ నుంచీ అన్నిట్లో జయం పొందుతున్నాను. ఎప్పుడూ విజయాన్ని యిచ్చిన దేవుడు ఈసారి....ఆ మాట అనుకోటానికి కూడా రావటం లేదు. సరే అలా జరగదు....జరుగరాదు....పద__"
    నిశ్శబ్దంగా అనుక్షణం విపరీతంగా ధ్వనిస్తున్న గుండెతో బయలుదేరింది. హోమ్ వద్దకు వెళుతూనే వాకిటిలోనే ఎదురైంది విరజ. ఒక్కక్షణం విభ్రాంతికిలోనై వెంటనే సంబాలించుకుని అన్నాడు.
    "సావిత్రీ! ఈవిడే విరజ. చిన్నప్పుడు మేమిద్దరం కలసి చదువుకున్నాం. ఒకే చోట కానీ మధ్యలో విడదీయటం వల్ల వేరై పోయాం. జీవితంలో స్థిరపడ్డాక కలుసుకోవటం ఈ మధ్యే జరిగింది. మన యింటికి తీసుకుని వద్దామనుకున్నాను. కానీ వసతి కుదరలేదు. పైగా ఈవిడే మళ్ళీ వస్తానంది. విరజా. ఈవిడెవరో నీకు వేరే చెప్పాలా?"  
    చిరునవ్వు నవ్వింది విరజ. ఆమె సౌందర్యానికి అశ్వేత పద్మం లాంటి ముఖ వర్చస్సుకీ వినీలరోచిస్సాలీనే నయన కాంతులకి ముగ్ధురాలవుతూ ప్రతిగా చిరునవ్వుని వెలిగించింది సావిత్రి.
    మెల్లిగా నర్శింగ్ హోంలోకి వెళ్ళారిద్దరూ. అలాగే చేతులు అందిపుచ్చుకుని వెళుతుంటే చూసి పరవశుడౌతూ అనుకున్నాడు.
    "కొన్ని సంవత్సరాలు పరిచయం పెరిగినా మగవాళ్ళుకలిసిపోలేరు, కానీ ఆడవాళ్ళు ఒక్క క్షణంలోనే కలిసిపోగలరు. సృష్టిలో యెంత వైవిధ్యం వుంది ఎంత విచిత్రం వుంది?"
    మౌనంగా వాళ్ళ వెంట తన రూమ్ కి వెళ్ళి సావిత్రికి ఎలా చేయాలో అంతా మళ్లీ ఒకసారి వివరించి రంగ వద్దకు తీసుకెళ్ళి సావిత్రిని వదిలి వచ్చేశాడు.
    కన్సల్టింగ్ రూములో కూర్చొని బరువెక్కిన గుండెతో ఆ క్షణానికై ఎదురుచూస్తూ నిశ్శబ్దంగా కాలాన్ని స్మరించుకుంటూ కూర్చున్నాడు.
    పది పదిహేను నిమిషాలు గడిచినా అవి అతని పాలిటికి పది పదిహేను యుగాలుగా వున్నాయ్. నిజంగా ఆపదలో వున్న వారికే కాలం యొక్క బరువు తెలిసేది.
    హఠాత్తుగా "బావా" అన్న సావిత్రి కేక వినబడింది. మరుక్షణంలో నిలువకుండా గాబరాగా పరుగెత్తాడు. అదిరే గుండె కన్నా వేగంగా.


                                                            12


    అలా అనొద్దు వేణూ! యెప్పుడు భగవంతుడు నిర్ధయుడు కాడు. ఏది జరిగినా ఏది జరుగుతున్నా ఏది జరగబోతున్నా అదంతా మన భాగదేయమే ప్రపంచంలో మంచీ చెడూ అంటూ ఏదీలేదు వేణూ. మనకి జరిగేదంతా మంచి మాత్రమే. చెడు అనే ప్రశ్న లేదు. అది మన ఛాయలకి ఎప్పుడూ రానే రాదు. అసలు చెడు అనే పదార్ధమే పదమే ఈ ప్రపంచంలో లేదు వేణూ. అనవసరంగా మూఢులమై అల్పమయిన జ్ఞానంతో అవివేకంతో మనల్ని మనం మభ్య పుచ్చుకుంటున్నాం. తండ్రి కుమారుడికి ఏది అవసరమో కాదో తెలుసు. దాన్నే యిచ్చేస్తాడు. కొడుక్కి కానీ కుమారుడికి తండ్రిని అర్ధం చేసుకునే యోగ్యత లేక ఒక్కోసారి మూర్ఖంతో తనకి అన్యాయం జరిగిందనుకుంటాడు....అంతే....మనమూ అంతే....భగవంతుని గురించి అలా అనుకునే పొరబడుతున్నాం.    
    ఇంకా ఏదో చెప్పబోతుండగానే అతని మాటలకు అడ్డువస్తూ అన్నాడు.
    "లేదు మురళీ....భగవంతుడెప్పుడూ మనతో ఆడుకుంటున్నాడు. లేకపోతే ఇలా చేయవలసిన అవసరం ఏముంటుంది! పదేళ్ళుగా దూరమై స్వప్నంలో కూడా కనిపించకుండా ఛాయ అయినా తెలియకుండా మనసులు తెలియని స్థానాన్ని దాక్కుని వున్న అందాల బొమ్మని జ్ఞాపకం చేసి ఆమెని దగ్గరగా తీసుకుని వచ్చి జత కలిపి సంతోషాన్ని నా సొత్తు చేయడమేమిటి? ఇక ప్రపంచంలో నాయంత అదృష్టవంతుడులేడు. నా యంతటి సుఖి లేడు అని అనుకునే తరుణంలో రెండు మూడు రోజులు గడువకముందే రంగకి శాశ్వతమయిన అన్యాయం చేసి నన్ను దగా చేయటమేమిటి? అభం శుభం ఎరుగని కుర్రాడిని ఆటలాడడానికి పిలిచి ఓడించి తీవ్రమైన శిక్ష విధించటంగాలేదూ ఇది! నమ్మకంతో వెడితే దగా చేసే వర్తకుడిలా వ్యవహరించటంలేదా భగవంతుడు"
    చిరునవ్వు నవ్వుతూ అన్నాడు మురళి.
    "అదుగో అక్కడే పొరబడుతున్నావ్....అదంతా ఆయన మీద రుద్దబోకు....ఎప్పుడూ....కష్టం కలిగించేది కలిగించిందీ ఆయన కాదు. అది మీ మనస్సు....సుఖమూ....దుఃఖమూ అదే కలిగించింది....దుఃఖాన్నీ కష్టాన్నీ అదే తెలియబరుస్తుంది. ఎప్పుడూ ఒకరి మీద నింద వేయటం మంచిది కాదు....ప్రపంచమే నిమిత్త మాత్రం__మనసంతా నిమిత్తమాత్రుతం__ దాన్ని గురించి అనుకోవలసిందేముంది? ఏది ఎలా జరగాలో__అలాగే జరుగుతుంది__అది ఆయన చేతిలో లేదు. మన చేతిలో లేదు.... అలా జరుగుతుంది అందుకు విరుద్ధంగా జరిగే అవకాశమే లేదు, అలా జరుగుతుంది అనుకుంటే అది మన పొరపాటే__మన అవివేకమే....అంతకుమించి మరేమే కాదు__భగవద్గీత చదువుతావు__ చదివిస్తాను.... అందులో ఏముందో బాగా జీర్ణం చేసుకున్నావు. కర్మణ్యీవాదికారస్తే మాంఫలేషుకదాచనా, అనటంలో విధికి నిర్ణయానికి ఫలితాన్ని వదలమనే అర్ధం. అయినా చూస్తుంటే విజ్ఞానమూ వివేకమూ అనేవి వ్యక్తి బాగా వున్నప్పుడే కానీ, బాధలో వున్నప్పుడు అక్కరకు రావేమోననిపిస్తుంది"
    విషాదంగా నిర్జీవమయిన చిరునవ్వు నవ్వుతూ అన్నాడు. "సాంత్వన వాక్యాలూ, వేదదంతోపన్యాసాలూ యుద్ధ వార్తలూ వినడానికి చెప్పటానికీ బాగానే వుంటాయ్.... ఎవరికయినా ఆచరణలోకి వచ్చాకనే...."
    అతని మాటకు అడ్డువస్తూ అన్నాడు.
    "వేణూ! ఏమిటిది! మరీ మూర్ఖంగా చిన్నపిల్లవాడి కంటే అన్యాయంగా దుఃఖం అనుభవించే వారికి ఓదార్పు కాకపోతే అలాగే ఏడుస్తుంటే వాళ్ళ కర్మకి వదిలేసి ఏడ్వనీ లెమ్మని వూరికే కూర్చోవాలా? డాక్టరువి నువ్వు....సుఖ దుఃఖాలకీ, కష్టనిష్టూరాలకీ ఈ ద్వంద్వ గుణాలకీ అతీతుడివిగా వుండాలి. మనసుని కట్టేసుకుని యంత్రంలా పనిచేస్తూ పోవాలి అంతే కాని జరిగిన సంఘటనలకీ సంభవించే విషాదాలకీ లొంగిపోతే ఎలా! స్వయంగా స్వంత శరీరాన్ని ఆపరేట్ చేసుకోవలసిన వచ్చినా కదలని గుండె దిటవు అదరని శరీర బలం కావాలి. అంతేకానీ అబ్బే! ఇలా బేలవైతే ఎలా?"
    "నావంటి వారు డాక్టర్స్ గా పనికిరారు మురళీ....అసలు ఎందుకూ పనికిరాని వాడిని నేను.... డాక్టరుగా అసలు పనికిరాను__నీవు చెప్పినట్టు గుండె దిటవు లేకుండా డాక్టరీ చేయటం కష్టమే....నన్ను ఈ మాత్రమైనా తయారు చేసింది నా విరజే! ఆవిడే అజ్ఞాతంగా నన్ను ప్రేరేపించకపోతే యింత వాడిని అయ్యేవాడిని కాను....ఏమారుమూల పల్లెటూరిలోనో వుండి కరణం లెక్కలు వ్రాసుకుంటూ జమా బందీ అనుకుంటూ వుండేవాడిని_" 

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra