Home » Balabhadrapatruni ramani » Madhuramaina Otami


    
    ఆ అమ్మాయి యీ విషయాన్ని ఇంత తేలిగ్గా తీసుకుని నవ్వేస్తుందని వూహించనట్లుగా ఆయన ఓ క్షణమాశ్చర్యంగా చూసి తనూ చిన్నగా నవ్వి "తెలివైనదానివే" అన్నాడు.
    
    "థాంక్స్" అంటూ ధృతి ఆ అభినందనని ఆనందంగా స్వీకరించింది. ఆ తరువాత ఆమె తన ఇంటివైపు నడుస్తూ చేతిలోవున్నా పెన్ ని మరోసారి చూసుకుంది మురిపెంగా. ప్రేమ్ ప్రతిరోజూ సాయంత్రం ధృతితో కబుర్లు చెప్తూనే వున్నాడు. అతను వీణ సంగతి పెద్దగా పట్టించుకున్నట్లులేడు. అతను తన తండ్రి బిజినెస్ వ్యవహారాలు చూసుకోవడానికి ఇండియా వచ్చినట్లు మాటల మధ్యలో చెప్పాడు. అతని సమక్షం హాయిగా వుంటుంది. ఎప్పుడూ సరదాగా, నవ్వుతూ, నవ్విస్తూ వుంటాడు. చీకూ, చింతాలేని జీవితం, కావలసినంత ఆస్తీ, చదువూ, అందం అన్నీ వున్నాయి. కొరతా, వెలితీ అనే పదాలకి బహుశా అర్ధం తెలిసివుండదు. ఒక్కడే కొడుకట! బాగా ధనవంతుడు కాబట్టే అంత ఉత్సాహంగా, నిత్యం ఉల్లాసంగా వుండగలడు అనుకుని, అంతలోనే అరే! నా ఆలోచనలు గాడి తప్పుతున్నట్లున్నాయే! అనుకుంది. ఆమెకి ఎప్పుడూ లోతుగా ఆలోచిస్తున్నట్లు కనబడే నవీన్ గుర్తొచ్చాడు. తామిద్దరూ ఏ విషయం మాట్లాడుకున్నా చోవారికి ఆర్ధిక విషయాల్లోకే దిగుతారు. ఇద్దరి సమస్యల్నీ కలబోసుకుని చర్చించుకోవడంలో ఎంతో ఆనందంవుంది.
    
    ప్రేమ్ వచ్చాక ధర్మానందరావుగారు చాలా హుషారుగా కనిపించారు. పాతికేళ్ళ యువకుడితో సమంగా షటిల్ ఆడడం, ప్రొద్దుటే జాగింగ్ చేయడం, మ్యూజిక్ వినడం అన్నీ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ధృతి అస్తమానం పిలిపించబడుతోంది. వాళ్ళతో కారమ్స్ ఆడడము, వీడియో చూడడం పరిపాటి అయిపోయింది. ఒక్కోసారి ధృతి తనే కాఫీ కలుపుతుంది. సుబ్బరాజుకి రాని వంటలు చేస్తుంది. ఆఫీసులో తను చూసే ధర్మానందరావుకీ, ఇంట్లో తను చూసే ధర్మానందరావుగారికీ పోలికే లేనట్లుగా వుంటుంది.
    
    ఆదివారం ఆమె ఇంటికి వెళ్ళొచ్చేసరికి ప్రేమ్ గేట్లోనే పట్టుకుని "ఇండియాలో వున్న అత్యద్భుత సౌందర్యమంతా ఒక్కసారిగా మాయమయి పోయినట్లయింది తెలుసా?" అన్నాడు నిష్టూరంగా.
    
    ఆమె నవ్వేసి "మీరేదో నా కోసమే వచ్చినట్లు మాట్లాడతారేంటీ?" అనేసింది. అనేశాక అరె! అనకుండా వుండాల్సింది అనుకుంది.
    
    కానీ అప్పటికే ఆలస్యం జరిగిపోయింది.
    
    "మీకోసం రాకపోయినా వచ్చాక మీకోసం వుండిపోవాలనిపిస్తోంది ధృతి" అన్నాడతను కళ్ళలోకి చూస్తూ.
    
    ఆమెకి చాలా ఇబ్బందిగా అనిపించి "వస్తా....." అంటూ కదలబోయింది.
    
    అతను కూడా ఆమెని అనుసరిస్తూ "అంకుల్ కూడా అనుకున్నారు ఈ అమ్మాయి లేకపోతే ఏమీ తోచటంలేదని" అన్నాడు.
    
    ఆమె ఠక్కున వెనక్కి తిరిగి మెరిసే కళ్ళతో "నిజంగానా....?" అనడిగింది.
    
    ఆమెకి చాలా సంతోషం కలిగింది. మొట్టమొదటిసారిగా ఆయనలో చిన్న స్పందన కలిగినందుకు.
    
    ప్రేమ్ చాలాసేపు కబుర్లు చెప్పాడు. అతను మాటలాడుతూ వుంటే ఆమె గమనించింది. ఎంతసేపూ తన గురించీ, తన స్నేహితుల గురించీ, తనవాళ్ళ గురించీ తప్ప-ధృతి గురించి కానీ, ఆమె కుటుంబం గురించి కానీ ఒక్కమాట కూడా అడగడు. అది అతని సంస్కారమా? లేక అహంభావమా? అన్న విషయం ఆమెకి అర్ధంకాలేదు. ఇప్పత్య్దాకా తండ్రి తరువాత తను చాలా చనువుగా మాట్లాడే మగవాడు ఒక్క నవీన్ మాత్రమే. నవీన్ తో తనకి అరమరికలు లేవు. నువ్వు వేరు, నేను వేరు అన్న భావమే లేదు. ప్రతి విషయం అతనితో చెప్పి, అతనితో చర్చించి తనెంత హాయిగా ఫీలవుతుందో, ఆమెతో కలిసి చర్చించటం వలన అతనూ అంతే సంతోషాన్ని పొందుతాడు. 'ఆనందాలు పంచుకోకపోయినా, విషాదాలు పంచుకోవడమే నిజమైన స్నేహం'
    
    "హలో! ఏమిటీ? ఎక్కడికెళ్ళిపోయారూ?" మొహం ముందు చిటికెలువేసి అడుగుతున్నాడు ప్రేమ్.
    
    "ఏమీలేదు ఏమిటీ అంటున్నారు? ఈ లోకంలోకి వస్తూ అడిగింది.
    
    "మీ హృదయద్వారాలు మూసివుంచినా మీ కనుల గవాక్షాలగుండా నేను మీ హృదయపు లోతుల్లోకి తొంగిచూస్తాను అనుకుంటున్నాను....." అన్నాడు.
    
    ఆమెకి అది కవితో, అతని పరిస్థితో అర్ధంకాలేదు.
    
    "చాలా లేటయింది. 'గుడ్ నైట్' ఇంకెప్పుడూ యిలా చెప్పకుండా చెక్కెయ్యకండే" అంటూ అతను వెళ్ళిపోయాడు.
    
    ఆమె అలాగే కూర్చుని ఆలోచిస్తుండిపోయింది. ఒక యువకుడు కవితవం చెప్తూ, తనచుట్టూ తిరుగుతూ వుంటే, అతను తన ఆకర్షణలో పడ్డాడూ అని అర్ధం చేసుకోలేనంతటి అమాయకురాలూ, లోకం తెలీనిదీ కాదామె. కానీ ఈ ఆకర్షణ రేపున్నది మించుతుందని తెలిసి కూడా 'ఈ రోజు' ఏమీ చేయలేని అశక్తత స్త్రీది! తొందరపడి 'మీ వరస నాకు నచ్చలేదూ!' అంటే 'ఇందులో తప్పుపట్టడానికి ఏముంది? స్వచ్చమైన స్నేహాన్ని అర్ధం చేసుకోలేని కుసంస్కారం నీది' అనెయ్యొచ్చు. అందుకే చూసీ చూడనట్లు వూరుకుంటే 'అప్ప్డుడంతా ఊరుకుంటే నీకిష్టమే అనుకున్నాను. నా తప్పేమీలేదు' అనేసి తప్పు ఆమె మీద తోసేసి తప్పించుకుంటాడు. కత్తికి రెండువైపులా పదునే! మగవాడితో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. నవీన్ కీ, ప్రేమ్ కీ అసలు స్వభావాళ్ళో సామీప్యత లేదు. నవీన్ ముందు కూర్చుంటే తనెక్కువగా మాట్లాడుతుంది. అతను వింటూంటాడు. ప్రేమ్ ముందు కూర్చుంటే అతను మాట్లాడతాడూ తను వినాలి.
    
    నవీన్ ఎప్పుడూ తన గురించీ, తనవల్ల గురించీ అడుగుతుంటాడు. అతని గురించి చాలా తక్కువగా చెప్తాడు. ఏదయినా అడిగితే "నీకున్నవి నీకు చాలవా?" అన్నట్లు చూస్తాడు. అతనిలో ఆమెకి చాలా నచ్చేదీ, చాలా కోపం తెప్పించేదీ ఆ గుణమే.
    
    ప్రేమ్ తనకి స్నేహం చేయడానికి సమవుజ్జీ మాత్రం కాదు. 'రేపు ప్రొద్దుట బస్ కి చిల్లరుందా?' అని చూసుకునే తనకి 'రోల్స్ రోయిస్' కార్ల గురించి ఏం తెలుస్తుంది? అమ్మని ఈ నెలనుంచి డాక్టర్ కి చూపించాలి అని ఖర్చులు వేసుకునే తనతో 'మొన్న క్రికెట్ మ్యాచ్ లో ఇండియా గెలుస్తుందని బెట్ కట్టి అయిదువేల రూపాయలు వోడిపోయాను' అనే అతన్ని చూస్తే నవ్వు వస్తుంది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra