Home » Kommuri venugopala rao » Aathma Jyothi

  

    'నేను చేసిన అన్యాయమేముందండీ ఇందులో? వీళ్ళంతా నామీద పడి ఏడుస్తున్నారు.'
    
    "ఎవడయ్యా ఏడిచేది? ఏడిచేది నువ్వు కాదంటా-కాణీకి అర్ధణాకీ కక్కుర్తి పడి" అని గుంపులోంచి ఎవరో అరిచారు. అంతా విలాసంగా నవ్వారు.
    
    "చూశారా, చూశారా ఆ పేలుడు?"
    
    "ఎవరయ్యా పేలేది? సీమ టపాకాయ మొహమేసుకొని నువ్వూ"
    
    పూజారికి కళ్ళనీళ్ళు తిరిగాయి. ఇలా అన్నాడు "పదిమంది కలసి ఒకడ్ని చేసి డబాయిస్తారా? పైగా చోద్యంగా వుందా మీకు?" అంటూ ఓ దృఢ నిర్ణయానికి వచ్చి "ఏమైనా సరే నా పని మానేదిలేదు. చూస్తారేమిటోయ్? ఇదేమీ అల్లాటప్పా వ్యవహారం కాదు. ఆఁ కావాలంటే పోలీసుల్ని పిల్చుకువస్తా కొట్టెయ్యండి చెట్టుని."
    
    శివనాథరావు నివ్వెరపోయాడు. అతని దృష్టి పోయి సగం పడిపోయినట్లున్న రావిచెట్టు మీదకుపోయి పడింది. చూద్దామన్నా ఆకు లేదు. ఒకనాడిది హోరుగాలికి ప్రచండరూపుదాల్చి తలన విలయ తాండవంతో ద్రష్టలను చకితుల్ని చేసింది. మండువేసవిలో తన నీదని ఆటకో, పాటకో చేరినవారికి ఆశ్రయమూ యిచ్చి చల్లని చిరుగాలులతో మైమరపించింది. ఇవాళ పూజారి సుబ్బయ్య శాస్త్రి ఈ అకార్యానికి పూనుకున్నాడు. ఈ పనికే యిప్పుడు దెబ్బలాడుతున్న పెద్దమనుషులు యిదివరకు సంకల్పించినపుడు ధర్మపన్నాలు వల్లించి వారించింది ఈ మహానుభావుడే.
        
    "నేను మునిసిపాలిటీ వారికి డబ్బుకట్టాను. పర్మిషన్ తెచ్చుకున్నాను. కట్టెలు కొట్టించుకుంటాను, ఏమైనా చేసుకుంటాను నేను చేసిన దోషమేమిటో అంట?"
    
    "అది దోషమంటివిగదయ్యా" అన్నారు ఎవరో మర్యాదగానే.
    
    "దానికి ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలో మాకూ తెలుసు."
    
    "ఆఁ తెలుసు" అని ఈసడింపుగా విదిలించి 'ఏం మనిషివయ్యా? ఆ విషయం అప్పుడే చెబుతే-నీకే ఐదో ఆరో తగలేసి ప్రాయశ్చిత్తం మేము మట్టుకు చేయించుకోలేకపోయామా? సమయంకోసం కాసుక్కూచున్నావు. గద్దలా తన్నుకు పోతున్నావు. కానీ అదీ చూస్తాగా- ఈ చెట్టుమీద ఎలా చెయ్యి  వేస్తావో' అని బెదిరించి మీసం మెలేయటానికి కూడా అభిమానపడలేదు అడితీ యజమాని.
    
    శివనాథరావుకి అసహ్యంవేసింది. అక్కడ వుండలేక లోపలకు వచ్చేశాడు. బయట చాలాసేపటివరకూ గొడవ జరుగుతూనేవుంది. అతను కాఫీ పూర్తి చేసేసరికి ఒక వార్త చేరింది-పూజారిగారే జయించారని, చెట్టును పడగొట్టటం నిర్విఘ్నంగా సాగిపోతోందనీ.
    
    అతను చిరాగ్గా బయటకు వెళ్ళిపోయాడు.
    
    రెండురోజులు గడిచాయి. మధ్యాహ్నంపూట పిన్నీ, తనూ సరోజినీ కలిసి పేకాట ఆడుతున్నారు. మాటలు కులాసాగానే గడిచిపోతున్నాయి. ఈ వారం రోజుల్నుంచీ యువతీ యువకులైన వీళ్ళిద్దరూ అంతపెద్ద యింటో వంటరిగా సంచరించారన్న సంగతి అతనికే విభ్రాంతి కలగజేస్తోందే! మిగతావాళ్ళు ఏం విసుక్కుంటున్నారో? పిన్ని నిశ్శబ్దవాది. ఐదారు సంవత్సరాల క్రితం తండ్రికిప్రమాదంచేసి చివరకు ఏమౌతుందో అన్న సందిగ్దావస్థలో పడినప్పుడు కూడా ఆమె ఓ కన్నీటిబొట్టును విడువలేదు. లోలోన ఎంత దారుణ విషాదాన్ని దాచుకుందో! ఆమె చలించటం శివనాథరావు గమనించలేదు. దీన్ని గురించి కొంతమంది గుసగుసలాడుకోవటం అతని చెవినపడినా అన్యధా భావించలేదు. తమ యిద్దరిగురించీ ఆమె ఏమైనా సందేహపడుతుందేమో అతనికి తెలియదు. పడితే ఎలా? పడకపోతే మరో యిబ్బంది ఈ మాదిరి మనస్తత్వాన్ని సంఘం అర్ధం చేసుకోలేక పిరికివాడని నిందిస్తుంది. పోనీ తెగించి ఏమైనా చేశాడా క్రూరుడూ, కఠినుడు, కని పెంచినవాళ్ళకే ద్రోహం తలపెట్టిన నీచుడు అని యిత్యాది బిరుదుల్తో సత్కరిస్తుంది. కౌరవులు చచ్చిపోయినందుకు ఎవరూ దుఃఖించరు. పదితలకాయల రావణుడు ఘోరంగా వధించబడితే అయ్యో పాపం అంటూ నిట్టూర్పురాదు ఎవరినుంచీ. నిజ జీవితంలో విలన్ లాంటి వ్యక్తి సినిమాలో కథలో అలాంటి వ్యక్తిని చూచినప్పుడు సానుభూతి ప్రదర్శించడు. ప్రేమించినవాడికి కూడా ప్రేమించినవాడంటే వెటకారమే ఓ సినిమాలో తను ప్రేమించిన యువతిని పెళ్ళాడవద్దని, మరో యువతిని చేసుకొమ్మని శాసించిన తండ్రిని కుమారుడు "రాక్షసుడా! నీకు హృదయం లేదు" అని నిందించాడు. ఏ కుమారుడూ అటువంటిమాట విసిరితే హర్షించలేని తండ్రికూడా ప్రేక్షకుల్లోంచి భలే భలే అని సంతోషించాడు. అసలు మానవుడి నైతిక ప్రవర్తనకు ఓ నిర్దిష్టమైన నిర్వచనం ఎవరైనా కల్పించుకుంటే అతనికంటే శుంఠ ఎక్కడా వుండబోడు. "నేను ఫలానా మనస్తత్వం గల మనిషిని" అని ఏ మగాడైనా ధైర్యంగా నిలబడి తన ఆత్మ విశ్వాసం వెల్లడి చేసుకుంటే అతనే ఈనాడు దిట్ట అని శివనాథరావు ఒప్పుకుంటాడు. అటువంటి వారికి ముందు గౌరవంయిచ్చి తరువాత మరొకరి ముఖం చూస్తాడు. అయితే ఈ నిర్ణయాలే శాశ్వతమనీ, నిర్దుష్టమనీ నమ్మకం ఏమిటి? ఆలోచించటం చేతవచ్చి, వాటికి రూపం యివ్వలేని అసమర్ధుని తరహా అతనిది. అయినా ఛీ, ఏమిటిన్ని ఆలోచనలు తనకు? పేకాట ఆడుతూ, అన్నం తింటూ, నిద్రపోతూ, ఎందుకిన్ని ఆలోచనలు? తను ఊహించడానికి ప్రయత్నిస్తున్న దేమిటీ? ఈ ప్రశ్నకు సమాధానం లభించిననాడు ధన్యుడ్ని, ధన్యుడ్ని అనుకున్నాడు.
    
    ఓరోజు సాయంత్రం ఆరుగంటలయింది. వంటయింట్లో సావిత్రి గోవిందుకు ఏదో పురమాయిస్తోంది. క్లబ్బులో పార్టీ వుందని మాధవరావుగారు బయటకు వెళ్ళిపోయారు. ఇవాళ సరోజినితో ఏకాంతంగా మాట్లాడి తీరాలనుకున్నాడు. వెదుకుతున్నాడు-ఏ గదిలో వుందా అని. ఇంతలో ఓ అమ్మాయి లోపలినుంచి తడి ముఖాన్ని తువ్వాలుతో తుడుచుకుంటూ హాల్లోంచి ప్రక్క గదిలోకి పోతోంది. సవ్వడి చేయకుండా వెంటపడ్డాడు.
    
    "సరోజినీ!"
    
    ఆమె అతనివంక తిరగటం పూర్తికానిచ్చి "ఏం కావాలి నీకు యిక్కడ?" అని గాంభీర్యం నటించబోయి, చేతకాక సున్నితంగా నవ్వి ఊరుకుంది.
    
    "ఏమి కావాలో నీకు తెలీదా?"
    
    "ఉహు! అది సరేగానీ ఏమిటీ చొరవ? అత్తయ్య చూస్తే?"
    
    "నీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను" అన్నాడు ముఖాముఖి.
    
    "మాట్లాడు వేగిరం."
    
    "ఏమీ అనుకోబోకు మరి. ఇంకా ఎన్నాళ్ళు యిక్కడ రాణిగారి మకాం?"
    
    ఆమె జాలిగా అంది "వెళ్ళిపోదామంటే భయంగా వుంది."
    
    "సరోజినీ, ఏమిటిది?"        
    
    ఆమె ముఖం మ్లానమైవుంది. జవాబు చెప్పలా.
    
    "నీతో ఓ విషయంచెప్పాలి బావా" అంది ఓ నిముషం పోయాక.
    
    ఇంత గంభీరతను చూసి నిశ్శబ్దానికే భయంవేసి గుట్టుచప్పుడు కాకుండా ఊరుకుంది.
    
    "నేను పెళ్ళీడుపిల్లను."
    
    భావాలు విహరిస్తున్నాయి.
    
    "అందులో పల్లెటూరి పిల్లను."
    
    "అబ్బ! నన్ను చంపక."
    
    "ఇంతకంటే మృదువుగా చెప్పలేను. కానీ విను. ఆడవాళ్ళు అర్ధంలేకుండా మాట్లాడతారని నువ్వాక్షేపిస్తేనే నడవగలను. నేను ఓ వస్తు...వును కాం...క్షించాను. అది నాకు దొరుకుతుందో లేదో తెలుసుకుందామని ఈ ఊరు వచ్చాను."
    
    "అది ప్రాణంవున్న వస్తువా? ప్రాణంలేని వస్తువా?"
    
    "అదే యిప్పుడు తెలియబోతుంది."
    
    సర్వాంతర్యామి ఎక్కడో సిగ్గుపడి వుంటాడు. తన సృష్టి తనకే దిగ్భ్రమ కలిగిస్తోందని.
    
    అతని ధైర్యం పటాపంచలయింది. "ఏమిటి సరోజినీ? స్పష్టంగా..."
    
    "ఏం మనిషివి బావా? ఓ ఆడదాని దగ్గర్నుంచి యింకా స్పష్టంగా ఏమాసిస్తావ్? నేడోరేపో ఊరికి ప్రయాణం కడుతోన్న సరోజిని నిన్ను ఏం చేస్తావని అడుగుతోంది. వాళ్ళయింట్లో ఆమె పెళ్ళివిషయం ఓ సమస్య అయింది."
    
    ఆమె సిగ్గువిడిచి నోరువిప్పింది. ఇహ అతను పెదవి కదపాల్సిన సమయం శేషించింది.
    
    "నువ్వు నన్ను నమ్మూ నమ్మకపో నేను ఓ మహా సముద్రంలోకీడ్చుకు పోతున్నాను. దారీ తెన్నూ తోచడంలేదు. నిన్నుమాత్రం వదల్లేను."
    
    "అది సరియైన జవాబుకాదు. ఆ మాటవినటం నాకూ సరదాగానే వుంది. నేను ఒంటరిదాన్నే అయితే నీ మాటలు వింటూ కాలక్షేపం చేయగలను. కానీ నాకు తల్లీ-తండ్రీ వున్నారు."

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra