Home » Merlapaka murali » Shrungarapuram Oka Kilomeetaru


  

      అతని అడుగులు తడబడ్డాయి. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూశాడు. పునర్వసు ఎక్కడా కనపడలేదు. ఆ ఇంటిని దాటి వెడుతూ లోపలికి చూశాడు.

 

    పెరట్లో పాలు పితుకుతోంది ఆమె. చిత్రపటంలో లాగా ఆమె మొదటిసారి చిన్నగా కనిపించింది. ఓ సెకనుపాటు నిలబడ్డట్టు ఆగి, ఆపై ముందుకు సాగిపోయాడు.

 

    గుండె వేగం అప్పటికి తగ్గింది. ఆమెను మరోసారి చూడాలన్న ఆరాటం శరీరాన్ని ముందుకు తోస్తోంది. వీధి చివరికంటా వెళ్ళి వెనక్కి తిరిగాడు.

 

    అప్పటికి పాలు పితకటం పూర్తిచేసి ఆమె ద్వారం దగ్గర నిలబడి వీధిలోకి చూస్తోంది.

 

    ఆమె అక్కడ వుండడం దూరం నుంచే కనిపెట్టాడు పులిరాజు. తిరిగి గుండె వేగంగా కొట్టుకుంటోంది. శరీరంలో ఇలా అసంకల్పిత మార్పులు గోచరించడమేనా ప్రేమంటే అనుకున్నాడు.

 

    ఖచ్చితంగా ఇంటిముందు ఆగి ఆమెవైపు చూశాడు. నిజానికి ఆ సమయంలో తన ముఖంలో ప్రస్పుటమవుతున్న ఫీలింగ్స్ ఏమిటో తెలియడం లేదు. అయితే తను ఆమెను చూసి నవ్వుతున్నట్టు మాత్రం తెలిసింది.

 

    ఆమెలో ఏదో అర్థంకాని కన్ ప్యూజన్. రోజులాగే అర్థం కానట్లు మొహం పెట్టి ఏమైనా చెబుతాడేమోనన్నట్టు చూసింది.

 

    అతను అక్కడ నుంచి కదలలేదు.

 

    "మీ నాన్న వున్నాడా?" అని అడిగాడు. ఎప్పుడూ లేనిది తన గొంతు వణకడం తెలుస్తూనే వుంది/

 

    అన్ని రోజులూ తను కనిపిస్తూనే గుడ్లప్పగించి చూస్తూండే అతను అప్పుడు మాట్లాడటంతో ఆమె తడబడింది. ఆమె అవస్థ అంతా  గుర్తించిన  అతను మరోసారి అడిగాడు.

 

    "లేడు. పొలం వైపు వెళ్లాడు."

 

    "మీ అమ్మ?"

 

    "అమ్మ కూడా పొలం వెళ్ళింది"

 

    ఇక ప్రశ్నించాల్సిందీ ఏమీ లేనట్లు అతను ఇంట్లోకి నడిచాడు. బసపుటెద్దు ఆవులున్న దొడ్లోకి వచ్చేస్తుంటే తరమడానికి ధైర్యం చాలని చిన్నపిల్లలా చూస్తుండిపోయింది.

 

    "ఏం కావాలి?" తన దగ్గరికి దూసుకొచ్చిన అతనివైపు భయంగా చూస్తూ అడిగింది.

 

    అతని రిహార్సల్స్ లో అటువంటి ప్రశ్న లేదు. అందుకే సమాధానం తట్టలేదు.

 

    "అదీ... అదీ" అంటూ అక్షరాలు చూస్తూ నమిలాడు.

 

    ఆమె ఏమీ మాట్లాడకుండా చూస్తూ నిలబడింది.

 

    అతని కళ్ళలో ఏదో అభ్యర్థన లీలగా  కదుల్తోంది. పెదవులు ఏదో  జపింఛడానికన్నట్లు గుటకలు వేస్తోంది. ఇన్నిరోజులూ తనలో దాచుకున్న  భావనలను బయటకు వెల్లడించేందుకు గుండె పిచ్చిదానిలా కొట్టుకొంటోంది.

 

    "నువ్వు కావాలి" కళ్ళు కూడా ఆర్పకుండా చెప్పాడు. ఒక్కసారి ప్రకృతి అంతా ఫిట్స్ వచ్చి పడిపోయినట్టు స్తంభించిపోయింది ఇద్దరికీ.

 

    అతను ఏం అడిగాడో చప్పున అర్థంకాలేదామెకు. అర్థమయ్యాక తన  మనసేమిటో అర్థం కాలేదు. లోపలంతా తనను తరచి చూసినట్టు ఆమె  కళ్ళను వాల్చింది. తిరిగి తల పైకెత్తింది. ఇక  తప్పదన్నట్టు అతను కళ్ళు ఆర్చుతున్నాడు గానీ లేకపోతే చూపును అలా  నిలబెట్టేవాడు.

 

    "నేను నిన్ను ప్రేమిస్తున్నాను."

 

    మొదట చెప్పింది ఆమెకు బోధపడిందో లేదో నన్న అనుమానంతో మళ్ళీ మాటలను మార్చి చెప్పాడు.

 

    ఒక ప్రేమికుడు లోనయ్యే భ్రమలకు అతను లోనవుతున్నాడు. అందువల్ల తిరిగి మాటలను మార్చి చెప్పాడు.

 

    ఒక ప్రేమికుడు లోనయ్యే భ్రమలకు అతను లోనవుతున్నాడు. అందువల్ల తిరిగి మాటలను మార్చి చెప్పాడు.

 

    ఒక ప్రేమికుడు లోనయ్యే భ్రమలకు అతను లోనవుతున్నాడు. అందువల్ల తిరిగి మాటలను మార్చి చెప్పాడు.

 

    ఆమె అప్పటికే సర్దుకుంది.

 

    అతను భూతవైద్యుడు గనుక స్త్రీలకి ఓ విధమైన భయం వుంది. అతను మామూలు మనిషి కాదన్న భావన వుంటుంది. అతని వృత్తి అలాంటిది. అది దెయ్యాలను దూరంగా తరుముతుంది. గానీ, మనుష్యులను దగ్గరకు చేరనివ్వదు. అంతేగాక ఆమె తన అంతరంగం ఏమిటో తెలుసుకో గలిగింది. ఈ మేరకు ఆమె తెలివైనదే. అందుకే ఏం జవాబు చెప్పాలోనని ఆమె గింజుకోలేదు. అయితే దాన్ని ఎలా చెప్పాలో అని మాత్రమే ఇబ్బంది పడుతోంది.

 

    "ఎన్నో రోజులుగా చెప్పాలని...... కానీ"

 

    "పిల్లి అడ్డొచ్చిందా" అని నవ్వింది ఆమె. ఆ నవ్వు వెనకనున్న అర్థం ఏమిటో తెలియక అతను తల్లడిల్లిపోయాడు.

 

    స్త్రీలు అంతే! అంతవరకూ సీరియస్ గా వున్న ఆమె  తన  మనసేమిటో తెలుసుకున్నాక ఈజ్  అయిపోయింది. తనకు కావల్సిందానిని వాళ్ళు ఎంత  గాఢంగా కోరుకుంటారప్ తనకు అక్కర్లేని దానిని అంతే తృణీకారంతో చూస్తారు.

 

    ఇప్పుడు పులిరాజు కూడా ఆమెకు అలానే కనిపిస్తున్నాడు. తనకు అవసరం లేదనుకోగానే అతను చులకనైపోయాడు.

    "మరెందుకు చెప్పలేదు?"

 

    "అదీ..... అదీ"

 

    "మంత్రాలను పొల్లుపోకుండా చెబుతావు కదా. ఇంత చిన్న వాక్యాన్ని చెప్పడానికి ఇంత టైమ్ తీసుకోవాలా?" ఆమె నవ్వును ఆపటం లేదు.

 

    "చెప్పాలనే.... ఏదో జంకు, తెలియని బెదురు."

 

    "పోనీలే ఇప్పటికైనా చెప్పావు. కానీ....." అతని రియాక్షన్ కోసం ఆగింది. అప్పటికే అతని గుండెలో విస్పోటనం జరిగిపోయింది.

 

    "ఏమీ అనుకోవద్దు పులిరాజూ! నువ్వంటే నాకలాంటి ఉద్దేశం లేదు. ఎందుకు లేదు అని అడగొద్దు. నీమీద  ఎందుకు ఇష్టం లేదో చెప్పలేనట్లే గోపాలకృష్ణ మీద ఎందుకు నాకంత ఇష్టమో కూడా చెప్పలేను."

 

    ఆ తరువాత ఆమె చెప్పిన ఒక వాక్యమో, రెండు వాక్యాలో వినిపించలేదు అతనికి.

 

    నిమ్మకాయను కొస్తే ఎర్రటిరక్తం ఎగజిమ్మినట్టు, బుట్టలో పెట్టిన తాడు తాచుపామై కాటేసినట్లు, తోక ముడిచి పారిపోవాల్సిన దెయ్యం తిరగబడి తనను తినేస్తున్నట్టు అతను. వణికిపోయాడు.

 

    రక్తంలో విషంలా ఏదో తెలియని బాధ ఒళ్ళంతా చరచరా పాకడం తెలుస్తూనే వుంది నరాలు చిట్లి దారాలుగా సాగడం  బోధపడుతూ వుంది. కళ్ళల్లో నీళ్ళు ఊరి, దృశ్యాలన్నీ మసకయిపోవడం గమనిస్తూనే వున్నాడతను.

 

    "పులిరాజా! ఇక  వెళ్ళిరా" అని అతను ఏమైపోతున్నాడని గమనించ కుండానే లోపలికి వెళ్ళిపోయింది.

 

    
                                        *    *    *

 

    ఎలా నడిచాడో ఏమో  తెలియదు. మరో  పదినిముషాలకు ఊరి  పొలిమేరలు దాటాడు.

 

    పొలాల వెంబడి నడుస్తున్నాడు.

 

    అప్పుడప్పుడూ తల పైకెత్తి చూస్తున్నాడు.

 

    చిన్నపిల్లాడు పౌడర్ నంతా చేతుల్లో ఒంపుకుని ముఖానికి పూసుకున్నట్టు చంద్రుడు ప్రకాశిస్తున్నాడు.

 

    అలా ఎంతసేపు తిరిగాడో అతనికే తెలీదు. చందమామ ఆకాశం మధ్యలోకి వచ్చి నిలబడి లోకంవైపు సంభ్రమాశ్చర్యాలతో చూస్తోంది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra