అతని వడిలో వాలిపోయి మెడకి చేతులువేసి అతని ముఖంలోకి సూటిగా చూస్తూ గుండెలపై తల ఆన్చుకుంది. సంతత ధారగా ఆమె కళ్ళవెంట నీళ్ళు కారుతూ అతని చొక్కా తడవసాగింది.
    ఆమె కన్నీటిని తుడుస్తూ అన్నాడు.
    "చెప్పు విరజా__ఇన్నాళ్ళెలా వున్నావ్? ఇన్నిరోజులు ఏమైంది మనకి? ఇక్కడికి వచ్చాక కూడా ఎందుకు దాగుడుమూతలాడావ్? నాకు తెలియబరుచుకోవటానికి సిగ్గేసిందా? అభిమానం తలెత్తిందా? నేను నిన్ను విడిచి వుండగలననుకున్నావా విరజా! చెప్పు విరజా! నా మనసులో ఎంత బాధ కలుగుతుందో నీకు తెలియటంలేదా"
    అతని అరచేతుల్ని తీసుకుని ముఖానికి రుద్దుకుంటూ అంది "నన్ను క్షమించు వేణూ! ఈ పది సంవత్సరాల్లో ఎంతగా నీలో మార్పు వచ్చి వుంటుందో నేను తెలుసుకోగలను. నీ చిన్ననాటి చెలిమికత్తె నీకు గుర్తు వుంటుందో వుండదో ననుకున్నాను. నా రూపం నీ హృదయాన మాసినా నేను మాసిపోలేదు. కానీ నేరుగా వచ్చి ప్రశాంతమైన నీ జీవితంలో ప్రవేశించలేక నేను దూరంగా మసలలేక నన్ను నేను పరిచయం చేసుకోలేక నీ మనస్సులో ఎలా ప్రవేశించాలో తెలీక స్నేహితురాలిగా మళ్ళీ దరిదాపుల్లోకి వద్దామనుకున్నాను. నా అందం నా సుగుణం నిన్ను ఆకర్షిస్తాయనుకున్నాను. ఒక క్రొత్త స్నేహితురాలిగా, ఆత్మీయురాలిగా నీతో పరిచయం పెంపొందించుకోవాలనుకున్నాను కాని అది అసాధ్యమైంది."
    "పిచ్చి విరజా! నీవు కాక నాకు దగ్గరగా వచ్చేవారు ఎవరుంటారు విరజా! నీవు ఎంత దూరానవున్నా ఎలావున్నా నా మనసులో దేవతలా వున్న నీవు దూరం కాలేదు. కాలేవు! నిన్ను దూరం కానీను.... నమ్ము విరజా! నిన్ను గురించి ఈ రెండు నెలల రోజులనుండి ఎంతగా బాధపడుతున్నానో నీకు వేరే చెప్పాలా? నా మనసు తెలియదా నీకు? నన్నెరుగవా నీవు?"
    "ఇలెస్ట్రేటెడ్ వీక్లీలో నీ ఫోటో చూశాక నాకు ఎంత ఆనందం కలిగిందో అప్పుడే ఆ క్షణాన్నే ఎంత దుఃఖం నన్ను ముంచెత్తిందో చెప్పలేను వేణూ! నేను చెప్పలేను అది నీకే అర్ధమవుతుంది. నేను కోరుకున్నట్టే, నిన్ను అర్ధించినట్టే డాక్టరు వయ్యావని ఒకవేపు సంతోష సముద్రమూ ఆ క్షణాన్నే నీవు నానుండి శాశ్వతముగా వేరై పోయావని మరొకరి సొత్తుగా మారావనీ, నీకు నామీద కించిత్తయినా హక్కులేదని ఒకవేపు దుఃఖ సముద్రమూ ముంచెత్తుతూ వుంటే చిన్నారి ద్వీపకల్పంలా నేనెలా అల్లాడిపోయానో నీవు వూహించుకోగలవు వేణూ! మనసు నిలుపుకోలేక మనిషిని నిలువలేక నిన్ను వెదుక్కుంటూ వచ్చాక నీతో ఎలా పరిచయం చేసుకోవాలో తెలీక చివరికి డాక్టరుగా నీ విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చటంలో నీకు నీవే సాటియని వ్యాధిగ్రస్తురాలిగా ప్రవేశించాను. నా హావభావాలతో నా మనసులో నిన్ను ఆకట్టుకోవాలనుకున్నాను. కానీ నీ సున్నితమైన మేధాశక్తి ముందు నేనే ఓడిపోయాను. నేనే విధి చేతిలో మరోసారి ఓడాను కానీ ఇందులో దుఃఖం లేదు వేణూ! నేను నేనుగా కాకున్నా విరజగా నిన్ను జయించుకున్నాను. అందుకే దుఃఖం కన్న సంతోషమే అధికంగా వుంది."
    లేచి కూర్చొని ఇందుప గింజలంత కన్నీరు కనుకొలుకులలో తారాడుతుండగా చలిస్తున్న ఆధారాలతో అదురుతున్న గుండియలతో అలౌకికమైన ప్రేమ కనుద్వయంతో వర్షిస్తుంటే అంది.
    "ఇప్పుడు ఇంకేమయినా, ఎలా అయినా పరవాలేదు వేణూ! నేను నేనుగా నీకు తెలిశాను. నీ మనసు తెలిసింది_నీ మమత తెలిసింది అంతేచాలు. నీ విరజ బ్రతికేవుందని నీకై నా ఉజ్జ్వల భవిష్యత్తుకై భగవంతుని ప్రార్ధించని గడియ లేదని నీకు తెలిసింది. నీ విరజ మనసులో నీవే ఉన్నావనీ తెలిసింది. ఇక చాలు అంతకన్నా నాకు అవసరంలేదు. ఏదీ నీ చల్లని మాట.... స్నేహం.... నీ ఆత్మీయత.... నీ సాన్నిధ్యం.... ఇవిచాలు.... అంతే అవి ఎప్పుడూ నావేనని కూడా తెలుసు."
    తల మునకలవుతున్న ఆనందంతో అన్నాడు దుఃఖాన్నయినా, సంతోషాన్నయినా ఆడవాళ్ళు భరించినంతగా మగవాడు భరించలేరు నిజానికి__కానీ బాహ్య ప్రపంచానికి విరుద్ధంగా కనిపించేట్టు వర్తిస్తారు యిరువురూ!
    "విరజా! నీ పేరుని తలుచుకుని, యిలా పిలుచుకుని ఎన్నేళ్ళయింది? అబ్బ! భగవానుడు ఒక్కోసారి ఎంత కష్టాన్ని చేకూర్చతాడో వెంటనే ఒక్కసారిగా అనుకోకుండా అంతకంటే అధికమైన లాభాన్ని కూడా చేకూర్చుతాడు! పద విరజా! మా యింటికి వెడదాం పద_అక్కడే వుందువుగాని! ఇక దాగుడుమూతలకి స్వస్తి ఇక్కడే_నీవూ మా ఇంట్లోనే వుండాలి. ఇంకేం చెప్పకు పద.
    విషాదంగా అంది.... "వుంటాను వేణూ! నాకు నీ యింట్లో స్థానం వుంది కానీ యింకొన్నాళ్ళు ఆగాలి. తప్పక వస్తా వేణూ! అలా చూడొద్దు. నీవు దుఃఖిస్తే నీ ముఖంలో విషాద ఛాయలు కనిపిస్తే నేను భరించలేను! నీవు సంతోషంగా వుండాలి. సుఖంగా వుండాలి ఎప్పుడూ నున్నా వీడని చిరుమందహాసంతో ప్రజల్ని అనుక్షణం ఓదార్చుతూ వాళ్ళకు సేవచేస్తూ వాళ్ళ ఆశీసుల్ని పొందుతూ దినదిన ప్రవర్ధమానంగా నీ కీర్తి చంద్రిక వెలుగుతూ వుంటే నేను చూడాలి. అంతే కానీ నిన్ను దుఃఖంతో చూడలేను...." అతని చేతిని తన చేతిలో తీసుకుని మరో చేత్తో కప్పుతూ అంది.
    విషాద ఛాయలు ముఖం నిండా అలుముకున్నాయ్. నోట మాట రాలేదు. అయినా ప్రయత్న పూర్వకంగా అన్నాడు.
    "ఎందుకు దేవతా! ఎందుకు? ఇంకా ఎన్నాళ్ళు భరించాలి? ఈ వియోగపు బాధలో పడి నా గుండె నలిగి పోయింది. ఎన్ని సంవత్సరాల నుంచి నాలో నాకు తెలియకుండా నిన్ను గురించి తపస్సు చేస్తున్నానో ఆ భగవంతుడికి తెలుసు. నీకూ తెలుసు. ఈ పదేళ్ళనుంచీ తెలిసో తెలియకో చేసిన తపస్సు చాలదా దేవతా?"
    ఆమెలో ఆనందం అనవతరంగా ఉధృతంగా పౌర్ణమి వేళ పోటు పొడిచిన సముద్రంలా తరంగాలుగా లేచింది. ఎంత గుర్తు! ఎంత అభిమానం. ఛీ....ఛీ....యిలా వూహిస్తుందేమిటి తను అతనెవరో పరాయి వాడిలా? కారణమేమిటి? చిన్ననాడు తనను దేవతా అని పిలిచే వాడతను. అది గుర్తుకు రావటంలో ఆనందం తలమునకయింది తనకు లేకపోతే అతనికి తనకీ బేధమంటూ వుందా?
    శరజ్యోత్సలాంటి మందహాసం వెలుగుతూ వుంటే పండు వెన్నెల వంటి ముఖంతో అంది.
    "చాలదు వేణూ! ఇంకా చేయాలి. దేవుడు దయ తలచాలి. దేవతలు నీ యింట్లో వెలియవలెనంటే ఎండ తపస్సు చేయాలి చెయ్. ఇంకా చెయ్. భగవానుడు కరిగి కరిగి అమృత వాహినిగా మారి నీ ముందు ప్రవహించేలా చెయ్. నీ ప్రార్ధనని, నీ జపాన్ని విని ఆయన నిలువనీక నీచుట్టూ మేమిరువురమూ ఆనంద పారవశ్యంతో నర్తించేలా చెయ్...."
    తేలికైన మనస్సుతో చిరునవ్వు నవ్వుతూ అన్నాడు. "నీ తీయనైన చిరునవ్వుతోనే నన్ను సదా జయిస్తున్నావ్_అలాగే చేస్తాను విరజా.... నీ జపం సదా చేస్తాను. కరుణాళువు అయిన భగవంతుడు నిన్ను కటాక్షించి నా పాలిటి వరంగా దయచేసేవరకూ నేను తపస్సు చేస్తూనే వుంటాను పోనీ....ఇంకా ఎన్ని రోజులు చేయాలి. తపస్సు....ఎన్ని రోజులు చేయాలి. తపస్సు....ఎన్ని రోజులకి అనుగ్రహిస్తావ్...."
    నవ్వింది మళ్ళీ! అదే నవ్వు! అదే స్థిరత్వం! అదే ప్రేమ. అతను ఎన్ని రోజులు అనటం ఆమెను మరీ సంతోషంలో ముంచెత్తింది. "నీ దుడుకుతనం, తొందరపాటు ఆశ యింకా పోలేదే వేణూ! శారీరకంగా మార్పొచ్చినా ఇంకా ఆనాటి వేణువే. నీవు__ డాక్టరుగా స్థితప్రజ్ఞత్వం సంపాదించుకో, ఇలా అయితే ఎలా? యింత తొందరపాటా? పద పోదాం__ చీకటి పడబోతోంది. వర్షంకూడా వచ్చేట్టుంది."
    ఆకాశం వర్షాగమన సూచకంగా ఏడ్వటానికి సిద్ధంగా వున్న స్త్రీ నేత్ర ద్వయంలా వుంది. వెన్నెల వేళల్లో చీకటి ముసురుకుంటుంది మనస్సులో! శారదా చంద్రికలు వెల్లివిరుస్తాయ్....అదే భగవానుడు చేసే చిత్ర కవిత్వం__!


                                                           11


    "సావిత్రీ__"
    "వస్తున్నా బావా!"
    కప్పునిండా బోర్నవిటా తీసుకువచ్చి టేబుల్ మీద పెట్టి "తీసుకోండి బావా అంది.
    నిండుగా పైట కప్పుకుని అందంగా మనోహరంగా సదా నిశ్చలంగా నిబ్బరంగా వుంటుందామె.
    కప్పుని ప్రక్కకు జరుపుతూ దగ్గరగా తీసుకుని ఆమె గడ్డాన్ని కొన వేలితో లేవనెత్తుతూ అన్నాడు.
    "సావిత్రీ!"
    "ఊఁ...." పెళ్ళయి దాదాపు మూడు మాసాలే అయినా ఇంకా ఆమెలో నూతన వధువు ఛాయలు పోలేదు. చిన్ననాటి నుంచీ చూచిన బావే సిగ్గరి! అందాల ప్రోవైనా అభిమానపాత్రులైనా అతని ఎదురుగా తలెత్తి నిల్చుకోలేనంత సిగ్గు ముంచెత్తుతుంది.
    "నాకెందుకో భయం వేస్తోంది" అదిరే కంఠంతో అన్నాడు. అతనిలో ఏదో తెలియని వ్యాకులపాటుతో అంది.
    "ఎందుకు బావా? మీకు భయమేమిటి? చెప్పండి? దేన్ని గురించి మీ భయం? అయినా మీకు భయమేమిటి బావా? ఆ మాట వింటూంటే నాకు నిజంగా భయమేస్తోంది...."
    క్లుప్తంగా అన్నాడు సాధ్యమైనంత వరకూ చలించే గొంతుకను అదుపులోకి తెచ్చుకోటానికి యత్నిస్తూ.
    "రంగని గురించే సావిత్రీ!"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra