Home » Lalladevi » Ardha Manavudu


    ఆ విచిత్ర మానవుడు తాను సంపాదించి తెచ్చిన ఆహారాన్ని గర్వంగా ఆమె ముందుంచాడు. ఈ ఘనకార్యం సాధించుకు వచ్చినందుకు తనను ఆమె ప్రశంస చేస్తుందన్న ఆశతో బాలునిలా ఆమెవంక చూడసాగాడు.
    ఆమెమెత్తఃగా నవ్వింది. ఆనవ్వు అతనిమీద సమ్మోహనాస్త్రంలా పనిచేయసాగింది. అతడు సమ్మోహనపడిపోయినాడు. మానసికంగా లొంగిపోయినాడు.
    వాస్తవానికి ఆమె అలా ఎప్పుడు ప్రశంసాపూర్వకంగా అందంగా నవ్వుతూ ఉండాలని అతనికి అనిపించింది. ఆమె నవ్వువల్ల తనకుకలిగే అద్భుతమయిన అనుభూతి ఎల్లప్పుడు తనకు కావాలని పిస్తోంది. అందుకోసం కొంగలేకాదు చెవుల పిల్లుల్నే కాదు. చమరీ మృగాన్ని అయినా బెబ్బులిని అయినా వేటాడి తీసుకురాగల వనిపించింది.
    తాను తెచ్చిన ఆహారాన్ని ఆమెకుఅందించాడు. ఆమె వాటని ఎంతో ఆప్యాయంగా తీసుకుంది. తన యిష్టమయిన వారికి అందించుకోవటంలోని ఆనందం అతడిని తలమునకలు వేయించసాగింది.
    రవ్వంతసేపు అతడిచ్చిన బహూకృతిని తనతో ఉంచుకుని ఆపైన విసిరి కొట్టింది మాలతి. అనూహ్యమయిన ఈ సంఘటనతో ప్రిమిటిల్ మాన్ విభ్రాంతుడయినాడు. అతని ముఖం పాలిపోయింది.
    తిరిగి వాటిని తెచ్చి యిచ్చినా స్వీకరించలేదు. "ఇవి నాకువద్దు" అన్నట్లుగా సైగ చేసిందామె. అతని సుదీర్ఘ ఏకాంత జీవితంలో ప్రప్రధమంగా ఎదుటివ్యక్తినించి, అనగా తనలాంటి మరొక ప్రాణినించి ఒక సంకేతాన్ని అందుకుఅర్ధంచేసుకున్నాడతడు. "తాను యిచ్చిన బహూకృతి ఆమెకు నచ్చలేదు.
    వెనువెంటనే అతడు వాటినక్కడ వొదిలేసి మరొక బహుమానం తెచ్చేందుకు బయలుదేరి వెళ్ళిపోయినాడు. పోతూ ఆమెభుజాలు పట్టుకుని నొక్కి వెళ్ళిపోయాడు నేను తిరిగివచ్చేంత వరకూ ఎదురుచూస్తూ ఇక్కడే వుండవలసిందన్నసూచన కాబోలు.
    మాలతికి అతడు తనసూచనల్ని అర్ధం చేసుకోగలుగుతున్నాడని తెలిసిపోయింది. తనను సంతోష పరిచేందుకు సమాయత్తమవుతాడని తెలిపోయింది.
    ఈ రెండు కారణాలను సంబంధాలుగా మలుచుకుని అతడు లొంగిపోయేలా చేయవచ్చు. అలాచేయగలిగితే చాల భాగం తను ప్రమాదంనించి బయటపడినట్లే!
    ముందు ఏమిచేయాలన్నది ఆలోచించుకుందుకు, అవకాశాలు అన్వేషించుకుందుకు కొంత సమయంకావాలి. సమయం తనపట్ల నిరుపద్రవమయినదిగా ఉండాలి. అందుకు తగిన ఆధారాలు దొరుకుతున్నాయి.
    మనసులోని సంశయాలనించి కొంత ఊరటపడింది కెప్టెన్ మాలతి. రవ్వంతసేపు అయాక అతడు కుందేలు పిల్లల్ని చెవులు పట్టుకు తీసుకొచ్చాడు.
    ఆ పూటకు ఆహారం దొరికింది కాబట్టి తిరిగి పోవాలి. మైదానం అంతా నడిచి లోయ అంచుకు వచ్చాడు. అతడు వచ్చిన దారిన దిగిపోయేందుకు ఉద్యుక్తుడయినాడు.
    అలా నేరుగా దిగిపోయిన లోములోకి ఆదారిన వెళ్ళటం మాలతికి యిష్టంలేదు. తను డార్జిలింగ్ లో పొందిన తర్ఫీదు అనుకరించి అలా ప్రమాదకరమయిన లోయలలోకి వెళ్ళాలంటే వీలయినంత చుట్టుదారిన తిరిగి పోవాలి.
    ఏదారీ లేనప్పుడే రిస్క్ చేయాలి.
    తాని ఆ విచిత్ర మానవుడికి జీవితం నేర్పిన అలవాటు ఆత్మవిశ్వాసం ఆధారంగా నేరుగా దిగే వెళ్ళగలడు. ఆ దమ్ములు అతనికున్నాయి.
    కాని గోడలాఉన్న కొండఅంచున మొలచిన పిచ్చి మొక్కలు ఆధారంగా దిగటం ప్రమాదకరం చెట్టుకొమ్మలు పెరగవచ్చు. కాగా యిద్దరి బరువుకు కూకటి వ్రేళ్ళతో పెకిలించుకురావచ్చు.
    అలా జరిగితే అతడికి ఆత్మరక్షణోపాయాలు ఏవైనా వుంటాయో, లేదో తెలియదు కాని తానుమాత్రం లోయలోకి పడిపోవటం తప్పదు.
    మాలతి అతని సూచన ప్రకారం ఆవైపుగా లోయలోకి దిగేందుకు సన్నద్దురాలు కాలేదు విముఖతను ప్రదర్శిస్తూ తిరిగి మైదానం మీదికివచ్చి నిలబడింది.
    అతడుకూడా బుద్ధిగా ఆమెను అనుసరించి మైదానం మీదికి వచ్చాడు. తన అవారికమయిన గుహలోకి వెళ్ళేందుకు ఆమెకు యిష్టంలేదని మాత్రమే అనుకున్నాడు.
    కెప్టెన్ మాలతి అతిప్రయత్నంమీద చుట్టు తిరిగిపోవాలని అతనికి అర్ధమయ్యేలా చేయగలిగింది. చుట్టు తిరిగి వెళ్ళేదారి నిరపాయకరమైనదే.
    ఆ దారి వెంట ఆమె ముందు నడుస్తోంది. అతడు అనుసరించి రాసాగాడు. కొంతదూరంపోయాక వృక్షాలు బాగా దట్టంగా పెరిగి ఉన్నాయి. పొదలు తీగలు చీకిరి బాకిరిగా అల్లుకుని ఉన్నాయి.
    ముందుకు వెళ్ళేదారికూడా కొన్నిచోట్ల కన్పించలేదు. అతి కష్టంమీద ఆమె ముందుకు పోతోంది. కొన్ని వందల మీటర్లు నేరుగా దిగితే లోయలోని అతని నివాసానికి చేరుకోవచ్చు.  కాని ఈ చుట్టు దారిన కనీసం అయిదారు కిలోమీటర్ల దూరం నడవాలి.
    అంతేకాదు దారి చొరరానిదిగా దట్టంగా కన్పిస్తోంది. పోతూ ఆమె ఒక పొదలోంచి తనను రెండుకళ్ళు గమనిస్తున్నాయని తెలుసుకుంది.
    కాని ప్రధమ పర్యాయం అందుగురించి ఆమె అంతగా పట్టించుకోలేదు. ఏదో అడవి జంతువు అయివుండవచ్చు.  అలికిడికి భయపడి పొదలో దూరిపోయింది అనుకుంది. మరికొంత దూరం వెళ్ళాక పొదలో అలికిడి వినిపిస్తోంది. కెప్టెన్ మాలతి ఆ పొదలలో ఉన్నదేమిటో చూడలేకపోయింది. భయమనిపించింది.
    వెంటనే ఆమె నడక వేగాన్ని తగ్గించి వెనుతిరిగి చూచింది. అర్ధమనవుడు ఆమెను అనుసరించి వస్తున్నాడు. కొంత ధైర్యాన్ని కూడదీసుకుని నడువసాగింది మాలతీ. మరికొన్ని అడుగులు నడిచాక పొదలు, చీకిరిబాకిరిగా అల్లుకుపోయిన అడవితీగలు మరింత దట్టంగా అయినాయి పోను పోను అది కీకారణ్యంగా మారే సూచనలు కన్పించసాగాయి. ఆమె నిట్టూర్చింది.
    ఈ అర్ధమానవుడు గతంలో కొన్ని పర్యాయాలు ఆ దారిన వచ్చేందుకు ప్రయత్నించి ఉంటాడు. మార్గం అగమ్యమయింది కావటంతో ప్రమాదకరమయినా నేరుగా కొండ చరియల మీదికి ఎగబ్రాకే విద్య అలవరచుకున్నాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra