Home » Yandamuri veerendranath » Bharya Gunavathi Sathru

 

     నవ్వింది. "కాదు పిల్లలకి."    
    "ఏ పిల్లలకి?"    
    "అదే ఎంక్వయిరీ చెయ్యాలి."    
    "ఈ అయిడియా మరీ నాసిరకంగా వున్నట్లు లేదే" అన్నాడు బాలూ ఉత్సాహంగా.    
    ఆ రోజు సాయంత్రం చల్లబడ్డాక ఆ వీధిలో వున్న అయిదారు ఇళ్ళలో విచారించింది సౌదామిని.    
    అందరిళ్ళలో దాదాపు ఒకేరకం ప్రశ్నలూ, సమాధానాలు.    
    "ఎంత తీసుకుంటారు?"    
    "మీకు తోచినంత ఇవ్వచ్చు."    
    "ఇక్కడికి వచ్చి చెబుతారా? మీ ఇంటికి రావాలా? మీ ఇల్లెక్కడ?"    
    "మీకు ఎలా సౌకర్యంగా వుంటే అలా చేస్తాను. మా యిల్లు ఈ వీధి లోనే."    
    "వీణ మీ దగ్గర వుందా?"    
    "లేదు మీరే కొనాలి."    
    వాళ్ళ మొహాల్లో ఆశ్చర్యం కనబడేది. "మరెలా నేర్చుకున్నారు? ఇంకోళ్ళకి చెప్పేటంతగా నేర్చుకున్న వాళ్ళ దగ్గర వీణ లేకపోవడమేమిటీ?"    
    దానికి జవాబు తన దగ్గరవున్నా చెప్పేది కాదు సౌదామిని. చిరునవ్వు నవ్వి ఊరుకునేది.    
    ఒక్క ఇంట్లో మాత్రం సంభాషణ వేరే విధంగా నడిచింది. అసలు ఆ ఇల్లే వేరే రకంగా వుంది. ఆ మనుషులు వేరే తరహాగా వున్నారు. ఆయన ఎక్కడో ఆఫీసరుట. మధ్యతరగతిలో నుంచి గబగబా బయటపడిపోయి సొసైటీలో పైపైకి ఎగబాకి పోవాలనే దుగ్ధతో వున్నట్లు కనబడుతున్నారు. కొత్తగా కాస్త డబ్బు వెనకేసుకున్న నియోరిచ్ కుటుంబంలా వుంది అది. దానితోబాటు కాస్తో కూస్తో కళని కూడా సొంతం చేసుకోవాలన్న ఆరాటంతో వున్న కల్చర్ వల్చర్ లా ఆత్రంగా కనబడుతున్నారు వాళ్ళు.    
    "వీణ కొనటం నో ప్రాబ్లెం సాయంత్రానికి తంజావూరు వీణ తెప్పించెయ్యగలను. ఎన్నాళ్ళలో ట్రెయిన్ అప్ చెయ్యగలరు మా డాలీని? ఎంత త్వరలో ప్రోగ్రామ్స్ ఇప్పించగలరు? టీవీలో, రేడియోలో ప్రోగ్రాములు మేనేజ్ చేయగలరా? ప్రెస్ కవరేజీ మీరు చూసుకుంటారా?" ప్రశ్నల వర్షం కురిపించింది పట్టుచీర సర్దుకొంటూ.    
    సంగీతం నేర్పించడం తప్ప మిగతావన్నీ తను చెయ్యలేనన్నది సౌదామిని. వింటున్న ఇంటాయన మొహం అప్రసన్నంగా పెట్టాడు.    
    "మా రోటరీ క్లబ్ మెంబరొకాయన కూతురికి ఒకే ఒక సంవత్సరంలో వీణ నేర్పించేసి, టీవీలో - రేడియోలో అధరగొట్టించేస్తున్నాడు. ఆ టీచరే ఇవన్నీ చూసుకుంటుందిట. ఇవన్నీ చెయ్యని కాడికి మీరెందుకూ? మా అమ్మాయిని ఆ టీచర్ దగ్గరికే పంపుతాం" అన్నాడు.    
    మనుష్యుల తత్వాలు చూస్తుంటే వికారం కలుగుతోంది. తనకి కడుపులో తిప్పుతున్నట్లు అనిపిస్తోంది. ఒక్కతే కూర్చొని ఆలోచిస్తూంది. అంతలో అలవాటైన కూరల అమ్మాయి కేక వినబడింది. చాలా చిన్నపిల్ల పన్నెండేళ్ళు వుంటాయి. పెద్ద బుట్టనెత్తిన పెట్టుకుని పెరటి గుమ్మంవేపు వచ్చి రోజూ కేకవేస్తుంది. పక్కింటి బేబీ జాన్ కుటుంబం ఆ అమ్మాయి దగ్గరే వాడుగ్గా కొంటారు కూరలు.    
    సౌదామిని వాళ్ళ వాడుక కూడా తన దగ్గరే వుంటే బాగుంటుందని ఆ అమ్మాయి తాపత్రయం. రోజూ జాలిగా అడుగుతుంది. "కూరలు తీసుకోవా అమ్మా" అని.    
    "ఇవాళ కాదు" అనేది సౌదామిని ఏరోజు కారోజు.    
    ఇవాళ ఆ పిల్ల గట్టి ప్రయత్నమే చేయదలచుకుంది. ఈ అమ్మ తన దగ్గర ఎందుకు కొనదు కూరలు? తను తాజావి తేనని అనుకుంటోందా ఏమిటి?    
    "లేత లేత సొరకాయలమ్మా బొల్లారం నుంచీ తెల్లారక ముందే తెచ్చి నానమ్మా తీసుకోవా?" అంది జాలిగా చూస్తూ.    
    "వద్దు పాపా ఇంట్లో కూరలున్నాయ్" అంది సొరకాయ కోస్తున్నట్టు - సౌదామిని.    
    "ఎక్కడనుండి తెచ్చుకుంటారమ్మా మీరు? మోండా మార్కెట్ కెళ్ళి తెస్తారా? నేను మార్కెట్ ధరకే అమ్ముతానమ్మా నిజమో కాదో ఆ దొరసానమ్మను అరుసుకో . చెప్తుంది. నాకు పది పైసలు కూడా మిగలదమ్మా" అంది ఆత్రంగా.    
    గుండె కరిగి నీరైపోయింది సౌదామినికి.    
    "ఇవాళ కాదు, ఇంకోరోజు తప్పకుండా తీసుకుంటాను" అంది తప్పించుకోవడానికి కాని ఆమె చూపులు అప్రయత్నంగానే బుట్టలో వున్న మామిడికాయలవైపు పోతున్నాయి. నిజంగానే బాగున్నాయి అవి. నవనవలాడుతూ, నిగనిగ మెరుస్తూ అతి ప్రయత్నం మీద కళ్ళు పక్కకి తిప్పుకుంది సౌదామిని.    
    ఆ చూపులు కని పెట్టేసింది కూరలమ్మాయి.    
    "మామిడికాయలు కొబ్బెర లెక్క ఉన్నాయమ్మా. తినిచూస్తే నీకే తెలుస్తుంది" అని, సౌదామిని వద్దనేలోగానే చాకు తీసి చిన్న ముక్కకోసి ఆమె చేతిలో పెట్టింది. నోట్లోనూ, కళ్ళలోనూ నీళ్ళూరాయి సౌదామినికి.    
    ఎటూ తేల్చుకోకుండా ఆ మామిడికాయ ముక్కవైపు చూసింది. తను ఎలాగూ ఈ అమ్మాయి దగ్గర కూరలు కొనబోవడంలేదు. మరి ఊరికే తిని ఆశపెట్టడం కరక్టేనా?    
    "తినక్కా" అంది కూరలమ్మాయి. ఇంక ఆలోచించకుండా ఆ ముక్కనోట్లో పెట్టేసుకుంది సౌదామిని.    
    పుల్లపుల్లగా దివ్యాతిదివ్యంగా తోచింది నోటికి. తొంభై రోజుల తొలివలపు - తీయబోతూన్న తలుపు-తిరగబోయే మలుపు-తీయ తీయని పులుపు....    
    "పది కాయలు ఇవ్వనా అమ్మా, పచ్చడి పెడితే మంచిగా వుంటుంది...."    
    గుండెలు పిండేసినట్లయింది సౌదామినికి. చప్పున ఆ అమ్మాయి గెడ్డాన్ని పట్టుకుని, "చాలా థాంక్స్ పాపా! ఇవాళ నా దగ్గర డబ్బుల్లేవు. నా దగ్గర డబ్బులున్న రోజున, నా అంతట నేనే పిలిచి, నీ బుట్టలో వున్న కూరలు మొత్తం కొనేస్తాను. అప్పటిదాకా మళ్ళీ నన్ను అడక్కు ఏం?" అంది గబగబా.    
    అనూహ్యమైన ఈ చర్యకి బిత్తరపోయి ఆశ్చర్యంగా చూస్తూ, తలఊపి వెళ్ళిపోయింది కూరలమ్మాయి.    
    ఇంట్లోకి వచ్చేసరికి బాలూ అప్పుడే పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చిన పేపరు చదువుతూ కనబడ్డాడు. అతని వెనకే కూర్చుని, అతని భుజంమీద గెడ్డం ఆనించి, తనుకూడా హెడ్ లైన్స్ చదవడం మొదలుపెట్టింది సౌదామిని.    
    నీలంగేకర్ పదవీచ్యుతిలో వసంతదాదా హస్తం, ఆందోళన.    
    లెక్చరర్ల మరో మూడు కోర్కెలకు ఆమోదం.    
    పంతుళ్ళ సమ్మెకు అన్ని పార్టీల మద్దతు. ప్రాక్టికల్స్ జరగలేదు.    
    "ఇదేమిటి" అంది సౌదామిని ఉన్నట్లుండి.    
    "ఏది?"    
    చూపుడు వేలితో ఒక వార్తని చూపించింది సౌదామిని.    
    "టెలీఫోన్స్ డిపార్ట్ మెంట్ లో పనిచేసే ఉద్యోగి సస్పెన్షన్-సిబ్బంది ఆందోళన."    
    గబగబా చదివాడు బాలూ.    
    "టెలీఫోన్స్ డిపార్ట్ మెంట్ లో పనిచేసే ఒక ఉద్యోగి కుటుంబ సమేతంగా కాశ్మీరు వెళ్ళడానికి లీప్ ట్రావల్ కన్సెషన్ కింద డబ్బు తీసుకుని, కాశ్మీరు వెళ్ళకుండానే దొంగ టిక్కెట్లతో అడ్జస్ట్ మెంట్ బిల్సు పెట్టి ప్రభుత్వం ఏర్పరచిన సదుపాయాన్ని దుర్వినియోగం చేసినందుకుగానూ సస్పెండ్ చేయబడ్డాడు. ఆయన మీద ఎంక్వయిరీ జరుగుతున్నది. ఇది యాజమాన్యపు కక్ష తప్ప మరేమీ కాదని ఆ ఉద్యోగిపై సస్పెన్షన్ తొలగించాలనీ డిమాండ్ చేస్తూ సిబ్బంది మెరుపు సమ్మె ప్రారంభించారు...    
    ....చట్ట విరుద్దమైన సమ్మె కారణంగా పని ఆగబోదనీ కస్టమర్లకు అసౌకర్యం కలగనివ్వమనీ, ట్రైనింగ్ పొందిన వ్యక్తులను తాత్కాలికంగా ఉద్యోగాలలోకి తీసుకుంటామణీ అధికార్లు తెలియజేశారు. టెలీ ఎక్స్చేంజికార్డుతో సహా ఆఫీసర్ ను కలుసుకోవచ్చు."    
    "-ట్రైనింగ్ పొందిన వ్యక్తులంటే నీలాంటి వాళ్ళే! అంటే మనకి ఉద్యోగం!!!కనీసం టెంపరరీగా!" అన్నాడు బాలు హర్షాతిరేకంతో. "బయల్దేరు! యెర్లీ బర్డ్ గెట్స్ దవర్మ్! అనగా మొదట వెళ్ళిన పిట్టకు పురుగు దొరుకును పద! పద!!" అరిచాడు బాలు.    
    నవ్వింది సౌదామిని. ఆ కొద్దిరోజుల టెంపరరీ వేకెన్సీకి కూడా ఎంత కాంపిటీషన్ ఉంటుందో, ఎంత పెద్ద రికమెండేషన్లు ఉంటాయో తెలియదు. ఈ ఉద్యోగం తనకి వస్తుందో రాదో తెలియదు. అయినా వెళ్ళింది.    
    ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. చాలాసేపటికి వచ్చింది సౌదామిని టర్న్.    
    ఇంటర్వ్యూ చేసే ఆయన చాలా సౌమ్యుడు. ఆమె సర్టిఫికెట్లు చూసి తల పంకించి "ఎక్కడ ఉంటారు!" అన్నాడు.    
    చెప్పింది.    
    వెంటనే ఆయన మొహంలో ఆసక్తి కనబడింది. "కరెక్ట్ లొకేషన్ ఎక్కడ?"    
    చెప్పింది సౌదామినీ.    
    "అంటే బేబీ జాన్ వాళ్ళ ఇంట్లోనే అన్నమాట. అవునా?"    
    "అవును పక్కపోర్షనే ఎందుకు?" అంది.    
    "అయితే మీరు మాకు హెల్ప్ చెయ్యండి. మేము మీకు హెల్ప్ చేస్తాం" అన్నాడా ఆఫీసర్.    
    అనుమానంగా చూసింది సౌదామిని.    
    "అంటే?"    
    "మీ పక్క పోర్షన్ లో వుండే బేబీ జాన్ కాశ్మీర్ వెళ్ళకుండా ఈ ఊళ్ళోనే వుండి దొంగ టిక్కెట్లతో బిల్లు సబ్మిట్ చేశాడు. అతను కాశ్మీర్ వెళ్ళలేదని మీకు తెలుసు. అలా అని స్టేట్ మెంట్ రాసి సంతకం పెట్టి ఇవ్వాలి మీరు. మీకు ఈ ఉద్యోగం గ్యారంటీ. స్ట్రయిక్ ముగిసిన తర్వాత మిమ్మల్ని రెగ్యులర్ గా తీసుకోవడానికి కూడా ప్రయత్నిస్తాము."    
    కొద్దిగా ఆలోచించి, తల వూపింది సౌదామిని.    
    అతని మొహం వికసించింది బెల్లుకొట్టి స్టెనోని పిలిచాడు.    
    కొద్దిసేపట్లోనే కాయితాలు టైపు అయి వచ్చాయి.    
    చదివింది సౌదామిని. సంతకం పెట్టింది.    
    "థాంక్స్ ఏలాట్? ఇది మాకు చాలా పనికి వస్తుంది. లేకపోతే యూనియన్ తో ఇంకా పెద్ద గొడవ అయి వుండేది. ఇది మీ అప్పాయింట్ మెంట్ ఆర్డర్ తీసుకోండి."    
    తల అడ్డంగా వూపింది సౌదామిని. "నో థాంక్స్! నాకు తెలిసిన నిజాలు నేను చెప్పినందుకుగానూ ఇలా లంచం తీసుకోవడం బాగుండదనుకుంటాను."    
    పట్టశక్యంగాని ఆశ్చర్యంతో చూశాడు ఆయన. "లంచం కాదిది! మ్యూచువల్ హెల్ప్!"    
    లేచి నిలబడింది సౌదామిని. నెమ్మదిగా, కానీ స్థిరంగా చెప్పింది- "నీతి నిజాయితీ, ధర్మం నైతికం లాటి పెద్ద మాటలు నేను చెప్పను సార్! కానీ ప్రతి మనిషికీ కొన్ని విలువల్ని కాపాడవలసిన నైతికధర్మం వుంటుందని నేననుకుంటున్నాను. బేబీ జాన్ మా ప్రక్క ఇంట్లో వున్న మనిషి శలవుకాలంలో అతడు ఎక్కడికీ వెళ్ళలేదనటానికి నేను సాక్షిని, అది ప్రభుత్వానికి చెప్పటం కోసం ఏ విధమైన లంచమూ అవసరం లేదు. ఒక సాధారణ పౌరురాలిగా అది నా కర్తవ్యం. ఒక లంచగొండిని రక్షించటం కోసం యూనియన్స్ ప్రయత్నించటం దురదృష్టకరం. ఈ టెంపరరీ ఉద్యోగం ఆశ పెట్టకపోయినా నేనీ కర్తవ్యం నిర్వర్తించాలి. నా స్వార్ధంకోసం అతడి ఉద్యోగం పోగొట్టి ఆ స్థానంలో నేను చేరటం నాకెందుకో అంత బాగా అనిపించడంలేదు! క్షమించండి" అంటూ పూర్తిచేసింది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra