Home » Suryadevara rammohan rao » త్రినేత్రుడు-2


    "సరిగ్గా 24 గంటల్లో సుదర్శన్ రావు నుంచి బాహ్య ప్రపంచాన్ని దూరం చేయబోతున్నాడు. దీనికి సయితం అడ్డు పడేందుకు ప్రయత్నించావో... నిన్ను నామరూపాలు లేకుండా చేస్తాను. ఖబడ్దార్..." బోస్ వచ్చినంత ఆవేశంగా వెళ్ళిపోయాడు.


                                          *    *    *    *


    "అదెలా సాధ్యం...? సుదర్శన్ రావులాంటి కరోర్ పతి ఫోన్ బిల్స్ ని క్షణాల్లో పే చేస్తుంటాడు. అది జరగకపోతే తప్ప ఫోన్స్ ని కట్ చేయటం మరెలా సాధ్యం?" హిందూకి అయోమయంగా వుంది.

    "అది మనకు అసాధ్యంగా కనిపించవచ్చు హిందూ! కాని అలా అని త్రినాధ్ తెలివితేటల్ని తక్కువ అంచనా వేయటం మన అవివేకం అవుతుంది. అందుకే చూద్దాం... ఈ ఛాలెంజ్ ని మన బాస్ ఎలా నెరవేర్చుకుంటాడో?" గుప్తా ఒకింత ఆసక్తిని చూపిస్తూ అన్నాడు.

    సరిగ్గా ఇదే సమయంలో త్రినాధ్ రూమ్ లోని టైప్ మెషిన్ నిర్విరామంగా పనిచేసుకుపోతోంది.

    "పూర్తయిందా?" త్రినాధ్ పొడిగా ప్రశ్నించాడు తన స్టెనోని.

    అప్పుడే ఆఖరి వాక్యం టైప్ చేసిన స్టెనో అయిందన్నట్టు వినయంగా తలూపాడు.

    త్రినాధ్ తన సీట్లోంచి లేచి స్టెనో దగ్గరకు వచ్చి అతను అందించిన టైప్డ్ మేటర్ ని చదివి సంతృప్తిగా తల పంకించాడు.

    "ఇప్పుడు అన్ని పత్రికల రిపోర్టర్స్ కి ఫోన్ చేసి మెయిన్ టెలిఎక్చ్సేంజికి రమ్మని చెప్పు. ఎందుకని అడిగితే... ఓ సరికొత్త అవినీతిని కళ్ళారా చూసేందుకని చెప్పు..." అన్నాడు మరోసారి ఆ కాగితంవేపు చూస్తూ.

    సరీగ్గా ఇదే సమయంలో సుదర్శన్ రావుకి త్రినాధ్ మీద అనుమానం ఇచ్చి తన ఇంటికి వచ్చే టెలిఫోన్ వైర్స్ ని ఎవరన్నా కట్ చేస్తారేమోనని నిఘా పెట్టాడు.

    మెయిన్ హాల్లో సుదర్శన్ రావు పచార్లు చేస్తుంటే ప్రియాంక, యోగేష్ సరికొత్తగా త్రినాధ్ విసిరినా సవాల్ గురించే ఆలోచిస్తున్నారు.

    తాము ఎప్పటికప్పుడు టెలిఫోన్ బిల్స్ కరెక్టుగానే చెల్లించడం జరుగుతోంది. సో... ఆ విధంగా లైన్స్ డిస్కనెక్ట్ అయ్యే అవకాశం లేదు. ఇకపోతే తమ ఇంటికి వచ్చే ఫోన్ కనెక్షన్ అండర్ గ్రౌండ్ కేబుల్. దాన్ని కట్ చేసినా డిస్కనెక్ట్ కావచ్చు. కాని అదంత తేలికైన పనికాదు. పైగా అది నేరం కూడా. నేను కాదా పనిచేసిందని త్రినాధ్ ఎలిబీ సృష్టించి చట్టపరంగా తప్పించుకోవాలన్నా, అతను సవాల్ విసిరిన పదో నిమిషం నుంచే కేబుల్ వున్న ఏరియా పొడవునా నిఘా పెట్టించాడు.

    ఇక అతనికి మిగిలిన ఒకే ఒక్క అవకాశం. ఎక్చ్సేంజ్ ఇంజనీర్ ని ఒప్పించి తమకొచ్చే లైన్ ని డెడ్ చేయించడం. కాని అందుకు ఏ ఇంజనీరూ ఒప్పుకోడు. ఒకవేళ ఏదైనా ప్రలోభానికి లొంగిపోయి ఆ పని చేసేందుకు ముందుకు వచ్చినా, తమ నెంబర్ తెలిసిన మరుక్షణం వాళ్ళ కాళ్ళు చల్లబడటం ఖాయం.

    మరి ఎలా తన సవాల్ ని నెగ్గించుకోగలడు? ప్రియాంక తీవ్రంగా ఆలోచిస్తోంది.

    "ఆ ఏడ్చాడు... మన ఫోన్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేయడం వాడి వల్లేమవుతుంది డాడీ! డోంట్ వర్రీ... యూ టూ సిస్టర్..." అన్నాడు యోగేష్ దిలాసాగా.

    తండ్రీ కూతురూ మౌనంగా వుండిపోయారు. వాళ్ళిద్దరకూ తెలుసు త్రినాధ్ ఇప్పుడు అంత తేలిగ్గా తీసేసే మనిషి కాదని. అతను విసిరే సవాళ్ళ వెనుక అనితరసాధ్యమైన పట్టుదల వుంటుందని.

    ఏమి జరగనున్నదో అని సుదర్శన్ రావు, ప్రియాంక ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా అక్కడ త్రినాధ్ హోండా ఎకార్డ్ వసుంధరా ఇండస్ట్రీస్ పారిశ్రామిక సౌధపు ప్రాంగణంలోంచి బయటకు దూసుకుపోయింది.

    త్రినాధ్ ఎపాయింట్ మెంట్ కోసమే ఆశగా, ఆతృతగా రోజుల తరబడి, గంటల తరబడి ఎదురుచూస్తున్న డీలర్స్, ఏజెంట్స్ వెళుతున్న బాస్ కారువేపు గౌరవ ప్రపత్తులతో చూస్తూ, తమ నిరీక్షణా కాలాన్ని పొడిగించుకునేందుకు మానసికంగా సిద్ధమవుతున్నారు.

    త్రినాధ్ తో ఏదో ఒక బిజినెస్ డీల్ గురించి చర్చించేందుకు, సహాయం అర్థించేందుకు వచ్చే విజిటర్స్ కి, బిజినెస్ మెన్ బోర్ కొట్టడం అనేది ఎప్పుడూ జరగలేదు. అయ్యో, కాలం వృధా అయిపోతోందే అన్న బాధ అంతకంటే కలగలేదు. 

    వస్తూనే- త్రినాధ్ ఒకప్పుడు పైసా కూడా లేనివాడని... చదువు అంతకంటే లేనివాడని... పూటకు గతిలేనివాడని... అలాంటివాడు మూడే మూడేళ్ళలో పటిష్టమైన పారిశ్రామిక సామ్రాజ్యాన్ని స్థాపించాడని తెలిసినవి, తెలియనివి కథలు కథలుగా చెప్పుకుంటూ నూతనోత్సాహాన్ని, ఉత్తేజాన్ని పొందుతుంటారు.

    రోజుకిన్ని గంటలు శ్రమిస్తాడని కొందరంటే- ఇన్ని గంటలు మాత్రమే విశ్రమిస్తాడని కొందరంటారు.

    విరామంలో సయితం అతని వాలిన కనురెప్పల వెనుక కమనీయ పారిశ్రామిక సౌధాలు ఊపిరి పోసుకుంటాయని కొందరంటారు.

    అసాధ్యమన్నది అతని డిక్షనరీలోనే లేదని, అసలు ఇతరులు అసాధ్యమన్న దానినే పట్టుబట్టి సుసాధ్యం చేసుకుంటాడని, పని... పని పని నిరంతరం నిలువులోతు పనుల్లో నిమగ్నమయి వుంటాడని... ఎంతటి నిర్ణయాన్నైన్నా చలాగ్గా, ప్రశాంత చిత్తంతో క్షణాల్లోనే తీసుకుంటాడని... అవతల వ్యక్తిని చూస్తూనే అతని శక్తి సామర్ధ్యాల్ని, నీతి నిజాయితీల్ని, స్వామిభక్తిని అంచనా వేసి అతనికి తగిన పనిని అప్పగిస్తాడని కొందరనుకుంటుంటే- ఇంకొందరు అతను పెట్టి పుట్టాడని, అతని జాతకం శుక్రదశలో నడుస్తున్నదని, అందుకే అంతవాడు అయ్యాడని అంటారు.

    మరికొందరు అతని మేథస్సు అపూర్వమైనదని, ప్రతిక్షణం ఓ కొత్త ప్రాజెక్టుకి అతను మదిలోనే రూపకల్పన చేస్తాడని, సమయం సావకాశం చూసి దాన్ని నిజం చేసుకుంటాడని, అతనికి వ్యాపారమే ప్రాణమని, మరో విషయంతో అతనికి సంబంధం వుండదని, డబ్బు సంపాదించడం అతనికిప్పుడు వెన్నతో పెట్టిన విద్య అని అంటారు.

    అతని గురించి బొత్తిగా ఏమాత్రం తెలీనివాళ్ళు సయితం అతన్ని చూస్తుంటే పట్టుదల, దీక్షలకు నిదర్శనంగా కనిపిస్తున్నాడని, సాహసానికి మారుపేరు లాంటివాడని, మనిషి ఆత్మవిశ్వాసంతో సాధించలేనిది లేదని చెప్పేందుకు ఇతనే నిదర్శనమని అంటారు.

    ఈ ఆలోచనలతో త్రినాధ్ ని ఓ అద్భుతమైన వ్యక్తిగా పక్కవారికి అభివర్ణించి చెప్పడం గొప్ప థ్రిల్లింగ్ గా భావించేవారు ఇప్పుడు ఎందరో. ఎవరి అభిప్రాయాలు ఎలా వున్నా త్రినాధ్ మాత్రం దారుణమైన అవమానాల నుంచి, అనుభవాల నుంచి ఎన్నో దెబ్బలు తిని ఒడ్డుకు చేరి అసాధారణమైన మానసిక పరిణతిని సంతరించుకున్నాడు.

    క్రితంరోజు కేవలం నాలుగు గంటల కాలంలోనే వసుంధరా హోండా మోపెడ్ కి సమర్ధులైన నాలుగు వందలమందిని తన డీలర్స్ గా, ఏజెంట్స్ గా అపాయింట్ చేసుకున్నాడు. ఆ సందర్భంలో వాళ్ళు కట్టిన డిపాజిట్స్ యాభై లక్షలు దాటుతాయని ఎవరూ ఊహించని విషయం. ఒకేరోజు అంత డబ్బు తన చేతికందినా మామూలుగానే వున్నాడు త్రినాధ్.

    ఐదో గంట ప్రారంభం నుంచే అతని ఆలోచనలు మరోవేపు మరలాయి- సరీగ్గా ఇరవై నాలుగ్గంటల్లో సుదర్శన్ రావుని బాహ్య ప్రపంచానికి దూరం చేయాలి. ఎలా...? కేవలం కామన్ సెన్స్ ని... అదే అప్పుడూ అతనికో ఉపాయం తెలియజెప్పింది.

    దాన్ని పకడ్బందీగా అమలుపరిచే పనిని స్టెనోకి అప్పగించి ఆలోచనల్ని సైంటిస్ట్ పరిశోధనల మీదకు మళ్ళించాడు.

    సరిగ్గా తొమ్మిది నెలల క్రితం జరిగిన సంఘటన ఇది- ప్రియాంక నిరసనకు అవమానానికి రెచ్చిపోయిన సైంటిస్ట్ ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంటూ త్రినాధ్ ముందుకొచ్చి సిగ్గుతో తలవంచుకున్నాడు.

    ఎవరిని ఎలా లొంగదీసుకోవాలో, ఎవరిని ఎలా తన వ్యాపార శిబిరంలోకి చేర్చుకోవాలో త్రినాధ్ కి బాగా తెలుసు.

    "జరిగినదాన్ని తిరగదోడడం అన్నది విలువైన వర్తమానాన్ని వృధా చేసుకోవడమే అవుతుంది. నీ అనుభవాలే నిన్ను నా దగ్గరకు మనస్పూర్తిగా పంపాయని భావిస్తున్నాను. పగనుంచి పట్టుదలను పెంచుకో. అనుభవాలనుంచి ఆత్మవిశ్వాసాన్ని తోడుకో- ఇప్పుడు నీకో ఛాలెంజ్ విసురుతున్నాను. నేను జపాన్ నుంచి వారం క్రితమే వచ్చాను. మనం త్వరలో జపాన్ హోండా కొలాబరేషన్ తో 50 సి.సి. మోపెడ్స్ తయారుచేయబోతున్నాం. బహుశా అది లీటర్ పెట్రోలుకు ఎనభై నుంచి వంద కిలోమీటర్లు వరకు నడపవచ్చు. ఖచ్చితంగా ఎన్ని కిలోమీటర్స్ అన్నది దాని కార్పోరేటర్ సెట్ కావడాన్ని బట్టి వుంటుంది. ఇది మనకు గొప్ప ఆఫర్. అయితే దాన్ని నేను మరింత గొప్ప వాహనంగా రూపొందించాలనుకుంటున్నాను.

    అంటే... మధ్యతరగతి మానవుడి రవాణా భారాల్ని తగ్గించడం మనదేశంలో సహజ వాయువు వనరులు అపారంగా వున్నట్టు అంచనా. దాన్ని వెలికితీసే కార్యక్రమాన్ని ఆయిల్ అండ్ నేచురల్ గేస్ కార్పోరేషన్ యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టింది.

    ఒక వస్తువు ఎప్పుడైతే అపారంగా లభ్యమవుతుందో దాని ధర చౌకగా వుంటుంది.

    కనుక నువ్విప్పుడు నేచురల్ గేస్ తో వాహనాన్ని నడపగల ప్రక్రియలు కనిపెట్టాలి.

    అది నీవు నిజం చేయగలిగితే నీవు సంపాదించుకున్న అపారమైన శాస్త్ర విజ్ఞానానికి అర్ధం చెప్పుకోగలిగినట్లే.

    ఇకపోతే... అదే నిజమైతే మన కంపెనీ స్లోగన్ ఏమిటో తెలుసా?

    'ఇప్పుడు మీ వెహికల్ ఇంధనపు ఖర్చు మీ కాఫీ, టీ ఖర్చుల్ని మించదు.

    ఈ స్లోగన్ తో నేను లక్షల వాహనాల్ని... కాదు కాదు కోట్ల వాహనాల్ని ఉత్పత్తి చేసి నా దేశపు రోడ్లను ఆక్రమించుకుంటాను. కోట్లాది వాహన ప్రియుల మనసుల్నే కాదు జేబుల్ని దోచుకుంటాను.

    ఆ తదుపరి వసుంధరా హోండా మోటార్ సైకిళ్లు- వసుంధరా హోండా కార్లు, వసుంధరా హోండా జీపులు, వసుంధరా హోండా లారీలు, బస్సులు, పేలోడ్ వేన్స్, ఆటోలు, క్రేన్స్, క్రషర్స్, జెట్స్, జెంబోస్, ఓహ్- ఒకటేమిటి...? ఆ ప్రక్రియే నా ఆశలకు, ఆశయాలకు నిజమైన ఊపిరి పోయగలిగేది.

    ఇప్పుడు ఎదుగుతున్న పారిశ్రామిక సామ్రాజ్యం...

    అప్పుడు ఎదగబోయే సామ్రాజ్యం...

    నాది... నా ఒక్కడిదీ కాదు... వేలాది... లక్షలాది నిరుద్యోగ, విజ్ఞానగనులది. నిరాశ నిస్పృహల బలిపీఠంపై ఉరి తీసుకునే భారతదేశపు యువతది.

    కమాన్... కెన్ యూ ఛాలెంజ్ విత్ మి? అద్భుతాన్ని... అత్యద్భుతాల్ని సృష్టిస్తాను- నీవే కనుక నాకా ప్రక్రియను అందించగలిగితే-

    సైంటిస్ట్ బిత్తరపోయాడు త్రినాధ్ లోని ఉద్వేగానికి ఉరకలు వేస్తున్న ఉత్తేజానికి.

    సిగ్గుపడ్డాడు... తనని కలవగానే త్రినాధ్ తన తప్పిదాల్ని ఎత్తి చూపుతాడని భావించినందుకు.

    ఇతను ఒకప్పటి తిమ్మడేనా?

    ఒకప్పటి అనామకుడేనా?!

    అరికాళ్ళకు చెప్పులు సయితం లేని అతి సామాన్య మానవుడేనా?! ఇది కలా...? నిజమా...?

    తన కళ్ళ ముందే ఎదిగిన ఒక సామాన్యుడి అసమాన ప్రతిభ!!

    నమ్మలేని నిజం!

    నమ్మని తప్పని ఉదాహరణలు ఓ ప్రక్క...

    "హేట్సాఫ్ మిస్టర్ త్రినాధ్... హేట్సాఫ్ టు యువర్ ఇంటెలిజెన్స్... ది రేగ్స్ టూ రిచెస్ స్టోరీస్ నెవ్వర్ బికమ్ పార్ట్ ఆఫ్ హిస్టరీ దే ఆర్ కాన్ స్టెంట్లీ టేకింగ్ ప్లేస్... అయినప్పటికి నువ్వు సాధించిన, సాధిస్తున్న విజయాల్ని వెంటనే జీర్ణించుకోలేకపోతున్నాను" ఉద్వేగంగా అన్నాడు సైంటిస్ట్ త్రినాధ్ వైపు చూస్తూ.

    త్రినాధ్ కిప్పుడు పొగడ్త కూడా మామూలుగానే అనిపిస్తోంది.

    అంతగా ఆశ్చర్యపోనక్కరలేదు మైడియర్ సైంటిస్ట్. ఈనాడు జాతీయస్థాయిలో నెంబర్ వన్ పారిశ్రామిక కుటుంబమైన 'తాతా' ఎలా ఎదిగిందో తెలుసా? కొన్ని దశాబ్దాల క్రితం జెమ్ షెడ్ జీ తాతా ఓ మామూలు వడ్డీ వ్యాపారి. నేడు...?! 'తాతా'లతో సమానమైన బిర్లాలు ఒకప్పుడు మార్వాడీ బజార్ లో చిన్న షాప్ తో తమ వ్యాపారాన్ని ప్రారంభించారు. బిర్లాల కుటుంబానికి ఆదిపురుషుడైన షివ్ నారాయణ్ బిర్లా 1862లో "షో షోభారామ్ నారాయణ్" పేరుతో పచారి సామానులమ్మే షాప్ తో తమ వ్యాపారాన్ని ఆరంభించారు... మరి నేడు?!

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra