Home » Vasundhara » Vasundhara Kadhalu - 15

 

                            పవిత్రతకు పరీక్ష

                                                                      వసుంధర

    "ఆ అమ్మాయి చాలా బాగుంది కదూ" అన్నాను బీచ్ లో దూరంగా ఒంటరిగా కూర్చున్న ఓ పడుచు పిల్లను చూపించి.
    శర్మ నవ్వాడు. "అమ్మాయెం కర్మ -- ఇక్కడున్న పిల్లల్లో చాలామందే బాగున్నారు. అందువల్ల ఆ అమ్మాయి బాగుంది కదూ అన్న నీ వాక్యంలో సబబు లేదు. అ అమ్మాయి నీకు కావాలా -- అన్నది చెప్పు!"
    తడబడ్డాను. నాకు కట్టుబాటు లేని మనసైతే ఉందేమో కానీ, కట్లుబాట్ల మీద అపనమ్మకం మాత్రం లేదు. ఆడవాళ్ళ వంక కాంక్షతో చూడవచ్చు. అంత మాత్రాన చూసిన ప్రతి ఆడదాన్నీ పొందగలననే అవివేకం నాకు లేదు.
    శర్మ అలా అనగానే నేను "అందంగా ఉండన్నాను కానీ -- పొందలనుకుంటున్నా ననలేదుగా --" అన్నాను.
    "ఎక్కడో కొంతమంది తప్ప ఆడవాళ్ళ లో బాగుండని వాళ్ళెవరు? ఆడదంటేనే అందమని అర్ధం. ప్రతి ఆడదాని లోనూ ఏదో ఒక విలక్షణ సౌందర్యం ఉన్నదని నా సిద్దాంతం. అందువల్ల ఏదైనా ప్రత్యేకమైన కోరిక ఉంటె తప్ప. ఒక ఆడపిల్లను చూపించి అందంగా ఉన్నదని చెప్పడం అనవసరం"అన్నాడు శర్మ.
    'సరే -- నీ అర్ధమే రైటనుకుందాం. ఆపిల్ల నాకు కావాలి అని నేనన్నాననుకో -- ఇప్పుడెం జరిగింది?" అన్నాను కాస్త చిరాగ్గా.
    "నీ కోరిక బలమైనదై -- నువ్వు డబ్బుకు వెనుదీయని పక్షంలో -- ఆ పిల్ల నీ స్వంతం కావడానికి సుమారు వారం రోజుల వ్యవధి చాలు" అన్నాడు శర్మ ఒక్క విసురు గంబీరంగా.
    "పవిత్ర భారత దేశంలోని ఆడవాళ్ళ శీలాన్ని ఊహలో కూడా నీ అంత దారుణంగా కించ పరచలేడు. అస్తమానూ ఒకేలా కాక అప్పుడప్పుడు కొంచెం సీరియస్ గా ఉండడం నువ్వు నేర్చుకోవాలి శర్మా!" అన్నాను.
    శర్మ ముఖం నిజంగానే సీరియస్ గా మారింది. నేనెప్పుడు ఏది మాట్లాడినా సీరియస్ గా మాట్లాడుతా నన్న నిజం నీకింకా తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అవలబించవలసిన పద్దతులు సరిగా తెలుసుకోవాలి గానీ, ఈ లోకంలో ఆడదాన్ని లొంగదీసుకోవడం పెద్ద విశేషమేం కాదు. పవిత్ర భారతదేశంలోని ఆడవాళ్ళు ఒక ఎక్స్ ప్షనూ కాదు.నీకు తెలియనంత మాత్రాన ఇది నిజం కాదనుకోరు --"
    నాకు కోపం వచ్చింది. "ఊహలను నిజమనుకోవడం నేనింకా ప్రారంభించలేదు" అన్నాను.
    శర్మ నవ్వాడు. నువ్వు చంద్రమండలం చూడలేదు కానీ అక్కడ ప్రాణ కోటి ఉన్నదనీ, భయంకర జంతువులూ తిరుగాడుతుంటాయనీ నమ్ముతున్నావనుకో -- ఆవిషయం చంద్రమండలం వెళ్ళొచ్చిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ తో వాదిస్తున్నావనుకో -- జవాబుగా అతనేం చేయగలడు? ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకుంటాడు. ఇప్పుడు నేనూ అందుకే నవ్వుతున్నాను" అని శర్మ నవ్వసాగాడు.
    నేను ఉడుకు మోతునని చెప్పలేను కానీ ఆ క్షణంలో నా రక్తం ఉడికింది. శర్మ నవ్వు నా శరీరాన్ని కంపింప జేస్తోంది. ఈ ప్రపంచంలో తను కావాలనుకున్న ప్రతి స్త్రీని పొందగల ననుకుంటున్న శర్మ మాటలు నిజమెలా గౌతాయి? కానీ అతను తన్ను నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ తో పోల్చుకుంటున్నాడు. అంత ఖచ్చితమైన అనుభవం తనకున్నదీ గదా -- అతని మాటల కర్ధం!
    "చాలా నమ్మకంగా చెబుతున్నావ్ ? ఏమిటి విశేషం ఇందులో ఏదైనా కిటుకుంటే నాకూ చెప్పకూడదు" అన్నాను కుతూహలంగా.
    "నీకు హోటల్ మేనకా గురించి తెలుసా?" అన్నాడు శర్మ.
    "ఈ ఊళ్ళోకల్లా కాస్త ఖరీదయిన లాడ్జి. అంతే కదా అన్నాను. శర్మ చెప్పబోయే విషయం అంతే కాదని తెలిసుండి కూడా.
    "అది నీ బోంట్ల కు తెలిసిన సమాచారం. మా బోంట్ల వాళ్ళకు సంబంధించినంత వరకూ -- స్త్రీ సుఖం విషయంలో కల్పతర్వది " అన్నాడు శర్మ.
    "అంటే - నీక్కావలసిన ఏ ఆడదాన్న యినా సృష్టించి ఇస్తుందా?" అన్నాను.
    "కాదు సృష్టిలో ఉన్న ఏ ఆడదాన్నయినా నీకు స్వంతం చేయగలదు. నువ్వు చేయవలసినదల్లా సరైన వివరాలివ్వడమే----"
    ఒక్క క్షణం నివ్వెరపోయాను. శర్మ చెప్పేది నిజమా?.....
    "ఇలాంటి విషయాలు నమ్మడానికి కనీసం నామాత్రపు అనుభవం అవసరం -- ఇంతకూ నీకా అమ్మాయి కావాలా, చెప్పు?" అనడిగాడు శర్మ.
    శర్మకు తెలుసు -- నేను నలుగురూ మంచిదని పిలిచే దారిలోనే ఇంతవరకూ నడుస్తున్నానని . మనిషి పతనం స్త్రీ విషయంలో కట్టుబాట్లు పాటించక పోవడం వల్లనే ప్రారంభమవుతుందని నమ్మేవారిలో నేనొకడిననీ--]
    పరాయి స్త్రీ ని కాంక్షించడం -- మగాడికి -- ముఖ్యంగా వివాహితుడికి తగదని -- నా నరనరాల్లోనూ ఒక నమ్మక ముంది.
    శర్మ ఇప్పుడు నా నమ్మకాన్ని సవాలు చేస్తున్నాడు!
    ఆ అమ్మాయి వంక ఒక్క క్షణం పరీక్షించి చూశాను.
    నిజంగానే ఆ పిల్ల చాలా బాగుంది. వయస్సు పదహారు కూ ఇరవై కీ మధ్యలో ఉండవచ్చు. ముఖంలోని అమాయకత ఆమె అందానికి వన్నె తెచ్చింది. నేను కోరితే ఆమె నా స్వంతమయే అవకాశముందంటున్నాడు శర్మ!
    శర్మ సవాలుకు పై సవాల్ చేయాలనిపించింది. శర్మ మాటలు అబద్దం చేయాలనే పట్టుదల నాలో పెరిగింది.
    "నేను రెడీ శర్మ! ఆ అమ్మాయి అడ్రసు సంపాదిద్దాం" అన్నాను.
    శర్మ నా భుజం తట్టి "గుడ్!"అన్నాడు.
    మరో ఇరవై నిమిషాల కనుకుంటాను -- ఆమె లేచింది. మేము లేచాము. ఆమె నడిచింది. మేమూ నడిచాం -- ఆమె వెనుకనే. అయితే ఆ తర్వాత ఆమె ననుసరుంచ లేకపోయాం. కారణం --మాకులా బస్సు కోసం ఎదురు చూడడం లెదామే. ఆమె కోసం కారు డ్రైవర్ ఎదురు చూస్తున్నాడు. నేను నివ్వెర పోయాను. కానీ శర్మ కారు నంబరు నోట్ చేసుకున్నాడు.

                                     2
    మర్నాడు నేనాఫీసులో ఉండగా శర్మ దగ్గర్నించి ఫోన్ వచ్చింది. ఆ అమ్మాయి పేరు శాంతి  అనీ -- ఆమె బట్టల వ్యాపారస్థుడు గోవిందయ్య గారి రెండో కూతురనీ -- ఇంకా అవివిహిత అనీ వివరాలిచ్చి , గోవిందయ్య గారి చిరునామా ఇచ్చాడు నాకు. నన్నోకసారి వెళ్ళి ఈ వివరాలు సరైనవేనని రూడి చేసుకోమన్నాడు. అనంతరం తను మిగతా ఏర్పాట్లు చేస్తానని చెప్పాడు.
    సాయంత్రం అయిదున్నర ప్రాంతంలో నేను శర్మ ఇచ్చిన చిరునామా పట్టుకుని గోవిందయ్య గారింటికి వెళ్లాను.
    డాబా ఇల్లు. ఇంటి చుట్టూ కాస్త ఆవరణ వుంది. ఇల్లు మరీ అంత పెద్దదీ కాదు. చిన్నదీ కాదు.
    నేను కాలింగ్ బెల్ మ్రోగించగానే తలుపు తెరుచుకుంది. ఎవరో పనివాడులా ఉన్నాడు-- "ఎవరు కావాలి సార్?" అనడిగాడు.
    "ఎవరో ఒకరు -- ఇంట్లో వాళ్లతో మాట్లాడాలి అన్నాను.
    "అయితే చిన్నమ్మ గారిని పిలుస్తానుండండి "-- అంటూ వాడు నాకు కూర్చోడానికి సోఫా చూపించి -- లోపలకెళ్ళాడు.
    "కానీ నేను కూర్చోకుండా నిలబడే చుట్టూ చూస్తున్నాను. "నమస్కారం!" అన్న తియ్యని కంఠం వినిపించి ఆటే తిరిగాను.
    అదృష్టమంటే అదే -- బీచి వద్ద కనపాడ్డ అందమైన అమాయకపు ముఖపు టమ్మాయి--"నమస్కారం!' అన్నాను అప్రయత్నంగా చేతులు జోడించి.
    "కూర్చోండి" -- అందామె నేను కూర్చోగానే ఎదురుగా తనూ కూర్చుంది.
    నాకు మాటాలు రావడం లేదు. మర్యాదను కూడా మరిచి పోయి ఆమెను కళ్ళప్పగించి చూస్తున్నాను. అందులోనూ కావాలనుకుంటే ఆమె నా స్వంత మవుతుందేమో మరింత పరీక్షగా చూస్తున్నాను. నా చూపులు తప్పక ఆమెను ఇబ్బంది పెట్టి ఉంటాయి. "ఏవైనా పని మీద వచ్చారాండీ" అనడిగిందామె.
    "అవునండీ -- గోవిందయ్యగారితో పనుండి వచ్చాను-"
    'ఈ టైము లో నాన్నగారింట్లో ఉండరు. దుకాణానికి వెడితే..."
    ఆమెను వాక్యం పూర్తీ చేయనీకుండానే " నాన్న గారంటే గోవిందయ్యగారేనండీ?" అనడిగాను . ఆ సమాచారం నాకు చాలా అవసరం.
    'అవును -- మా దుకాణం ...." అని ఏదో చెప్పబోతుండగా------
    "నాకు దుకాణం తో పని ఏముంది లెండి! అయినా, గోవిందయ్య గారి షాపు ఎదుగని వాళ్ళెవరు? మీ ఇంట్లో ఏదైనా వాటా ఖాళీ ఉందేమో కనుక్కుందామని వచ్చాను-"అన్నాను.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra