Home » Kommuri venugopala rao » పెంకుటిల్లు


    వాసు ఈ బెదిరింపులకూ, అదిరింపులకూ జవాబిచ్చే స్థితిలో లేడు. ఆ పెన్కు కాస్తా జేబులో పెట్టుకొని బయటకు వచ్చాడు.

    ఎక్కడికి పోవాలి? ఏమి చేయాలి? ఇవే వాడ్ని వేధిస్తున్న ప్రశ్నలు? ఎన్ని గుండెలతో యింటికి వెళతాడు? అన్నయ్య డబ్బు చూసుకోకుండా వుంటాడా? ఈ వేళ చూసుకుంటే ఏం జరుగుతుంది? ఎవర్ని అనుమానిస్తాడు? అనుమానించి ఏం చేస్తాడు?

    వాడికి ఆలోచించటానికి కూడా భయం వేయసాగింది. తన ఇంట్లో వాళ్ళు ఎవరయినా వీధుల్లోకి వచ్చినా కనిపించకుండా వుండాలని. వాళ్ళెవరూ సాధారణంగా వచ్చే అలవాటు లేని కొత్త బజారువైపు పోయి అటూ యిటూ తిరగసాగాడు. వాడి వళ్ళూ, బట్టలూ చెమటతో తడిసిపోయి గలీజుగా కనిపిస్తూన్నాయి. పలుచని వాడి జుట్టు, వుత్తప్పుడే సరిగ్గా  దువ్వుకోని వాడి జుట్టు గాలికి కొబ్బరిపీచులాగా నలువైపులా పడింది. ఏమిటో ఆలోచనలు వాడి హృదయాన్ని కాల్చి వేస్తూంటే వాడు చీటికీ మాటికీ ఏడుస్తున్నాడు. పొంగి పొర్లివచ్చే దుఃఖాన్ని అరికట్టుకోలేకుండా వున్నాడు. జుట్టు పీక్కుంటున్నాడు. తిరిగిన బజార్లే తిరుగుతున్నాడు. ఏడ్చి ఏడ్చి వాడి కళ్ళు ఎర్రబడిపోసాగాడు. బాగా దాహం వేసింది. ఒకచోట ఆగి పంపుదగ్గర నీళ్ళు  తాగాడు.  కళ్ళు తిరగటం యింకా తగ్గలేదు. ఎవరూ లేని చోట ఆగి పంపుదగ్గర నీళ్ళు తాగాడు. కళ్ళు తిరగటం యింకా తగ్గలేదు. ఎవరూ లేని చోటు చూసుకుని ఒక ఇంటి అరుగుమీద ముడుచుకొని కూర్చున్నాడు.

    ఎండ బాగా తగ్గిపోయేవరకూ అలాగే కూర్చుని వున్నాడు. కాని ఏమీ చేయకుండా అలా కూర్చుని వుండటం చాలా కష్టమైన విషయంలాగా వుంది. అయినా యిక్కడ చేయగలిగింది కూడా వాడికేమీ కనిపించలేదు. ఇల్లు అనేది ఒక విచిత్రమైన ఆకర్షణ. ఎంత ఇష్టం లేకపోయినా, ఎంత భయపడినా దాన్ని విడిచిపెట్టి వుండటం సాధారణంగా సాధ్యమైన విషయం కాదు. ఇల్లు విడిచి వుండవలసినంతటి బలీయమైన కారణం, అంతటి నిబ్బరం వాడికి లేవు. మెల్లగా లేచి ఇంటిదారి పట్టాడు.

    ఆకస్మికంగా ఆకాశం అంతా మేఘావృతం కావటంవల్ల చీకటిగా లేకపోయినా మసకగా వుంది. తడబడుతూ నడుస్తూ వాసు యింటికి చేరాడు. మిగతా ఎవరు యేం చేస్తోందీ వాడు గమనించే స్థితిలో లేడు. అన్నయ్య ఏం చేస్తున్నాడో చూడాలి. సాధ్యమైనంతవరకూ యెవరికీ కనిపించకుండా వుండాలని ప్రయత్నిస్తూ ఆ గది దగ్గరకు చేరి కిటికీలోంచి లోపలకు చూచాడు. అన్నయ్య: అవును. పెద్దన్నాయి. ఏం చేస్తున్నాడు? ఎందుకంత కంగారుగా, విసుగుగా కనిపిస్తున్నాడు? ఒక ప్రక్కకు వొదిగి చాటుగా డ్రాయరు వైపు చూశాడు. సొరుగంతా చెల్లాచెదురుగా వుంది. చూచేవుంటాడు. వేగంగా కొట్టుకుంటున్న గుండెతో యేం జరుగుతుందోనని అక్కడే నిల్చుని చూస్తున్నాడు.

    అక్కగారు యింతలో ప్రవేశించేసరికి "చూడమ్మాయి, ఎప్పుడూ లేనిది యివాళ ఓ చిత్రం జరిగింది" అన్నాడు అన్నయ్య. ఆమె వంక అమాయకంగా చూస్తూ.

    "ఏమిటన్నాయ్?"

    "నా డ్రాయర్ సొరుగులో పెట్టుకున్న డబ్బులు మాయమైనాయి ఎట్లా పోయినాయో ఆశ్చర్యంగా వుంది."

    రాధ కూడా విస్మయ పూర్వకంగా "బాగా చూశావా అన్నాయ్?" అని అడిగింది.

    "ఆఁ ఒకసారా? రెండుసార్లా? అంతా గాలించాను."

    "ఏమయి వుంటుందంటావు?"

    రెండుమూడు నిమిషాలు అలా తర్జన భర్జనలు పడ్డాక చివరికి వాసు అనుకున్నంతా అయింది. మొదటగా నారాయణ అనలేదు. రాధే అంది.

    "వాసు ఇలాంటి పనులు చేయడు. కాని యిప్పుడు గుర్తుకు వస్తుంది. పొద్దున్న నన్ను పావలా అడిగాడు. వాడేమైనా ---"

    ఇంకా ఏదో చెబుతోంది. కాని వాసు అంతవరకే వినగాలిగాడు. వాడి హృదయం భోరున యేడిచింది. ఇంతకాలంగా తెచ్చుకున్న మర్యాద, గౌరవం అన్నీ భస్మీభూతం అయినట్టయింది. ఈయింట్లో ఇక తల ఎత్తుకుని తిరగటం యెట్లా? పారిపోవాలి ఇక్కడనుంచి..... ఇహ పారిపోవాలి.

    వాడికి ఇంక వళ్ళు తెలియలేదు. కళ్ళు చీకట్లు క్రమ్మసాగాయి. అలాగే బయటకు వచ్చి రోడ్డుమీద ఇష్టం వచ్చినట్లు పరుగెత్తసాగాడు, ఒక దారీ తెన్నూ లేదు. పాములా మెలికలు తిరిగిపోయాడు. చిరుతలా లంఘించాడు. ఆయాసం వచ్చింది. అయినా పరుగెత్తటం మానలేదు. కళ్ళు మసగ్గా కనిపించసాగాయి. అప్పుడప్పుడూ యెదురుగా వస్తున్న మనుష్యులను ఢీ కొడుతున్నాడు. కళ్ళకు యెన్నో దెబ్బలు తగిలాయి. బళ్ళూ, కారులూ ప్రక్కలనించి రివ్వుమని వెళ్ళిపోతున్నాయి. ఇంకా పరుగెత్తుతున్నాడు. ప్రక్క సందులోంచి జయ్యిమని టర్నింగు తిరిగిన కారును వీడు చూచుకోలేదు. చివరిక్షణంలోనే తెలివి తెచ్చుకొన్న వాసు కెవ్వుమని అరచి వెంటనే తెలివిని కోల్పోయాడు.


                                                      11

    హాల్లో లోపల ద్వారం ఇవతలగా కొంచెం ఒదిగి నిలబడి లోపల ఏదోపనిలో ఉన్న శకుంతలతో "ఒకసారి ఇలా వస్తారా?" అన్నాడు ప్రకాశరావు.

    "ఎందుకు?" లోపల్నుంచే అంది.

    "ఒకసారి బయటకు రాకూడదా?"

    శకుంతల అలాగే బయటకు వచ్చి తన విశాల నయనాలతో అతని వంక చూసి, చిన్నగా నవ్వుతూ "చెప్పండిబాబూ!" అంది.

    "మీకంత విసుగ్గా వుంటే చెప్పనులెండి."

    "విసుగూలేదు, ఏమీలేదు. పనీ గినీ లేకుండా ఊరికినే ఇంట్లో కూర్చునేదానికి విసుగేమిటి?" అంది.

    "మీకంత విసుగ్గా వుంటే చెప్పనులెండి."

    "విసుగూలేదు, ఏమీలేదు. పనీ గినీ లేకుండా ఊరికినే ఇంట్లో కూర్చునేదానికి విసుగేమిటి?" అంది.

    ప్రకాశరావు బిక్కమొహం వేసి తల గోక్కుంటూ "అంతా నా ఖర్మ. ఇంతకీ నే చెబుదామని వచ్చిందేదో మరిచిపోయాను." అన్నాడు.

    శకుంతల విరగబడి నవ్వుతూ "ఇంత మతిమరుపు వున్నవారు లా చదువున్నారు. లా అంటే తల బద్దలయేటంతటి విషయాలని అవగాహనా చేసుకోవాలని మీరే చెప్పారు. అవన్నీ ఎలా గుర్తుంచుకుంటున్నారరబ్బా" అంది చూపుడు వేలు బుగ్గలమీద ఆనించి, ఆమె ముఖంలో కొంటెతనం ఆశ్చర్యం ఇత్యాది భావాలన్నీ వెల్లివిరిసి మాయం అయిపోయాయి.

    ప్రకాశరావు ఈసారి కొంచెం చనువు తీసుకుంటూ "నే చెబుతున్నాగా- ఇన్నాళ్ళు నేను చదువుకుని, అనుభవం సంపాయించి తెలుసుకున్న విషయం ఏమిటంటే లా చదవటంకంటే ఆడవాళ్ళతో మాట్లాడటం కష్టం అని."

    "అయితే లా  చదవటం ఇంత తేలికని నేననుకోలేదు- ఉన్న వూరు విడిచి యీ వూళ్ళో అష్టకష్టాలూపడి చదువుకొనేది ఇంత తేలికైనదన్నమాటా?"

    "ఊఁ అయితే."

    ప్రకాశరావు యిలా ఒప్పుకోవటం చూస్తే శకుంతలకు ఇంకా నవ్వు వచ్చింది. "భలేవారే, మీరింకా ఏమిటో ఖండిస్తారనుకొన్నాను" అంది.

    "మొదటనే చెప్పాను, మీ ఆడవాళ్ళ మాటల్ని ఖండించేటంతటి శక్తి సామర్థ్యాలు నాకు లేవని."

    "అయితే ఆ విషయం గురించి మాట్లాడటం ఆపి మీరు వచ్చిన పనేమిటో చెప్పండి."

    ప్రకాశరావు ఇబ్బందిగా "ఆ విషయం నాకు గుర్తు ఉంటే ఇంత సంభాషణ జరపవలసిన అవసరం ఏముంది? సరేలెండి. సాయంత్రంలోగా గుర్తు తెచ్చుకొని చెబుతాను" అని వెళ్ళిపోదామని చేతిలో పుస్తకాలు పట్టుకొని, వెనక్కి తిరిగి రెండు మూడడుగులు వేశాడు. ఇంతలో హఠాత్తుగా ఏదో స్ఫురించగా "ఉండండి. గుర్తుకువచ్చింది." అని గబుక్కున వెనక్కి తిరిగి జేబులోంచి మూడు అయిదురూపాయల కాగితాలు బయటకు తీశాడు. "మీ అద్దె పూర్తిగా ఇవ్వటల్లేదనుకోండి, ఈ పదిహేనూ జమకట్టుకోండి."

    శకుంతల కొంచెంసేపు స్థబ్దురాలై నిలబడి, తర్వాత అతనివంక చిరాగ్గా చూస్తూ "బాగా ఆలోచించుకునే ఇస్తున్నారా?" అంది.

    అతను ఆశ్చర్యంగా "అదేమిటి?" నేను రూమ్ లో వుంటూ అద్దె చెల్లించటంలో అంత బాగా ఆలోచించవలసింది ఏముంది?" అన్నాడు.

    "కాని మిమ్మల్ని అద్దె ఇవ్వమని యెవరూ ఒత్తిడి చేయలేదే!"

    "ఇది మరీ బాగుంది. మీరు వత్తిడి చేసేదాకా ఇవ్వకుండా వూరుకోవటం మర్యాదా ఏమిటి?"

    శకుంతల తలుపుకు ఆనుకుని అతనివైపు చూడకుండానే "మీరు అనవసరంగా వాదన పెంచటం నా అభిమతం కాదు. చూడండి, మీరెలా అనుకొంటే అలానే చేయవచ్చు. డబ్బు చేదా యేమిటి?" నిక్షేపంగా అద్దె తీసుకుంటాం. ఇలా వాయిదాల పద్ధతిలో చెల్లించటమే నాకు నచ్చలేదు. అంతా ఒకేసారి ఇచ్చేస్తే చాలా బాగుంటుంది" అని చీరచెంగు ముఖంమీదకు లాక్కుంది. అతన్ని చూడకుండా వుండటంకూడా ఆమె అభిలాష కావచ్చు.

    ఆ మాటలు ఆమె ఏ అభిప్రాయంలో అన్నదో ప్రకాశరావుకి బోధపడలేదు. ఈ అమ్మాయిని అర్థం చేసుకోవటంలో ఈ పరాయి వూరు అబ్బాయి ఇలాగే చాలాసార్లు పొరపాటు చేశాడు. ఈ మాటలు గంభీరంగా అందో, లేక నవ్వుతాలకి అందో కూడా అతనికి తెలియదు. అందుచేత ప్రాణాలొగ్గ పట్టుకొని "చూడండి శకుంతలగారూ, మీ ముందు రహస్యం దాచవలసిన అవసరం లేదు. నేనేమీ డబ్బు వున్నవాడిని కాదు. చదువుకోసం ఈ వూరు వచ్చాను. మీకు బాకీ  వున్నదంతా ఒక్కసారిగా ఇవ్వడానికి నాకు యెలాగూ శక్తిసామర్థ్యాలు చాలవు. ఉన్నప్పుడైనా ఇలా అప్పుడప్పుడు ఇవ్వకుండా నా  దగ్గిరే వుంచుకుంటే నా అవసరాలకే ఆహుతయి వూరుకుంటుంది. నే నిప్పుడే మీకు చాలా బుణపడి ఉన్నాననే విషయం ఎప్పుడు గుర్తుకువచ్చినా సిగ్గుతో చచ్చిపోతున్నాను. తీసుకోండి" అన్నాడు.

    శకుంతల ఇంకా అతనివైపు చూడకుండానే, కొంచెం ఆగి "అయితే ఆ బల్ల మీద పెట్టి వెళ్ళండి" అంది. ప్రకాశరావు ఆమె ఆజ్ఞను పాటిస్తూ అలానే పెట్టి వెళ్ళిపోయాడు. గుమ్మం వరకూ వెళ్ళాక యెందుకో అతన్ని శకుంతల మళ్ళీ పిలిచింది.

    "పిలిచారా?"

    "అవును. మీ గది తాళంచెవి ఇచ్చి వెడతారా?"

    ఏమనుకున్నాడో ఏమిటో "ఎందుకూ?" అని ప్రశ్నించకుండానే ఆమె కోరిన వస్తువు జేబులోంచి తీసిపెట్టి వీధిలోకి వెళ్ళిపోయాడు. కొన్ని క్షణాలవరకూ శకుంతల అలా శూన్యంలోకి చూస్తూ నిలబడింది. ఆమెకు తెలియకుండానే ఆమె నేత్రాలనుంచి కన్నీళ్ళు స్రవించాయి. పమిటచెంగుతో వాటిని తుడుచుకొని, ఒక క్షణంసేపు తటస్థంగా నిలబడిపోయి తర్వాత తాళంచెవి తీసుకొని ప్రకాశరావు గది తలుపులు తెరిచి లోపలకు ప్రవేశించింది. ఉదయమే వచ్చి పనిమనిషి ఆ గదికూడా వూడ్చి పోవటంవల్ల శుభ్రంగా ఉంది. ఒక ప్రక్కగోడ వారగా చాప పరచివుంది. ప్రయివేటు కుర్రవాళ్ళు దానిమీదే కూర్చుని, చదువు నేర్చుకొనిపోతారు. ఉన్నకొద్ది పుస్తకాలూ తలుపులు మూసివున్న కిటికీలోనే క్రింద భాగంలో ఒక వరుసలో అమర్చివున్నాయి. తలుపులు వేసివున్నా వాన వచ్చినప్పుడు జల్లు సందులగుండా వచ్చి పుస్తకాల మీద పడుతుంది. అందుకనీ ఎప్పుడయినా వర్షం వచ్చిన రోజున ప్రకాశరావు ఆ పుస్తకాలు స్థలం మార్చి సర్దుకోవటంలొ పడే అవస్థ ఆమె ఎరిగే వుంది. ఒకటి రెండుసార్లు సహాయపడింది కూడా. ఒకే ఒక కుర్చీ ఆ కిటకీ ఎదురుగా వేసి వుంది. ఆ క్షణంలొ శకుంతలకు తన ఇంటిలోని ప్రతిగదీ, ప్రతి అలంకరణా గుర్తుకువచ్చింది. ఆ మొత్తం  గృహానికీ, ఈ గదికీ ఎంతో భేదం ఉంది. ఎన్ని విషయాల్లోనో వ్యత్యాసం ఉంది. ఇది ఓ ఆశ్రమంలా వుంది. గదిలో ఒకమూల గోడకి వివేకానందుడి పటం వ్రేలాడుతోంది. పేదరికంలొ నిర్మలత్వం ఉందన్న విషయం ఆమె కళ్ళకిప్పుడు స్పష్టంగా గోచరించింది. ఆ గదిలో ఇంకా యేమేమి ఉన్నాయో పరికించింది. ఇంతవరకూ చూడక కాదు - అందులో ప్రవేశించకా కాదు. ఇవాళ అందులో ఉన్న సాధన సంపత్తి అంతరంగిక స్వరూపం క్షుణ్నంగా పరిశీలించాలనుకొంది. కిటికీ ప్రక్కగా గోడకి బట్టలు తగిలించుకొనే కొంకె కట్టబడి ఉంది. ఒక పైజామా, లాల్చీ దానికి వేళాడుతున్నాయి ఆ పైజామా చాలా శిధిలావస్థలో ఉంది. ఒక పైజామా, లాల్చీకూడా ఇంచుమించు అంతే. ఇంట్లో ఉన్నప్పుడూ, యెప్పుడూ ప్రకాశరావు అవే ధరిస్తూ ఉంటాడు. ఒకమూల పెద్ద ట్రంకుపెట్టె తప్ప వేరే  సామాగ్రి ఇంకేమీ లేదు. ఆ పెట్టె తాళం కూడా వేసిలేదు. ఎందుకో శకుంతలకు అది తెరవాలనిపించింది. ఆ పని చేయకూడదేమోనన్న సంశయం ఆమెను కొద్దిగా పీడించకపోలేదు. కాని ఆ వ్యక్తిమీద ఇన్నాళ్ళుగా సంపాదించిన అధికారం సేకరించిన చనువువల్ల ఆమె ఎక్కువగా సంశయచిత్తురాలు కాలేకపోయింది. మోకాళ్ళమీద నేలమీద కూర్చుని, కొద్దిగా వంగి, వణుకుతున్న చేతులతో మూత తెరిచింది. రెండు మూడు జతల లాగులూ, చొక్కాలూ అందులో వున్నాయి. అందులో ఒకజత ఆమె దృష్టిని ఆకర్షించింది. ఏదన్నా కాలేజీలో ఫంక్షన్ ఉన్నప్పుడు, యెక్కడికైనా ముఖ్యమైన పనిమీద వెళ్ళవల్సి వచ్చినపుడూ అతను వేసుకొనే దుస్తులవి. నాన్నగారు రోజూ ఆఫీసుకు పోయేటప్పుడు మామూలుగా వేసుకొనే దుస్తులతో వాటిని పోల్చుకొనేసరికి ఆమె హృదయం ద్రవించింది. ఇంకా ఏదో దినకృత్యాలకి పనికివచ్చే వస్తువులూ కాగితాలూ అటువంటివి అందులో ఉన్నాయి. ఒకమూల రెండు మూడు రూపాయి కాగితాలు కనిపించాయి. అంతే అతని వస్తువులు, వీటితో అతను నెలంతా యెలా గడుపుతాడో అర్థం కాలేదామెకు. పెట్టెమూత వేస్తూండగా ఒకమూల సూదీ, దారం కనిపించాయి. ఆ దృశ్యం చూసి భరించలేని బాధతో మూత చప్పున వదిలేసింది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra