Home » Vasireddy seeta devi novels » నిశాగీతం


    "అమెరికాలోకూడా సౌత్ ఇండియన్ హొటళ్ళున్నాయ్యనివిన్నానే?" శివరామయ్య కల్పించుకొని అడిగాడు.
    "ఇడ్లీ సామ్బారూ వడా...దోశా దొరుకుతాయి. కాని మనతెలుగు వాళ్ళ పెసరట్టు దొరకదు."
    "మీరు మొత్తం ఎన్నేళ్ళున్నారక్కడ?"
    "దాదాపు ఇరవై ఏళ్ళున్నాను. నా నాలుగో ఏట మా అమ్మగారు నన్ను స్టేట్సుకు తీసుకెళ్ళారు."
    "ఏమిటి డాడీ? డాక్టర్ గార్ని ముందు తిననివ్వండి. పెసరట్టు ఆరిపోతే బాగుండదు." మానసి గుణిసినట్టుగా అన్నది.
    ఫ్లాస్కులో వున్న కాఫీ మూడు కప్పుల్లోకి వంచి ఒకకప్పు ఉదయ్  ముందు పెట్టింది మానసి.
    కాఫీ గుటకవేసిన ఉదయ్ చంద్రకు పొలమారినట్టయింది. ఎదురుగా వచ్చి నిలబడి  వ్యక్తిని చూసి.
    "వీడు మా బుచ్చి. మా అన్నగారి కొడుకు. ఏడాది వయసున్నప్పట్నుంచీ  మా దగ్గిరే పెరిగాడు." శివరామయ్య పరిచయం చేశాడు బుచ్చయ్యను.
    బుచ్చయ్యది భారీవిగ్రహం. ఎత్తుగా లావుగావున్నాడు. మొరటుగా వున్నాడు. వయసుకుమించి ఎదిగిన శరీరం. బండ పెదవులు. బయటికి ఉబికివచ్చినట్టుండే కనుగుడ్లు తేలిపోతున్న చూపులు. అంటకత్తిరించిన జుట్టు. పోడుగాటి బాహువులు. లావుపాటి వేళ్ళు వెడల్పాటి పొడవైన చప్పిడి  పాదాలు బుచ్చయ్యను చూస్తూ వేడివేడి కాఫీని మూడు గుక్కల్లో తాగేశాడు ఉదయ్ చంద్ర.
    తనవంక తదేకంగా వింతగా ఆశ్చర్యంగా చూస్తున్న బుచ్చయ్యను చూసిన ఉదయ్ కు కడుపులో దేవినట్టుగా అయింది.
    ఉన్నట్టుండి హఠాత్తుగా "నమస్కారం నమస్కారం" రెండు  చేతులూ దగ్గరకుచేర్చి అన్నాడు బుచ్చయ్య.
    "నమస్కారం"
    తమాషాగా నవ్వాడు బుచ్చయ్య.
    అతడు నవ్వుతుంటే ఎడం చెవులో పెట్టుకున్న గన్నేరుపువ్వు వెనక్కూ ముందుకూ కదిలింది.
    "బుచ్చీ! నువ్వెళ్ళి తోటలో గులాబీ పువ్వులున్నాయి. కోసుకురా" బుచ్చయ్యను అక్కడ్నుంచి పంపించాలన్న ఉద్దేశ్యంతోనే మానసి అన్నట్టుగా తోచింది ఉదయ్ కు.
    "నువ్వెవరు చెప్పడానికి? నువ్వు చెప్తే చేస్తావా ఏం?" మాట  మొరటుగా వుంది. వాలకం మొండిగా వుంది.
    "ఒరే బుచ్చీ ముందు నువ్విక్కడ్నుంచి కదులు" శివరామయ్య కళ్ళెర్రజేశాడు.
    బెదిరిన గొడ్డులా పేలవంగా చూసి, బుచ్చయ్య పెద్దపెద్ద అంగలు వేసుకొంటూ వెళ్ళిపోయాడు.
    "వాడొట్టి వెర్రోడు డాక్టర్ గారూ!"
    "వేరే చెప్పడం ఎందుకూ? చూస్తే తెలియడంలా? డాక్టర్ గారికి ప్రత్యేకంగా చెప్పాలా?" మానసి పెదవి విరిచి ముద్దు ముద్దుగా అన్నది.
    "నిన్న రాత్రి ఈ బుచ్చయ్య ఎక్కడున్నాడూ? మనం వచ్చాక కన్పించలేదే?"
    "సర్కస్ చూట్టానికి వెళ్లాడు." శివరామయ్య చెప్పాడు.
    "సర్కసా!"
    "అవును డాక్టర్ గారూ! ఇక్కడికి ఏడుకిలోమీటర్ల దూరంలో, హనుమాన్ పాలెంలో సర్కస్ ఆడుతోంది. చూట్టానికి వెళ్ళాడు."
    "ఎప్పుడు తిరిగొచ్చాడూ?"
    "బాగా తెల్లవారినాకే తిరిగొచ్చాడు. ఆరూ ఆరున్నరకు వచ్చ్చాడు. వట్టి అమాయకుడు. అభం శుభం తెలియదు వాడికిప్పుడు ఇరవైయొకటో ఏడు నడుస్తోంది. కాని పన్నెండేళ్ళ కుర్రాడికంటే అన్యాయం. మా అన్నయ్యా వదినా ఇరవైఏళ్ళ క్రితం రైలు యాక్సిడెంటులో చచ్చిపోయారు. అప్పట్నుంచీ వీడు నా దగ్గిరే పెరిగాడు. మానసి వాడికంటే  రెండేళ్ళు పెద్ద. ఏమాటకా మాటే చెప్పాలి. నా భార్య వాడిని మానసికంటే ప్రేమగా పెంచింది ఆవిడ బ్రతికున్నంతకాలం, వీడు ఆవిడ మాటతప్ప మరెవరి మాటా వినేవాడుకాడు. చూశారుగా మానసిని ఎలా ఎదిరించి మాట్లాడుతున్నాడో?"
    "రైలు ప్రమాదం జరిగినప్పుడు ఈ కుర్రాడుకూడా వాళ్ళతో వున్నాడా?"
    శివరామయ్య ఒక్క క్షణం ఆగి "లేదు. అప్పుడూ...." దీర్ఘం తీస్తూ మళ్ళీ ఆగిపోయాడు.
    "డాడీ. మర్చిపోయినట్టున్నారు మీరు. వాడు అప్పుడు పెదనాన్నా పెద్దమ్మలతోనే వున్నాడని అమ్మ నాకు చెప్పింది. రైలుపట్టాల పక్కన ఏడుస్తూవున్న బుచ్చిని...."
    "అవునవును గుర్తొచ్చిందమ్మా. మీ అమ్మ చెప్పింది. నేనప్పుడు  బొంబాయిలో వున్నాను. తిరిగొచ్చేసరికే మా అన్నావదినల అంత్య క్ర్యాలు కూడా జరిగిపోయాయి." 
    "బొంబాయెందుకెళ్లారు?"
    "అదో పెద్ద  కథ డాక్టర్ గారూ. మా అన్నయ్య పనిమీదేవెళ్ళాను. ఆయన పత్తివ్యాపారం  చేసేవాడు."
    "డాడీ. మళ్ళీ  డాక్టర్ గారికి బోరుకొడుతున్నారు. అలా తోటలోకి వెళ్దాంరండి. గులాబీలు చూద్దురుగాని. మా డాడీ దగ్గర కూర్చుంటే ఇలా చెప్పుకుపోతూనే వుంటారు." మానసి లేని నిలబడింది.
    మానసిని అనుసరించాడు ఉదయచంద్ర.
    "చూశారా ఈ తెల్ల  గులాబి ఎంత అందంగా వుందో? పువ్వుని తెంచి సుతారంగా తిప్పుతూ అన్నది.
    "మానసీ...నీకు తెల్లగులాబీలంటే ఇష్టమా?"
    "అవును. మీకో?"
    "ఎర్రగులాబీలు."
    "నిజంగానా?" బెదురుగా చూసింది.
    "ఆఁ ఏం? నీకు...."
    "ఇష్టంలేదు. అదంటే  నాకు భయం."
    "భయమా?" ఆమె ముఖంలో వచ్చిన మార్పును పరీక్షగా చూశాడు.
    "ఎరుపు రంగంటేనే భయమా?"
    "ఉహుఁ ఎరుపురంగంటే భయంలేదు. ఎర్రగులాబీలంటేనే భయం."
    "ఎండుకనో చెప్పగలవా?"
    "ఎందుకో ఏమో మరి."
    "బుచ్చి అంటే నీకు ఇష్టమేనా?"
    హఠాత్తుగా ఎదురైన ఆ ప్రశ్నకు మానసి విస్తుపోయి చూసింది.
    "ఇష్టమేనా?"
    "లేదు."

    "బుచ్చి నీకు ఎర్ర గులాబీ పువ్వులు కోసితెచ్చి ఇస్తుంటాడా?"

    "అవును డాక్టర్. కర్టెక్. వాడెప్పుడూ ఎర్రగులాబీలు తెచ్చి ఇచ్చేవాడు. వద్దన్నా  ఆ పనే చేసేవాడు. ఎర్ర గులాబీ మొక్కలు పీకేయించాను. చూడండి. ఒక్క మొక్కకూడా లేదు." తోటంతా కలియజూస్తూ ఆగిపోయింది హఠాత్తుగా.
    "డాక్టర్ ! వాడు...ఆ బుచ్చిగాడు....అక్కడ, అక్కడ" మానసి కంఠం కంపించింది.
    దూరంగా, తెల్లగులాబీలమధ్య ఒక ఎర్రగులాబి మొక్క....ఆ ముక్కకు ఒకే ఒక పువ్వు....విచ్చిన ఎర్ర గులాబి. తేలిమబ్బుల ఆకాశంలో అస్తమిస్తోన్న సూర్య బింబంలా, ఎర్రగా, రక్తం చిందిస్తోందా అన్నట్టుగా కన్పించింది.
    ఉదయ్ గులాబీతోట చాళ్ళలో, మొక్కల కొమ్మలకున్న ముళ్ళు తప్పించుకొంటూ, ఎర్రగులాబిమొక్క దగ్గరకు వెళ్ళాడు.
    "ఆ మొక్కను పీకేయండి డాక్టర్ గారూ?" దూరంనుంచి మానసి కేకపెట్టింది.
    ముల్లు తప్పించి, మెల్లగా  అరచేతి  వెడల్పున్న గులాబిని  కోసుకొని మానసి కేసి నడవసాగాడు.
    అది చూసి మానసి  గులాబితోటలోనుంచి బయటికి పరుగుతీసింది. తోట గట్టుమీద నుంచి, కొబ్బర్తితోటలోకి పరిగెత్తుతున్నమానసివెంట పరిగెత్తసాగాడు ఉదయ్.
    "మానసీ! ఆగు! ఆగు!"
    "ఆ గులాబీ పారేయండి" వెనక్కు తిరిగిచూడకుండా ఉద్రేకంగా అరిచింది.
    "ఎప్పుడో పారేశాను. ఇలా చూడు?"
    మానసి ఆగింది. అనుమానంగానే తిరిగిచూసింది.
    "లేదు లేదు....పారేయలేదు. వెనకచేతిలో వుండి." ఉద్వేగంగా అన్నది.
    "అది ఎర్రగులాబీకాదు. నీకిష్టమైన తెల్ల గులాబి....తెల్లగులాబి."
    "వద్దు. వద్దు."
    "నిజం నా చేతిలో వున్నది తల్లగులాబీయే." అప్పటికే మానసి దగ్గరకు వచ్చేశాడు.
    "కాదు. కాదు." మళ్ళీ  పరుగుతియ్యబోయిన మానసి చేతిని ఒక్క ఉదుటున పట్టుకొన్నాడు.
    "నువ్విప్పుడు చూడబోతున్నది తెల్లగులాబీనే. తెల్లగులాబి.... తెల్లగులాబి"......గంభీర స్వరంలో చెబుతూ చెయ్యి ముందుకు చాచి గులాబిని అందుకొన్నది.
    "తెల్ల గులాబీలంటే నీకు చాలా ఇష్టంకదూ?"
    "అవును చాలా ఇష్టం" అంటూ ఒక్కసారిగా బిగ్గరగా అరచివస్తున్న బుచ్చయ్యను చూసి ఆశ్చర్యపోయాడు డాక్టర్.
    "ఆగక్కడ?"
    ఉదయ్ కంఠంలో కాఠిన్యానికి బుచ్చయ్య బెదిరిపోయాడు.
    కాళ్ళు భూమీలోకి దిగిపోయినట్టు ఉన్న చోటులోనే నిలబడిపోయాడు.
    "వెళ్ళు....ఇక్కడ్నుంచి వెళ్ళిపో" ఉదయ్ ఆజ్ఞాపించాడు.
    "అక్కయ్యకు గులాబిపువ్వు ఇద్దామని....."
    "అవసరంలేదు. పో_____వెళ్ళు."
    బుచ్చయ్య గులాబిపువ్వు చెవులో పెట్టుకొని పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు.
    మానసి నిట్టూర్చింది.
    "మానసీ! అందుకంత బంగారుపడ్తావ్? అన్ని గులాబీలు ఒక్కటే. రంగులతేడా. అంతే. నీకు ఎరుపు రంగంటేకూడా చాలా ఇష్టమే. కాని ఎర్రగులాబి అంటేనే ఇష్టంలేదు. కారణం తెలుసా?" ఆగి ఆమె కళ్ళల్లోకి చూశాడు.
    మానసి తల అడ్డంగా తిప్పింది.
    "నీ కిష్టంలేని బుచ్చయ్య ఇస్తున్నాడు కనుక అదంటే నీకిష్టం లేదు. బుచ్చయ్యంటే నీకు అసహ్యం. భయం. ఆ విషయాన్ని నువ్వు బయటికి చెప్పుకోలేకపోతున్నావు, బాహ్యవ్యక్తీకరణకు అంతరాయం కలిగినప్పుడు, ఆ భావాలు అంతరంగంలో చోటుచేసుకొని వుండిపోతాయి. ఆ భావాలు మరో రూపంలో బయటపడ్తాయి. బుచ్చయ్య నీ కిష్టంలేని ఎర్రగులాబీలను నీకు ఇస్తున్నాడు. కనక అతడంటే నీ కిష్టంలేని ఎర్రగులాబీలను నీకు ఇస్తున్నాడు. కనక అతడంటే  నీ కిష్టంలేదని భావిస్తున్నావు. అది సరికాదు, నువ్వు ద్వేషించేది....ఎర్రగులాబిని కాదు. బుచ్చయ్యనే. అవునా మానసీ?" మానసి కళ్ళల్లోకి సూటిగా చూశాడు.

    "బుచ్చిబాబు నా తమ్ముడు. మా పెద్దనాన్న కొడుకు. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. అమాయకుడు. వెర్రిబాగులవాడు. వాడ్ని నే నెందుకు ద్వేషిస్తాను డాక్టర్? వాడు నా తమ్ముడు" మానసి కళ్ళలో నీరు తిరిగింది.
    "అవును  నువన్నది అక్షరాలా నిజం. నీ తమ్ముడ్ని నువ్వు ద్వేషించడం అసహ్యం. కాని ద్వేషిస్తున్నావు."
    "లేదు లేదు డాక్టర్ . నేను వాణ్ణి ద్వేషించడంలేదు. అకారణంగా నా తమ్ముడ్ని నేనెందుకు అసహ్యించు
    డాక్టరు ఉదయచంద్ర ఆలోచనలోపడ్డాడు.
    "అథోచేతనావస్థలో దాగివున్న భావాలను వెలికితీయడం అంత తేలికపనికాదు. అలా చెయ్యగలిగితే నూటికి తొంభైమంది మానసిక వ్యాదులనుంచి బయటపడి వుండేవారు. సైకియాట్రిస్టు ప్రముఖంగా ఎదుర్కొనే మొదటి  బటిలమైన సమస్యఇదే.
    "అదుగో చూడండి డాక్టర్ గారూ? మా బుచ్చిబాబు ఇటే వస్తున్నాడు." ఈసారి ఆమె కంఠంలో ఉద్వేగంలేదు. ద్వేషంలేదు.
    "బుచ్చీ రారా!" ఆమె  అప్యాయంగా పిలిచింది. ఆమెలో వచ్చిన ఈ మార్పుకు ఆశ్చర్యంలో తలమునకలౌతు ఉదయ్ వెనక్కుతిరిగాడు.
    బుచ్చిబాబు సంతోషంగా గంతులేస్తూ పరుగెత్తుకొస్తున్నాడు డాక్టర్.
    దగ్గరౌతున్న బుచ్చిబాబును పరిశీలనగా చూశాడు.
    వాడి ఎడమచెవిలో తెల్లగులాబి, కుడిచేతిలో తెల్లగులాబీలు.
    "ఒరే బుచ్చీ డాక్టర్ గారికి కూడా ఒక గులాబి ఇవ్వరా మంచిది చూసి....."మానసి మాట పూర్తికాలేదు.
    "ఎర్రదా?" నోరెళ్ళబెట్టాడు. బండగా. మొద్దుగా, ఎర్రగా వుంది నాలుక.
    "బుచ్చీ? నువ్వు మళ్ళీ....."మానసి కంఠంవాణికింది.
    బుచ్చి గరగరా నవ్వాడు.
    విరగబడి నవ్వాడు.
    ఒరగబడి నవ్వాడు.
    "తమ్ముడూ? ఏమిటానవ్వు? ఆపు."
    "మీ అక్క! బలే బలే అక్క!" చప్పట్లుకొడ్తూ ఇంకా  బిగ్గరగా నవ్వసాగాడు.
    ఆ నవ్వు వికృతంగా వుంది.
    భయంకరంగా వుంది.
    మెలికలు తిరిగిపోతూ నవ్వుతున్న బుచ్చిబాబు హఠాట్టుగా ఆగిపోయాడు.
    నెత్తిమీద ఠపీమని దెబ్బపడింది.
    "వెర్రివెధవా. పో ఇక్కడ్నుంచి."
    శివరామయ్య ఎప్పుడొచ్చాడు? ఇంతవరకూ ఎక్కడున్నాడు?
    "అక్కయ్య అక్కయ్యే....అట్టాగే పిలుస్తాను." చేతులు అడ్డం పెట్టుకుంటూ "కొట్టొద్దు బాబాయ్. కొట్టొద్దు. అక్కయ్యే...." నిలువెల్లా కంపించిపోతూ, ప్రాధేయపడుతున్నాడు బుచ్చిబాబు.
    "సరే, పో!" విసురుగా అని మెడపట్టుకొని తోశాడు శివరామయ్య.
    పిల్లిలా అడుగులేసుకొంటూ చెట్లకడ్డంపడి వెళ్తున్న బుచ్చిని కళ్ళార్పకుండా చూశాడు డాక్టర్.
    "వట్టి వెర్రినాగన్న. రండి  డాక్టర్ గారూ కొబ్బరితోట చూద్దురుగాని" శివరామయ్య దారితీశాడు.
    "బుచ్చయ్యను కొడ్తూవుంటారా?" శివరామయ్య వెనక మానసి పక్కగా నడుస్తూ వినడు. మీరే చూశారుగా  ఎట్లా  చేస్తున్నాడో?"
    "మానసిని అక్కా అని పిలవడం బుచ్చయ్యకు ఇష్టం వుండదా?"
    శివరామయ్య ముందుకేసి అడుగు ముందుకూ, వెనక్కేసిన అడుగు వెనకే వుండిపోయింది. అలాగే ఆగిపోయాడు.
    పాతేసిన కుంచెరాయిలాగా ఆగిపోయాడు.
    మానసి బిగిసిపోయింది.
    కళ్ళు తేలవేసి ఉదయచంద్రను చూస్తూ నిల్చుండిపోయింది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra