Home » Kommuri venugopala rao » భారతి

    "ఎందుకంత  పట్టుదల  పట్టారు?" అన్నది  అప్రయత్నంగా.

    పరధ్యాసగా  ఏదో ఆలోచిస్తూ  నడుస్తూన్న సారథి, ఊఁ" అన్నాడు.

    "కారులో  ఒడుదుడుకుగా  డ్రైవ్ చేసుకుంటూ వచ్చి, మా ప్రాణాలు తీసినంత పని చేసినప్పుడు  మనం కలుసుకున్నది కొన్ని క్షణాలే కదా! నన్నంత గాఢంగా  ఎలా గుర్తు పెట్టుకున్నారు? డ్రైవరు రాజయ్యతో నా ఆచూకీ తెలుసుకునే వరకూ మీ మనసెందుకు వుండబట్టలేక పోయింది? తరువాత  ఇంట్లో అంత కలవరపాటు  ఎందుకు లేవదీశారు?" బిడియం పోగొట్టుకుని  నెమ్మదిగా అడిగింది భారతి.

    అతను ఆమెవంక  నవ్వుతూన్న కళ్ళతో  చూసి, "ఇన్ని ప్రశ్నలడిగావు గానీ, వీటన్నిటికీ సమాధానం నీ ప్రశ్నలోనే  వుంది" అన్నాడు.

    "అదెలా?"

    "చెప్పమంటావా? దీనికంతటికీ కారణం  నువ్వే! గ్రహించావా!"

    ఆమె నవ్వి, "గ్రహించాను గాని, ఈ 'నవ్వే' ను సుదీర్ఘం చేసి బలవత్తరమైన  దానిగాను, లోకోత్తరమైనదిగాను  సృష్టించకండీ. ఒట్టి అతిశయోక్తే అవుతుంది" అంది.

    సారధి దెబ్బతిన్నట్లు  "అతిశయోక్తా  ఏ విధంగా?" అన్నాడు.

    "చెప్పలేని వ్యధతో  మీలో మీరు  క్రుంగిపోతున్నప్పుడు, మీ అమ్మగారి ద్వారా ఈ విషయం తెలుసుకున్న మామగారు ఏ  కళనున్నారో  నన్నను గ్రహించ బట్టిగాని, వారే ఈ సంబంధానికి ఇష్టపడక మొదట్లోనే 'వీల్లేదు' అని ఒక్కమాట చెప్పి ఉంటే ఇది జరిగేదా? ఏమయ్యేది?"

    అడుగులు తడబడినట్లయి  సారధి ఆగిపోయాడు. ఇలాంటి ప్రశ్నలు  అతనేన్నడూ వేసుకోడు  అంత తీవ్రంగా ఆలోచించటం అతనికి భయం. జరిగే సంఘటనలతో  రాజీపడి  భయం భయంగా  తనలో తను క్రుంగిపోతూ  జీవించటం, తనని తాను నోరులేని  వింత ప్రేక్షకుడుగా  తిలకించుకోవటం  చిన్నప్పటినుండీ  అతని అలవాటు. ఈ వయసులో తండ్రికి తెలియకుండా బయటకు  కారు తీసుకువెళ్ళటం  అతనికి భయం. అంతరంగికమైన  స్వేచ్చా జీవితం అతను కోరుకుంటున్నా  తెలియని వుద్రేకంలో  అతను బయట ఎక్కడెక్కడో  తిరిగి ఇంటికి వచ్చినప్పుడు 'ఇంత ఆలస్య మెందుకు చేశావు?' అని తండ్రి తనను ఎక్కడ గ్రుచ్చి గ్రుచ్చి ప్రశ్నిస్తాడోనని హడలిపోతూ వుండేవాడు.

    తను పుట్టి బుద్దెరిగాక  తండ్రి  తను పట్టుమని  పది నిమిషాలు గానీ, పది మాటలుగానీ ఎదురెదురుగా మాట్లాడుకున్నట్లు  గుర్తులేదు. అసలెప్పుడూ  ఒంటరిగా  తన గదిలోనే పడి మ్రగ్గిపోతూండేవాడు. అధవా ఆయన ఎప్పుడైనా ఎదురుపడినా, తను ఏదో తప్పు చేసినట్లు  ప్రక్కనుంచి  తప్పించుకు  పోతూండేవాడు.

    'ఆగిపోయారేం?' అన్నట్లు  భారతి  అతనివంక  విస్మయంగా చూసింది.

    "నిజం చెప్పమంటావా?" అన్నాడు  తడబడే కంఠంతో.

    "ప్రతివారూ  ఇతరుల నుండి  వాంఛించేది  నిజమేగా!"

    "నేను ఎదిరించలేకపోయి  వుండేవాణ్ణి. నాలో  నేను కుమిలిపోతూ  ఊరుకునేవాణ్ని.

    "అలా కుమిలిపోతూ  జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోయేవారా?"

    ఒక ఘడియ ఆలోచించి, తల అడ్డంగా  ఆడిస్తూ సారధి అన్నాడు: "ఆ మాట నేను చెప్పలేను"

    "మరి ఏం చేసేవారు? మీ నాన్నగారు  ఇంకో సలక్షణమైన  పిల్లను చూసి, కట్టుకోమంటే  తల ఊపి  అలాగే  చేసి వుండేవారు__ఏం?"

    అతను సిగ్గుపడుతూ, "బహుశా  అంతే  ననుకుంటాను" అన్నారు.

    "మధ్య మధ్య కుములుతూ వున్నా  మీ జీవితం  సాఫీగా  గడిచి పోయేది."

    ఏమీ తోచనివాడిలా  అతను  స్తబ్దుడై  అవునన్నట్లు  తల ఆడించి ఊరుకున్నాడు.

    భారతి అతనికేసి పకౌతుకంగా  తిలకించింది. తప్పు చేసిన మొద్దబ్బాయిలా  తల వంచుకుని నిలబడ్డాడు. అతని ముఖమూ, కళ్ళూ అమాయకత్వంతో నిండిపోయి  యెంతో నిష్కల్మషంగా, అసమర్ధంగా కాంతి దీపం  యెక్కడున్నదో తెలియక అంధకారంలో  తడుముకుంటున్నట్లు  కనిపించాయి. హఠాత్తుగా ఆమెకు తను సిగ్గుమాలిన తనంతో, దుష్టంగా ప్రవర్తించినట్లు స్పురించి, అతనిపై ఎనలేని  జాలి కలిగి, కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అతన్ని, ఆ అమాయకుణ్ణి, ఆ బలహీనుణ్ణి, ఆ అసమర్ధుణ్ణి తన గుండెల్లో  దాచుకోవాలన్నంత  ఆకాంక్ష  కలిగింది.

    "ఇవన్నీ మీరు చెప్పారని  మీరంటే  నాకు కోపం  వచ్చిందనుకున్నారా?" అంది రుద్దకంఠంతో.

    కరుణాపూరితమైన ఆమె కంఠస్వరం విని. అతని నేత్రాలు ఆనంద కిరణాలు రాల్చాయి. "పుట్టి బుద్దెరిగాక  నేను చేసిన ఘనకార్యం  ఒక్కటే__నిన్ను  చేసుకోవటం! ఇదేమిటి? ఇంత అదృష్టం నన్నెలా  వరించింది?" అన్నాడు తన్మయంగా.

    ఆ క్షణంలో  భారతి ఆనంద పారవశ్య విలీనురాలై  తన సమస్త దుఃఖాలనూ విస్మరించింది. ఆమె బ్రతుక్కి ఓ ప్రయోజనం, ఉత్కృష్టమైన నిర్వచనం వజ్రాలతో  పొదిగిన  సోపానంలా  కళ్ళ యెదుట యేర్పడి  దానిమీద  సకల సుఖాలు సాక్షాత్కరించాయి.

    ఆమె పెళ్ళి  జరక్కముందు నుంచీ, జరిగాక కూడా  పెళ్ళికొడుకు తరపు బందువర్గం నుంచి తన కుటుంబంమీదా, తను అంతస్తుమీదా  ఆమె యెన్నో వ్యాఖ్యానాలు వింటూ  వచ్చింది. మనసు అగ్ని శలాకను దాచుకున్నట్లు  అవన్నీ ఎలానో భరించి  ఓర్మివహిస్తూ  వచ్చింది. ఈ క్షణాన ఎన్నడూ  లేనంత  ప్రశాంత చిత్తురాలయి. తన మనస్సు నుండి మసక మసగ్గా  వున్న  ఆ మరకలన్నీ  తుడిచి పెట్టేసింది.

    ఉన్నట్లుండి  వర్షం  పెద్దదై, ఇద్దరూ  మెల్లిగా  తడిసిపోసాగారు.

    ఆమె కలలోంచి  మేలుకున్నట్లయి  "బాల్యం నుంచీ  ఎంతో గారాబంగా పెరిగిన సుకుమారులు మీరు. ఇట్లా  తడిసిపోతే జబ్బు చేస్తుంది. పదండి ప్రక్కకి పోదాం" అంది బాధ పడుతూన్నట్లుగా.

    "నీకు జబ్బుచేయదా? నాకేమీ చేయదు. నేను చిన్నతనం నుండి కష్టాలకు కొంతవరకూ  అలవాటు పడినదాన్ని. ఎండలో తిరగటమూ, నీటిలో నానటమూ నా కలవాటే" అని అతని చెయ్యి ఆత్రంగా పట్టుకుని  దగ్గర్లోనే వున్న పెద్ద చెట్టుక్రిందకి  అతన్ని లాక్కు  వెళ్ళింది.

    వర్షం  భీషణంగా కురుస్తూ, దానికి గాలి కూడా  తోడవగా తోటలోని  చెట్లన్నీ  చప్పుడు  చేసుకుంటూ  అటూ ఇటూ ఊగుతున్నాయి. కొమ్మలమీద  గూళ్ళు కట్టుకుని వాటిలో  కాపురం  చేసే పక్షులన్నీ. వేటి గూటిలో అవి మరింత లోపలకు ఒదిగిపోయి, బిక్కు బిక్కు మంటున్నట్లు  కూర్చున్నాయి. క్రమంగా  ఇందాకటి నుంచీ  మిణుకు మిణుకు మంటూన్న కాస్త వెలుగు కూడా  నశించి చీకటి ఛాయలు  భూమి మీదకు చోటు చేసుకుంటున్నాయి.

    సారధికి  వానలో తడవటం, చలిగాలిలో  తిరగటం  ఎప్పుడూ అలవాటులేదు. జీవితంలో  ఒక్కసారి కూడా  చన్నీళ్ళ స్నానమెలా వుంటుందో  అతను రుచి చూసి ఎరగడు.

    చెట్టు క్రింద  నిల్చున్నాకానీ, కొమ్మల సందులనుండీ, ఆకుల మీద నుంచీ జారి ఆమెతోపాటుగా అతనిమీద నీళ్ళు  పడుతూంటే  అతని చలికి వణికిపోసాగాడు. ఎంత నిగ్రహించుకుందామన్నా  అతనికి సాధ్యపడటంలేదు.

    భారతి ఇంకా అతని చెయ్యి పట్టుకునే వుంది. అతని శరీరం గజగజమని వణికిపోవటం  ఆమె గ్రహించి, జాలితో నిండిపోయింది.

    అనుకోకుండా అతనికి మరింత దగ్గరగా  జరిగింది భారతి. "చలి బాధను తట్టుకోలేకుండా  వున్నారా? పాపిష్టిదాన్ని, నా మూలంగానే  మీకీ బాధలన్నీ" అన్నది  చలించే  గొంతుతో.

    "అలాగనకు భారతీ! నా జీవితంలో  ఇది మరుపురాని  సంఘటన. మధురాతి మధురమైన అనుభూతి. ఈ ఆనందాన్ని  నన్ననుభవించనీ."

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra