18

    మరో కొన్ని రోజులు మరేమి విశేషాలు లేకుండానే గడిచిపోయాయి.     ఆఫీసు అంతా చాలా గట్టిగా పనిచేస్తున్నారు, ఆడిట్ ఐపోతే, ఒక పెద్ద గండం గడిచిపోయినట్టు. సంబంధం ఉన్నా లేకపోయినా, ఆడిటర్ ప్రభావం ఆఫీసు అందరిమీదా పడింది. తానుచేసేది అట్టే లేక, కొంత నిరుపయోగంలాంటి చిన్నతనం అప్పుడూ అప్పుడూ అనుభవించాడు గోపాలం. అకౌంట్స్ మేనేజరూ, టెక్నికల్ మేనేజరూ రోజూ ఆరు గంటలదాకా కూర్చునే వాళ్ళు. గోపాలం నాలుగ్గంటలకి బయటికి వొచ్చి కాఫీ తాగి కాలేజీకి వెళ్ళిపోయేవాడు. కంపెనీలో ఇంకా తనకి ముఖ్యమైనదికాని. శాశ్వతమైనదికాని స్థానం దొరకలేదని అతని కనిపించేది- కాని తన కొత్త ఉద్యోగం మాట తలుచుకుని తనని తనే సంతృప్తిపరచుకొనేవాడు. లా డిగ్రీ తీసుకుని కొంత పని నేర్చుకుంటే తన ఉపయోగం ఎక్కువవుతుందనే ఆశల్లో తనప్రస్తుత భావాలని దాచుకొనేవాడు.
    సరళ పెళ్ళికి సహాయం చేసే విషయం చివరికి వసంత పరిష్కారం చేసింది. ఒకనాడత నాలోచిస్తూంటే "ఏమిటి ఆలోచిస్తున్నావు!" అంది.
    "సరళ పెళ్ళి- వొచ్చే నెల పదహారో తేదీని. వెళ్ళాలి' అన్నాడు.
    "వెళ్ళు- దానికి పెద్ద ఆలోచన ఏమిటి!" అంది.
    "నువ్వూ రావాలనుకుంటాను"    
    "గాడ్! నీకు జ్ఞాపకం ఉండదు ఏమీ- పదహారున క్లబ్ డే. అని జ్ఞాపకం లేదూ?"
    అతనికి జ్ఞాపకం వొచ్చింది, మరో పరిస్థితిలోఐతే, ఆమెని ఒప్పించి తనతో తీసికెళ్ళడానికి ప్రయత్నించేవాడు. కాని తనకి తెలీని ఏ కారణం చేతనో బ్యూటీ కంటెస్ట్ మీద ప్రాణం నిలుపుకుంది వసంత. ఏ మయినా ఆమె అంగీకరించదని తెలిసి ఇంకేమీ అనలేదు.
    కొంచెం ఊరుకుని, "నువ్వు ఆఫీసులో లోన్ అడిగేవుట- ఎందుకు?" అంది నెమ్మదిగా వసంత.
    "నీ కెవరు చెప్పేరు?"
    "తెలిసిందిలే. నువ్వు దాచుకున్న విషయాలలో ఇది ఒకటి: ఏం?"
    "కాదు వసంతా... అలాగ కాదు."
    "నాకు తెలుసు గోపాలం.....నువ్వు ఎంత వాచినా, దాగని మాట అది. నా దగ్గరనీకూ, నీ దగ్గర నాకూ ఎడమెరిక ఉంటే ఏం సంసారం చేస్తాం?..... బేంక్ లోంచి నీకు కావలసినది తీసుకోడానికి ఏమిటి అడ్డు వొచ్చింది?"
    అతను మాట్లాడలేదు, వెయ్యి జవాబులు అతని మనస్సులోకి వొచ్చినా ఆమె ఎదుట నాలిక మీదకి రాడానికి భయపడుతున్నాయి- ఆ డబ్బు నాదికాదు అని చెప్పేసాహసం లేకపోయింది అతనికి..... ఆ డబ్బునాది, అనుకునే నమ్మకం లేకపోయింది.
    "సరళ పెళ్ళికి పంపాలంటే వెంటనే పంపు. అది నా దెంత అవునో, నీదీ అంతే, నువ్వు నమ్మలేకపోవొచ్చును కాని. నాకు చేతగాదు"

           
    ఒక్కసారి అతని కనిపించింది- తనమీద ఉన్న ప్రేమతోనే, ప్రేమ ఇచ్చే స్వార్ధంతోనే, ఆ హృదయంతోనే, వసంత ఇంత తీవ్రంగా ఈమాట తనకి చెప్తోందని. ఆమెని వేరుగా చూడడం తనకి చేతకాని పని....అలాగే ఆమె డబ్బుని కూడా వేరుగా చూడడం ఆమెని బాధిస్తుందని అతను అనుకున్నాడు.
    "పద చెక్ రాసి పంపు"
    ఆమె చెక్ బుక్ తెచ్చిఇచ్చింది. గోపాలం రెండువేలకి చెక్కురాసి. ఉత్తరం రాసి కవర్లో పెట్టి పోస్టు చెయ్యడానికి పంపేదాకా ఆమె ఊరుకోలేదు. తన బాధ్యత తీర్చుకున్న సంతృప్తిలో అతను ఆమెని దగ్గరగా తీసుకున్నాడు.
    "ఈసారి డబ్బుకావలిస్తే అకౌంటెంట్ కి చెప్పకు- నాన్నగారికి ఎంత చిన్నతనం?...ఏం? ప్రామిస్!"
    ఆమె చెయ్యి జాపింది.
    ఆమాట ఇంతసేపటికి అతని సంతృప్తిని ఒక్కసారి మాయం చేసింది. అంతరాంత రాలలో వసంత భద్రంగా దాచుకున్న భావం- తండ్రిమీద అంతులేని గౌరవం ఆమె ప్రవర్తనని నిర్ణయించింది......తనకీ, ఆమెకీ మధ్య ఉన్న కొద్ది తెరలని తొలగించాలనీ, కొంచెం ఐనా దూరాన్ని లేకుండా చెయ్యాలనీ భావంకాదు.
    ఆమె చెయ్యి జాపింది. ఎంత నాజూగ్గా ఉంది! ఆ చేతిని చేతిలోకితీసి అందంగా పాలిస్ చేసిన ఆమె గోళ్ళూ వేలిమీద మెరుస్తోన్న ఉంగరంలోని రాయినీ చూశాడు.
    తక్షణం రాసిన చెక్ ని వెనక్కి తీసుకుని చించి పారెయ్యాలనిపించింది - ఆ నిమిషంలోనే ఉత్తరం ఇంటి పక్కనే ఉన్న పోస్టు బాక్స్ లో పడేసి తిరిగివొచ్చేడు నౌకరు.
    చాలాసేపు అమెచేయ్యి అతని చేతిలో ఉండిపోయింది. అతనికి అనిపించింది- ఈ ఇల్లూ, ఈ డబ్బూ ఈ చక్కని డ్రాయింగ్ రూమ్ ఫర్నిచర్ తమ డబుల్ బెడ్, రేడియో గ్రామ్, ఫ్రిజ్ అన్నీ ఆమెని ... తనది ఒక్క పైస లేదందులో అనికాని, తన ఉద్యోగం కాని, తనవికాదు- ఆమెని ఆమె తండ్రిని.
    ప్రతిక్షణమూ వెంకట్రామ్ నీడ తన జీవితం మీద పడుతూనే ఉంటుంది. ఈ రోజునించి.
    అవేవీ లేకపోయినా తాను జీవించగలడు. ఇంతకుముందు జీవించినట్టే.... కాని, ఆమె-వసంత - తనది కాకపోతే జీవించలేడు.
    ఆమె తనకలగా తన జీవితంలోకి వొచ్చింది. తన భార్యగా తన జీవితంలో ఉండిపోయింది. కాని, ఆమె ముఖ్యంగా వెంకటరామ్ గారి పుత్రిక. ముఖ్యంగా లక్ష్మీపుత్రిక. ఆమె జీవితంలో భర్తగా తాను ప్రవేశించాడు. తన జీవితం వెనుక పెట్టివొచ్చి.
    తనకి మిగిలిన కొంచెం ఆత్మగౌరవం రక్షించుకోనివ్వదు. ఈ నిజాలు గమనించిన కొద్దీ అతనికి తను దైనందినం ఆమె ఆడుకునే ఆటవస్తువులాగ అనిపించింది... పెద్ద ఖరీదైన ఆటబొమ్మ.
    ఆమె బాల్కనీలో నిలబడి ఎదురింటిలోకి చూస్తోంది.
    నీ సౌందర్యం నీ మనస్సులో కూడా ఉంటే ఎంత బాగుండును? అనుకున్నాడు.

                                                     *    *    *

    ఆలోచనలు రోజలా వొదల లేదు తనని.
    సాయంత్రం వసంత ఎక్కడికో వెళ్ళింది-స్నేహితురాలితో. అతను లేక్స్ కి వెళ్ళేడు.
    చల్లగావొస్తూంది గాలి. ఆదివారం కావడాన్న చాలామంది వొచ్చాడు. దూరంగానడిచి ఒక మూల కూర్చున్నాడు. ఇక్కడా మనుష్యులున్నా. ఎక్కువమందిలేరు.
    ఉదయం జరిగినదంతా మాటిమాటికీ అతనికి జ్ఞాపకం వొస్తోంది.
    -ఈ పరిస్థితిలో ఆమె ఏం చెయ్యాలి?
    నిజంగా తానంటే ప్రేమ ఉండి, తనకీ ఆమెకీ మధ్య ఏమీ దూరంలేకపోతే, ఆమె ఎలాగ ప్రవర్తించి ఉండాలి?
    పడమటి ఆకాశంలో కిందికి వెళ్ళిపోతూన్న సూర్యకిరణాలు సరస్సులో నీళ్ళని వెండి కరుగుతోన్నట్టు చేసేశాయి. రెండు జాయ్ బోట్సులో అమెరికన్లలాగ ఉన్నారు - కూర్చుని చేపలు పడుతున్నారు.
    ఎంత ప్రశాంతంగా ఉంది?
    చుట్టూ చెట్లమీద ఎన్నో రకాల పక్షులు. ఈ మహానగరంలో కూడా మానవుడు పూర్తిగా ప్రకృతికి దూరం ఐపోలేదు.
    ఆరో బోట్లు రేస్ చేస్తున్నాయి లయబద్దంగా వేస్తోన్న తెడ్ల చప్పుడు గాలిలో తేలుతూ వొస్తోంది. అవి దగ్గరికి వొస్తోన్న కొద్దీ అందులో ఉత్సాహంతో అరుస్తోన్న గొంతుకలు స్పష్టంగా లేని నెమ్మదిగా వినిపిస్తున్నాయి.
    అవతల రోడ్డుమీద కారు స్టార్టు ఐంది.
    -వసంత.
    తనచేత చెక్కు రాయించింది....నిజమే. కాని తనమీద అభిమానం చేతకాదు.... వాళ్ళ  నాన్నగారి గౌరవం కోసం....
    ఇవన్నీ చెప్తే వొదిన ఏమంటుంది?
    "ఒక్కమాట ఎందుకాలోచించుకోవు. గోపాలం?-మాటదాచే మనిషి కాదు. వసంత....నిజం ఎంత వికృతంగా ఉన్నా, నీతో అరమరిక లేదు కనకనే. చెప్పజాలింది...."
    మెరుపులాగా వొచ్చిన ఆలోచన అతన్ని ఒక్కసారి తెలియని ఔన్నత్యాలకి తీసుకుపోయింది.
    తనని బాధించే నిజాలని ఆమె అవసరం లేకపోయినా చెప్పాలా? తనస్థానం అమ్ముడు పోయిన తనని గురించిన నిజం. వ్యక్త చెయ్యాలా?
    మళ్ళీ చీదరగా వొస్తున్నాయి ఆలోచనలు.
    కలకత్తా వొచ్చిన మొదటిరోజుల్లో వెంకట్రామ్ కూడా వొచ్చి పదిరోజులుండి వెళ్ళేరు. తనకీ, వసంతకీ ఇక్కడఉన్న పాత స్నేహితులెందరినో ఆయన పరిచయం చేశారు.
    రెండు మూడుసార్లు జరిగినది అతనికి జ్ఞాపకం-
    "మిస్టర్ ఘోష్? మా అల్లుడు - గోపాలం....
    ఘోష్ తనని ఇతరులకి పరిచయం చేస్తూ "వసంత భర్త..." అని అన్నప్పుడు తనకి ఈ నాటి ఆలోచనలు రాలేదు. ఆమె నవ్వుతూ తనవైపు చూసిన ఆ క్షణంలో మహావిజయం సాధించిన ఒక సంతృప్తి మాత్రమే.
    ఆ సంతృప్తి ఇవేళ అసంతృప్తిగా ఎందుకు మారిపోయింది?
    సూర్యాస్తమయం ఐపోయింది. లేచి నెమ్మదిగా తన కారుదగ్గరకి నడవసాగాడు. పర్లాంగు అవతల పార్క్ చేశాడు. అక్కడ ఆసోసియేషన్ వాచ్ మన్ వున్నాడని.
    దారిలో నడుస్తోన్న వాళ్ళెవర్నీ అతను పరిశీలించలేదు. ఈ పట్నంలో తెలిసినవాళ్ళు కనిపించడం అరుదు- ప్రత్యేకంగా వెడితేతప్ప.
    కారుసీట్లో పడుకుని నిద్రపోతోన్న డ్రైవర్ ని లేపి వెనక కూర్చున్నాడు.
    కారు కదలబోతుంటే రోడ్డుమీద వెడుతోన్న ఇద్దరు అతని దృష్టిలో పడ్డారు.
    ఎలెక్ట్రిక్ దీపం ఈ సగంచీకటిలో ఎంతో ప్రకాశంగా లేదు- కాని.....
    ఆమెని ఎక్కడఉన్నా గుర్తించగలడు. అతన్నీ మరచిపోలేడు.
    కారు నెమ్మదిగా ఇటువేపు సాగిపోతోంది.
    వెనక్కి తిరిగి మరీ మరీ పరికించేడు.
    అవును - తనకి తెలుసును.
    ఆమె - శశిరేఖ.
    అతను - రామానంద్.
    ఏం చెయ్యాలో తోచలేదు తన నిర్ధారణ అయే సరికి. కారు ఆపమన్నాడు, కాని ఆగాక వెనక్కి వెళ్ళి వాళ్ళని పలకరించే ఉద్దేశం సిల్లీగా అనిపించి మళ్ళీ బయలుదేరాడు.
    భగవాన్? శశిరేఖ? అతను ఏంచేస్తున్నా డిక్కడ? బహుశా అతను కలకత్తాలో పనిచేస్తూ ఉంటాడు. ఈపాటికి అతని ట్రైనింగ్ ఐపోయి ఉంటుంది.
    కనిపించీ కనిపించని ఆ కాంతిలో తాను సరిగా చూసిన నిశ్చయం ఏమిటి. ఈ మహానగరంలో ఆమెలాటి ఎంతమంది స్త్రీలు ఉండరు.
    ఎన్నో ఆలోచనల్తో ఇంటికి చేరాడు. గదిలోకి రాగానే. ఆమె శశిరేఖ అని, తాను సరీగానే పోల్చుకున్నా, ఏదో ఆశ, తనకి తెలియని భయం. ఆమె కాదనే సందేహాల్ని కలుగజేసిందని తెలిసి వొచ్చింది గోపాలానికి.
    స్నానంచేసి బెడ్ మీద పడుకున్నాడు.
    ఈరోజు ఎవరో పరాయివాళ్ళ గదిలాగ ఉంది. అతనికి మాటి మాటికి శశిరేఖ జ్ఞాపకం వొస్తోంది.
    శశిరేఖ జ్ఞాపకాలతోనే అతనికి ఈ మహా నగరం చిన్నపట్టణం అయిపోయి నట్టని పించింది...
    వసంత వొస్తే బాగుండును. ఈ ఆలోచనల రొదలని తియ్యటి ఆమె మాటలు పారదోలేని. అర్ధంకాని ఈ భయాలని మెత్తటి ఆమె చేతులు పోగొట్టేవి.
    లేచి షహనాయ్ రికార్డు పెట్టేడు.
    మలయ మారుతం లాగ ముందర మెల్లగా తియ్యగా. ఎంతో మృదువుగా మొదలుపెట్టిన రాగ తరంగ సంచయం క్రమంగా వేగంతో, నిశితంగా తన తలలోకి హృదయంలోకి చొచ్చుకుంటున్నాయి. అంతరాంతరాలలో తాను తననించీ, అందరినించీ, దాచుకుంటూన్న ఏదో నిజాన్ని బయటికి తీయించడానికి తననీ, తను కప్పుకున్న ఆలోచనల్నీ బయటికి తీయడానికి ప్రయత్నిస్తున్నాయి.
    ఆ నిజం ఏమిటి?
    - ఏమీ లేదు. తనకి శశిరేఖ అన్యాయం చేసినా. ఆమెకి తానేదో నేరం చేశాననే బాధ,
    దీనికి పునాదులు లేవు......శిఖరాలూ లేవు .....
    తననించి దూరంగా జరిగిపోయిన శశిరేఖ కోపం తనకెందుకు బాధ? ఆమె తనదికాదు : వసంత తనది- ఆలోచనలెందుకు శశిరేఖమీద?
    వసంత వొచ్చేసరికి  అతను నిద్రపోతున్నాడు. ఆమె లేపి "ఏం అలాగ ఉన్నావు?" అని అతని నుదురు. బుగ్గలూ ఆప్యాయంగా తాకగానే అతనికి పూర్తిగా తెలివొచ్చింది.
    "ఏదో చెడ్డకల వొచ్చిందిలే" అన్నాడు.
    భోజనం చేసి వాక్ కి వెళ్ళి వొచ్చేసరికి. అతనికి ఇవేళ జరిగినదంతా పొరపాటని నమ్మకం కుదిరింది. ఆమె శశిరేఖ కాదని అతను తెలుసు కున్నాడు- ఆమె ఎవరో - మూర్తీభవించిన ఆలోచనా కకలం...
    "కలల్ని గురించి అంత ఆలోచన ఏమిటి?" అంది విచిత్రంగా అతనివైపుచూస్తూ, వసంత,
    "కల ఏనాడో మరిచిపోయాను వసంతా- ఊరికినే ఆలోచిస్తున్నాను" అన్నాడు గోపాలం.
    ఆ రాత్రి అతను ప్రశాంతంగా నిద్రపోగలిగేడు.
    
                                   *    *    *

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra