Home » Govindaraju seetadevi » Jeevana Kalasam


    "నేను, రావద్ధండీ ఆయనకి అసలే సిగ్గు" అని యెంత చెప్పినా వింటేనా. నాలుగు రోజుల నించీ వూరులో లేరియ్యె. మరి అదిగో వస్తున్నారు."
    "వాసుబాబూ ఎలా వుంది" అంటూ కుర్చీ లాక్కుని కూర్చున్నాడు ఆయన.
    "నమస్కారం" ఇంక తప్పదు అనుకున్న వాసులేచి కూర్చోబోయాడు.
    లేపకండి....డాక్టర్ మీ కింకా విశ్రాంతి కావాలన్నాడు. పూర్తి ఆరోగ్యం చేకూరే వరకూ ఇక్కడే వుండండి. క్షణక్షణానికీ "వెళ్ళిపోతా" అంటూ మాకు ఇబ్బంది కల్గించకండి. వైదేహి మీ దగ్గరే వుంటున్నది కదూ మరి వస్తాను. కాస్త పనివుంది." అంటూ పాఠం అప్పజెప్పి నట్లు చెప్పేసి జవాబు ఆశించకుండా వెళ్ళిపోయాడు.
    ఆయన్నే చూస్తూ "ఈ డబ్బున్న వాళ్ళ మర్యాదలు ఇలాగే వుంటాయా?" అనుకుని ఆలోచిస్తూ వున్నాడు.
    "బత్తాయిరసం ఇదిగో." వైదేహి అందించింది.
    వైదేహి చేతి రంగు రంగుల గాజులని చూస్తూ "నే నంటే మీ కెందుకింత శ్రద్ధ!" అన్నాడు.
    అనుకోని ప్రశ్నకి ఆలోచనలో పడింది వైదేహి.
    "మాట్లాడరేం?"
    "ఏం మాట్లాడను. నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను ఎందుకు? అని వైదేహి జవాబుకి మరిమాట్లాడలేక రసంగ్లాసు అందుకుని గబగబా తాగేసి గ్లాసు కింద పెట్టబోతూంటే వైదేహి అందుకుంది.
    అయిదు నిముషాలు ఇద్దరి మధ్యా నిశ్శబ్దం రాజ్యం చేసింది.
    నౌకరు ఫ్లవర్ వాజ్ లో పువ్వులు మార్చి వెళ్ళాడు.
    ఆ గదిని ఒక్కసారి కలయజూశాడు వాసు. పెద్దగది. ఒక మంచం. ఓ చిన్న టేబుల్ దానిమీద నటరాజ విగ్రహం. దగ్గరలోనే బట్టల స్టాండు. దానిమీద ఓ పాంటూ షర్టూ వేలాడుతున్నాయి. ఇంకో మూల రెండు పుస్తకాల బీరువాలు దానికి కాస్త దూరంలో పెద్ద అద్దం. కిటికీలకి పెద్ద పువ్వులున్న సిల్కు కర్టెన్లు వ్రేలాడుతున్నాయి. మంచం దగ్గరగా వున్న కిటికీ కర్టెన్ పక్కకి లాగివుంది.
    వాసు దృష్టి క్యాలెండర్ మీదికి వెళ్ళింది.
    తేదీ ఇరవై ... అంటే దాదాపు నాలుగు రోజులు, జ్వర తీవ్రతలో అప్పుడప్పుడూ మెలకువ వస్తూ వుండేది. తలకీ భుజానికి తగిలిన దెబ్బ బాధగా కూడా వుండేది. ఒకసారి డాక్టర్ పరీక్షిస్తున్నట్లు, మరోసారి ఆర్ధరాత్రి, వైదేహి, పుస్తకం చదువుకుంటూ అలాగే నిద్రపోవటం కన్పించి, తిరిగి మగతగాకళ్ళు మూతలుపడ్డాయి. మరోసారి మెలకువ వచ్చింది.
    తన తల దగ్గర కూర్చుని అక్కడే నిద్రపోతూ చెయ్యి తనమీద వేసింది వైదేహి. ఆ స్పర్శకే కాబోలు మెలుకువ వచ్చి కళ్ళు తెరిచాడు తను.
    ఇప్పుడు తలుచుకుంటే ఇదంతా కలలాగా అన్పిస్తోంది.
    "వీరభద్రం, వెంకటేశ్వర్లు వచ్చారుట మిమ్మల్ని చూడాలని ప్రతిరోజూ వచ్చి చూస్తూనే వున్నారు" అంటూ వైదేహి మరో రెండు కుర్చీలు అక్కడ వేయమని నౌకరుకి చెప్పింది.
    ఇక్కడకే యెందుకు, నేను క్రిందకే వెడతాను" లేవబోయాడు వాసు.
    "వద్దు వద్దు ... వాళ్ళే యిక్కడికి వచ్చేస్తున్నారు."
    వాసు లేచి కూర్చున్నాడు. తన వంటిమీద వదులు వదులుగా వున్న లాల్చీని. పరీక్షగా చూసుకుంటూంటే పైజమాకూడా అలాగే వుంది. ఆ రెండూ తనవికాదు.
    వైదేహి క్రీగంట కనిపెడుతూనే వుంది.
    "ఇవీ..... ఇవి....నాకొద్దునాబట్టలు..." అంటూ మహా చికాకు పడిపోతుంటే ఇంతలోనే వెంకటేశ్వర్లూ, వీరభద్రం వచ్చారు. అసలు వాసుకి మరొకరి బట్టలు వాడాలంటే తగని చికాకు టవల్ అయినా సరే తనది తనకి ప్రత్యేకంగా వుండాల్సిందే.
    "రండి. కూర్చోండి" అంటూ ఆహ్వానిస్తున్న గురువుగారిని చూస్తూంటే పెద్ద పెట్టుననవ్వు వచ్చేసింది వీరభద్రానికి, వెంకటేశ్వర్లు వస్తున్ననవ్వు ఆపుకోలేక పెద్దగా నవ్వేస్తూంటే ఇంక వీరభద్రం పైకే నవ్వేశాడు. వాసు తన బట్టలవైపు మరోసారి చూసుకోబోతూ యెదురుగా అద్దంలోకి చూశాడు. తన అవతారం పూర్తిగా కన్పిస్తూంటే వాసూ ఆ నవ్వుల్లో శృతికలిపాడు.
    వైదేహి నోట్లో పమిట కొంగు పెట్టుకుని ఆలోచించి పారిపోయింది.
    వాసు వాళ్ళతోపానవ్వుతున్నాడేగాని ఆ బట్టల్లో కంపర మెత్తినట్లు వుంది.
    "డ్రైవర్ రెడీమేడ్ బట్టలు తెమ్మంటే ఇంత పెద్దవి తెచ్చాడు."
    అంటూ సంజాయిషీ ఇచ్చిందేకాని తిరిగి నవ్వు వస్తోంది ఆమెకి.
    "ఇవిగో మీ బట్టలు అంటూ ఇస్త్రీ పాంటూ, షర్టూ అందించింది వైదేహి.
    తన బట్టలు వేసుకున్న తర్వాత గాని వాసు స్నేహితులతో సరీగా మాట్లాడలేకపోయాడు.
    "నేను ఇక్కడ వున్నానని మీ కెలా తెల్సింది?"
    "భలేవారు. మీరు కన్పించలేదని మేం ఖంగారు పడుతూంటే వైదేహిగారు కబురు పంపారు. అప్పుడే వచ్చి చూశాం. ఖాన్ పగ పట్టాడంటే పాముపగ....దరిద్రుడు....అంటూ సానుభూతి చెప్తూ మాట్లాడారు మిత్రులు.
    వైదేహి ఆ ఇద్దరికీ కాఫీ పంపింది.
    "ఈ మర్యాదలు మా కెందుకండీ... మా స్నేహితుడిని ఆపదసమయములో ఆదుకున్నారు. అంతే చాలు" చేతులు జోడించాడు వెంకటేశ్వర్లు.
    "ఫర్వాలేదు. ఒట్టి కాఫీ మాత్రమేగా" అంటూ బలవంతం చేసింది.
    "వెంకటేశ్వర్లు నేనూ మీతో వచ్చేస్తాను. నా కింక ఫర్వాలేదు" వైదేహి వైపు చూశారు ఆ ఇద్దరూ.
    "చూడండీ మరో నాలుగురోజులు పోయిన తర్వాత పంపిస్తాను మీరు ప్రతిరోజూ వచ్చి చూసి వెడుతూ వుండండి" యెంతో మృదువుగా చెప్పింది వైదేహి"
    "కాదు నాకు చాలా బాగుంది. నేను వెళ్ళి పోతాను వైదేహి అంటూ వాసు పట్టబడుతుండగా డాక్టర్ వచ్చాడు.
    "మరో నాలుగురోజులు పూర్తి విశ్రాంతి తీసుకోవాలి" అంటూ గట్టిగా చెప్పి వెళ్ళాడు.
    వెంకటేశ్వర్లూ, వీరభద్రం వైదేహిదగ్గర సెలవుతీసికొని వెళ్ళిపోతూ "మీ అన్నయ్యగారికి చెప్పమంటారా" అంటూ వాసు ముఖం చూసి, వద్దులెండి అంటూ వెళ్ళిపోయారు.

                               *    *    *

    పథ్యం తీసుకుని నిద్రపోకుండా గదిలోనించి బాల్కనీలోకి అక్కడనించి గదిలోకి పచార్లు చేస్తున్నాడు వాసు.
    మనస్సులో చాలా విసుగ్గా వుంది. ఇదేం బందిఖానా! శరీరంలో శక్తిలేదు. మనస్సుకి శాంతిలేదు.
    స్కూటర్ శబ్దం కావటంతో పరీక్షగా చూస్తున్నాడు.
    ఆ శబ్దం తనకి పరిచయమయినది. అవును అది.... అది...
    "బాబూ....మీకు ఫోన్ వచ్చింది" నౌకరు పిల్చాడు.
    నాకా.....ఫోను ఎవరు చేసివుంటారు...
    వెళ్ళి అందుకున్నాడు. "హలో....వాసు స్పీకింగ్."
    "ఎవరూ- ప్రసన్నలక్ష్మి.....ప్రసన్నలక్ష్మా? ఏమిటి?"
    ఆరోగ్యాన్ని గురించి ప్రశ్నిస్తోంది ప్రసన్న లక్ష్మి ఆమె గొంతులో ఆతురతా. వ్యధా....యెన్నో ప్రతిధ్వనిస్తున్నాయి.
    పెళ్ళికావల్సి తప్పిపోయిన ఆ యిద్దరు యువతీ యువకులూ యేం మాట్లాడాలో తెలియక ఆగిపోయారు.
    "మిమ్మల్ని చూడాలని చాలా వుంది. కాని అవకాశం లేదు."
    "ఇప్పుడు బాగున్నాను." అంతకుమించి మరేం చెప్పలేకపోయాడు వాసు.
    ఏం చెప్తాడు? ఎలా చెప్తాడు!
    "మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను. ఆ చుట్టుపట్ల వైదేహి లేదు కదూ!"
    అదేమిటి ఆమె ఇంట్లో ఉన్న నన్ను ఆమె లేదుగా అని అడుగుతుందేమిటి? అయినా చెప్పాడు. "లేరు ఏదో పనిమీద బైటకు వెళ్ళారు."
    యేదో చెప్పాలని చెప్పలేక పోతోంది ప్రసన్న లక్ష్మి అని అర్ధమయింది.
    "చెప్పండి."
    "మీరు.... మీరు వైదేహి..."
    వైదేహి ఇంట్లో యెందుకు వున్నావని అడుగుతుందా! ఇంకా ఏం కావాలో కూడా అర్ధమవుతోంది వాసుకి. ఓహో ఇప్పటికి అర్ధమయింది కష్టపడి యెందుకు ఫోను చేసిందో మొట్టమొదట ప్రసన్న గొంతువిని గుర్తుపట్టగానే యేదో తెలియని ప్రశాంతతా సంతృప్తీ కల్గింది. అది కాస్తా ఆవిరిలా యెగిరిపోయింది.
    ప్రసన్నలక్ష్మి మాటలో బెరుకుతనం కంటే యేదో చెప్పాలనే తపన అర్ధమవుతోంది. కానీ మేమీ చెప్పలేక పోతోంది.
    నుదురు గట్టిగా రాసుకున్నాడు వాసు.
    "పెట్టేసేయ మంటారా!"
    "వద్దు.... వద్దు..... నే చెప్పేది సాంతం విని ఆ తర్వాత."
    "వింటున్నాను. చెప్పండి" టేబుల్ మీద గీతలు గీస్తూ వింటున్నాడు వాసు.
    "మీరు.... మీరు...
    వింటున్నాడు వాసు.
    "అందరూ చెప్పినవి మా నాన్నగారూ అన్నయ్యలూ నమ్మి....నమ్మారు. కాని.....నేను.....మీతో ఓసారి మాట్లాడాలని..."
    "నిజమా? కాదా! అని ప్రశ్నించి తెలుసు కోవడానికా ఫోను చేసింది."
    కఠినంగా అడిగాడు వాసు.
    "కాదు. కాదు"
    "మరేమిటి? కాకుంటే ఇదుగో చెప్తున్నాను వినండి. నా యిష్టం వచ్చినట్లు చేస్తాను. రేపు ఆ అమ్మాయి జైలునించి రాగానే నా దగ్గిరే వుంచుకుంటాను. ఈ విషయంలో బ్రహ్మదేవుడిని కూడా లెక్క చెయ్యను.చాలా ఇంకా యేమయినా కావాలా.  
    ప్రసన్నలక్ష్మి గొంతు వొణుకుతూ మాట్లాడింది.

            


    "అదికాదు నేను చెప్పేది పూర్తిగా వినాలని. ఆవేశపడవద్దు. నేను మీ మీద వేసిన అభాండాలు నమ్మటంలేదు. అనే విషయం మీకు చెప్పాలనే పిల్చాను ఈ పిలుపు మీకు అందడానికి నేను యెంత కష్ట పడ్డానో ఆ పరాత్పరుడికే తెలుసు" ప్రసన్న గొంతు దుఃఖంతో ఇంక పెగల్లేదు.
    "ఏమిటీ....లోకమంతా కోడై కూసే ఈ వాదు మీరు నమ్మరూ"
    "నమ్మను. నమ్మలేను. నమ్మబోను......ఈ విషయం మీకు చెప్పాలని యెంతో వ్యధపడ్డాను. ఇప్పటికి నా మనస్సు తేలికపడింది.
    "ప్రసన్న లక్ష్మి.....నాకు ఇదంతా యేమి టోగా వుంది. అసలు నాతో మాట్లాడుతున్నది మీరేనా అని" ఓ వైపు ఆనందం. మరోవైపు ఆవేదనా నిండిన వాసు గొంతు విన్న ప్రసన్న కళ్ళనించి రెండు కన్నీటి చుక్కలురాలిక్రింద పడ్డాయి. త్వర త్వరగా చెప్పేసింది.
    "మీరు వీలైనంత త్వరగా ఆ ఇంట్లోనించి వెళ్ళిపొండి. ఇలా చెప్పవలసి వచ్చినందుకు నాకు చాలా బాధగా వుంది. దయచేసి నే చెప్పినట్లు చెయ్యండి." అంటూ ప్రసన్న యేదో చెప్తూనే వుంది.
    ఏదో శబ్దం కావటంతో వాసు వెనక్కు తిరిగి చూశాడు వైదేహాయ్ యెప్పటినించీ నిల్చివుందో చేతిలోని పాకెట్టు జారి క్రింద పడటంతో కంగారుపడిపోయింది.
    "వైదేహీ" అన్నాడు. ఫోనులో మాట్లాడే మాట మర్చి.
    అవతల పెట్టేసిన శబ్దం అవటంతో రిసీవర్ పెట్టేసి వైదేహి ముఖంలోకి చూస్తుంటే.
    వచ్చే ఆవేశాన్ని యెంతో నిగ్రహించుకుంటోంది అన్నది తెలిసిపోతూనే వున్నది.
    వైదేహి ఇంతలో ఆవేశపడటానికి కారణం ఏమిటి?
    మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది వైదేహి.
    ఎవరితో మాట్లాడుతున్నాడు? అని ఆమె అడగలేదు. అతను చెప్పలేదు.
    అప్పటివరకూ వున్న కాస్త శక్తీ కూడా యెవరో లాగేసినట్లయి నీరసంగా వచ్చి మంచంమీద పడుకున్నాడు.    
    ఛీ నేనే చాలా అసభ్యంగా ప్రవర్తించాను. నా స్నేహితులతో మాట్లాడుతున్నాను అని ఒక్క మాట చెప్పివుంటే చాలా బాగుండేది. అయినా ఇక్కడనించి త్వరగా వెళ్ళిపొమ్మని ప్రసన్న ఎందుకు హెచ్చరించినట్లు! ఏమిటో అంతా యేదో పద్మవ్యూహంలా వుంది.
    పది నిమిషాల తర్వాత వైదేహి బట్టలు మార్చుకుని వచ్చికూర్చుంది.
    యెప్పటి చిరునవ్వు వెలుగుతోంది వైదేహి ముఖంలో.
    "అదోలా వున్నారేం.....రేడియో పెట్టనా! ఈ సారి మీకు సరీగ్గా సరీపడ రెడీమేడ్ బట్టలే తెచ్చాను చూడండి.." అంటూ పాకెట్టు విప్పి ఖరీదైన పాంటూ షర్టూ రెండు జతలు తీసి చేతిలో పెట్టింది.
    వైదేహి ప్రకృతి ఎలా అర్ధం చేసుకోవాలో తెలియటం లేదు.
    "అనవసరంగా చాలా డబ్బు ఖర్చుచేశారు. అవన్నీ నాకు అక్కరలేనివి. అదీగాక నేనంత ఖరీదు బట్టలు వేసుకోవటం మానేశాను. తిరిగి వాపసు ఇచ్చేయండి" అన్నాడు వాసు మెల్లగా దిండు ఆనుకొని కూర్చుంటూ
    వైదేహి మరేం మాట్లాడలేదు. తీసుకుని బీరువాలో పెట్టేసి తాళంవేసి క్రిందకి వెళ్ళి పోయింది.

                                  *    *    *

    మూడు నెలలు జైలుశిక్ష అనుభవించి ఆ రోజే బయట అడుగుపెట్టింది మాల. ఎదురుగా వాసు ఆమె కోసమే అన్నట్లు నిల్చున్నాడు. మాలని యెలా వోదార్చాలా అని ఆలోచిస్తున్నాడు. మాల దుఃఖం అగపడలేదు. తలయెత్తి వాసు ముఖంలోకి చూసింది అరక్షణం. మామూలుగా "నమస్కారం....అంది." ఇద్దరూ ఒకర్ని ఒకరు చూసుకుంటూ వుండిపోయారు."        
    "మాలా..." అతనికి తెలియకుండానే రెండుచేతులూ చాచాడు. నెమ్మదిగా అతినెమ్మదిగా దగ్గిరకు వచ్చిందేకాని అతని చేతుల్లో వాలిపోలేదు.
    మాలలో యేదో మార్పు కన్పించింది వాసుకి.
    వీరభద్రం పరిగెత్తుకొచ్చాడు.
    అసలే తెల్లగా వుండే మాల చిక్కి మరీ తెల్లగా బొమ్మలాగా కన్పించింది వీరభద్రానికి.
    ఇంటికి తీసుకు వచ్చేశారు.
    వాసుకి ఓ చిన్న కంపెనీలో వుద్యోగం దొరికింది, నెలకి వంద రూపాయలు జీతం మీద, సాయంత్రం మరో రెండు ట్యూషన్లు చెప్తూంటే మరో ఇరవై దొరుకుతోంది. రాత్రి భోజనం చేసి లాయర్ కృష్ణమూర్తిగారి దగ్గరకివెళ్ళి "జాబ్" వర్కు చేస్తున్నాడు. రోజూ రెండూ మూడూ దొరుకుతుంది, ఒక్కొక్కరోజు ఇంకా యెక్కువే దొరుకుతుంది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra