Home » Chandu harshavardhan » The Cell


    సోదరి సుమతికి నా కడసారి నమస్కారాలు చెప్పండి.
    
                                                                                                             ఇట్లు   

                                                                                                          అభాగ్యుడు
                                                                                                             శ్రీహరి."
    ఈ ఉత్తరం చదివి నేను క్షణం చలించి పోయాను. "సోదరి సుమతికి నా కడసారి నమస్కారాలు చెప్పండి" ఈ చివరిమాటలు నా చెవుల్లో మారుమ్రోగుతున్నాయి.
    "సుమతీ..." గట్టిగా కేక పెట్టాను. ఇంట్లోంచి సుమతి పరుగున వచ్చింది.
    "సుమతీ.... శ్రీహరి నీకు తెలుసా?" సూటిగా అడిగాను. నాకళ్ళ తీక్షణతకి తట్టుకోలేక తలవంచుకుందామె.
    "ఊ......చెప్పవే...." ఈసారి మరింత కోపంగా అడిగాను.
    అయినా సుమతి తల ఎత్తలేదు. తను తప్పు చేసినప్పుడు బదులు చెప్పదు సుమతి. జరిగింది ఊహించాను. అభ్యుదయ రచయిత అర్ధాంగి వాళ్ళిద్దరిని విడదీసిందంటే ఇక-నా రచనలకి అర్ధం లేదనిపించింది.
    నా రచనలు ఇష్టపడి, కులమతాలు పక్కకునెట్టి నన్ను ఆదర్శ వివాహం చేసుకున్న సుమతి అలా ప్రవర్తించిందంటే నమ్మలేక పోయాను. కాని ఆమె మౌనం నమ్మేలా చేసింది. ఆ క్షణంలో సుమతి నా కళ్ళకు ఎన్నో యుగాల అట్టడుగు మనిషిలా కనిపించింది. కోపంతో వూగిపోయాను.
    "సుమతీ! నువ్వు చేసిన పని దేవుడు కూడా హర్షించ లేడు. కనీసం పాపభీతన్నా నీకు లేకపోయిందా! నూరుఅబద్దాలాడి అయినా ఓ పెళ్ళి చెయ్యమంటారే. అలాంటిది నువ్వు చేసిందేమిటి? ఆ జంటని విడదీయటానికి నీకు మనసెలా వొప్పింది. చూడు నువ్వు చేసిన పనికి ఫలితం..."
    "వద్దండి.....అంతంత మాట లనకండి.....వాళ్ళని విడదీయాలన్న ఉద్దేశంనాకు లేదండి. కాని ఆ పరిస్థితిలో నేనలా చెయ్యక తప్పలేదు....." సుమతి కళ్ళ నీళ్ళు పెట్టుకుంది,
    "హు పరిస్థితి.....పరిస్థితులకు బానిసయితే మానవ జన్మకు అర్ధంలేదు, పిరికిదానిలా పరిస్థితికి తలవంచావా! మన ప్రేమ ఎలా ఫలించింది. మనకు లేని పరిస్థితి వాళ్ళకు వచ్చిందా? మన పెళ్ళికి ఎన్ని అడ్డంకులు వచ్చాయి. పెద్దలు ఒప్పుకుంటే అయ్యిందా మన పెళ్ళి. శాస్త్రోక్తంగా జరిగిందా....!
    ఆరు నెలలు సాహసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారు అంటారే! అలాంటిది నీ తెగింపులో కొంతన్నా నీ స్నేహితురాలికి లేకపోయిందా!"
    "ప్లీజ్.....నేను చెప్పేది వినండి....మాటలతో నన్ను హింసించకండి......నేను చేసింది తప్పే అయితే మీ ఇష్టం వచ్చిన శిక్ష విధించండి.
    శ్రీహరి మనస్తత్వం నాకు బాగా తెలుసండి. చిన్న పిల్లాడి మనస్తత్వం అతనిది. ప్రతి చిన్న విషయాన్ని సీరియస్ గా తీసుకుంటాడతను. అతని పసి మనస్తత్వం దాన్ని ఆకట్టుకుంది. అతని అర్ధాంగి అయ్యి అతన్ని లాలించాలి అని, అతన్ని సుఖపెట్టాలనీ అనుకుంది. కాని శ్రీహరి తల్లి దాని మనసు మార్చేసిందండి. శ్రీహరి అమాయకుడని. అతన్ని వదిలి పెట్టమని, అతని మీద వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, అతని జీవితం నుంచి దాన్ని తొలగి పొమ్మని ప్రాధేయపడింది.
    తమ తొలగిపోవటం అతని పాలిట వరం అవుతుందనుకుంది. తల్లిదండ్రులు కోరిన పిల్లని చేసుకుని అతను సుఖపడతాడని అనుకుంది.
    అతన్ని కాదని తను చెప్పలేక, వాళ్ళని విడదీసే పని నా కప్పజెప్పింది. స్నేహితురాలిగా దాని మాట కాదనలేక పోయాను. ఇప్పుడు చెప్పండి, ఆ పరిస్థితులో నేనలా చేయటం తప్పంటారా?..."
    "సుమతీ! తరతరాలుగా ఇది జరుగుతున్నదే. ప్రేమికులను విడదీసి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తూనే ఉన్నారీ పెద్దలు. చిన్నదానివైనా నువ్వు ఆ పెద్దలకేమీ తీసిపోలేదు.
    విడదీయటం వల్ల అతను సుఖపడుతున్నాడని అనుకున్నావా? అది అతని పాలిట శాపమయ్యింది.
    రచయితగా నే నేదో సాదిస్తున్నాను అనుకున్నాను. నిన్ను మార్చలేని నేను ఈ సమాజాన్నేం మార్చగలను సుమతీ! ఇంటగెలవలేనివాడు రచ్చనెలా గెలుస్తాడు?"
    అనగానే, టీపాయి మీది నా అభిమానుల వుత్తరాలు నన్ను ఎగతాళి చేస్తున్నట్టు ఎగిరిపోయాయి.
    
                                     * * *

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra