Home » Lalladevi » Ardha Manavudu


    మరొకరినించి తనకు అందిరావలసిన అనుభవాలను అందుకునేందుకు ముందుగా వారి అనుమతితీసుకోవాలన్నది నాగరికుల సంప్రదాయం.
    అతడు నాగరిక ప్రపంచం తెలియని ప్రకృతి పుత్రుడు. అందునుంచి నిస్సందేహంగా మాలతిని తిరిగి తన బాహువులతో బంధించాడు.
    అతడు జీవితంలో అనుభవించిన ఒంటరితనాన్ని మరిచేందుకు ఒకతోడు కావాలనుకుంటున్నాడు. అమృత ప్రాయమయిన స్నేహం అతనికి కావాలి. మనిషిని మహోన్నతుడుగా మార్చే మైత్రికోసమే అతడు అలాచేస్తున్నాడు. అంతకుమించి యౌవనవతి అయిన ఒక స్త్రీని తన బాహువులలో ఉంటే ఏమి చేయాలో అతనికి తెలియదు. అందునుంచి అతడు పసివాడు, పవిత్రుడు.
    అభ్యంతరం చెప్పవలసిన అవసరం మాలతికి కన్పించ లేదు. అభ్యంతరం చెప్పినా అతడిని ఎదిరించి తాను సాధించగలిగింది ఏమీ లేదనిపించింది.
    అది ఒంటరిచోటు. అతడు అమితమయిన బలశాలి. ఎదిరించి తాను నిలువలేదు. తను నాగరికలోకంతో సంపాదించుకున్న తెలివితేటల్ని ప్రదర్శించి బయటపడవచ్చు. అలాంటి ప్రయత్నం ప్ర్రారంభిస్తే అతడిని గాయపరచవలసి రావచ్చు. ఆ ప్రయత్నం ప్ర్రారంభించాక అతడు తనను విరోధిగా భావించి ఎదురు తిరుగుతాడు. అలా జరగటం మంచిదికాదు.
    అటువంటి ప్రయత్నాలు జరుగకూడదు. మైత్రీ భావానికి అతడు బాలుడల్లే లొంగిపోతాడు. కాని తనను శత్రువర్గంగా భావిస్తే మృగప్రాయుడవుతాడు హతమార్చేందుకు ప్రయత్నిస్తాడు.
    అందునుంచి మాలతి ఆస్పర్శను మైత్రీభావంతో స్వీకరించి ఊరుకుంది. అతనితో పాటుగా ముందుకు అడుగులు వేయటం ప్రారంభించింది.
    ఇద్దరూ కలిసి గుహ వెలుపలకు వచ్చారు.
    అప్పటికి లోక బాంధవుడు తన వెలుగు కిరణాలతో మంచు పర్వతాల్ని ముంచెత్తుతున్నాడు. హిమసానువుల గిరిశిఖరాలు వెండి కొండల్లా తరంగిత మవుతున్నాయి. గాలిలో రవంత వెచ్చదనం వచ్చింది.
    అతడు గృహవెలుపలకురాగానే ఒకసారి తలఎత్తి ఆలోయ చుట్టూ ఉన్న ఎత్తయిన గిరిశిఖరాలవంక చూచాడు. అతనిలో ఆనందం తాలూకు చైతన్యం వెల్లువలా పొంగిపొరలుతోంది.
    ఆ ఆనందవివశత్వంలో కెప్టెన్ మాలతిని విడిచిపెట్టి అమతమయిన వేగంతో ముందుకు సాగాడు.
    ఒక వంకకు చేయెత్తి చూపుతూ చిత్రమయిన శబ్దం చేయసాగాడు. అతడు తనకు ఏదో చూపాలని ప్రయత్నిస్తున్నాడని అర్ధమయింది మాలతికి. ఆ వంకకు నడవసాగింది.
    తన మనోగతాన్ని గ్రహించిన ఆమెవంక ఆరాధనగా చూస్తూ ఆ వంకకు బయలుదేరాడు ఆ విచిత్ర మానవుడు. తాను చూడబోయే ఆ విచిత్రంలో కొన్ని ఊహిస్తూ అతనిని అనుసరించి వెళ్ళసాగింది కెప్టెన్ మాలతి.
    అతడు లోయలోంచి ఎత్తయిన గిరి శిఖరం మీదికి అవలీలగా ఎక్కేయటం ప్రారంభించాడు. నేరుగా ఎక్కేందుకు వీలుకానిచోట అతడు చిత్ర విచిత్రమయిన పద్దతులను అవలంభిస్తూ పురోగమించాడు. ఒక్కొక్కచోట ఒక్క ఉదుటున పది పన్నెండు అడుగుల ఎత్తుకి డేగలాగ ఎగిరిపోవడం. ఒక్కోచోట ఇరవై అడుగుల వెడల్పున్న అగడ్తల్ని దూకేయటం, రాళ్ళమద్యనించి పుట్టుకొచ్చి ఒత్తుగా పెరిగిన వృక్షాల కొమ్మల్ని పట్టుకుని వ్రేలాడుతూ కాళ్ళతో మరొక ఆగడ్త అంచుల్ని అందుకోవటం. ఇలా మునుముందుకు పోవటం ప్రారంభించాడు.
    అతనికి ఎటువంటి శిక్షణ లేకుండానే ఒలిపింక్ పోటీలకు తీసుకుని పోతే అథ్లెటిక్స్ లో అమెరికాకు ఒక్క బంగారు పతకం కూడా లేకుండా కొట్టుకొచ్చేయగలడనిపించింది కెప్టెన్ మాలతికి.
    కాని తాను మాత్రం ఆ ప్రయోగాలలో ఒక్కటి కూడా చేయలేని ఆశకు రాలయిపోయి చూస్తూవుండిపోయింది. ఆమె కూడా తనలాగే అవరోధాలన్నింటిని అధిగమించుతూ వెంటవంటి వచ్చేస్తోందని భావించాడు ఆవిచిత్ర మానవుడు.
    కాని అలా చేయటం సాధారణ మానవ సమాజంలో ఇమిడిపోయిన వారికి ఎంత సాధ్యమో అతనికి అర్ధంకాలేదు. కొంతదూరం పోయిన తనతోపాటుగా రావలసిన స్నేహితులు వెనుక చిక్కిపోవటాన్ని గమనించాడు.
    జిమ్నాస్టిక్స్ క్రీడాకారులు చేసే విన్యాసాలతో అద్వితీయమయిన ప్రయోగాలను సునాయాసంగా నిత్యం అలవాటులో ఉన్నట్లుగా ప్రదర్శించిన ఆ విచిత్ర మానవుడు వెళ్ళినంత వేగంగానూ తిరిగివచ్చాడు.
    తన స్నేహమయి అలా ఎందుకు నిలిచిపోయిందో అతడికి రవంత అయినా అర్ధం కాలేదు. తనతోపాటు రావలసిందని సైగలు చేస్తూ తిరిగి ముందుకు ప్రయాణమయినాడు.
    మాలతి మాత్రం నిస్సహాయురాలయి అలాగే నిలిచి పోయింది. అతడు ఆమె నిస్సహాయతను అర్ధం చేసుకుందుకే కొంత సమయం పట్టింది. కాని అర్ధంచేసుకున్న తరువాత ఆమెను చేతులతో ఎత్తుకుని తీసుకుపోవడం కాస్సేపయినా పట్టలేదు. కెప్టెన్ మాలతి అతని విశ్వాసాలమీది పూర్తి విశ్వాసంతో అతని చూపులలో గువ్వపిట్టలా ఇమిడిపోయి నిశ్చింతగా కళ్ళు మూసుకుంది.
    కొన్ని ప్రాణులు బిడ్డల్ని కన్న తరువాత కొంత కాలం పాటు వాటి విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తాయి వాటికి తమంతట తాముగా ఈ ప్రపంచంలో ఆబతికే తెలివి తేటలు సామర్ధ్యమూ వచ్చేంత వరకూ కంటికి రెప్పలా కాపాడుకుని ఆ తరువాత ఈ విశాల ప్రపంచంలోకి వాటి దారిన వాటిని వొదిలేస్తాయి.
    అందుకా తల్లి ఇచ్చే తర్ఫీదులో తెలివిగా బ్రతికేసామర్ధ్యాన్ని విరోధి ప్రాణులనుంచి తనను తాను రక్షించుకునే పాటవాన్ని పొందిన పిల్లలు తల్లినించి వేరుపడతాయి తమ అదృష్టాన్ని అవకాశాన్ని అన్వేషించుకుంటూ సువిశాలమయిన ప్రకృతిలో అంతర్భాగాలయిపోతాయి. తమదారిన తాము వెళ్ళిపోతాయి.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra