Home » Mainanpati bhaskar » Bhama Kalapam

 

    చల్లపతి చప్పరించాడు. "అయ్యో! రూలు ప్రకారం ఇంకో రెండ్రోజులు జైల్లో ఉండి ఉంటేనే గానీ పెన్షను రాదే? అయినా చూద్దాం లెండి? అప్పుడు జైల్లో బ్రిటిష్ వాళ్ళు మిమ్మల్ని పెట్టిన చిత్రహింసలకి చెయ్యి చచ్చుబడిపోయింది గదా.......ఆ పాయింటు మీద లాగుదాం లెండి!"


    "నా కేండుకయ్యా పెన్షను! అబ్బాయి నృత్య ప్రదర్శనల మీద వచ్చే దానితో ఏదో జరిగిపోతుంది. భగవంతుడు చల్లగా చూస్తున్నాడు. అదే చాలు!"


    "అసలు అందుకే వచ్చాను నేను. ఇంకో మూన్నెల్లలో మా సంస్థ వార్షికోత్సవం ఉంది. భరత్ డాన్సు ప్రోగ్రాం పెడితేనే తను అధ్యక్షత వహించడానికి ఒప్పుకుంటానని చెప్పారు. అబ్బాయి ఉన్నాడా?"


    గదిలో ఉండి ఇదంతా వింటున్న భరత్ నవ్వుకున్నాడు. తన మీద అభిమనంతో ఏదో ఒకవిధంగా తనకు మంచి చేద్దామనుకుంటున్నారన్న మాట మినిస్టరు గారు.


    "నమస్కారం!" అంటూ బయటికి వచ్చాడు.


    అతన్ని గాడంగా, నాటకియంగా కౌగలించుకున్నాడు చలపతి. "నువ్వు అపర భరత మహా మునివని మెచ్చుకున్నారు బాబూ మంత్రిగారు. మా ఫంక్షనులో నీ ప్రోగ్రాం ఉండి తీరాలి."


    "తప్పకుండా!"


    జేబులోనుంచి పెద్ద లెదర్ పర్సు తీశాడు చలపతి. ఐదు వంద రూపాయల నోట్లు తీసి అందించాడు. "ఇది అడ్వాన్సు! హాలు బుక్ చెయ్యడానికి వెళుతున్నాను. మర్చిపోబాకేం!"


    సరేనన్నట్లు తల ఉపాడు భరత్.

 

    తను వచ్చిన పని అయిపోయినా , అక్కడ నుంచి కదల లేదు చలపతి. ప్రభువుల కటాక్ష విక్షణాలు ఎవరి మీదయినా ప్రసరిస్తున్నప్పుడు వారిని తను కూడా పొగిడితే, ప్రభువులకి తన మీద కూడా దయ కలిగే అవకాశం ఉందని అతనికి అనుభవపూర్వకంగా తెలుసు. అందుకని......అందుకని ఊక దంపుడు మొదలెట్టాడు.


    "మీ నాన్నగారి గొప్పతనం నీకు తెల్దుగానీ, బాబూ, చాలా గొప్పోరులే. వందెకరాల మాగాణి, పదెకరాల మామిడి తోటా, నాలుగిళ్ళు ఉండేవి. అన్ని దేశం కోసం అర్పించేశారు. కళలంటే కూడా ఎంత అభిమానమో వారికీ. కళల కోసం దేశం కోసం తను కన్నా కలల కోసం యావదాస్తి కరుచు పెట్టేశారయ్యా. అది మనిషి జన్మెత్తినందుకు సార్ధకత. మాలాగా నిస్వార్ధంగా దేస్సేవ చేసే వాళ్ళు ఇప్పుడేరి.........అంతా పదవుల కోసం, పవరు కోసం కొట్లాడుకునే వాళ్ళే గానీ, ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు తెల్లోళ్ళు ఎన్ని హింసలు పెట్టారో తెలుసా బాబూ, చేతులకి కాళ్ళకి గోళ్ళలో గుండు సూదులు గుచ్చారు. బట్టలన్నీ ఇప్పదియించి, ఒక రోజు రోజంతా మంచు దిమ్మల మీద పడుకోబెట్టాడు. అప్పుడే వారికి చెయ్యి చచ్చుబడిపోయింది."


     పొగడ్తలు వింటే చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది సదాశివరావుగారికి.

 

    "నాయనా!" వాళ్ళ ప్రోగ్రాం ఎప్పుడో గుర్తుగా రాసి పెట్టుకో ఎక్కడన్నా!" అన్నాడు భరత్ తో.

 

    భారతి పెన్నుతో కాలెండరు మీద ఆ తేది చుట్టూ గీత గిసి రాసి పెట్టింది.


    అందరికి పొడుగాటి నమస్కారాలు పెట్టి, కారెక్కాడు చలపతి.

 

                                                                   ---------------------

 

    సదాశివరావుగారి గురించి చలపతి చెప్పినవేవి అతిశయోక్తులు కావు. సదాశివరావు వాళ్ళ నాన్నగారికి ఒక్కడే కొడుకు. అయన తండ్రి బారిస్టరుగా వుండి రెండు చేతులా ఆర్జించాడు. పెద్ద పెద్ద జమిందారుల కేసులే ఎక్కువగా చూసేవాడుట. అయన కేసు తిసుకున్నాడంటే గెలుపే తప్ప ఓడడం అంటూ ఉండేది కాదు.


    సదాశివరావు గారు చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెరిగారు. సిల్కు బట్టలు తప్ప వేసుకునే వారు కాదు. విద్యార్ధిగా ఉండగానే గాంధీగారి పిలుపు నందుకుని చదువు మానేసి స్వాతంత్ర్యోద్యమం లోకి దూకడంతో అయన జీవితం మారిపోయింది.


    అయన స్వతహాగా కవి, కళాకారుడు. అయితే అయన ఎప్పుడూ భుక్తి కోసం కవిత్వం రాయలేదు. మొదట్లో రక్తికోసం, తర్వాత దేశ విముక్తి కోసం , ఇప్పుడు కేవలం ముక్తి కోసం రాస్తున్నారు. అయన రాసిన దేశభక్తి గీతాలు అప్పట్లో ప్రతి రాజకీయ సభలోనూ పాడేవాళ్ళు.


    దేశభక్తి తోనే అయన కొడుకులకి విజయ భరత్ అని, కూతురికి స్వతంత్ర్య భారతి అని పేర్లు పెట్టుకున్నారు. ఆ కళా హృదయంతోనే కొడుక్కి నృత్యం , కూతురికి వీణా నేర్పించారు.


    అప్పట్లో ఆయనలాంటి మహానుభావులెందరో స్వతంత్య కోసం తపించిపోయారు. నిస్వార్ధంగా కృషిచేసి ధన, మాన ప్రాణాలను త్యాగం చేసి స్వాతంత్ర్యం తెచ్చారు.


    కానీ, అంత కష్టపడి సాధించిన స్వాతంత్ర్యం ఇంత వికృతంగా మారుతుందని, చలపతి, రత్నాకరరావు లాంటి వాళ్ళు అడ్డూ అదుపూ లేకుండా చెలరేగి పోవడానికి లైసెన్స్ గా మారుతుందని వాళ్ళు ఉహించలేకపోయారు.


                                                                         --------------

 

    మర్నాడు పొద్దున్న లేచి లేవగానే , తన హొటల్ ని సర్ ప్రయిజ్ ఇన్ స్పెక్షన్ చెయ్యాలని నిశ్చయించుకుంది సుదీర.


    గబగబ స్నానం ముగించి తేలిగ్గా మేకప్ అయి, క్రీమ్ కలర్ వెల్వెట్ కార్డ్ రాయ్ జీన్సు వేసుకుని, ఎరుపు రంగు చెక్స్ షర్టు టకప్ చేసుకుంది.

 

    పోర్టికోలో నిలబడి వుంది సీత కొత్తగా కొన్న బెంజ్ కారు. డీజిల్ ఇంజను అమర్చి ఉంది దానికి. కొనేటప్పుడు లక్షలు గుమ్మరించినా, ఆ తర్వాత మెయిన్ టెయిన్స్ ఖర్చు చాలా తక్కువే అవుతుంది దానికి.


    పోర్టికోలోనే నిలబడి వున్నాడు సారధి.


    "సారధి!" అని పిలిచింది సుదీర.

 

    అతడు దగ్గరి కొచ్చాడు.


    "ఇవాళ కోర్టుపని ఎక్కువ ఉందా నీకు? లేకపోతే నాకు సాయంగా రా!"

 

    "తప్పకుండా! ఇట్ ఈజ్ ఏ గ్రేట్ ప్లెజర్!" అన్నాడు సారధి. ఈ సుదీర కోసం ఎన్ని పనులున్నా వదిలేయ్యగలడు తను.

 

    ఇద్దరూ కారేక్కారు. అతను డ్రైవింగ్ సీటులో కూర్చున్నాడు. సుదీర వెనక సీటులో కూర్చుని, అతని భుజాల ,మీదుగా కొంచెం ముందుకు వంగి చెప్పింది. "మన హొటల్ కి పోనియ్!"

 

    ఫ్రెష్ గా , టూత్ పేస్ట్ సువాసనతో కలిసి వస్తోంది ఆమె మాట.


    "ఒకే!" అన్నాడు సారధి.


    పదినిముషాల తర్వాత హొటల్ చేరింది కారు. అటూ ఇటూ చూడకుండా రిసెప్షన్ లో ఉన్నవాళ్లు చేస్తున్న నమస్కారాలు అందుకోకుండా సుడిగాలిలా నేరిగా బార్ లోకి వెళ్ళిపోయింది సుదీర.


    బార్ తాలూకు హెడ్ వెయిటర్ జంకుతూ లేచి నిలబడ్డాడు.


    ఈలోగా సారధి కిచెన్ లోకి వెళ్ళిపోయాడు.

 

    ఆ హొటల్ మీద ఇదివరకు ఒకసారి జరిగిన ఇన్ కమ్ టాక్స్ దాడి కూడా అంత పకడ్భందిగా, మెరుపు వేగంతో జరగలేదు.

 

    బాల్ అల్మారాలో ఉన్న బిల్లు బుక్కులూ, రసీదులు వోచర్లు తీసి పరిశీలించింది సుదీర. అక్కడ చిన్న లిక్కరు సీసాలు లెక్క పెట్టింది. స్టాకులో ఉండవలసిన దానికంటే ఎక్కువ విస్కీ సీసాలు, వాటిలో కొన్ని చౌకరకంవి. వాటిని హెడ్ వెయిటర్ బజారులో నుంచి తెచ్చి బారులో అమ్మి తనే డబ్బు చేసుకుంటున్నాడు.


    వేరేగా పెట్టి ఉన్న ఒక సీసా తీసి వాసన చూసింది. అదేం లిక్కరో అంతుబట్టలేదు. అప్పుడు స్పురించింది. ఆమెకు ఒక్కొక్క పెగ్గులో కొన్ని గ్రాములు తగ్గించి సర్వ్ చేస్తూ మిగిలిన ద్రవాన్ని ఇలా సీసాల్లో పోసుకుంటున్నారు. ఇది వాళ్ళు ఇళ్ళకు పెట్టుకుపోవడానికి పనికి వస్తుంది.

 

    సారధి కిచెన్ లో చూశాడు. మొదటి క్వాలిటి కూరగాయలు కొన్నట్లు రసీదులు ఉన్నాయి గానీ, ఇక్కడ ఉన్నవి మోండా మార్కెట్ లో సాయంత్రం పూట మిగిలిపోతే తగ్గింపు ధరకి అమ్మే అడుగు బోడుగు రకంవి. పుచ్చులు, చాలా ఉన్నాయి.


    అక్కడ నుంచి ఇద్దరూ మూడో అంతస్థుకి లిప్టులో వెళ్ళి రూమ్ నెంబరు 69 ముందు ఆగారు.

 

    అసహనంగా తలుపు కొట్టింది సుదీర.

 

    హొటల్ మేనేజర్ కళ్ళలో ప్రాణ భయం కనబడింది. అడ్డం వస్తూ, "మెడమ్! కస్టమర్స్ కి అసౌకర్యం కలిగిస్తే మన హొటల్ ప్రిస్టేజి దెబ్బ తిని పోతుంది" అన్నాడు.


    "మన హొటల్ ప్రిస్టేజి పెంచడానికే ఈ తాపత్రయమంతా!" అని మళ్ళీ తలుపు తట్టింది సుదీర. "ఎవరున్నారు లోపల?"


    విహ్వలంగా చూశాడు మేనేజరు. "మిస్టర్ అండ్ మిసెస్ అరుణాచలం ఉన్నారు, మెడమ్! ఇది చాలా తీవ్రమైన.........."

 

    తలుపు తెరుచుకుంది. అరుణాచలం తల బయటికి పెట్టి చూశాడు. అతని మొహంలో ఆగ్రహం కనబడుతోంది. "వాట్ ద హెల్ డూ యూ వాంట్?" అన్నాడు ఆగ్రహంగా.

 

    "ఒకసారి మిసెస్ అరుణాచలంతో మట్లాడాలి" అంది సుదీర.

 

    మేనేజర్ మొహానికి చెమట పట్టింది.


    "మా ఏకాంతానికి భంగం కలిగించి డిస్టర్బ్ చేస్తున్నందుకు మీమీద న్యుసేన్స్ కేసు పెడతాను" అన్నాడు అరుణాచలం సుదీరతో.

 

    సారధి ముందుకు వచ్చాడు. "తప్పకుండా పెట్టండి. మీకోసం కోర్టులో కాచుకుని ఉంటాను." అని తలుపు నెట్టి "హాలో, మిసెస్ అరుణాచలం!" అన్నాడు వెటకారంగా. అతని చేతిలో ఉన్న కెమెరా ప్లాష్ వెలిగింది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra