Home » Suryadevara rammohan rao » త్రినేత్రుడు-2


    1954లో పోటీలో ప్రవేశపెట్టిన మోటార్ సైకిల్ పేరు ఆర్.సి. 142 రేసర్. బెన్లీ మోటార్ సైకిల్ ని ఇంప్రూవ్ చేయగా తయారైన మాస్టర్ పీస్ ఆ మోటార్ సైకిల్. మీకు ఇంట్రస్ట్ వుంటే కంపెనీ మ్యూజియంకి వెళితే అది మీకు కనిపిస్తుంది ఇప్పుడు.

    ఎప్పుడైతే పోటీలో ప్రధమ స్థానం హోండా కంపెనీ మోటర్ సైకిల్ కి వచ్చిందో ప్రపంచం వ్యాప్తంగా ఆ కంపెనీ సేల్స్ విపరీతంగా పెరిగిపోయాయి.

    ఈ మధ్యనే మీ దేశం వచ్చిన కెనెటిక్ హోండా స్కూటర్ కి ఎలక్ట్రిక్ స్టార్ట్ వుంది. అంటే కిక్ కొట్టకుండానే కేవలం కారులా ఇగ్నీషన్ కీ తిప్పితే ఇంజన్ స్టార్ట్ అవుతుంది. అది 1950లోనే హోండా తన కంపెనీలో తయారు చేశాడు.

    త్రినాధ్ ఒక్కసారి షాక్ తిన్నాడు.

    అంటే- 1950లో జపాన్ లో కనిపెట్టిన సాంకేతిక పరిజ్ఞానం ఇండియాలో 1987లో కొత్తదాని క్రింద లెక్కా?

    "నేను సిగ్గుపడుతున్నాను సార్! ఎందుకో తెలుసా... 1950లో జపాన్ సాధించిన సాంకేతిక అభివృద్ధి 1987లో గాని మా దేశం సాధించలేకపోయింది. ఆ సాధించడం కూడా యీ హోండా కంపెనీ కొలాబరేషన్ తో..."

    వృద్ధుడు సిగ్గుపడుతున్న త్రినాధ్ కేసి ఆశ్చర్యంగా చూశాడు.

    "అది 1960వ సంవత్సరం. హోండా కంపెనీ అభివృద్ధి సరికొత్త మలుపు తిరిగిన గొప్ప సంవత్సరం.

    You meet the nicent people on a honda- ఈ ఎడ్వర్ టైజ్ మెంట్

    స్లోగన్ తో హోండా ప్రపంచ మార్కెట్ పై విరుచుకుపడింది.

    హోండా కంపెనీ స్లోగన్ ప్రపంచ మోటార్ సైకిల్ రైడర్ పై తన సమ్మోహనాస్త్రాన్ని విసిరి విజయం సాధించింది. అందుకు హోండాకు ఎందరో- ఎందరో- మేధావులు, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు సహకరించారు."

    "అసలు బాస్ లో కృషి, దీక్ష వుంటేనే గదా సహచరులు సహకరించేది?" త్రినాధ్ తన అభిప్రాయంగా అన్నాడు.

    వృద్ధుడు చిరునవ్వుతో మొదలెట్టాడు.

    "హోండా మీద రైడ్ చేస్తే నైస్ పీపుల్ ని మీరు కలుసుకోగలరు అనే స్లోగన్ కి ఉదాహరణగా లిటిల్ సి 100, సి 110 విడుదలయ్యాయి. అవి మీ దేశంలో టూ వీలర్స్ ఉత్పత్తిలో నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించుకున్న బజాజ్ కంపెనీ బజాజ్ ఎం 50, ఎం 80ని పోలి వుంటాయి.

    ఇకపోతే హోండా కంపెనీ సరికొత్త వాహనాలు అటు యూరోపియన్, ఇటు అమెరికా టూ వీలర్స్ మార్కెట్ ని కైవసం చేసుకున్నాయి పూర్తిగా.

    సరీగ్గా కంపెనీ పెట్టిన పదవ సంవత్సరానికి హోండా కంపెనీ తన వ్యాపార కార్యకలాపాల విస్తరణలో భాగంగా అమెరికాలో 'అమెరికా హోండా ఇన్ కార్పొరేషన్' పేరిట అక్కడ ఒక కంపెనీ ప్రారంభించింది. మొట్టమొదటిసారి అమెరికాలో సంచలనం సృష్టించిన హోండా మోడల్ సి 100 అది అమెరికన్ వినియోగదారుల్ని వెర్రెత్తించటమే గాక ఆ దేశపు టూ వీలర్స్ తయారుచేసే కంపెనీల్ని నిర్ధాక్షిణ్యంగా వెనక్కు తోసేసింది. అలా ఒక్క అమెరికాలోనేకాదు, ప్రపంచవ్యాప్తంగా జరిగింది. 

    ఇక రేసింగ్ పోటీల విషయానికొస్తే హోండా బండ్లు 16 ప్రపంచ ఛాంపియన్ షిప్స్ ని, 137 గ్రాండ్ ఫ్రీ విజయాల్ని చవిచూసాయి. వాస్తవానికి ఒక 1966లోనే హోండా బండ్లు 29 గ్రాండ్ ప్రిక్స్ విజయాల్ని చవిచూసాయి. అంతేకాదు- 1966 సంవత్సరపు ప్రపంచ అత్యున్నత ఐదు పోటీల్ని హోండా బండ్లు గెలుచుకున్నాయి.

    ప్రపంచ పోటీలకు వెళ్ళాలనుకున్న హోండా సరదాయే ఆ కంపెనీ ప్రొడక్ట్ కి విపరీతమైన అమ్మకాల్ని తెచ్చిపెట్టింది.   

    తరువాత పోటీలపై ఎక్కువ కాలాన్ని వృధా చేయడం హోండాకు ఇష్టం లేకపోయింది. అదే కాకుండా హోండా కంపెనీ బండి పోటీలకు వస్తుందని తెలిసి ఎందరిలోనో ఏడ్వటాలూ, మొత్తుకోలు, అసూయ, ఉక్రోషం, ఉన్మాదం తలెత్తటం మొదలెట్టాయి. పైపెచ్చు హోండా బండి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చుకుంది. ఇంకెందుకు ఆరాటం?

    అనుకోకుండా 1985లో హోండా తిరిగి పోటీకి సిద్ధపడ్డాడు. అప్పుడు హోండా బండిని రైడ్ చేసిన వ్యక్తి ప్రపంచ ప్రఖ్యాత రేసర్ ప్రెడ్డీ స్పెన్సర్ (అమెరికా) కప్పు అయితే గెలుచుకున్నాడు గానీ, తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో హోండా తీవ్రమైన వ్యధకు గురయ్యాడు. ఏది ఏమైనా ప్రపంచంలోని అత్యున్నత పోటీలన్నిటిలో మొదటి మూడు స్థానాలు హోండా గెల్చుకోవటానికి, ఆ బండిలోని పనితనం ఒక్కటే కారణం కాకపోవచ్చు. ఆ కంపెనీకి చెందిన డేర్ డెవిల్ రేసర్స్ డేవిడ్ తార్ పే, ఎరిక్ గెబోయిర్స్, ఆండ్రేయల్ హెర్ బేల చాకచక్యం, రిస్క్ నెస్ తోడయి వుండవచ్చు."

    ఎందుకో ఆ వృద్ధుడి కంఠం ఒకింత భారమైంది. అతని కళ్ళవెంట తడి... తడి వెనుక మెరుపు... త్రినాధ్ ఆ వృద్ధుడిలో వచ్చిన మార్పును మరో రకంగా అర్ధం చేసుకున్నాడు.

    "20 సంవత్సరాలలో 1,00,00,000 మోటార్ బైక్స్ ఉత్పత్తి చేసి ప్రపంచంలో నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించుకుంది హోండా కంపెనీ" వృద్ధుడు ఆగాడు.

    "హోండా కంపెనీ అంత అభివృద్ధి సాధించటానికి కారణం- ఆ కంపెనీ మోటార్ సైకిల్ తక్కువ ధరకు దొరకటం, ఈజీగా తోలగలగటం, సంక్లిష్టమైన డిజైనింగ్ లేకపోవడం, పెట్రోల బాగా ఆదా రావడం, చూట్టానికి ఎంతో ముచ్చటగా వుండడం, వీటన్నిటిని మించిన పటిష్టమిన్ నాణ్యతను అది కలిగి వుండడం కావచ్చు. ఆ మహానుభావుడి మేధస్సులో జీవం పోసుకున్న యంత్రాలు, ఈనాడు ప్రపంచమంతటా ప్రతి నగరంలో పట్టణంలో ప్రతి రోడ్ పై, రహదారిపై సంచరించటం తలుచుకుంటుంటే అమాంతం ఆయన కాళ్ళపై పడాలనుంది. ఒక్కసారి వార్ని దర్శిస్తే నా జన్మ ధన్యమవుతుంది. ఆ ఒక్కసారి వార్ని చూసిన ఉత్తేజం నాలో జన్మ జన్మలకు మిగిలిపోతుంది. కాని ఎడ్సెల్ పోర్డ్, గియొనాని, అకియొ మోరిటా, కాన్రాడ్ హిల్టన్, లీఆయకాక్కా, రాక్ ఫెల్లర్స్ లాంటి ప్రపంచ భాగ్యవంతులతో సమానమైన వారి దర్శనాన్ని కోరుకోవటం దురాశేమో..." త్రినాధ్ పైకే అన్నాడు.

    అతని కళ్ళలో తొంగిచూసిన అసంతృప్తి ఆ వృద్ధుడి దృష్టిని దాటి పోలేదు.

    "ఆ సాయ్ ఛిరో హోండా కూడా వృద్ధాప్యానికి అతీతుడేం కాదుగా! 1973లో తన 67వ ఏట కంపెనీ కార్యకలాపాల నుంచి తప్పుకుని బాధ్యతల్ని తన సంతానానికి అప్పజెప్పాడు."

    "ఇప్పుడా మేధావి కాలాన్ని ఎలా గడుపుతుంటారు?" త్రినాధ్ ఆసక్తిగా ప్రశ్నించాడు.

    "1988 జనవరికి ఆయన 81వ సంవత్సరంలో అడుగుపెట్టాడు. ఇంకిప్పుడు ఆయనేం చేయగలడు- కంపెనీకి సలహాలందించటం తప్ప....? ఇప్పుడాయన కంపెనీకి సుప్రీమ్ ఎడ్వైజర్. ఎప్పుడన్నా కంపెనీలో ముఖ్యమైన ఉత్సవాలు జరిగితే ఆయన వస్తుంటాడు" అని వృద్ధుడు ఆగిపోయి "నీకో తమాషా చూపించనా?" అన్నాడు వున్నట్టుండి.

    త్రినాధ్ చూపించమన్నట్టు తలూపాడు. ఆ వృద్దుడు తన ఖాళీ చేతుల్ని త్రినాధ్ కి చూపించి ఓసారి గాల్లో చేతుల్ని ఊపి గుప్పిట తెరిచాడు. అందులో హోండా ఎకార్డ్ కారు కీ వుంది.

    త్రినాధ్, గుప్తా ఇద్దరూ థ్రిల్లింగ్ గా ఫీలయ్యారు. "ఇలాగే హోండా అప్పుడప్పుడు మేజిక్స్ చేసి తన సన్నిహితుల్ని ఆనందపరుస్తుంటాడు. ఆయనకు మేజిక్ అంటే భలే ఇష్టం" అని తన చేతిలోని కీని త్రినాధ్ కి అందించాడు ఆ వృద్ధుడు.

    దానర్ధం అప్పుడు తెలియలేదు త్రినాధ్ కి.

    "కారు, మోటార్ సైకిల్ స్పేర్ పార్ట్స్ హోండా టెక్నాలజీలో ఇండియాలో తయారు చేసేందుకు హోండా కంపెనీ కొలాబరేషన్ కోసం ప్రయత్నించకూడదూ?" ఆ వృద్ధుడు నెమ్మదిగా అన్నాడు త్రినాధ్ ని పరిశీలనగా చూస్తూ.

    "అంత అదృష్టమా...?" త్రినాధ్ ఒకింత నిస్పృహగా అన్నాడు.

    "ప్రయత్నించడంలో తప్పులేదుగా...? వృద్ధుడు అన్నాడు తిరిగి.

    "నిజమే... ప్రయత్నిస్తాను వచ్చినా రాకున్నా. మీ మేలు మాత్రం నేనెప్పటికీ మరువలేను" అన్నాడు త్రినాధ్ వృద్ధుడి వేపు కృతజ్ఞతగా చూస్తూ.

    "నేనా... నేనేం మేలు చేశాను?"

    "కొలాబరేషన్ కంటే గొప్ప మేలు చేశారు. ఎంతో ఓపిగ్గా ఈ వయసులో మహనీయుడు హోండా జీవిత చరిత్ర చెప్పి నాలో కొత్త ఉత్సాహాన్ని, పట్టుదలను, దీక్షను పురికొల్పారు. మీకివే నా ప్రణామాలు."

    ఈరోజు నుంచే నేను రోజుకి ఇరవై గంటలు శ్రమిస్తానని, తన పారిశ్రామిక సామ్రాజ్యాన్ని విస్తరించుకొనే బృహత్తర యజ్ఞంలో తానో సమిథనై పోతానని- కొన్ని వేల లక్షలమంది నిర్భాగ్యులైన నిరుద్యోగులకు జీవనోపాధిని చూపిస్తానని- తన తల్లికి, గురువుకు, తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు మనస్సులోనే.

    అప్పుడు లేచాడు త్రినాధ్.

    అతని కళ్ళలో ఇప్పుడో కొత్త వెలుగు... ఈ ప్రపంచాన్ని జయించగలనన్న విశ్వాసం ఆ వెలుగు చివర.

    ఆ వృద్ధుడు లేచాడు.

    "నేను వెళ్ళివస్తాను. మీరిప్పుడే వెళ్ళి నకసోనే కొరిసా అనే ఎగ్జిక్యూటివ్ ని కల్సి కొలాబరేషన్ కోసం రిక్వెస్ట్ చేయండి" అన్నాడా వృద్ధుడు అక్కడి నుంచి వెళ్ళేందుకు ఉద్యుక్తుడవుతూ.

    "అతనెవరు?-?" గుప్తా ప్రశ్నించాడు.

    "అతను... ఫారెన్ కొలాబరేషన్ వ్యవహారాలు చూసే ఆఫీసర్."

    "బొత్తిగా పరిచయం లేకుండానే?" త్రినాధ్ తన సందేహం వెలిబుచ్చాడు.

    "అక్కర్లేదు... వెళ్ళి కలవండి నేను చెబుతాను" అన్నాడు ఆ వృద్ధుడు జపనీస్ స్టయిల్ లో త్రినాధ్ ని దీవిస్తూ.

    ఆలోపు ఓ వ్యక్తి అటుగా వచ్చి ఆ వృద్ధుడ్ని చూసి అదిరిపోయి సెల్యూట్ చేశాడు. అక్కడ ఆయన ఎందుకు వున్నాడో అర్ధంకాక ఆ వ్యక్తికి అప్పటికే మతి పోయింది. వృద్ధుడు ఆ వ్యక్తికి సైగ చేసి బయటకు వెళ్ళిపోయాడు వేగంగా.

    త్రినాధ్, గుప్తా లేచి నకసోనే కొరిసా రూమ్ కి దారి అడిగి తెలుసుకుని ఆ వేపుకు సాగిపోయారు.

    కార్డ్ పంపిన క్షణంలోనే కొరిసా నుంచి కబురొచ్చింది త్రినాధ్ని, గుప్తాని లోపలకు రమ్మంటూ.

    అప్పటికే వాళ్ళిద్దరికి మతులు పోయాయి. లోపలకు వెళ్ళగానే కొరిసా త్రినాధ్, గుప్తాని సాదరంగా ఆహ్వానించి జపాన్ దేశపు ప్రాచీన పద్ధతిలో తయారు చేసే 'టీ' తెప్పించి యిచ్చాడు. ఆ 'టీ' ఇవ్వటం అంటే జపాన్ లో గొప్ప మర్యాద ఇవ్వటం క్రింద లెక్క.

    "మేం ఇండియా నుంచి వచ్చాం. కొలాబరేషన్ కోసం మిమ్మల్ని అర్ధించటానికొచ్చాం" త్రినాధ్ డైరెక్ట్ గా విషయంలోకి వెళ్ళాడు.

    "అలాగే- తప్పక మీ అభ్యర్ధన పాజిటివ్ గా పరిశీలిస్తాను" అవును... ఇంతకు మిమ్మల్ని నా దగ్గరకు వెళ్ళమని గైడ్ చేసిందెవరు?" కొరిసా ప్రశ్నించాడు.

    కొరిసా కళ్ళలో చిత్రమైన ఉద్వేగం ఉరకలు వేస్తోంది.

    "ఓ మహానుభావుడు- ఎవరో తెలియదు- వారి సలహామీదే మీ వద్దకు వచ్చాం" అన్నాడు గుప్తా.

    "అతనెవరో తెలుసా?" కొరిసా తమాషాగా ప్రశ్నించాడు.

    "తెలియదు." అన్నాడు త్రినాధ్.

    "నీ చేతిలో హోండా ఎకార్డ్ కారు కీ వుందా?" కొరిసా తిరిగి ప్రశ్నించాడు.

    "ఉంది..." అన్నాడు ఆశ్చర్యంగా.

    అవన్నీ ఎందుకడుగుతున్నాడో అర్ధంకాక తికమక పడుతున్నారు గుప్తా, త్రినాధ్ లు.

    "ఎవరన్నా ఒక కీ ప్రెజెంట్ చేస్తే ఏమిటి దాని అర్ధం?"

    త్రినాధ్ మౌనంగా వున్నాడు.

    "ఆ కీకి సంబంధించిన వస్తువును మీకు ప్రెజెంట్ చేసినట్లే గదా అర్ధం?"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra