Home » Suryadevara rammohan rao » Premaku Pettubadi Kavali


    సిటీలో ఫేమస్ పొలిటికల్ లీడర్ ఏకైక పుత్రరత్నం రవి! వాళ్ళ డాడీ ప్రతాప్ మాజీ ఎం.పి. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే.

 

    ఆయన తన కొడుకుమీద చాలా ఆశలు పెట్టుకున్నాడు.

 

    ఇన్నాళ్ళూ తన చుట్టూ అమ్మాయిలు సెక్స్ కోసం, డబ్బుకోసం తిరగారు. ఎవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్ళి అనే టాపిక్ ఎత్తకుండా జాగ్రత్తపడ్డాడు. నేటి కాలపు అమ్మాయిలకు వెయ్యి రూపాయల దగ్గర పదివేల రూపాయలు పడేస్తే  పెళ్ళికోసం బలవంతం చెయ్యరు. కావలిస్తే పెళ్ళయ్యాక కూడా రహస్యంగా సంబంధం పెట్టుకోవడానికి వాళ్ళు సంకోచించరు- రవి అనుభవం, ఆలోచనా విధానం అది!

 

    కానీ అన్విత విషయం అందుకు విరుద్ధంగా వుంది, ఎఅవి అన్వితను యిష్టపడ్డాడు. నచ్చిన అమ్మాయికి తను గెస్ట్ హౌస్ కి పిలిచి పార్టీ  ఇవ్వటం అలవాటు. కానీ అన్విత ఇచ్చిన పార్టీకి వెళ్ళాడు.

 

    "అన్వితను ఎలాగయినా పెళ్ళి చేసుకోవాలి....." అనుకున్నాడతను. అంత సులభం కాదన్న విషయం ఆ సమయంలో అతనికి తెలియదు!

 

    "నువ్వు అన్విత మీద మోజు పెంచుకోవడం ఆశ్చర్యంగా వుంది. ఒకపక్క మీ డాడీ హైలెవెల్ పొలిటికల్ సర్కిల్ లో పెళ్ళి సంబంధాలు చూస్తుంటే నువ్వు....." పక్కనున్న జిమ్ ఫ్రెండ్ రఘునాధ్ అన్నాడు.

 

    "లేదు రఘూ..... ఒకసారి కాలేజీకొచ్చి అన్వితను చూడు. నీకే  మతిపోతుంది. ఆమె బ్రీత్ టేకింగ్ బ్యూటీ! మానస సరోవరంలో ముంచి తీసిన మల్లెపూవ్వులా వుంటుంది. ఒక్కసారి ఆమెతో గడిచి చచ్చిపొయినా చాలదనిపిస్తుంది. ఈ జీవితానికి ఇన్ క్రిడబుల్ బ్యూటీ..... అలాంటి అమ్మాయితో సెక్స్ నాకిష్టం....." నిస్సంకోచంగా అన్నాడతను.

 

    "ఓన్లీ సెక్స్ కోసమేనా?"

 

    "ముందు సెక్స్.... తర్వాత మేరేజ్" సిగరెట్ పొగ గాలిలోకి వదులుతూ అన్నాడు రవి.

 

    మధ్య తరగతి జీవితం దూకుడుగా ప్రవహించే నదిపైన కట్టిన కర్రల వంతెన లాంటిది. దూరం నుంచి చూస్తే నది అందంగా కనిపిస్తుంది. కర్రల వంతెన కూడా అందంగానే కన్పిస్తుంది. కానీ కర్రల వంతెన మీద నడవాలంటేనే భయం. నదిలోకి చూడాలంటేనే భయం.

 

    కర్రల వంతెన జీవితం అయితే, నది ప్రేమ లాంటిది. ఆ కర్రల వంతెన మీంచి ప్రేమనదిలోకి దూకాలనే అందరికీ వుంటుంది. దానికెంతో ఆత్మస్థయిర్యం, సాహసం కావాలి. ఆ రెండూ తమకు పుష్కలంగా ఉన్నట్టు నటిస్తారు. మధ్యతరగతిలోంచి వచ్చిన యువకులు.

 

    అందుకే వాళ్ళలో ఎక్కువమంది ప్రేమ విషయంలో పరాజితులై, గంతకు తగిన బొంతల్ని కట్టుకుని, నిరాశా నిస్పృహలతో కాలక్షేపం చేస్తారు. జీవితంలో ఎక్కువ వేదాంతం వారి నోటినుంచే వస్తుంది.

 

    ఆ కారానికి చేమడిన వ్యక్తి రమణ! తను గొప్ప మంచివాడినని నమ్మించటానికి, రవి విషయంలో అన్వితకు హెచ్చరిక చేశాడు. కానీ అన్విత ఆ విషయం పట్టించుకోకపోవడంతో ఆలోచనల్లో పడ్డాడు.

 

    ప్రస్తుతం రమణ ఇంటి దగ్గరున్న లెండింగ్ లైబ్రరీలో ఫ్రెండ్స్ తో  కూర్చున్నాడు.

 

    "అంత హైక్లాస్ అమ్మాయి, మనలాంటి వాళ్ళను ప్రేమించదని నాకూ తెల్సురా! ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు? ట్రై చెయ్యడంలో తప్పులేదు కదా.......!" అన్నాడు రమణ లెండింగ్ లైబ్రరీ ఓనర్ ఫ్రెండ్ సుబ్రమణితో.

 

    " హైక్లాస్ అమ్మాయిల మిడిల్ క్లాస్ అబ్బాయిల్ని ప్రేమించాలంటే నువ్వు స్టడీస్ లో హాయ్ ర్యాంక్  తెచ్చుకో."

 

    "లేదురా..... ఆ సినిమాటిక్ లవ్  ఎఫైర్స్ కి ఇది టైమ్ కాదు..... క్వొశ్చన్ పేపర్స్  జిరాక్స్ అందుబాటులోకొచ్చేసిన రోజులు......" నిట్టూరుస్తూ అన్నాడు రమణ.

 

    "అందమైన ప్రేమలేఖ రాయి...... ఆమెను ఇన్ స్పైర్ చెయ్యి."

 

    "పాత చింతకాయ పచ్చడి...... సి.డీ.లు వచ్చేశాయిరా! కాగితాల మీద రాసే లవ్  లెటర్స్ కి అంత  వాల్యూ లేదు."

 

    "మనం  మధ్యతరగతి వాళ్ళం, మంచిగా ఏవీ సాధించలేం అనేదే నీ ఒపీనియన్. అవునా! అంచేత నువ్వో పనిచెయ్యి- అవతల వ్యక్తులు నీ దగ్గర ఓడిపోవాలంటే నువ్వు గెలవాలి...... అనేదే కదా మన  ఫిలాసఫీ!"

 

    "ఎస్....."

 

    "నువ్వు జాగ్రత్తగా ఆమె ప్రేమకోసం, ఆమె కోసం తాపత్రయ పడేవాళ్ళను 'కట్' చెయ్యి..... శకునిలా ఖేదోపాయం, అంతకన్నా మంచి మార్గం లేదు"

 

    "కరెక్ట్..... నేనూ అదే అనుకుంటున్నాను. ప్రస్తుతం నాకూ...... ఆ రావిగాడికే పోటీ. అన్ని విషయాల్లోనూ నాకన్నా వాడు బలవంతుడు. వాడ్ని మిస్ లీడ్ చేస్తే సరి" సాలోచనగా అన్నాడు రమణ. అతని ఆలోచనలో అతి త్వరలో ప్రమాదంలో పడబోతున్నాడన్న విషయం అతనికి తెలీదు. మధ్యతరగతి మనస్తత్వం అంటే ఇదే! దీనినే వన్ వే ఇడియట్ లవ్ అంటారు.

 

    
                                          *    *    *

 

    "She wants to make love three times a week and smooch and cudole the other nights. He is satisfied coming to her sexually once a month. And therein lies one of the most common problems involving sexual desire. A mismatch of appetites.

 

        రోజువారి టెన్షన్స్ తో సగటు మనిషి సెక్స్ జీవితం ఇలా మారిపోతోంది. సగటు మనిషి ఏమిటి- మనుషులందరి జీవితం ఇలాగే మారిపోతోంది.

 

    ఆవిడకేమో వారానికి మూడుసార్లు ప్రేమ కావాలి. మిగతా నాలుగు  రోజులు అక్కర్లేదు.

 

    అతనికేమో నెలకొకసారే ప్రేమించాలని వుంటుంది. మిస్ మ్యాచ్ ఆఫ్  ఎపిటైట్. అంటే ఇదే! ప్రపంచంలో సమానంగా ప్రేమించుకునే జంటల్ని వేళ్ళమీద  లెక్కపెట్టవచ్చు....." అంది సుష్మ ఫ్రాంక్లిన్ - గెస్ట్ హౌస్ లోకి  ఎంటర్ కాగానే రవిని చుట్టుకుపోతూ.

 

    ఆమెని అమాంతం గాలిలోకి ఎత్తుకుని, బెడ్ రూమ్  లోకి తీసుకెళ్తూ "నా దగ్గర అలాంటి సందేహం నీకక్కర్లేదు. నేను ప్రతిరోజూ ప్రేమిస్తాను. ఎన్నిసార్లయినా ప్రేమిస్తాను" నవ్వుతూ అన్నాడు.

 

    "అందుకే నువ్వంటే నేను పడిచచ్చిపోతాను...... ఎన్నిసార్లు ప్రేమించుకుందామన్నా, హెవీ డ్యూటీ ఎవ్వరెడీ బ్యాటరీలా పనిచేస్తావు- ఒళ్ళు దాచుకోకుండా- శక్తి మిగుల్చుకోకుండా. స్కాచ్ తీసుకుంటూ, ప్రేమించుకుంటే దాన్ని అంచుల్ని చవిచూడవచ్చు తెలుసా?" కైపుగా అంది నుష్మ ఫ్రాంక్లిన్.

 

    ఆమెను బెడ్ మీద పడేసి, లిక్కర్ క్యాబినెట్ వైపు నడిచి, జానీ వాకర్ బాటిల్ అందుకున్నాడు రవి.

 

    అతను అన్ని చేస్తున్నా అతని మనసంతా అన్విత చుట్టే తిరుగుతోంది.

 

    పచ్చిగా బైటపడి, ప్రేమించుకుందామనే సుష్మ ఒకవైపు- ప్రేమంటే అర్థంకాని నిర్వచనాలిచ్చే అన్విత మరోవైపు - ఇద్దరూ ఒక మగవాడికి అవసరమే. టూ ఎక్ట్రీమ్స్..... అటు వర్షం..... ఇటు ఎండ..... మోస్ట్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్..... అన్వితను పెళ్ళి చేసుకోవాలి. సుష్మా ఫ్రాంక్లిన్ ను వుంచుకోవాలి..... అని ఆలోచిస్తూ, రెండు గ్లాసుల్ని టీపాయ్ మీద పెట్టి, అందులో ఒక పెగ్..... ఇందులో ఒక పెగ్ పోసి, ఫ్రిజ్ లోంచి తెచ్చిన ఐస్ క్యూబ్స్ వేసి, ఒక గ్లాస్ ఆమెకందించాడు.

 

    "ఆన్ దీ రాక్స్...... హేవిట్...." అన్నాడు రవి ఆమెకేసి కాంక్షగా చూస్తూ.

 

    సుష్మ గ్లాసందుకుని ఒకసారి సిప్ చేసి తిరిగి గ్లాస్ ని టీపాయ్ మీద పెట్టి, రవి జేబులోంచి సిగరెట్ పెట్టె అందుకొని, సిగరెట్ వెలిగించింది.

 

    "న్యూయార్క్ లో - 42 డౌన్ స్ట్రీట్ లో నడిపే సెక్స్ షాప్స్ ని ఒకసారి చూడాలని వుంది. సెక్స్ ఆన్ ద బీచ్, సెక్స్ ఆన్ ద వాటర్, లాంటి లైవ్ షోస్ నడుస్తుంటాయట. ఒక్కొక్క షోకి జస్ట్ ట్వంటీ డాలర్సట. నీకూ, నాకూ పాస్ పోర్ట్ లు ఎలాగూ వున్నాయి. మీ డాడీ ఇన్ ఫ్లూయిన్స్ ఉపయోగించి వీసాలొచ్చేలా చూడగూడదూ....." అతని మోకాళ్ళమీద తన చుబుకాన్ని వుంచుతూ అంది సుష్మా ఫ్రాంక్లిన్.

 

    దానికి వెంటనే సమాధనం ఇవ్వలేదు రవి.

 

    ప్రస్తుతం కూడా రవి ఆలోచనలన్నీ అందదనుకుంటున్న దానిచుట్టే తిరుగుతున్నాయి.

 

    రవి మనసు ఎక్కడో వున్నదని గ్రహించిన సుష్మ తన చర్యని వేగవంతం చేసింది.

 

    మరికొద్ది క్షణాల్లోనే రవి ఉలిక్కిపడి, ఆలోచనల నుండి తేరుకున్నాడు.

 

    
                                          *    *    *

 

    ఉదయాన్నే అయిదున్నరకి మెలుకవ వచ్చేసింది మధుకి. ఇంటిలోంచి బయటకు వచ్చేశాడు. 'అన్విత ఇంటిని చూడాలి.....' అతని మనసులో అప్రయత్నంగా నాటుకున్న బలమైన కోరిక అది.

 

    రైల్వేస్టేషన్ ఎడమవేపుకు నడిచాడు. అరగంట నడక. ఆ ఇల్లు దగ్గరపడుతున్న కొలదీ అతని నుదుట మీద చెమటలు పడుతున్నాయి. పచ్చని దట్టమైన చెట్లమధ్య, సువిశాలమయిన పోదరింటిలాంటి ఇంట్లో అన్విత....

 

    ఆ ఇంటికెదురుగా ఓ స్టేడియం ఉంది. ఆ స్టేడియం మెట్లమీద కూర్చుంటే ఒక పక్క నుంచి బిల్డింగ్ అంతా కన్పిస్తుంటుంది.

 

    ఎంతసేపు కూర్చున్నాడో తెలీదు.

 

    లేత ఎండ, ముదురు ఎండగా మారుతోంది. కన్నార్పకుందా ఆ ఇంటి సెకండ్ ఫ్లోర్ లోని కిటికీ వైపే చూస్తున్నాడు మధు. ఎవరికో, ఎప్పుడోగాని ప్రేమ అనేది తటస్థించదు. అది కలిగిన నిమిషాన, అది నిజస్వరూపంతో ప్రసన్నమైనప్పుడు ఎ కవులూ, ఏ కలలూ దాని ఔన్నత్యాన్ని అందుకోనంత వెలుగులు కనబరుస్తుంది, కాలుస్తుంది. ఎంత గొప్ప ఆనందానికీ, అతిమహిమలకి, ఐశ్వర్యాలకీ, వెలుగులకీ కళ్ళు తెరుస్తుంది. అని చలం చెప్పిన సత్యం మధు విషయంలో నిజం కాబోతుంది. కొంతసేపయ్యాక ఆ కిటికీ తెరుచుకుంది. ఒక మానవాకారం తల అస్పష్టంగా కనిపిస్తోంది.

 

    అన్వితే...... అప్పుడే లేచి కిటికీ రెక్కలు తెరిచిందా? ఆ సున్నితమైన చేతి స్పర్శకు, ఆ రెక్కలు ఎంతగా మురిసిపోయాయో. ఆ రెక్కలకి మాటలొస్తే.....

 

    మధు ఊహించినట్టే ఆ గది అన్వితదే. కిటికీ రెక్కలు తెరిచింది స్వయంగా ఆమే.

 

    సమయం ఆరూ ఇరవై  నిమిషాలు.

 

    గాలి చల్లగా, చక్కగా వుంది.....

 

    ఉదయాన్నే జాగింగ్ చెయ్యడం అన్వితకి అలవాటు. ఆమె రోజూ స్టేడియంకే వస్తుంది.

 

    ఆ ఇంట్లోంచి అన్విత బయటకు రావటం, స్టేడియంవైపు రావడం ఎక్సయిటింగ్ గా వుంది మధుకు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra