Home » Yandamuri veerendranath » లేడీస్ హాస్టల్

   

    "బహుశ అలాటిదేమీ లేకపోవచ్చు. మామూలుగా మాట్లాడుకుంటూనే వుంటారట- గంటల తరబడి."
   
    "బహుశ పార్కుల్లో ఏకాంతం వుండదనేమో .... ఏది ఏమైనా అబ్బాయిల ఐకమత్యానికి మెచ్చుకోవచ్చు."
   
    ... ... ....
   
    "మరి మీరూ, అపురూపలక్ష్మీ ఎక్కడ కలుసుకునేవారు?"
   
    "మేము ఎక్కువసార్లు కలుసుకోలేదు."
   
    "కలుసుకునేటప్పుడు?"
   
    "హోటళ్ళలో కలుసుకునేవాళ్ళం."
   
    "ఏ హోటలు?"
   
    "బ్లూ టైగర్."
   
    "అది చాలా ఖరీదైన హోటల్ కదా?"
   
    అతడి ప్రశ్న అర్ధమై "సాధారణంగా రాజారావే బిల్ ఇచ్చేవాడు" అన్నాడు.
   
    "అతడికేమిటి మీమీద ఇంటరెస్టు?"
   
    "రమణి కూడా వచ్చేది."
   
    "ఒహో రెండు జంటలూ అలా కలిసేవన్నమాట ...."
   
    రాయన్నకి ఆ వెటకారం బాధగా అనిపించింది. "మేము ఎన్నోసార్లు కలుసుకోలేదు. అయిదారుసార్లు. అంతే-" అన్నాడు.
   
    "మీరబద్దం చెపుతున్నారు."
   
    "కాదు. నిజమే చెపుతున్నాను."
   
    "మిస్టర్ రాయన్నా! నా సర్వీసులో మీలాటి వాళ్ళని చాలామందిని చూశాను. చివరిసారి చెపుతున్నాను. నిజం చెప్పటం మీకే మంచిది."
   
    రాయన్న మాట్లాడలేదు.
   
    ఇన్ స్పెక్టర్ ఒక కాగితం అతడి ముందుకుతోసి కలం అందిస్తూ "నేను చెప్పింది వ్రాయండి" అన్నాడు. రాయన్న అర్ధంకానట్టుగా అతడిని చూసి, "ఏమిటి?" అని అడిగాడు.
   
    "చెప్తా వ్రాయండి" లాఠీకర్ర చేతిలోకి తీసుకుంటూ అన్నాడు ఇన్ స్పెక్టరు. రాయన్న వ్రాయటం ప్రారంభించాడు.
   
    "TO WHOM SO EVER IT MAY CONCERN....."
   
    రాయన్న వ్రాసేడు.
   
    ".... నేను నా స్వకారణాలవల్ల ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా మరణంతో ఎవరికి ఏ విధమైన సంబంధం లేదు-"
   
    రాయన్న సగం వ్రాసి అనుమానంతో తల పైకెత్తాడు.
   
                                   *    *    *
   
    కిరణ్మయి తెల్లారేవరకూ ఆ పుస్తకాన్ని చదువుతూంది. తూర్పున వెలుగురేఖ పొడిచాక - పెరట్లోకి వచ్చిన తల్లి "ఇక్కడ కూర్చున్నావేమిటే-" అని పలకరించేవరకూ చదువుతూనే వుంది.
   
    ఆ పుస్తకాన్ని చదివేకొద్దీ ఆమెలో అదో రకమైన అంతర్లీనమైన శక్తి పెరుగుతూ వచ్చింది. భయం, ఆందోళన, ఉద్వేగం, కంగారు - ఇవన్నీ మానసిక స్థాయి భావాలు. ఈ భావాలే బాధని కలుగచేస్తాయి తప్ప పరిస్థితులు కావు.
   
    ఆమె లోపలికి వచ్చింది. బంధువులు ఒక్కరొక్కరే నిద్రలేస్తున్నారు. రాత్రి తాలూకు కంగారు తగ్గి, కుతూహలం వాళ్ళ కళ్ళలో క్రమక్రమంగా చోటు చేసుకుంటూంది. కొత్త పెళ్ళికూతుర్ని రకరకాలుగా పరిశీలిస్తున్నాయి ఆ కళ్ళు. ఏ శాస్త్ర పరికరానికీ లేని వాడితనం ఆ చూపులకుంది.
   
    ఆమె దాన్ని పట్టించుకోలేదు. అన్నలకు కూడా బ్రతిమిలాడదల్చుకోలేదు. తనే ఫ్లాస్క్ లో కాఫీ పోసి, తొందర తొందరగా మొహం కడుక్కుని, స్టేషన్ కి బయల్దేరింది.
   
    ఆమె గుమ్మంలోంచి బయటకు అడుగిడబోతుంటే ఒక యువకుడు వచ్చాడు టెలిగ్రాం తీసుకుని రాయన్న పేరు వుంది టెలిగ్రాం.
   
    విప్పి, గబగబా చదివింది.
   
    "SELECTED FOR PRESIDENT'S ELEVEN TEAM TO PLAY AGAINST PAKISTHAN. START IMMEDIATELY - CRICKET BOARD-" అని వుంది అందులో.
   
    ఆమె టెలిగ్రాం చదువుతూండగా వెనుకనుంచి తల్లి వచ్చి, "ఏమిటే అది?" అని అడిగింది.
   
    "ఏం లేదు" అంది కిరణ్మయి.
   
    ఈ విషయం ఇంట్లో అందరికీ తెలిసి, మళ్ళీ అదో టాపిక్ అవటం, అందరూ సానుభూతి కురిపించటం ఆమె కిష్టం లేకపోయింది.
   
    టెలిగ్రాం తీసుకొచ్చిన యువకుడిని, "మీరెవరు?" అని అడిగింది.
   
    "రాయన్న ఫ్రెండ్ ని. తెల్లవారుఝామునే టెలిగ్రాం వస్తే ముందు కంగారు పడ్డాను. విప్పిచూస్తే ఇది. సరే-ఈ శుభవార్త స్వయంగా చెపుదామని వచ్చాను. ఏడీ మనవాడు? ఇంకా నిద్రపోతూనే వున్నాడా?"
   
    ఆమెకేం చెప్పాలో తోచలేదు. ఈ రోజునుంచీ ప్రారంభమయ్యే ప్రశ్నలకు ఇది ప్రారంభం మాత్రమే! ఆమె ఏదో సమాధానం చెప్పబోతూంటే పేపర్ కుర్రవాడు పేపర్ పడేసి వెళ్ళిపోయాడు. ఆమె దాన్ని తీసుకుంటూ, "మీరు అనవసరంగా శ్రమ తీసుకుని ఇంతదూరం వచ్చారు" అంది.
   
    "అదేమిటండీ? ఈ ఛాన్సుకోసం మావాడు రాత్రింబవళ్ళు తపస్సుచేసేవాడు. ఈ రోజు కాకుండా మరోరోజు అయితే మొహంమీద వీళ్ళుజల్లి అయినా సరే లేపి ఈ న్యూస్ నేనే స్వయంగా చెప్పి వుండేవాడిని. మీకు తెలీదండీ. క్రికెట్ అంటే వాడికి ప్రాణం. ఈ వార్త తెలుస్తే వాడు భూమ్మీద నిలవడు."
   
    కంట్లోంచి నీరు బయటకు చిప్పిల్లకుండా వుండటం కోసం కిరణ్మయి చాలా కష్టపడవలసి వచ్చింది. టెలిగ్రాం తీసుకొచ్చిన యువకునికి ఇదేమీ పట్టినట్టు లేదు. రాయన్నకి ఈ విషయం చెప్పి, ఆ ఆనందపూరితమైన క్షణాల్ని స్నేహితుడితో కలిసి పంచుకోవాలన్న తాపత్రయమే ఎక్కువ కనపడుతూంది. అంతలో అతడి దృష్టి ఆమె చేతిలోని పేపర్ మీద పడింది.
   
    "ఈరోజు పేపర్ లో కూడా ఈ వార్త వచ్చే వుంటుంది. ఏది ఇలా ఇవ్వండి" అంటూ పేపర్ తీసుకుని, చివరి పేజీ చూడబోతూ మొదటిపేజీలోనే ఆగి, 'అరె- ఫోటో కూడా పడిందే' అంటూ ఉత్సాహంగా చదవబోయాడు. అతడిని చూస్తూంటే, అతడే ఈ టీమ్ లో ఎన్నికైనంత హుషారుగా వున్నాడు. కానీ ఆ వార్త చదువుతున్నకొద్దీ అతని మొహంలో భావాలు క్రమంగా మారసాగాయి. నమ్మలేనట్టు మళ్ళీ మళ్ళీ దాన్నే చదవసాగాడు. ఆమెకి అనుమానం వేసి, అతడు చదువుతున్నవైపు చూసింది. ఆమె అనుమానం నిజమైంది. రాయన్న ఫోటో క్రింద-
   
                              "లేడీస్ హాస్టల్ లో విద్యార్ధిని మరణం"
   
    అని వుంది.
   
    ఆ హెడ్డింగ్ చదవగానే మిగతాది అర్ధమై ఆమె మొహం వాడిపోయింది. వచ్చిన యువకుడి పరిస్థితి మరీ అధ్వాన్నంగా వుంది. చేతుల మధ్య పేపర్ వణుకుతూంది. "ఇది .... ఇది నిజమేనా మేడమ్" అని అడిగాడు.
   
    'నిజమే' అన్నట్టు ఆమె తలదించుకుంది.
   
    ఏం మాట్లాడాలో తోచనట్టు అతను తలదించుకుని వుండిపోయాడు. ఆమెకి అతని మొహంలో దిగులు, విచారం కొట్టొచ్చినట్టు కనబడ్డాయి. రాయన్న అరెస్ట్ సంగతి తెలిసినప్పుడు తన తల్లి, తండ్రి, అతని తల్లి, తండ్రి- అందరూ "భయపడ్డారు". ఈ స్నేహితుడు "విచారిస్తున్నాడు" అదీ తేడా.
   
    "రాయన్న ఎక్కడ వున్నాడు మాడమ్?"
   
    ఆమె పోలీస్ స్టేషన్ వివరాలు చెప్పింది. అతడు వెళ్ళిపోయాడు.
   
    ఆమె పేపర్ తీసుకుని చూసింది. అపురూపలక్ష్మి మరణం విషయం, రాయన్న అరెస్టు విషయం అందులో వేశారు. అర్దరాత్రి తరువాత జరిగిన అరెస్టు సంగతి ప్రొద్దున్నే పేపర్లో ఎలా వచ్చిందా అని ఆమె ఆశ్చర్యపడింది. వారెంటు సంగతి తెలిసి బహుశ వేసివుంటారనుకుంది-
   
    ఆమె పేపర్ పడేస్తూ - చివరి వాక్యం చూసి హఠాత్తుగా ఆగిపోయింది.
   
    "అపురూపలక్ష్మి తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదనీ, జీవితంమీద విరక్తిచెంది తను ఈ చర్యకు పాల్పడుతున్నాననీ ఉత్తరం ద్వారా తెల్సింది."
   
    అన్న వాక్యం అది.
   
                                                             *    *    *
   
    "ఏమిటిది? ఎందుకు వ్రాయమంటున్నారు నన్నిలా" అని అడిగాడు రాయన్న సందిగ్ధంగా.
   
    "వ్రాయండి" కటువుగా వినిపించింది ఇన్ స్పెక్టర్ స్వరం.
   
    రాయన్న తలవంచుకుని వ్రాశాడు. నేను నా స్వకారణాలవల్ల ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా మరణంతో ఎవరికీ ఏ విధమైన సంబంధం లేదు.
   
    ఇన్  స్పెక్టర్ ఆ కాగితాన్ని తీసుకుని లోపల మరో గదిలోకి వెళ్ళాడు. రాయన్న ఒక్కడే టేబిల్ దగ్గిర కూర్చుని వున్నాడు. ఆ రోజు పేపర్ టేబిల్ మీద వుంది. మొదటి పేజీలో తన ఫోటో చూసి ఆత్రంగా తీసుకొని చదివాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra