Home » Yandamuri veerendranath » ఆనందోబ్రహ్మ

   

       మామూలు వాళ్ళు ఎవరూ అసలు కలలో కూడా వూహించలేరు. కానీ అతడికి ఇవన్నీ కొట్టిన పిండి.
   
    వీధి మూలగా రెండు కార్లూ, వాటి పక్కనే హేటు పెట్టుకున్న ఇద్దరు వ్యక్తులు సిగరెట్లు తాగుతూ ఏదో పనున్నట్టూ, ఏమీ పనిలేకుండా నిలబడి వుండటం మా.... ఫి...... యా!
   
    యాజీ తలెత్తి చూశాడు. భరద్వాజ ఇంట్లో లైటు వెలుగుతూంది.
   
    ఈ లోపులో డ్రైవరు తల వెనక్కితిప్పాడు. ఇద్దరూ కళ్ళతోనే మాట్లాడుకున్నారు. నిజానికి మాట్లాడుకోవలసినది కూడా ఏమీలేదు. బిస్సీయాజీ లాటివాడు బాడీగార్డు లేకుండా బయటకు రాడు. అందులోనూ అంత రాత్రిపూట! పైకి డ్రైవరుగా కనిపించే ఆ మనిషి కాంతికన్నా వేగంగా ఆయుధాల్ని ఉపయోగించగలిగే చురుకుదనం వున్నవాడు. అతడి జీతం అయిదంకెల్లో వుంది. వేరే బాడీగార్డు లేకుండా అతడే డ్రైవ్ చేస్తాడు.
   
    యాజీ నుంచి సూచన అందగానే డ్రయివరు కారుదిగి భరద్వాజ అపార్టుమెంటువైపు తాపీగా నడిచాడు.
   
    దూరంగా వీధి మలుపులో కారు దగ్గర నిలబడి వున్నవాళ్ళు చప్పున సంసిద్దులవటాన్ని అద్దంలో చూశాడు యాజీ. అతని అనుమానం నిజమైంది.
   
    డ్రైవరు భవనం లోపలి వెళ్ళి లిఫ్ట్ దగ్గర నిలబడ్డాడు.
   
    కారు దగ్గర వున్నవాళ్ళు సందిగ్ధంలో పడటాన్ని యాజీ గమనించాడు. ఫ్లాట్ లోకి వెళుతున్నవాడు ఏ అంతస్థులోకి వెళుతున్నాడో, ఎవరి ఇంటికి వెళుతున్నాడో వాళ్ళకి తెలీదు. ఒకవేళ అతడు లిఫ్టులో ఆగేది భరద్వాజ ఇంటిముందు కాకపోతే కంగారుపడటం అనవసరం.
   
    యాజీ కూడా సరిగ్గా అలాగే ఆలోచిస్తున్నాడు. దుండగులు దండెత్తింది భరద్వాజ మీదకు కాకపోతే వాళ్ళతో అనవసర శతృత్వం అప్రస్తుతం.
   
    కారు దగ్గర వున్న యిద్దరిలో ఒకడు కారులోంచి ఒక వస్తువు తీసి నోటి దగ్గర పెట్టుకుని మాట్లాడటం కారులో కూర్చున్న యాజీ గమనించాడు. బహుశా భవంతిలోకి వెళ్ళిన వాళ్ళకి ఎవరో వస్తున్నట్టూ వాకీటాకీ ద్వారా సందేశం అందిస్తున్నట్టున్నాడు.
   
    అతడి అంచనా కరక్టే.
   
    భరద్వాజ ఇంటి గుమ్మం ముందు నిలబడి తాపీగా పనిచేస్తున్న వాళ్ళకి ఈ సంకేతం అందింది.
   
    అంతలో లిఫ్టు పైకి రావటం కనిపించింది.
   
    వాళ్ళు జేబులోంచి చప్పున బాల్ పాయింట్ పెన్స్ తీశారు. అంతలో లిఫ్టు వచ్చి ఆగింది. అది తాము వున్నా అంతస్థుకే వచ్చి ఆగటంతో ఇక అందులోంచి వచ్చేది ఎవరైనసరే-చంపెయ్యటానికే నిశ్చయించుకున్నారు. మాఫియాకి మనుష్యుల్ని చంపటం ఓ లెక్కలోనిది కాదు. తాము చేసిన పన్లకి ఎవరినీ సాక్షులుగా మిగల్చరు.
   
    లిఫ్టు ఆగిన ఒక క్షణానికి తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. ఎల్.బి.పిస్టల్ నొక్కబోయిన మాఫియా మనిషి ఆశ్చర్యంతో అవాక్కయ్యాడు.
   
    లిఫ్టు ఖాళీగా వుంది. ఖాళీగా పైకి వచ్చిన లిఫ్తుని చూడగానే గుమ్మం దగ్గర వున్న రెండో వ్యక్తి కూడా అటు దృష్టి మరల్చాడు.
   
    వాళ్ళు చేసిన తప్పు అదే!
   
    యాజీ దగ్గర డ్రైవరు రూపంలో పనిచేస్తున్న గార్డు, గెరిల్లా పద్ధతిలోనూ, అధునాతనమైన వ్యూహల్లోనూ ట్రైనింగ్ అయినవాడు. క్రింది అంతస్థులోనేలిఫ్టు స్విచ్ నొక్కితలుపులు మూసుకుపోయేలోపులో దాంట్లోంచి బయటకొచ్చి మెట్లమీదుగా పైకి వచ్చాడు.
   
    గుమ్మం దగ్గర వున్న ఇద్దరి దృష్టి లిఫ్టుమీద వుండగానే అతడు మెరుపులా పక్క మెట్లమీద నుంచి వరండాలోకి దూసుకొచ్చి ఎల్.బి.పిస్టల్ నొక్కేడు.
   
    ఆ కిరణం సోకగానే గ్యాస్ గన్ అత్తుకున్న వ్యక్తి వికృతంగా, గుండెలవిసేలా కేకపెడుతూ- ఆకేక గొంతులో పూర్తికాకముందే కాలిబొగ్గులా అయిపోయాడు.
   
    అతడు అలా కాల్తుంటే పక్కనున్న వ్యక్తి కంగారులో వెనక్కి గెంతాడు. ఆ గెంతటంలో వెనకవున్నా వరండా అద్దంమీద పది, అది విరగటంతో పైనుంచి క్రిందకు ముద్దలా జారాడు.
   
    క్షణంలో రోడ్డుమీద మాంసం ముద్ద, అందులోంచి వస్తూన్న రక్తం మాత్రం మిగిలాయి.
   
    ఇది చూసిన యాజీతోపాటు, దూరంగా కారు దగ్గరున్న ఇద్దరు వ్యక్తులు కూడా కన్ను మూసి తెరిచేలోగా అప్రమత్తులయ్యారు. యాజీ మీద అనుమానం వచ్చి కారులోంచి హాండ్ గ్రనేడ్ తీసి అతడి కారు మీదకు విసిరారు.
   
    యాజీ కారులో కూర్చుని, తనకి రెండు అడుగుల దూరంలో బాంబు చప్పుడు కాకుండా పేలటాన్ని తాపీగా చూశాడు. అటువంటివి వందైనా లోపల కూర్చున్న వ్యక్తిని ఏమీ నష్టపరచలేని విధంగా నిర్మించబడ్డ కార్లు ప్రపంచంలో చాలా కొద్ది వున్నాయి. తమ ప్రత్యర్ధిది కూడా అటువంటి వాటిలో ఒకటని వాళ్ళు గుర్తించకపోవటం వాళ్ళ దురదృష్టం.
   
    వాళ్ళ పనిపూర్తయ్యాక, ఇంక తన వంతు అన్నట్టు యాజీ జేబులోంచి ఎ.పి. (ఎయిర్ ప్రైజర్) షూటౌట్ తీశాడు. సాధారణ పిస్టల్ (16వ శతాబ్దంలో కనుక్కోబడినది) పేలిస్తే మందు పేలిన ఆ వత్తిడికి, బుల్లెట్ ముందుకు దూసుకుపోతుంది. 21శతాబ్ద ఆరంభంలో కనుక్కోబడిన ఆ షూటౌట్ పేలిస్తే గాలి వత్తిడికి బుల్లెట్ ముందుకు దూసుకుపోయి గమ్యానికి తగిలిన తర్వాత "అక్కడ" పేలుతుంది.
   
    అలాగే పేలింది కూడా!
   
    కారుకి తగిలిన ఆ బుల్లెట్ పేలగానే - డాల్టన్ అటామిక్ థియరీ తప్పు అన్నట్లు ఆ మాఫియా కారు మనుష్యుల్తో సహా రెప్పపాటు కాలంలో మాయమైపోయింది. చప్పుడు లేదు కానీ, కాలినప్పుడు వచ్చిన (ఎనర్జీ) మాత్రం ఆ సందుని క్షణంపాటు ప్రకాశవంతం చేసింది. తరువాత చూస్తే అక్కడేమీ లేదు.
   
    వంద సంవత్సరాల క్రితం అయితే భయంకరమైన చప్పుళ్ళతోనూ, ఆర్తనాదాలతోనూ దద్దరిల్లిపోవలసిన ఆ పోరాటం, నిమిషంలో అత్యంత ఆధునికమైన ఆయుధాల్తో అలా ముగిసింది.
   
    అదే సమయానికి భరద్వాజ బైటకొచ్చాడు. జరిగినదంతా నిజమే అన్నదానికి ప్రత్యక్ష తార్కాణంగా, గుమ్మంలో మసిబొగ్గులా మరీనా శవాన్ని చూస్తూ భరద్వాజ అవాక్కయిన తరుణంలో వెనుకనుంచి ఒక కంఠం వినిపించింది.
   
    "నిన్న సాయంత్రం నా సెక్రటరీ నాకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఈ రోజు ప్రొద్దున్న ఆఫీసుకి వెళ్ళగానే ఆవిడని ఉద్యోగం లోంచి తీసెయ్యాలనుకున్నాను. కానీ ఇప్పుడా అభిప్రాయం మార్చుకుంటున్నాను. నాక్కావలసిన రచయితని రక్షించుకునే అవకాశం నాకు ఈ విధంగా కల్పించినందుకు ఆమెకి ఒక ఇంక్రిమెంట్ ఇచ్చినా తప్పులేదు. బైదిబై నా పేరు యాజీ! బిస్సీ యాజీ! గ్లాడ్ టు మీట్ యు. ఇలా శవాల మధ్య నిలబడి ఉపోద్ఘాతం లేకుండా వచ్చిన పని చెపుతున్నందుకు ఏమీ అనుకోకండి. అసలు ఈ ఆలోచన నాకు నాలుగురోజుల క్రితం వచ్చినప్పటినుంచి కాలు నిలవటం లేదు. అందుకే యిలా ఈ అర్దరాత్రి చెప్పాపెట్టకుండా వచ్చి నేనూ ఈ పోరాటంలో పాత్రధారున్ని కావలసి వచ్చింది. మీరింకా షాక్ నుంచి తేరుకున్నట్టులేదు. ఈ శవాలూ వీటి సంగతి మీ అబ్బాయికి వదిలిపెట్టండి. పోలీస్ డిపార్టు మెంటు కదా. అతడే చూసుకుంటాడు. ఇవన్నీ నాకెలా తెలుసు అనుకుంటున్నారా? నాక్కావలసిన రచయిత ఎవరా అని ఇంతకాలం వెతికాక మీరు దొరికారు. మీ గురించి అన్ని వివరాలూ సేకరించాను. అంటే ఇప్పటి రచన్లుకాదు.....మీ మొదటి రచన్లూ అవీ చదివాక నాకు నిశ్చయమైపోయింది. నాకు కావలసిన విధంగా వ్రాయ గలిగేది మీరొక్కరే భరద్వాజగారూ! మీరు నాకో నవల వ్రాసి పెట్టాలి."
   
                                               11
   
    "మీరు నా కోసం ఒక కథ వ్రాయాలి భరద్వాజా! కథ అనటం కన్నా నవల అనటం బావుంటుందేమో!"
   
    ఖరీదైన హోటలవటంచేత జనం ఎక్కువలేరు.
   
    భరద్వాజ నిరాసక్తంగా వెనక్కి వాలేడు. అతడికివన్నీ మామూలే. ఎదురుగా వున్నవాడు రచయిత అనగానే తమ కథ వ్రాయమని చాలామంది అడుగుతారు. అందుకే అతడి మాటలు మామూలుగా వింటూ డిన్నర్ తినటంలో మునిగిపోయాడు. నిజానికి యాజీ తననూ, తన కుటుంబాన్నీ రక్షించాడన్న కృతజ్ఞతతో యీ డిన్నర్ కి వప్పుకున్నాడే తప్ప లేకపోతే అతనికి చచ్చేటంత పని వుంది.
   
    అంతలో యాజీ అన్నాడు. "ఒకామెని పట్టుకోవాలి! ఆమె ఎక్కడుందో-ఎలా వుందో - ఏమీ తెలీదు. యాభై సంవత్సరాల క్రితం నా జీవితంలో ఒక మంచుతెరలా ప్రవేశించి వెళ్లిపోయిన ఆమెకి, మీ రచన ద్వారా ఈ సంకేతాన్ని అందించాలి! ఆమె దాన్ని చదివి ఆంద్రదేశంలో ఎక్కడున్నా తెరలచాటునుంచి బయటకి రావాలి."
   
    కాల్చిన నత్తగుల్లల్లోంచి తాపీగా ఫోర్కుతో నత్తల్ని తీసుకుతింటున్న భరద్వాజలో ఆసక్తి పెరిగింది.
   
    "ఆమె చెక్కిన ఈ శిల్పం యీ రోజున ఎంత అద్బుతంగా తయరైందో ఆమె చూసుకోవాలి! ఒక్కసారి.... నేను మరణించే ముందు ఒక్కసారి ఆమె ఎక్కడుందో తెలుసుకోవాలి. దానికోసం ప్రపంచాన్ని జల్లెడ పట్టి అయినా సరే సాధిస్తాను. దానికి మీరు సాయపడాలి భరద్వాజా! మీరే సాయపడాలి."
   
    అతడు చిన్నపిల్లాడిలా మాట్లాడటం చూసి భరద్వాజకి నవ్వొచ్చింది. వెంటనే మాట్లాడలేకపోయాడు. అతడింకా షాక్ నుంచి తేరుకోలేదు.
   
    ఇదేమీ పట్టనట్టు యాజీ అద్దాల కిటికీలోంచి బయట శూన్యంలోకి చూస్తూ చెప్పుకుపోతున్నాడు. "నా కాళ్ళమీద నేను కాస్త నిలదొక్కుకో గలిగినప్పటి నుంచీ ఆమె ఎక్కడుందో  కలుసుకోవాలి అని ప్రయత్నించాను భరద్వాజా. లక్షలు పైగా ఖర్చు పెట్టాను. అయినా కనుక్కోలేకపోయాను...."

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra