Home » D kameshwari » Aruna

 
    ఉత్తరం చాలా పెద్దదే రాశాడు సుబ్బారావు ఉత్తరం చదివి సంతృప్తిగా మడిచింది అరుణ. జానకి భర్త సహృదయుడే కాక, కాస్తో కూస్తో సంస్కారం ఉన్నవాడే ననిపించింది. అతను పెద్ద చదువులు చదవలేదు. ఇంటర్ అవగానే స్వంత ఊళ్ళో స్వంత  వ్యవసాయమే చేసుకుంటూ ఉండిపోయాడని జానకి పెళ్ళప్పుడు అనుకోవడం అరుణకి తెలుసు.
    అతను రాసిందాన్ని బట్టి...... ఊరు చిన్నదయినా అందంగా ఉండేట్టుంది. తోటలు, కాల్వలు...... అన్నీ బాగుంటాయట: ప్రయాణం కాస్త కష్టము, ఇబ్బందీ! మరి పల్లెటూళ్ళన్నీ అలాగే ఉంటాయి మంచిపనికోసం కాస్త ఇబ్బంది సహించాలి మరి......అనుకుంది అరుణ.
    మిగతావారిమాట ఎలా ఉన్నా. కాస్త తెలిసిన సుబ్బారావు ఉన్నాడు. అతని సహకారం లభిస్తుంది. ఆ వూళ్ళో తను నిలదొక్కుకోవడానికి అతను అండగా ఉంటాడు. ఫరవాలేదు: ఆ ఆలోచన తెరిపి ఇచ్చింది అరుణకి ఒకసారి ఆ ఊరెళ్ళి రావాలి అన్నీ చూసుకోవాలి అందరిసహకారం కోరాలి తనవసతి ఆస్పత్రి ఏర్పాట్లు అవీ చూసుకోవాలి:
                                                          * * * 
    'నీవంటే తల్లినితండ్రిని....... అందరిని ఎదిరించి లెక్కలేదన్నావుగాని, మాకు తప్పుతుందా? నీ అంత తేలిగ్గా బంధాలు తెంచుకోగలమా? రేపొద్దున్న నీకు ఏదయినా జరిగితే మాకేగా బాధ: మాకేగా మాట:"
    "ఒక్కర్తివీ ఉండి మానవ సేవచేస్తావేమో ఊరికి వెళ్ళడానికి మాత్రం సాయం కావలసి వచ్చిందా?" రైలులో ఉన్నంత సేపూ అరుణని సాధిస్తూనే ఉన్నారు కృష్ణమూర్తి. కృష్ణమూర్తి చెల్లెలు ఇలా పల్లెల వెంటపరుగెట్టి ఉద్యోగం చేయాలనుకోవడం అసలు నచ్చలేదు. వేణుని నిరాకరించడం అంతకుముందే నచ్చలేదు. చెల్లెలి పంతం పట్టుదల అసలేనచ్చలేదు. ఆమెకోసం ఇలా రైళ్ళలో బస్సుల్లో బండిలో వెంట ఉండి ప్రయాణం చేయాలంటే అతనికి చిరాగ్గా ఉంది. అయినా, తండ్రి చెప్పాకకాదనలేక అరుణని వెంటబెట్టుకు బయలుదేరాడు.
    అరుణ నాలుగు రోజులు సెలవు పెట్టింది. ఆ ఊరు వెళ్ళి అన్నీ చూసుకు రావడానికి తన ఉద్దేశం తండ్రితో చెప్పింది.
    "ఊ నీ ఇష్టం అమ్మా:" అన్నారు రామారావుగారు.
    అరుణ మీద కోపం తెచ్చుకుందామన్నా ఆయన తెచ్చుకోలేరు. కానీ కూతురు తన మాట, తన సలహాలక్ష్యపెట్టలేదని మనసులో బాధగా ఉంది. ఎన్నడూ లేనిది అరుణతో ఈ నెలరోజుల బట్టి కాస్త ముభావంగా ఉండసాగారు. కూతురు ఏదో ఊళ్ళో ఉద్యోగం చేస్తుందన్న దానికంటే, దానికోసం వేణుని నిరాకరించడం ఆయనకి ఎక్కువ మనస్తాపం కలిగించింది.
    "ఆఊరు ఒకసారి వెళ్ళి నాలుగూ చూసుకుని వస్తాను నాన్నా: ఉండడానికి ఆస్పత్రికి దానికి తగిన వసతులు అవీ ఉన్నాయో లేదోచూసుకోవాలి: ఈ రెండునెలల్లో అన్నీ చూసి నిర్ణయించుకుంటే హౌస్ సర్జెన్సీ అవగానే ప్రాక్టీసు మొదలుపెట్టచ్చని ......."
    "దానికి నా అనుమతి కావాలా అమ్మా? అన్నీ నిర్ణయించుకున్నావు ఇందులో నే చెప్పేది ఏముంటుంది: నీ ఇష్టం అరుణా, నీ కెలా మంచిదని తోస్తే అలాగే చెయ్యితల్లీ:"
    తండ్రిమాటల్లో నిష్టూరంఅరుణ ఉత్సాహానికి బ్రేకు వేసినా, అదేంపట్టించుకోకుండా మళ్ళీ తనే అంది." అన్నయ్యని తీసుకుని ఆ ఊరు ఒకసారి వెళ్ళి వద్దామని అనుకుంటున్నాను.......నాలుగు రోజులు సెలవు పెడుతున్నాను."
    "అన్నయ్యని అడిగి వాడి కభ్యంతరం లేకపోతే అలాగేవెళ్ళు" అన్నారు. 'ఆడపిల్లవు వేరేవూరిలో ఉండి ఉద్యోగం చేస్తానంటావు గదా....... వూరికి వెళ్ళడానికి అన్నయ్య సాయం కావాలా?' ఆయన ఆ మాట పైకి కాకుండా మనసులోనే అనుకున్నారు. కూతుర్ని ఏ విషయంలోనూ ఏ విధంగానూ ఎప్పుడూ నొప్పించడం ఆయనకి చేతకాదు.
    తనకేమీపట్టనట్లు పైకి అలా అన్నా, కొడుకుతో ఈ విషయం చెప్పి అరుణని వెంటబెట్టుకుని తీసుకెళ్ళమని దానికి కావలసిన సదుపాయాలు అక్కడ అమరుతాయో లేదో చూసి రమ్మని పురమాయించారు.
    కృష్ణమూర్తి తండ్రికి ఎదురు చెప్పలేకవిధిగా బయలుదేరాడుకాని చెల్లెలి మీద మాత్రం మనసులో చాలా కోపంగా ఉంది అతనికి అన్నగారి సాధింపు ఓపిగ్గా భరించింది అరుణ. తనకంటే పెద్దవాడు. అంతేకాక, అవసరం తనదివాళ్ళందరికి ఇష్టంలేనిపని చేస్తూంది తను అందుచేత అందరూ ఏమన్నా భరించాలి.
    ముందు అందరూ తనని సమర్ధించలేకపోయినా, తరువాత కొన్నాళ్ళకి, ఎప్పటికయినా తనుచేసింది మంచిపని అని తనతో ఏకీభవిస్తారన్ననమ్మకం ఉంది అరుణకి. 
    రైలు దిగి బస్సుకోసం ఓ గంట ఎదురు చూడవలసి వచ్చింది పక్కనున్న ఓ పాక టీ దుకాణం బెంచిమీద చెల్లెలిని కూర్చోబెట్టి విసుగ్గా పచార్లు చేస్తున్నాడు కృష్ణమూర్తి. అరుణకి అలసటగానే ఉంది. రైలు ప్రయాణం వెంటనే బస్సు కోసం పడిగాపులు, ఎండ, దుమ్ము అంతా చిరాగ్గా ఉంది అయినాకృష్ణమూర్తి మాత్రం శ్రమకూడా ఓర్చుకోలేకపోతేముందు తనేం చెయ్యగలదు:
    ఆఖరికి దుమ్ము రేపుకుంటూ బస్సు వచ్చి ఆగింది. బస్సులో ప్రయాసతో ఎక్కగలిగారు ఇద్దరూ. బస్సులో కాస్త చదువు సంస్కారం ఉన్న ఒక్క మనిషయినా కనపడలేదు అరుణకి. పంచెలుపైకెగగట్టి బారెడుచుట్టలు వెలిగించిగుప్పు గుప్పుమని పొగ వదిలే రైతులు పక్క పట్టణాలకి పాలు, కూరలు ఉదయాన్నే తీసుకెళ్ళి అమ్ముకుని, సాయంత్రం తిరిగి వచ్చే పాలవాళ్ళు, అడ్డపొగత్రాగే ఆడవాళ్ళు, ఉమ్ములు వేసేవాళ్ళు......
    "చూశావా ఇక్కడి మనుష్యులు, ఇక్కడి వాతావరణం:?" అన్నట్టు చూశాడు కృష్ణమూర్తి అరుణ వంక అరుణ చూపు తప్పించింది. అరుణకీ ఆ తొక్కిడిలో ఆ వాసనలో ఆ అశుభ్రతమధ్య కూర్చోడం చికాకనిపించినా ఏహ్యత అణుచుకుంది, చదువుసంధ్య లేనివాళ్ళూ, పరిశుభ్రత ఆవశ్యకత తెలీని వాళ్ళూ....... వారి లాంటి వారికి మంచి అలవాట్లు, పరిశుభ్రత, ఆవశ్యకత చెప్పవలసింది తనలాంటివారే తామే అసహ్యించుకుంటే ఎలా?
    బస్సు దుమ్ము రేపుకుంటూగతుకులలో, గుంటలలో పడి లేస్తూ ప్రయాణం సాగించి గమ్యం చేరింది.
    బస్సుదిగగానే సుబ్బారావుకనిపించాడు పంచెకట్టు, షర్టు చెప్పులు వేషం పల్లెటూరికి తగినట్లే ఉంది. సుబ్బారావుని వెంటనే గుర్తించగలిగింది అరుణ. జానకి పెళ్ళిలో అతన్ని చూడడంవల్ల, సుబ్బారావుకి మాత్రం కష్టం ఏముంటుంది? బస్సు డిగిన అందరిలోకీ చదువుకున్న ఓ యువతిని గుర్తించడానికి ప్రయాస ఏముంది? చూడగానే నమస్కారంచేశాడు సుబ్బారావు. అరుణ ప్రతి నమస్కారం చేసి, అన్నగారిని పరిచయం చేసింది.
    "రండి, మీ కోసం బండి తెచ్చాను" అంటూ బండి దగ్గరికి దారి తీశాడు. వాళ్ళ సూట్ కేసు బెడ్డింగు తనే అందుకుని పెట్టాడు బండిలో రెండెడ్లబండి లోపల గడ్డిపరిపించాడు ఒత్తుగా పైన ఒక జంపుకానా పరిచి ఉంది.
    "ఎక్కండి" అన్నాడు అరుణ తో.
    "ఎలా ఎక్కడం?" అంది అరుణ నవ్వుతూ.
    కృష్ణమూర్తి చెల్లెలికి సాయం చేసి ఎక్కించాడు" ఎక్కడం నేర్చుకో రేపొద్దుటినించి ఈ బళ్ళలోనేగా తిరగడం?" అన్నాడు నెమ్మదిగా వ్యంగ్యంగా కృష్ణమూర్తి ఎక్కుతూ.
    బండి బయలుదేరింది. "ఈబండి మీదేనా? బండిమీరే నడుపుతారా?" అరుణ ఆశ్చర్యంగా అడిగింది.
    "లేకపోతే ఈ బండికి డ్రైవరొకడా: బండి మీద తరచుపట్టణం వెడుతూనే ఉంటాను, సరుకులకోసం దానికోసం అలవాటే. మా పాలేర్లు నడుపుతుంటారు అప్పుడప్పుడు" అన్నాడు సుబ్బారావు.
    "బండిమీదఎంతసేపు ప్రయాణం ఊరికి?" కృష్ణమూర్తి అడిగాడు.
    "ఎంత అరగంటలో వెళ్ళిపోతాం. మా ఎడ్లముందుగుర్రాలెందుకు పనికొస్తాయి పరుగు మొదలెడితే మరి ఆగవు" అంటూ కర్రతో గిత్తలని పొడిచాడు. అందుకే రెండు మైళ్ళు అరగంట పడుతుంది గాబోలు చిరాగ్గా అనుకున్నాడు కృష్ణమూర్తి.
    "మీబస మా ఇంట్లో ఏర్పాటు చేశానండి, మీకేం ఇబ్బంది ఉండదు. ఈ రాత్రికి ఇంటికెళ్ళి శుభ్రంగా భోజనం చేసి పడుకోండి. ఉదయాన్నే ఊరంతా చూపిస్తాను. ప్రెసిడెంటుగారి దగ్గిరకి తీసుకెడతాను."
    కృష్ణమూర్తి చెల్లెలివైపు కాస్త కోపంగా చూశాడు. "హోటళ్ళూ డాక్ బంగళాలూ ఉండడానికేదేం విశాఖపట్నంలాగా ఉంటుందనుకున్నావా?"
    "బలేవారండీహోటళ్ళు పల్లెటూళ్ళలో ఎక్కడ ఉంటాయి ఉన్నాయి చిన్న చిన్న పాకల్లో టీదుకాణాలు, ఓ ఇన్ స్పెక్షన్ బంగళా మావూరికి అవతల చాలాదూరంలో ఉంది ఎవరైనా గరవ్నమెంటు ఆఫీసర్లు టూర్లకి వస్తే అందులో ఉంటారు. మీ రక్కడ ఎలా ఉండగలరు వూరికి బాగా దూరంగా ఉంది అయినా మేము ఉండగా మీ రెక్కడో ఉండే ఖర్మ ఏమిటి? మా జానకిమిత్రులు మాకూ మిత్రులే ఆ మాత్రం మీకు మేం చెయ్యలేం అనుకున్నారా? మీ రంత సత్కార్యంతల పెట్టినందుకు ఓ పూట భోజనం పెట్టడం కంటే మీకు మరే విధంగా సహకారం చూపించగలం మాలాంటివాళ్ళం?"
    సుబ్బారావు కాస్త మాతకారే ననిపించింది కృష్ణమూర్తికి. అరుణ అతని సహృదయతకి చాలా సంతోషించింది. ఆ మాత్రం అండ ఉంటే చాలనుకుంది మనసులో.
    ఊరిలోకి బండి వచ్చేసరికి సాయంత్రం అయిదుగంటలయింది. కాలవ గట్టమ్మటిసన్నని దారిగుండా బండివూరిలోకి చేర్చించి. కాలవ గట్టంట రెండు వైపులా సరుగుడు చెట్లు, కొబ్బరిచెట్లు పొడుగ్గా ఎదిగి అందంగా కనిపిస్తున్నాయి కలవలో కొందరు పల్లెవాళ్ళ పిల్లలు గేదెలు ఆవులతో స్నానాలు చేస్తున్నారు. ఈతలు కొడుతూ, మరికొందరు పిల్లలు దిసమొలలతో గట్లమ్మట పరుగెడుతూ ఆడుతున్నారు. వూరిలోకి వెడుతున్న కొద్దీ ఇళ్ళు దగ్గిర దగ్గిరగా ఉండడం ఆరంభించాయి. కొందరు ఆడవాళ్ళు సావకాశంగా గుమ్మాల ముందుకూర్చుని తలలు దువ్వుకుంటున్నారు. మరికొందరు సాయంత్రం వంటకి కాబోలు చేటలో బియ్యం పోసుకుని ఏరుతున్నారు. బండి వెడుతూంటే అందరూ కుతూహలంగా తొంగి చూశారు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra