మోహిత
                                                 --సూర్యదేవర రామ్ మోహనరావు

  

                                  

 

     THE
    BOMBAYITE-INTERNATIONAL
    ESTABLISHED-1979
    PRICE RS. 125
        RELIABLE
        BROADMINDED
        CONTACT
        MAGAZINE
    SINGLES
    COUPLES
    PENPALS
    TELE-FRIENDS
    MARRIAGE
    GENUINE RESPONSIVE, OVER 900 DREAM CONTACTS OF WOMEN,COUPLES MEN.

    CONFIDNTIALITY IS OUR HALLMARK.


                                         *    *    *    

    కలం స్నేహం చేసే దంపతుల కోసం ముంబాయినుంచి వస్తున్న ఇంగ్లీషు పత్రిక అది. ముఖచిత్రమ్మీద హాలీవుడ్ హీరోయిన్ షీరోన్ స్టోన్ కసికసిగా చూస్తున్న అర్థనగ్నపు ఫోటో. పల్చటి దుస్తుల్లోంచి, పసిడివన్నె ఛాయలో కన్పిస్తున్న ఆమె వక్షస్థలం, నడుము మడతలు, నునుపైన పొడవాటి కాళ్ళు మగాళ్ళని మత్తెక్కించే విధంగా వున్నాయి.

 

    హైదరాబాద్....


    
    నాంపల్లి రైల్వేస్టేషన్.

 

    సమయం సాయంత్రం అయిదు గంటలు....

 

    బెంగుళూర్ ఎక్స్ ప్రెస్ బయలుదేరడానికి ఇంకా పావుగంట మాత్రమే సమయం వుంది.

 

    ఏ.సి కంపార్ట్ మెంట్ లో తన సూట్ కేస్ ను పెట్టిమ్ ట్రైన్లో బోరు కొట్టకుండా వుండడానికి, ఏవో మ్యాగజైన్స్ ని కొందామని ప్లాట్ ఫారమ్మీద బుక్ స్టాల్ దగ్గరకొచ్చి చూస్తున్న మైత్రేయ బొంబైట్ మ్యాగజైన్స్ ని వెంటనే చేతుల్లోకి తీసుకుని, పేజీలు తిప్పి, షాపువాడికి నూటపాతిక రూపాయలిచ్చేసి వెనక్కొచ్చి, కంపార్ట్ మెంట్ ఎదుట నిలబడ్డాడు.

 

    ప్లాట్ ఫారంనిండా జనం... సమ్మర్ మూలంగా జనం రద్దీ బాగా వుంది.


    
    వయ్యారంగా నడిచి వస్తున్న అమ్మాయిలవేపు చూస్తున్నాడు మైత్రేయ.

 

    ఆరడుగుల మైత్రేయ అందంగా వుంటాడు.... గుండ్రటి ఎర్రటి ముఖం.... గాలికి ఎగురుతూ ముఖమ్మీద పడే జుట్టు..... పొడవాటి ముక్కు.... తొలిచూపులోనే ఎదుటి వ్యక్తిని అంచనా వేసే చురుకయిన కళ్ళు.... దృఢమైన చేతులు.... వక్షస్థలం- హిందీ సినిమాల్లో కనిపించే కొత్త హీరోల్లో ఒకడిలా వుంటాడు.

 

    మైత్రేయ ప్రస్తుతం మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాడు. మెడికల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనే  నిమిత్తం బెంగుళూర్ వెళుతున్నాడు. అతనికి బెంగుళూర్ అంటే చాలా ఇష్టం. ముదుమలై, బండిపుర, తితిమతి, నాగరహొలే , కూర్గ్ లాంటి ప్రాంతాన్ని ఖాళీ దొరికినప్పుడు వెళ్ళి చూస్తుంటాడు. సరిగ్గా ఐదుగంటల పదిహేను నిమిషాలకు ట్రైన్ కదిలింది. ఏ.సి చల్లగా వుంది. కూల్ డ్రింక్ తాగుతూ మ్యాగజైన్స్ తిరగెయ్యడం ప్రారంభించాడు.

 

    ఆ మ్యాగజైన్ తిరగేస్తున్నపుడు, అందులో వ్యక్తుల వివరాలు చదువుతున్నప్పుడు, ప్రపంచంలో ఎన్ని రకాల మనుషులుంటారో, ఎలాంటి వింత వింత మనస్తత్వాలుంటాయో, మోడ్రన్ ప్రపంచంలో కల్చర్, ఫ్యాషన్స్ పేరున ఎంతటి విక్రుతత్వం చేసుకుంటుందో, తెలుసుకుంటుంటే ఆశ్చర్యం వేస్తోంది మైత్రేయకి.

 

    మ్యాగజైన్ నిండా ఆయా వ్యక్తుల ఫోటోలు.... వారి (కలం) అభిరుచులు, డిగ్రీలు, హోదాలు, ఎలాంటి వారితో స్నేహం చేయలనుకుంటున్నారో వివరాలన్నీ సమగ్రంగా వున్నాయి. ఆసక్తిదాయకంగా వున్న వ్యక్తుల వివరాల్ని చదువుతున్నాడు మైత్రేయ.

 

    నా పేరు నీలమ్... వయసు నలభై ఏళ్ళు. నివాసం ముంబాయిలో. నా భర్త దుబాయ్ లో వుంటున్నాడు. కొడుకు అమెరికాలో వుంటున్నాడు. పాతికేళ్ళ యువకుడితో ఫ్రెండ్షిప్ చేయాలని కోరిక. ఆ యువకుడు సరదాగా జోక్స్  కట్ చేస్తూ మాట్లాడగలిగే స్వభావం కలవాడై వుండాలి. నాతి జాలీగా షికార్లు చెయ్యాలి. రెండు నెలలు  అతను నా అపార్ట్ మెంట్ లోనే వుండొచ్చు. పెళ్ళికాని యువకులు ఈ క్రింది అడ్రస్ కి తమ ఫోటో, బయోడేటాతో సంప్రదించండి. ఫోటో, వివరాలు చూశాక నచ్చిన వెంటనే ఫోన్ చేయడం జరుగుతుంది.

 

    నీలమ్ ఫోటోవేపు చూస్తూ, ఆమె మనస్తత్వాన్ని వూహించడానికి ప్రయత్నిస్తున్నాడు మైత్రేయ. ఆ నీలమ్ అనే మహిళకు పాతికేళ్ళ యువకుడే ఎందుకు కావాలి? కేవలం ఫ్రెండ్షిప్ కోసమేనా? లేక సెక్స్ కోసమా? ఒంటరి తనాన్ని పోగొట్టుకోవడానికా? ఫ్యాషనా? కల్చరా? ఆలోచిస్తూ పేజీలు తిరగేస్తున్నాడతను.

 

    ఒక హేండ్సమ్ బోయ్ కలర్ ఫోటో.... ఆ కుర్రాడి  పేరు వైభవ్. పద్ధెనిమిదేళ్ళ వయసు...... బిజినెస్ చేస్తున్నాడు.

 

    నాతో స్నేహం చేయడానికి ముప్ఫై ఏళ్ళ వయసుగల బెంగాలీ అమ్మాయి కావలెను. అమ్మాయి ఫైవ్ పాయింట్ సిక్స్ ఎత్తు వుండాలి. 36-24-36 కొలతలుండాలి. బస్ట్ సైజు ఇంకా ఎత్తుంటే మరీ మంచిది. కొన్నాళ్ళు స్నేహం చేశాక, అభిరుచులన్నీ నచ్చితే పెళ్ళిచేసుకోవడం కూడా జరుగుతుంది. పెళ్ళికి ముందు సెక్స్ విషయంలో అభ్యంతరాలు వుండకపొతే మంచిది. వారం రోజుల్లోగా ఫోటోతోపాటు సంప్రదించండి.

 

    క్రింద వున్న అడ్రస్ ను చదివాడు మైత్రేయ.

 

    'పెళ్ళికి ముందు సెక్స్ విషయంలో అభ్యంతరాలు వుండకపొతే....' అంటే కొన్నాళ్ళు సెక్స్ ని ఎంజాయ్ చేశాక, నచ్చితే పెళ్ళి చేసుకుంటాడా? నచ్చకపొతే....? ఆమెని వదిలేసి మరొకర్ని పట్టుకుంటాడా? ఆలోచిస్తున్నాడు మైత్రేయ.

 

    స్నేహం పేరుమీద వ్యామోహం సెక్స్ - ప్రేమ పేరుమీద వ్యామోహం సెక్స్...


    
    "లైఫ్ లో సెక్స్ సంతృప్తి అనేది లేకపోతే మనిషి పరిపూర్ణుడు కాలేడు. ఆడైనా.... మగైనా....' ఓసారి పార్టీలో కొలీగ్ మధు అన్న మాటలు గుర్తుకొచ్చాయి మైత్రేయకి.

 

    అదే సందర్భంలో ఆఫీస్ లో తనని ఎట్రాక్ట్ చేస్తూ, చనువుని పెంచుకోడానికి ప్రయత్నించే అమ్మాయిల్లో శిల్ప గుర్తుకొచ్చింది. శిల్పకి ఇరవై రెండేళ్ళుంటాయి. బలంగా, దృఢంగా వుంటుంది. యవ్వనంలోని కసి ఆ అమ్మాయి శరీరంలోఅ అణువణువులో కన్పిస్తుంది.

 

    ఒకసారి లంచ్ టైంలో , డైనింగ్ హాల్లోకొచ్చి మైత్రేయకి ఎదురుగా కూర్చుంది శిల్ప.

 

    "ఈ గ్రే కలర్  డ్రస్ చాలా బావుంది..... మీకు" అంది మైత్రేయని పొగుడుతూ శిల్ప.

 

    "థ్యాంక్స్" అన్నాడు మైత్రేయ ఆమెకళ్ళల్లోకి చూస్తూ. మైత్రేయ ముఖంవేపే సూటిగా చూస్తోందామె.

 

    "మిష్టర్ మైత్రేయ.... మీకు నిద్రలో కలలొస్తాయా...." చిన్నగా నవ్వుతూ అడిగిందామె. ఆ నవ్వు సెక్సీగా వుంది.

 

    "ఇదేం ప్రశ్న.... కలలెందుకు రావు..... వస్తాయి....." చిరాగ్గా అన్నాడతను.

 

    "ఎలాంటి కలలొస్తాయో తెలుసుకోవచ్చా" అలా అంటున్నప్పుడు ఆమె లేత ఎరుపు బుగ్గలవేపు చూస్తున్నాడతను, అతనికి తెలీకుండానే.

 

    "ఆ కలలు ఇప్పుడు నాకు జ్ఞాపకం లేవు..... ఈసారి కలొచ్చినప్పుడు ఫోన్ చేసి మరీ చెప్తానులేండి.... అసలు నా కలల గురించి మీకెందుకు?" తిరిగి ప్రశ్న వేశాడతను.

 

    "యంగ్ ఏజ్ కదా..... అందమైన అమ్మాయిలే కల్లోకి వస్తారు.... యామై రైట్...."

 

    "ఇంతకీ మీ బాధేంటి?"

 

    "ఏంలేదు.... ఈసారి మీరు పడుకొనేటప్పుడు, నన్ను తలుచుకుని పడుకోండి..... నేను మీ కల్లోకి వస్తాను."

 

    "దానివల్ల ఏంటి లాభం?"

 

    "సిల్లీ క్వశ్చన్..... ఆ మాత్రం హ్యూమన్ సైకాలజీ తెలీకపోతే ఎలా? అయిదారుసార్లు వరసగా కల్లోకి వచ్చాననుకోండి..... అప్పుడైనా నేనంటే ఇంట్రెస్ట్ ఏర్పడుతుందని" అతని వత్తు మీసాలవేపు చూస్తూ అంది శిల్ప.

 

    అబ్బా, ఎన్నాళ్ళకి చెప్పారండి బాబూ..... అయితే మా అపార్ట్ మెంట్  కి ఎప్పుడొస్తారు?" వెంటనే అంది శిల్ప.

 

    "ఎందుకు....?"

 

    "ఎన్నిసార్లుడిగినా ఇదే ప్రశ్న..... ఒక హేండ్సమ్ గైని ఒక గ్లిట్టరింగ్ బ్యూటీ.... అదీ పెళ్ళికాని అమ్మాయి ఎందుకు డైరెక్ట్ గా పిలుస్తుంది.....! కొంచెం సీరియస్ గా ఆలోచించండి మహానుభావా....." ఓరకంట చూస్తూ అడిగింది శిల్ప.

 

    "మేరేజ్ చేసుకోవచ్చు గదా..... మీరు....."

 

    "చేసుకోగలను.... కానీ..... మీలాంటి వాడు నాకు దొరకాలిగా....." పైటను జారుస్తూ అంది శిల్ప.

 

    మైత్రేయ ఒక్కక్షణం అర్థనగ్నంగా కన్పిస్తున్న ఆమె ఎత్తయిన గుండెలవేపు చూశాడు. ఎండలో మెరుస్తున్న ఎర్రమట్టి దిబ్బల్లా వున్నాయవి.

 

    "మీలాంటి మగవాడికి మనస్ఫూర్తిగా ఆనందాన్నివ్వడం కోసం, ఏ కొలతల్తో ఎలాంటి అందాలు వుండాలో అలాంటివన్నీ నా దగ్గరున్నాయి. నా అపార్ట్ మెంట్ కొస్తే.... ఏకాంతంగా......" నగ్న ప్రతిమలా తనని తాను ఊహించుకుంటూ అంది శిల్ప.

 

    "నాకంత టైమ్ లేదు. ప్లీజ్ లీవ్ మీ......" చిరాగ్గా లేచిపోయి, సింక్ వైపు నడిచాడు మైత్రేయ.

 

    ఐ డోంట్ లీవ్ యూ..... చూస్తుండండి..... నా  అవసరం మీకెప్పుడో రాక తప్పదు" వయ్యారంగా నడుస్తూ వెళ్ళిపోయింది శిల్ప.

 

    శిల్పని చూస్తున్నప్పుడు తనకెందుకు సెక్స్ కోరికలు కలగవు......? ఆలోచిస్తున్నాడు పాతికేళ్ళ మైత్రేయ.

 

    ఇప్పటివరకూ తను ఎవర్నీ ప్రేమించలేదు. కనీస లవ్ లెటర్ కూడా రాయలేదు. కాలేజీరోజుల్లో తనని ఆడపిల్లలందరూ "ది గ్రేట్ బుద్ధా" అని పిలిచే నిక్ నేమ్ గుర్తుకొచ్చింది.

 

    తనకు ఎలాంటి అమ్మాయి కావాలి.....?

 

    హిందీ సినిమా నటి మాధురీదీక్షిత్ లాంటి అమ్మాయా..... మనీషా కోయిరాలా లాంటి అమ్మాయా.... తెలుగు నటి రంభలాంటి అమ్మాయా..... ఐశ్వర్యారాయ్ లాంటి అమ్మాయా..... లేదా సాదాసీదా పల్లెటూరి అమ్మాయా.... ట్రైబల్ గర్లా.....? చూసిన డెబెనైట్ ఫాంటసీ పత్రికల్లోని సెక్సీ అమ్మాయిల న్యూడ్  ఫొటోస్ గుర్తుకొచ్చాయి. వాళ్ళ నగ్నదేహాలు......వెర్రెక్కించే గుండెలు, కిర్రెక్కించే ఫోజులు గుర్తుకొచ్చాయి....

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra