Home » Balabhadrapatruni ramani » మొగుడే రెండో ప్రియుడు

    ఇల్లంటే ఒక నమకం-ప్రతి హృదయం ప్రతి సాయంత్రం చేరుకావాలనుకునే గుడి, జ్ఞాపకాల్ని, స్మృతుల్నీ భద్రపరచుకునే లాకర్. రాత్రిపూట వేలికి తీయడంకోసం -ప్రొద్దున్నే నిశ్చింత పెట్టెలో మనిషి దాచుకున్న కలల సముదాయం.

    ఇల్లు జైలులో వుంటే మగవాడు గోడలు దూకయినాసరే స్వేచ్ఛను సంపాదించుకోవాలనుకుంటాడు.
    మంద్రంగా వినిపిస్తూ వున్న రవిశంకర్ సితార్ పగలంతా పడిన అలసటని మరిపింపజేస్తోంది. ఆమె బ్యాక్ డ్రాప్ లో-వంటి రంగులో పోటీపడ్తున్న గులాబీరంగు కర్టెన్లు గాలికి కదిలినప్పుడల్లా, వాటికి కుట్టిన చిరుమువ్వలు కిలకిల లాడుతున్నాయి. 'వాజ్' లో పెట్టిన తాజా లిల్లీ పువ్వులు పరిమళం గదంతా వ్యాపిస్తోంది.

    స్నానం చేసి, తెల్లని పైజమా, లాల్చీ వేసుకుని, దిండుకు ఆనుకుని కూర్చున్న హర్ష కళ్ళు ఆత్రుతగా ఆమె కోసం ఎదురుచూస్తున్నాయి.

    "ఉడుకులోన్" నీటిలో వేసుకుని స్నానం చేస్తే ఇంత హాయిగా వుంటుందని అమృత చెప్తేనే తెలిసిందతనికి.

    ఎప్పుడూ తనూ, తన చదువూ తప్ప ఏమీ పట్టించుకోకుండా పెరిగిన హర్షకి చాలా విషయాల్లో అమృతే గురువైంది.

    పెళ్ళయిన కొత్తల్లోనే "సిగరెట్ తాగొద్దని అననుకానీ తరువాత రెండు ఏలకులు నోట్లో వేసుకోకూడదూ!" అంది.

    అప్పట్నించీ అలాగే చేస్తున్నాడు.

    "ఆఫీసులో సీరియస్ గా బిగుసుకుపోయి కూర్చుని, సబార్డినేట్స్ తో పని చేయించడం కాదు; రోజు మొత్తంలో ఒకటి, రెండు తియ్యని మాటలు, అదే అమ్మాయిలైతే "యూ ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ టు డే" లాటి కాంప్లిమెంట్సు ఇవ్వాలి. ఇంటికెళ్ళాక బాస్ గుర్తుకొస్తే వాళ్ళ పెదవుల మీదకి చిరునవ్వు చేరాలి. తద్వారా నీ మీద, కంపెనీ మీద అభిమానం పెంచుకుంటారు" అనే స్థాయిలో సలహాలిచ్చి భార్యలు ఎంతమందికి వుంటారు? హర్ష కిచెన్ లోకి అడుగుపెట్టబోయాడు. "ఏయ్! నా స్వర్గంలోకి వచ్చేముందు, కాళ్ళు శుభ్రంగా తుడుచుకుని, నా పర్మిషన్ తీసుకోవాలి" అంది అమృత.

    హాల్, బెడ్ రూం, డ్రాయింగ్ రూం మీద అపరిమిత శ్రద్ద కనబరుస్తూ అలంకరించుకునేవారు కూడా, వంటింటి మీద శ్రద్ద చూపించకపోవచ్చు! కానీ ఇల్లాలి పనితనం పట్టించేది అదే అంటుంది అమృత.

    "వంటింట్లో అస్తమానం మసాలా వాసనలే కాదు, మొగలి పూల పరిమళాలు, అగరు పొగలు కూడా వుండవచ్చు. గంటెల నేపధ్యమే కాదు, ఘంటసాల గళం కూడా "మొగలి పూల వాసనతో జగతి నాట్యమాడిందీ" అని వినిపించవచ్చు. మధ్యమావతి పాడుకుంటూ మజ్జిగ చిలుక్కుంటూ....మేఘమల్హార్ ఆలపిస్తూ ఉల్లిపాయలు తరుక్కుంటూ...కళ్యాణి వింటూ కాఫీ కలుపుతూ....మాయామాళవ గేళలో దప్పళం పెడుతూ...అరెరె...గోడమీద చెయ్యి వెయ్యకూ!...వెళ్ళ మరకలు చూశావా?" అంటూ అతను చెయ్యి వేసిన చోట స్పాంజితో తుడిచి, అతని బుగ్గమీద పిండి చెయ్యి రాసి, "పో, పోయి అద్దంలో చూసుకుంటూ వుండు, ఇప్పుడే వస్తా" అనొచ్చు. మీటగలగాలేగానీ, సంసారం కన్నా గొప్ప వీణ వుంటుందా?

    ప్రతి పనీ లీనమయి చేయడంలో ఎంతటి ఆనందం? అమృత ఆ ఆనందాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తుంది. కొందరు వినోద సమయాల్లో సైతం ఆ పనిలో లీనమవలేకపోవడం వారి దౌర్భాగ్యం.

    అమృత 'సూప్ బౌల్' తో పడక గదిలోకి అడుగుపెట్టింది. హర్షకి ఇష్టమైన తెల్లని ట్రాన్స్ పరెంట్ నితీ వేసుకుంది. తలంటి పోసుకున్న కురులు గాలికి నెమ్మదిగా కదులుతున్నాయి.

    ఆమె వచ్చి అతనికి అనుకుని కూర్చోగానే గదంతా ఒక్కసారిగా మల్లెపూల సౌరభం.

    హర్ష ఆమె కురులలో మొహం దాచుకుంటూ "పువ్వులు పెట్టుకో లేదుగా! ఎక్కడిదీ పరిమళం?" అన్నాడు.

    "పెట్టుకోలేదని ఎవరన్నారు చిదంబరం?" అమృత ఎప్పటిలా...చిలిపిగా అడిగింది.

    "ఏది?"

    "చూడు" అంటూ ఆమె ఫ్రంట్ ఓపెన్ జిప్ తీసింది. ఆమె స్థనద్వయం మధ్య మల్లెపూల దండ నవ్వింది!

    "యూ...నాటీ!" అతను ఇంకా ఆగలేకపోయాడు.

    ప్రకృతి సహజంగా బలవంతుడై పురుషుడ్ని స్త్రీ తన ప్రేమతో ఆశక్తుడిని చేసేస్తుంది.

    ప్రేమంటే....స్పందించే మనసుకి మాత్రమే వినపడే మధురసంగీతం.

    ప్రేమంటే...కవులూ, రచయితలూ ఎంతగా వర్ణించినా పూర్తి కాని అద్భుత కావ్యం.

    పలికించేందుకు భాష సరిపోని భావం!

    మనకీ తెలియని రాగంలో మనసు మనసు ఆలపించే యుగళగీతం! గీతల్లో, రాతల్లో సంపూర్ణ దర్శనం ఇవ్వని సృష్టి రహస్యం!

    లలిత లలితమ్మగా....భావభరితమ్ముగా మదిలో దూరి...మనసుని తన బానిసగా చేసుకునే తీయటి మత్తుమందు!
   
                                                            *    *    *

    అమృత వంట గది సర్ది, పడకగదిలోకి వెళ్ళేసరికి, హర్ష అలిగినట్లున్నాడు. గోడవైపు తిరిగి పడుకున్నాడు. అతని అలక చూస్తే ఆమెకి ముచ్చట వేసింది.

    "రాత్రి నిద్రపోయే ముందు భార్య పక్కన లేదే అని బాధపడటం కాదు! తెల్లవారగానే భార్య ఎదురు రాలేదే! అని బాధపడటమే నిజమైన ప్రేమ శంకరానంద్" అంది.

    అతడు మౌనంగా వుండిపోయాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra