Home » Mainanpati bhaskar » Buddijeevi

వెంటనే చెల్లాచెదురై పోయింది ఆ 'సాసర్'. మబ్బు తునక ఏదో ముక్కలయిపోయినట్లు నెమ్మదిగా తేలుతూ ఏవో కార్లోకి వచ్చి పడ్డాయి. ఒకటి అపురూప జుట్టుమీద పడింది.
అవేమిటో అర్ధమయ్యాక నవ్వాలో, ఏడవాలో అర్ధంకాలేదు అజిత్ కి.
అవి కొండల ఈకలు. కొంగల గుంపుని చూసి ఫ్లయింగ్ సాసరని భ్రమపడ్డాడు తను. ఈ కళ్ళు ఒక్కోసారి భలే మోసం చేస్తాయి!
"అంతా మాయ!" అంది అపురూప నవ్వాపుకుంటూ.
ఆ అమ్మాయి దుఃఖంతో నవ్వు మరిచిపోయిందేమో, ఇంక జన్మలో ఎప్పుడూ నవ్వదేమో అని సన్నగా దిగులుపడుతున్న అజిత్ కి, ఆ పెదిమలు దాటని నవ్వు అత్యంత మనోహరంగా కనబడింది.
"ఓకే! ఓకే! నేనొక ఫూల్ ని!" అన్నాడు తను కూడా నవ్వుతూ.
అప్పుడు ఫక్కున నవ్వేసింది అపురూప.
అజిత్ చెయ్యి జాపి, ఆమె జుట్టులో ఇరుక్కున్న ఈకని తియ్యబోయాడు.
"ఆగు!" కఠినంగా వినబడింది.
అజిత్ చెయ్యి గాల్లోనే ఆగిపోయింది.
"ఎవరు నువ్వు? ఐడెంటిఫై యువర్ సెల్ఫ్!" ఒక మగ గొంతు కర్కశంగా వినబడుతోంది కార్ రేడియోలో.
చటుక్కున కిందికి చూశాడు అజిత్. మిలిటరీ స్థావరాలు కనబడుతున్నాయి.
"ఎవరు నువ్వు? ఆల్టిట్యూడ్ తగ్గించు! లాండింగ్ కి ప్రిపేర్ కా! నీ ఆటో పైలట్ ని ఆన్ చెయ్యి. జమిస్తాన్ ఎయిర్ పోర్టులో ఫోర్స్ లాండ్ అవుతున్నావు నువ్వు. వెర్రి వేషాలేసి తప్పించుకోవాలని చూడకు!"
పొరబాటు జరిగిందని గ్రహించాడు అజిత్. ఇది మెకానికా వెళ్ళే దారి కాదు. నావిగేషన్ ఛార్టు చూశాడు. అసలు తను ఈ దారిలోకి ఎలా వచ్చాడు?
ఈ అమ్మాయితో కబుర్లలో పడి దోవ తప్పాడా? లేదా పరికరాలు తనని తప్పుదారి పట్టించాయా?
డాష్ బోర్డు వైపు చూశాడు. నిలకడలేకుండా వృత్తాకారంగా తిరుగుతున్నాయి మీటర్లలోని ముళ్ళన్నీ!
మైగాడ్! ఏమయింది? ఇందాక ఆ ప్లేను పడిపోయిన చోటకూడా ఇలాగే ఇష్టం వచ్చినట్లు తప్పు రీడింగులు చూపించాయి మీటర్లు!
అంటే...అంటే ఫ్లయింగ్ సాసరు పరిధిలో మనకు తెలిసిన భౌతిక, రసాయనిక ధర్మాలకి అర్థంలేకుండా పోతోందా? అవి తలక్రిందులై పోతున్నాయా?
అంటే ఫ్లయింగ్ సాసర్ దరిదాపుల్లోనే ఉందా? లేకపోతే కేవలం ఇదంతా మెషిన్ల లోపం వల్ల జరిగిందా?
కళ్ళలో భయం కనబడిపోతూ ఉండగా అతనివైపు చూసింది అపురూప.
అంతా మాయగా కనబడుతున్నా, ఈసారి "జగమే మాయ" అనుకోవడానికి ఇద్దరికీ సాహసం చాలలేదు.
"నేను శత్రువుని కాదు. ఒక యూ.ఎఫ్.ఓ.ని తరుముతూ వచ్చాను" అని చెప్పబోయాడు అజిత్.
"బ్లఫ్ చెయ్యకు! మా రాడార్ లో నీ ఎయిర్ కారు మాత్రమే కనబడుతోంది. యూ.ఎఫ్.ఓ. గీ ఎఫ్.ఓ. ఏమీ కనబడటం లేదు. ఆల్ రైట్? దిగు!"
అజిత్ ఎయిర్ కారు జమిస్తాన్ ఎయిర్ పోర్టులో ఫోర్స్ లాండ్ అయింది.
రన్ వే పక్కనే నిలబడి ఉన్న సోల్జరొకడు దాన్ని చూసి నవ్వాడు. "ఓస్ ఇదా! ఇంకా దిగుతుంది దిగుతుంది అని కంట్రోల్ టవర్ వాళ్ళు చెబితే ఏదో పేద్ద స్పేస్ షటిల్ దిగుతుందనుకున్నాను. బుర్ర పిట్టలాగా ఇది వచ్చిందా!" అన్నాడు. బాగా బలిష్టంగా, గొరిల్లాలాగా ఉన్నాడతను. మిస్టర్ యూనివర్స్ కి ఉండాల్సినంత పర్సనాలిటి ఉందతనికి. తల మాత్రం శరీరానికి తగినట్లు కాకుండా కాస్త చిన్నదిగా ఉంది.
అతని మొహంలో, మాటల్లో కూడా ఏదో బండతనం కనబడుతోంది. తెలివి తేటలన్నవి ఏ కోశానా కనబడటం లేదు. మాటలొచ్చిన యంత్రంలా ఉన్నాడతను.
అజిత్ ని, అపురూపనీ ఇద్దరినీ చెరో చెయ్యి కలిపి, సంకెళ్ళు వేసి "కదలకుండా ఇక్కడే ఉండండి. ఇప్పుడే వస్తాను" అని ఎటో వెళ్ళాడు.
అంత ఇబ్బందికరమైన పరిస్థితిలోనూ ఒక సున్నితమైన భావం మెదిలింది అజిత్ మనసులో.
ఇవి ఇనుప సంకెళ్ళే కావచ్చు కానీ, తామిద్దరినీ దగ్గరగా చేసి, దూరం కావడానికి వీల్లేకుండా బంధించేశాయి.
అతని మనసులో మెదులుతున్న భావాలని చదివేసినట్లు నుదురు చిట్లించి, కాస్త దూరంగా జరిగింది అపురూప.
'ఇతనెక్కడో ఇరవయ్యో శతాబ్దంలో ఉండాల్సిన మనిషి!' అనుకుంది మనసులోనే. 'ఇతను ఈ బేడీలను చూసి 'వలపు సంకెళ్లు' అని రొమాంటిక్ గా ఆలోచిస్తూ ఉన్నా ఆశ్చర్యం లేదు. ఓహ్ గాడ్! ఇలాంటి వెర్రి వెర్రి సెంటిమెంట్లూ, ఒకరినొకరు ప్రేమతో బంధించెయ్యడాలూ, తాళితో ముడెయ్యడాలూ...బ్లడీ హెల్! ఇంకా నయం! ఈ పెళ్లి అనే బానిసత్వపు వ్యవస్థ ఈ ఇరవై ఒకటో శతాబ్దంలోనన్నా నశించిపోతోంది కాబట్టి బతికిపోయాంగానీ లేకపోతే...అమ్మో!"
"పెళ్లి" అన్న ఆ రెండు అక్షరాల మాట తలుచుకుంటేనే వళ్ళు కంపరమెత్తినట్లయింది అపురూపకి. ముక్కుకి తాడేసినట్లు మెళ్ళో తాడేసి మూడు ముళ్ళు వేసేవాళ్ళుట! ఇది నా స్వంత పశువు అని అందరికీ తెలియడానికి కాబోలు! ఎంత అనాగరికం!
తన తల్లిలాంటి జెనెటిక్ ఇంజనీర్లకి థాంక్స్ చెప్పాలి ఈ విషయంలో! టెస్ట్ ట్యూబుల్లో బేబీస్ ని పుట్టించడం లాంటి ప్రక్రియలను పర్ ఫెక్టుచేసి సృష్టిని అదుపులో పెట్టుకున్నాక, ఇప్పుడు ఆడవాళ్ళకున్న అతి పెద్ద పనిష్ మెంటు - నవమాసాలు మోసి, మళ్ళీ జన్మ ఎత్తినంత రిస్కు తీసుకుని పిల్లల్ని కనడం - తప్పిపోయింది. అవును!
సంసార సుఖాన్ని మగాడూ, ఆడదీ ఇద్దరూ సమానంగా పంచుకున్నప్పుడు, ఆడదానికే ఈ శిక్ష ఎందుకు? కడుపు బెలూన్లా ఉబ్బిపోవడం, తొమ్మిది నెలలు ఆపసోపాలు పడటం, బిడ్డను కన్నాక ఒంటి బిగువు సడలిపోయి, సగం అందం తగ్గిపోవడం - ఇదంతా ప్రకృతి పక్షపాతం!
ఆ అన్యాయాన్ని సరిచేశారు అమ్మలాంటి సైంటిస్టులు. ఇప్పుడు శారీరక సౌఖ్యం, సంతానాన్ని పొందడం - ఇవి రెండూ ఒకదానికొకటి సంబంధం లేని రెండు విడివిడి కార్యాలయిపోయాయి.
మనసయితే నచ్చినవాడితో సుఖం జుర్రుకో!
పిల్లలమీద మనసు కలిగితే స్పెర్మ్ బ్యాంకికి వెళ్ళి, మంచి లక్షణాలున్న స్పెర్మ్ ని వెదుక్కుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీ ఎగ్ తో కలిపి, ఇన్ క్యుబేటర్ లో పొదిగించుకో! దట్ సింపుల్!
శీలం, నీతీ, మొరాలిటీ, కన్యాత్వం - ఇవన్నీ అర్థంలేని అవసరంలేని పదాలయ్యాయి జెనెటిక్ ఇంజనీరింగ్ పుణ్యమా అని!
సంకెళ్ళవైపు అసహనంగా చూసి, మరికాస్త దూరంగా జరగడానికి ప్రయత్నించింది అపురూప.
అయిదు నిమిషాలు గడిచిన తర్వాత ఇందాకటి సోల్జరు వచ్చాడు. వాళ్ళని చూసి సందేహంగా ఆగి, "ఎవరు మీరు? ఇక్కడెందుకు నిల్చున్నారు?" అన్నాడు పరుషంగా.
ఆశ్చర్యంగా చూశాడు అజిత్. "ఇందాక మీరే సంకెళ్ళు వేసి ఇక్కడ నిలుచోమని చెప్పి వెళ్ళారు కదా?"
"నేనా? సంకెళ్ళు వేశానా?" అని నవ్వి, "ఓహో! మూడు లక్షల ఒకటి వేసి వుంటాడు. నేను మూడు లక్షల రెండుని" అన్నాడు.
అతన్ని కళ్ళార్పకుండా చూశారు అజిత్, అపురూపా. అచ్చం ఇందాకటి సోల్జరు లాగానే వున్నాడు. ఏమాత్రం తేడా లేదు!
కవల పిల్లలు కావచ్చు బహుశా!
"మూడు లక్షల ఒకటి ఇప్పుడే వస్తాడు. మీరిక్కడే చెక్క బొమ్మల్లాగా కదలకుండా నిలబడండి!" అని తనొక్కడే మార్చ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అతను.
మరో రెండు నిమిషాల తర్వాత మూడు లక్షల ఒకటి. వాళ్ళని గమనించనట్లే చకచక ముందుకి వెళ్ళిపోతూ హఠాత్తుగా ఆగి వెనక్కి వచ్చి "ఎవరు మీరు?" అన్నాడు గదమాయిస్తూ.
"మీరే ఇందాక సంకెళ్ళు..." అనబోయి ఆగాడు అజిత్. "ఎక్స్యూజ్ మీ! మీరు మూడులక్షల ఒకటేనా?"
"కాదు! మూడులక్షల ఇరవై! అయినా నీకెందుకు? ఎవరు మీరు?" అన్నాడతను.
ఒకే పోలికలతో వున్న కవలలు ఇద్దరుండడం సంభవమే! కానీ ముగ్గురా?
అప్పుడు గమనించారు అపురూపా, అజిత్. అక్కడికి కొద్దిదూరంలోనే అలాంటి పోలికలతోనే ఇంకొకడున్నాడు.
చీమల పుట్టమీద నిలుచున్నప్పుడంతే! మొదట అన్ని చీమలనీ ఒక్కసారిగా గమనించం. ముందర ఒక చీమ కాలి మీదికి ఎగబాకుతుంది. దాన్ని దులుపుకో బోతుంటే పాదం మీద మరోటి కనబడుతుంది. దాన్నీ దులుపుతుంటే అప్పుడు నేలమీద అసంఖ్యాకంగా వున్న చీమలన్నీ ఒక్కసారిగా దృష్టిలో పడతాయి.
సరిగ్గా అలానే అయింది ఇప్పుడు. అక్కడవున్న సోల్జర్లు, కూలీలూ, బేరర్లూ, పైలట్లూ, డ్రైవర్లూ, ఆఫీసర్లూ -
అందరూ ఒకే మూసలోపోసి తీసినట్లు, అచ్చు ఒకే పోలికలతో వున్నారు!
"మై గుడ్ నెస్ గ్రేషియస్!" అంది అపురూప అదురుతున్న గుండెతో.
"క్లోనింగ్! అందుకే అందరూ కార్బన్ కాపీల్లాగా వున్నారు" అన్నాడు అజిత్, అలర్టుగా అయిపోతూ.
ఈసారి నిజంగానే మూడులక్షల ఒకటి వచ్చాడు.
"పదండి! మీరిప్పుడు నెంబర్ వన్ దగ్గరికి వెళ్ళాలి" అన్నాడు.
"నెంబర్ వన్నా? అదెవరు?" అన్నాడు అజిత్.
వెంటనే మూడులక్షల ఒకటి గొంతులో భయమూ, భక్తీ రెండూ ధ్వనించాయి.
"నెంబర్ వన్ ఎవరా? ఆయన నాకు తండ్రి. నాకే కాదు ఈ దేశ ప్రజలందరికీ ఆయనే తండ్రి! నిజంగానే!" అన్నాడు.

                                                                * * * *

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra