లోపల లాకప్ రూం లో వున్న వీరూకి ఈ విషయం తెలీదు.
ఆ తరువాత రాక్షసుల్లా ఆ ముగ్గురూ వీరూ చెల్లెల్ని ఆ రాత్రంతా క్రూరంగా అనుభవించారు.
కానీ వీరూని వదిలి పెట్టలేదు. వీరూని వదిలి పెట్టటమన్నది ఆ ముగ్గురి చేతుల్లో లేదు. కంట్రాక్టరో- గౌండర్ కల్పించుకుంటే గాని వీరూ విడుదల లేదు.
ఆ అవమాన భారంతో వీరూ చెల్లెలు ఊరి పోసుకొని చనిపోయింది.
జరిగింది తెలుసుకున్న గౌండర్ , కంట్రాక్టరరు వణికిపోయారు. తప్పు చేసిన ఆ ముగ్గుర్ని కాపాడుకోక తప్పలేదు వారికీ. అందుకే ఎవడో ప్రేమించి, పెళ్ళి చేసుకుంటానని చెప్పి వీరూ చెల్లెల్ని మోసగించాడని - అందుకే ఆ పసిది ఉరి పోసుకు చనిపోయిందని పుకారు లేవదీశారు.
నిన్ననగా తమ బిడ్డ ఎక్కడికి వెళ్లిందని తల్లడిల్లుతున్న వీరూ తల్లిదండ్రులు , కూతురు శవమై చెట్టుకి వేలాడుతుందని తెలీగానే కుళ్ళి పోయారు.....కుమిలి కుమిలి ఏడ్చారు.
ఈలోపు ఎవరో ఈ విషయాన్ని ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లాకప్ లో వున్న వీరూకి చేరవేశారు.
ముందు నమ్మలేక - ఆపైన ఆ నిజాన్ని తట్టుకోలేక పోయాడు. గుండెలు పగిలేలా ,లాకప్ గది గోడలు ప్రతిధ్వనించేలా పెనుకేకలు పెడుతూ ఏడ్చాడు.
ఒళ్ళంతా గాయాలు .....తిండి తిప్పలు లేవు, నిద్ర లేదు. గాయాలు సలుపుతున్నాయి. అప్పటివరకు అతని నరనరాన నిస్సత్తువ ఆక్రమించుకొని వుంది.
అప్పటివరకు అతను కేవలం క్షతగాత్రుడు -- ఆపైన మారిపోయాడు దెబ్బ తిన్న చిరుతపులిగా.
ఆ లాకప్ అతన్ని అపగాలిగెంత శక్తి వంతమైనది కాదు. తను పారిపోయే ప్రయత్నం చేస్తే అది పెద్ద కేసవుతుందని , గౌండర్ విడిపిస్తాడని అప్పటి వరకూ ఆగాడు వీరూ.
అడవుల్లో తిరిగే నోరు లేని జంతువయిన వీరూకి తప్పించుకు పోయే ధైర్యం ఎక్కడిదని ఆ ఎస్.ఐ కూడా ఒకింత నిర్లక్ష్యంగా ఉన్నాడు.
అదే అదను ....లేని శక్తిని కూడకట్టుకొని, పగనీ, పట్టుదలని పంతాన్నీ , కాసినీ , ఉక్రోషాన్ని పోది చేసుకొని - శారీరకమైన బాధల్ని తాత్కాలికంగా మర్చిపోయి - మానసిక బలాన్ని కూడా గట్టుకొని ఒక్కసారి వరద ప్రవాహంలా ఆ లాకప్ నుంచి బయట పడ్డాడు.
ఫారెస్ట్ సిబ్బంది తేరుకొనే లోపే పుట్టల్ని, గుట్టల్ని లెక్క చేయక శబ్దం కంటే వేగంగా వచ్చి ఊర్లో పడ్డాడు. చెల్లెలి శవానికి కర్మ కాండ నిర్వహిస్తున్నారప్పుడు.
పర్వత సానువులు ప్రతిధ్వనించేలా పొలికేక పెట్టి ఫేయింటాయి పడిపోయాడు తన చిన్నారి చెల్లెలి శవాన్ని చూసి.
ఇక్కడిలా ఉండగా అక్కడ ఎస్.ఐ. కొందరు గార్డ్స్ ని తీసుకొని తన అహాన్ని, అధికారాన్ని బ్రద్దలు చేసుకొని వెళ్ళిన వీరూని తిరిగి అరెస్ట్ చేసేందుకు బయలుదేరాడు.
ఆ వార్త క్షణాల్లో గోపీనాదానికి చేరిపోయింది. క్షణకాలం ఆలోచించిన గ్రామా ప్రజలు చేతికందిన కట్టేల్నిం కర్రల్ని, పలుగుల్ని తెసుకొని ఊరులోకి అటవీ సిబ్బంది రాకుండా రక్షణ దుర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
ఆ ఊరు వెలిశాక అదే మొదటిసారి అంత ఉద్రిక్తత -- ఉద్రేకం ఉద్వేగం గూడు కట్టుకోవటం -
పరిస్థితిమీ తలచుకొని గౌండర్ , కంట్రాక్టర్ వణికి పోయారు.
వీరూని తిరిగి అరెస్ట్ చేసే ప్రయత్నాన్ని గౌండర్ సలహా మీద అటవీ సిబ్బంది విరమించుకుంది.
కొన్ని రోజులు గడిచిపోయాయి. ఊరంతా శ్మశాన నిశ్శబ్దం --- వైరాగ్యం అలుముకుంది. ఊరికే లక్ష్మి కళగా ఉన్న వీరూ చెల్లెలు పోవటం - ఆ కుటుంబ సభ్యుల్నే కాదు - గ్రామ ప్రజల్ని సయితం కదిలించి వేసింది.
పనిలేదు - కూలీ లేదు - పొయ్యి లో పిల్లి లేవటం లేదు.
వీరూ పరిస్థితిని అర్ధం చేసుకొని తేరుకున్నాడు.
సరీగ్గా అప్పుడే గౌండర్ , వీరూని కలిసేందుకు వచ్చాడు - కానీ తన గురువును చూసేందుకు ఇష్టపడలేదు.
గౌండర్ పరిస్థితిని అర్ధం చేసుకొని కంట్రాక్టర్ ని ముందు పంపించాడు.
వీరూ చెబితే తప్ప పనిలోకి రామని వాళ్ళు భీష్మించుకు కూర్చున్నారు. నాటకంలో భాగంగా గౌండర్ కూడా తన పనిలోకి రమ్మని అడిగి లేదని పించుకున్నాడు.
కంట్రాక్టర్ పని పూర్తిగా ఆగిపోయింది.
అప్పటికి కూడా గౌండర్ , కంట్రాక్టర్ ఒక్కటే అని వీరూకి తెలీదు.
ఈలోపు అడవి నుంచి వచ్చే ఆదాయం ఆగిపోవడంతో ఒక రాజకీయ నాయకుడు దిగిపోయాడు. అతను ఎమ్. ఎల్.ఏ నో, ఏం.పీ. నో సరీగ్గా తెలీదు. కానీ ఆ రెంటిలో ఏదో ఒకటి.
అతనికి అటు గౌండర్ - ఇటు కంట్రాక్టర్ -ఇద్దరూ ఇన్ కమ్ సోర్స్ , అయితే పరిస్థితి ఉద్రిక్తతను సంతరించుకొని ఉండడంతో ఊసర వేల్లిలా రంగుమార్చి, కంట్రాక్టరు ను తీసుకొని గోపీనాధం బయలుదేరాడు.
ఇద్దరూ చెరొక పాత్రని పోషించాలని ముందే అనుకున్నారు. ఏం.పీ పోలీసుల్ని ఫారెస్ట్ సిబ్బందిని తీసుకొని సడన్ గా గ్రామంలోకి ప్రవేశించాడు.
దాన్ని ఊహించని గ్రామ ప్రజలూ, వీరూ షాక్ తిన్నారు.
ఎం.పీ బెదిరిస్తే - కాంట్రాక్టరు ఆ గ్రామ ప్రజల్ని , వీరూని దువ్వాడు.
వీరూ దక్కలన్నా - మీకు పని దొరకాలన్నా నా దగ్గర పనిచేయండి. కూలి కూడా పెంచుతాను. లేదంటే ఎం.పీ గారు ఇష్యుని తన చేతుల్లోకి తీసుకుంటారని కంట్రాక్టర్ అన్యాపదేశంగా హెచ్చరించాడు.
వీరూ చకచకా ఆలోచించాడు.
ముందు తను సేవ్ కావాలి - తరువాత గౌండర్ ని నిర్వీర్యుడ్ని చేయాలి. ఆపైన తన చెల్లెల్ని మానభంగం చేసిన రెంజర్, గార్డ్ ని , ఎస్. ఐ ని ముక్కలు ముక్కలు కింద నరికి పడేయాలి.
అంటే ,ముందు తనకు బలం పెరగాలి - బలగం వెన్నంటి ఉండాలి. ముఖ్యంగా ఒక కాపు కాసే ఎం.పీ లాంటి వారి అండ కావాలి. ఆపైన తన పధకాల్ని అమలు పర్చాలని నిర్ణయించుకున్నవాడై - కూలి పెంచితే పనిలోకి వస్తామని - మా మీద కేసులు రాకుండా చూడాలని - అవసరం వస్తే ఆదుకోవాలనే అతి మాములు మూడు నిబంధనల్ని పెట్టి ఎం.పీ తో ఒట్టేయమన్నాడు.
ఆ సమస్య అంత తేలిగ్గా పరిష్కారమవుతుందని ఊహించని ఎం.పీ అనందభరితుడై - అది తన మూలంగానే జరిగిందనే స్వాతిశయానికి వెళ్ళి ఒట్టేశాడు . ఆరోజే ఎం.పీ వీరూ కోరిక మీద కంట్రాక్టర్ చేత అందరికీ అడ్వాన్స్ కూడా ఇప్పించాడు.
అడవిలో తిరిగి పని మొదలయిపోయింది. కంట్రాక్టర్ కి - ఎం.పీ కి బాగా ఇష్టుడయిపోయాడు వీరూ. గౌండర్ కార్యకలాపాల్ని స్తంభింప జేశాడు. గౌండర్ కి - కంట్రాక్టర్ కి మధ్య నున్న సంబంధాల గురించి తెలిసింది వీరూకి.
వృద్దుడ్ని నమ్ముకుంటే అడవినేం కొల్లగొడతాడు? తనని నమ్ముకోమని ఒక పధకం ప్రకారం చెప్పి ఎం.పీ ని ముందు ఒప్పించి - ఆపైన కంట్రాక్టర్ కి - గౌండర్ కున్న సంబంధాల్ని త్రుంచేశాడు వీరూ.
ఈలోపు చాపకింద నీరులా కంట్రాక్టర్ కి , ఎం.పీ కి తెలీకుండా తను కొంత సరుకును స్మగుల్ద్ చేసి ఆ డబ్బంతా ఫారెస్ట్ సిబ్బందిపై వెదజల్లాడు.
దాంతో ఎం.పీ , కంట్రాక్టర్ అవసరం లేకుండానే తన మాటే అటవీ సిబ్బంది దగ్గర చెల్లుబడయ్యేలా చూసుకున్నాడు.
ఇంత జరిగినా,జరుగుతున్నా వీరూ తన చెల్లెల్ని మానభంగం చేసిన ఆ ముగ్గుర్ని మర్చిపోలేదు. ఒక దెబ్బకు రెండు పిట్టలు ఎత్తువేశాడు. ఆ ముగ్గుర్ని చంపితే తన పగ చల్లారుతుంది - తన చెల్లెలి ఆత్మ శాంతిస్తుంది.


