Home » Dr c. ananda ramam » Suryanethram


    రవి సమాధానం చెప్పలేకపోయాడు. "అన్యాయం! దారుణమైన అన్యాయం!" అని ఘోషిస్తోంది అతని మనసు. కింది కులాల ఆడపిల్లలని ఒక హక్కులాగా అగ్రవర్ణాలు అనుభవించే ఆచారం.
    ఆలోచనలలో వున్న రవి దృష్టిని దూరంగా కనిపించే బంగళా పెంకుల ఇల్లు ఆకర్షించింది. ఎత్తైన కొండ మీద కట్టారు దానిని.
    "ఆ ఇల్లెవరిది? గిరిజనులది అయివుండదు. ఇంత మారుమూల, అడవిలో, కొండల మధ్య ఇల్లెవరు కట్టుకున్నారు?"
    "అది మాదే! ఒక రకంగా నాదే!"
    "నిజంగా? ఇక్కడ మీకు ఇల్లెందుకూ?"
    "అక్కర్లేదు. కాని వుంది. అది అమ్మగారి పూర్వీకులది. అరణంగా మా అమ్మకి వచ్చింది. ఇప్పుడు నాకు వస్తుంది."
    "అరణం అంటే?
    "జమీందారీ కుటుంబాల్లోనూ, రాజకుటుంబాల్లోనూ ఆడపిల్లని అత్తవారింటికి పంపేటప్పుడు అగ్రహారాలూ, లేదా భూములూ, దాసదాసీలూ మొదలైన హంగులన్నింటితోనూ పంపేవారు. అలా వచ్చిన భూములు సాధారణంగా మళ్ళీ తమ ఆడపిల్లలకిస్తారు. ప్రబంధాలలో నంది తిమ్మన్న తిరుమలదేవి వెంట అరణంగా వచ్చిన కథ చదవలేదూ?"
    "చదవలేదు, విన్నాను. ఇదీ ఒక రకంగా వెట్టిచాకిరీయే!"
    "కొంత భేదం వుంది. ఇలాంటి దాసీలకి దైనందినావసరాలకి లోటు వుండదు. ఎక్కడో తప్ప తగినంత గౌరవాదరాలు కూడా వుంటాయి."
    "ఇప్పుడా యింట్లో ఎవరుంటున్నారు?"
    "దెయ్యాలు!"
    "ఛా?"
    నవ్వింది అనిల.
    "నిజమో, అబద్దమో నాకూ తెలీదు. ఇటీవలి కాలంలో నేనెప్పుడూ ఆ ఇంటికి వెళ్ళలేదు. ఆ ఇల్లు చూస్తేనే నాకు మతిపోయినట్లవుతుంది."
    "ఎందుకని?"
    "మూడేళ్ళ కిందట మా కుటుంబం ఒకసారి ఇక్కడికి వచ్చింది అమ్మపేర ఈ ప్రాంతంలో ఉన్న కొద్దిపాటి భూమినీ, ఆ యింటినీ అమ్మాలని చూశారు నాన్నగారు. ఎవరు కొంటారు? అప్పుడు ఒక్కరోజు మాత్రమే ఆ ఇంట్లో ఉన్నాం ఆ రాత్రి నాకొక భయంకరమైన కల వచ్చింది. ఇప్పటికీ అప్పుడప్పుడు ఆ కల నన్ను వెన్నాడుతూనే ఉంటుంది."
    నిలువునా వణికింది అనిల. నుదుటిపైన కొద్దిగా చమట కూడా వచ్చింది.
    "ఏమిటా కల?"
    "చిమ్మ చీకటి! బోలెడన్ని గదులు. నేను దారి తప్పిపోయాను. బయటికి రాలేక ఒక గదిలోంచి మరో గదిలోకి తిరుగుతున్నాను చీకట్లో! ఇంతలో భయంకరమైన ఆకారం. రెండు చేతులూ చాచి పైనుంచి నామీదకి దూకబోయింది. నేను గట్టిగా అరవబోయాను. ఎవరో నా నోరు నొక్కేశారు. ఏదో గుహలోకి లాక్కుపోయారు. గుహంతా చీకటి. నేను భయం వేసి ఏడుస్తున్నాను. ఎంత ఏడ్చినా ఎవరూ వినిపించుకోరు. పైగా చుట్టూ భయంకరమైన ఆకారాలు కనిపిస్తున్నాయి. కత్తులూ కటారులతో ఒక చిన్న రంధ్రం కనిపించింది చిత్రం! నేను చిన్నపిల్లనయిపోయాను. ఆ రంధ్రంలోంచి బయటికి వచ్చేశాను. వెలుతురు ఉంది. అలాగే చిన్నపిల్లలూ ఉండిపోయి 'అమ్మా?' 'అమ్మా?' అని ఏడ్చేస్తున్నాను.
    "చిత్రంగా ఉంది. మీకు కలల్ని అనలైజ్ చేయటం తెలుసా?"
    "ఫ్రాయిడ్, ఆడ్లర్, యూంగ్ మొదలైన వాళ్ళ పుస్తకాలు చదివాను. కానీ మనకంతా అయోమయంగా ఉంటుంది. క్లినికల్ సైకాలజిస్ట్ ని కలుసుకుని నా కల గురించి చెప్పాను. నేను ఏదో 'రెస్ట్ లెస్ నెస్' తో బాధపడుతున్నానని చెప్పింది కొంతవరకు నిజమే?"   
    "ఈ కల మీకు ఇక్కడి ఇల్లు చూసినప్పుడే వస్తుందా?"
    "ఎప్పుడూ వస్తుంది. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం నన్ను ఈ ఇల్లు అయస్కాంతంలా ఆకర్షిస్తుంది ఒకటి రెండు సార్లు. వెళ్ళటానికి ప్రయత్నిస్తే ఎవరో ఒకరు అడ్డుకుని ఆపు చేశారు. ఎత్తైన కొండమీద కట్టిన ఇల్లు కావటం వల్ల ఈ గ్రామాలలో ఎక్కడున్నా ఆ ఇల్లు కనిపిస్తుంది. అది వెయ్యి చేతులు నావైపు చాచి 'రా! రా! రా!' అని పిలుస్తున్నట్లు తోస్తుంది. ఏముందో ఆ ఇంట్లో?"
    అనిల మాటలతో దూరాన కొండమీద విసిరేసినట్లుగా ఉన్న ఆ ఇల్లు రవిని కూడా ఆకర్షించింది. ఒకసారి లోపల తిరిగి రావాలనిపించింది. తను వచ్చిన పని వేరు. రోజురోజుకీ విచిత్రంగా ఈ జమీందారుల, గ్రామీణుల, గిరిజనుల జీవితాలతో పెనవేసుకుపోతున్నాడు. తెలిసి తెలిసి ప్రమాదాల వైపు అడుగు వేస్తున్నాడు.
    "మీరు అనలైజ్ చెయ్యగలరా? నా కలని?" అడిగింది అనిల.
    "కరెక్ట్ గా చెయ్యలేను. ఎవరూ చెయ్యలేరు. బహుశా ఫ్రాయిడ్, ఆడ్లర్, జంగ్ మొదలయిన వాళ్ళందరూ ఒక్కొక్క రకంగా సిద్ధాంతాలు చేశారు. అచేతనలో సంచలనాన్ని గురించి మొత్తం మీద మనసుని ప్రధానంగా LIBIDO. ID. EGO SUPER EGO పొరలుగా విభజించుకోవచ్చునని అందరూ అంగీకరించారు. చదువుతో సంస్కారంతో కొంత క్రమశిక్షణతో మనం అలవరచుకుని వ్యక్తీకరించేది super ego ఇదే పైకి అందరికీ కనిపించే మన ప్రవర్తన కానీ, దీనివెనుక మనకే తెలియకుండా అచేతనలోనే జరిగే అణిచివేత ఎంతో ఉంది. ఈ రకంగా అణచివేయబడ్డ విషయాలూ లేక భావాలు కలలై పైకివస్తాయి చేతన కొద్దిగా విశ్రమించగానే."
    "కానీ కొందరికి వచ్చిన కలలు నిజమవుతాయట. కొందరికి ముందు ఏం జరుగుతుందో కలలో తెలుస్తుందట. అదీగాక కలలో ఏదో వస్తే నిజంగా మరేదో అవుతుందనీ, ఇలా కలల గురించి ఎన్నెన్నో చెప్పుకుంటారు."
    "అవి ఒక రకంగా నిజం. మరో రకంగా కాదు. ఎక్కడో చదివింది కేవలం తమాషాకి గుర్తు పెట్టుకున్నాను. గోడలు మొదలైనవి కలలో కొస్తే జీవితంలో ఆటంకాలు ఎదురవుతాయనీ, అలాగే పెళ్ళి కలలోకొస్తే అది మరణాన్ని సూచిస్తుందనీ, చావు కలలో కొస్తే అది శుభమనీ, ఇలా ఏవేవో ఫ్రాయిడ్ అయితే మెట్లు ఎక్కడమూ, దిగడమూ మొదలైన కలలు కూడా సెక్స్ కి సంబంధించినవే అంటాడు. ఈ శాస్త్రాల మాట ఎలా ఉన్నా నేనయితే అచేతనలో అణచివేతలే కలలకి ప్రధాన కారణమని నమ్ముతాను. మీరన్నట్లు కొందరికి వచ్చిన కలలు నిజం కావచ్చును. అందుకు కారణం నా ఉద్దేశం కేవలం సిక్త్ సెన్స్. కలదాకా ఎందుకూ? ఒక్కొక్కసారి మనకే ముందు జరగబోయేది మనసులో భావిస్తుంది కొన్ని సందర్భాలలో నిజమవుతుంది. Instint జంతువుల్లో ఎక్కువగా ఉంటుంది. మనలో కూడా కొంత ఉంటుంది. అన్నింటికీ అగాధమైన మనసే మూల కారణం. మనసుకున్న సెన్సిటివ్, భావుకత, గాఢత వీటినిబట్టి ఉంటాయి. కలలూ, భావనలూ, ఆలోచనలూ అన్నీ"
    "కొంతమంది కలలు చాలా క్రమబద్ధంగా వచ్చినట్లుగా చెప్తారు. నాకు అలా రావు"
    "ఎవరికీ రావు, రాకూడదు. వస్తే అది కల కాదు. భావన అవుతుంది. నిద్రలో చేతన విశ్రమిస్తుంది. అచేతనలో అణిగిన భావాల విజృంభణ్ని విశ్రమించే చేతన కంట్రోల్ చెయ్యలేదు. స్పష్టమైన వ్యక్తీకరణ కూడా ఉండదు."
    "క్లినికల్ సైకాలజిస్ట్స్ చాలా గమ్మత్తుగా వ్యాఖ్యానిస్తారు. నగ్నంగా ఉన్నట్లు-అందుకు సిగ్గుపడుతూ, బాధపడుతూ ఉన్నట్లు కలొస్తే అది గిల్టీ కాన్షన్ నెస్ ని చూపిస్తుందట."  
    "మీరేమీ అనుకోనంటే, మీ కలలో ఒక భాగాన్ని అనలైజ్ చెయ్యటానికి ప్రయత్నిస్తాను."
    "అనుకోను"
    "మీరు ఒక గదిలోంచి మరో గదిలోకి తిరుగుతూ బయటికి దారి దొరక్క భయపడ్డారన్నారే కలలో? అది బహుశా దేవనారాయణ్ గారితో జరిగిన ఎంగేజ్ మెంట్ నుంచి విముక్తి పొందాలనే మీ ఆరాటమూ, అలాంటి విముక్తి దొరకదనే నిరాశా చూసిస్తున్నాయేమో?"
    అనిల తల దించుకుంది. వెంటనే సమాధానం చెప్పలేదు.
    "చూశారా? కనీసం మనలో మనమైనా కొన్ని విషయాలు ఒప్పుకోలేము. ఇవే మనసుని బలహీన పరుస్తాయి. నిర్భయంగా మనల్ని మనం ఎదుర్కోగలిగితే అంతకంటే మానసికారోగ్యానికి కావలసినది లేదు."

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra