దీని కర్థం ఏమిటంటావు? బహుశా అర్థమేమీ వుండకపోవచ్చు. లేక నా ఊహకు అందనిది ఏమయినా వుండవచ్చు. నువ్వు యిలాంటి విషయాలను గురించి ఆలోచించవు.

 

    అసలు మన మిరువుర మెవరిమో, ఈ ఆవేదనల మూలచరిత్ర ఎక్కడ దాగివుందో, ఈ అనురాగాలకు ముడి ఎక్కడ వేసివుందో? అంతా అయోమయంగా ఉంది.

 

    చివరకు నా జీవితం ఓ నిట్టూర్పుగా మారి ముగుస్తోంది.

 

    అర్థంలేని రాత రాశాను. కోపగించకు అక్కా! ఇహ ఉంటాను.

 

                                                                        సీత.

 

    వేదిత కళ్ళు రెండూ నీటితో నిండిపోయి, చెంపలమీద ప్రవాహంగా ఏర్పడ్డాయి.

 

                                          * * * 

 

    ఓ రాత్రి వేదిత గృహకృత్యాలన్నీ పూర్తిచేసుకుని, హఠాత్తుగా ఆరిపోయిన దీపాన్ని మళ్ళీ వెలిగించి ఒత్తి కొంచెం పెద్దది చేసి గోడకు తగిలిస్తోంది. గోవిందాచార్యులుగారు యింట్లో లేరు. ఇందుమతమ్మగారికి సుస్తీ ఎక్కువగా ఉన్నదంటే అక్కడికి వెళ్ళారు. ఆ రాత్రికి అక్కడే పడుకుంటానని కబురుచేశారు తర్వాత.

 

    దీపం గోడకు తగిలించి అలికిడి అయితే తల వెనక్కి త్రిప్పి చూసింది. వెంటనే విభ్రాంతురాలయి "నువ్వా? ఈ సమయంలోనా?" అన్నది అనుకోకుండా మారిపోయిన కంఠంతో.

 

    కళ్యాణమూర్తి లోపలకు వచ్చి ఆమెను సమీపించి బలవంతాన నవ్వటానికి ప్రయత్నిస్తూ "నీతో ఏకాంతంగా మాట్లాడదామని నాలుగయిదు రోజులుగా ప్రయత్నిస్తున్నాను వేదిత! నీకు తెలుసు. సాధ్యంకాలేదు. ఇందుమతమ్మగారికి సుస్తీ యెక్కువగా ఉన్నదంటే చూడటానికి వెళ్లాను. మీ నాన్నగారు అక్కడే పడుకుంటారని తెలిసి, సాహసం చేసి యిలా వచ్చాను. ఇందులో అసభ్యత యేమయినా వుంటే క్షమించు అన్నాడు.

 

    ఒక నిమిషం వేదిత మౌనంగా నిలబడి, తర్వాత "కూర్చో! అన్నది నెమ్మదిగా.

 

    కళ్యాణమూర్తి ముక్కాలిపీట కొంచెం యివతలకు లాక్కుని కూర్చుని "నీతో యివాళ చాలా విషయాలు మాట్లాడాలని వచ్చాను. ఎంత సేపని నిలబడతావు? ఆ చాపమీద కూర్చో నువ్వు కూడా" అన్నాడు.

 

    "ఫర్వాలేదు. ఎంతసేపయినా నిలబడటం నాకు అలవాటే. చెప్పు."

 

    అతను ఆమె ముఖంలోకి సూటిగా చూసి "అవునూ! నువ్వంత కఠినంగా ఎందుకు మారిపోయావు?" అన్నాడు.

 

    "నీపట్ల నాకేం కఠినత్వంలేదు. ఉన్నా బాగుండేది" అనుకున్నదామె మనస్సులో "జీవితంపట్ల నిజాయితీ కఠినంగానే ఉంటుంది కళ్యాణమూర్తీ!" అంది బయటకు.

 

    "వేదితా! నాకు నిర్వచనాలు చెప్పకు. నిర్వచనాలు మనిషిని మనస్సులేని యంత్రంగా మారుస్తాయి. కాని రక్తప్రసారం ఉన్న జీవునిలా స్ఫురింపజేయవు వేదితా! చాలా సంవత్సరాలు గడిచాక నా భూమికి తిరిగివచ్చాను. ఇక్కడికి వచ్చాక నా అభిరుచులు, ఆలోచనలు నన్ను గల్లంతు చేస్తున్నాయి. ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి."

 

    ఆమె గుండె గబగబ కొట్టుకుంటోంది. "తనకేం జరిగింది? ఇంత పాపిష్టి శరీరమా తనది? ఇంతమందిని ప్రలోభపరుస్తున్నదా?"

 

    వెనువెంటనే ఉలిక్కిపడి తనని దిద్దుకోవటానికి ప్రయత్నించింది. "ఎందుకు నాగుండె యిలా కొట్టుకుంటోంది? ఇంత మామూలు మనిషినా నేను? ఎన్నాళ్ళకూ నాకు పెరుగుదల లేదా?" అని విసుక్కుంది.

 

    "అదే చరిత్ర.... అదే కళంక వాతావరణం... అదే సుడిగుండం.... అదే విషవాయువు మళ్లీ మొదలవుతున్నాయి. అయితే ధ్వని వేరు."

 

    "నీకు ఈనాడు కొన్ని నిజాలు చెప్పాలని వచ్చాను వేదితా!"

 

    "వద్దు వద్దు, ఆ నిజాలు చెప్పవద్దు అని అరవాలనుకుంది. "ఒకవేళ నాకు నిజంగా వినాలని వుందా? నేను ఆత్మవంచన చేసుకుంటున్నానా?" అని మళ్ళీ యింకో అనుమానం మొలకెత్తింది.

 

    బయటనుంచి వస్తూన్న గాలికి గోడమీద దీపం రేపరెపలాడుతోంది. ఎండలూ, వడగాల్పూ క్రమంగా తగ్గిపోయి గాలి చల్లదనానికి వచ్చింది. అందులో నిన్నటినుంచి ముసురు ముంచుకువస్తున్నది. సమీప తీరాల్లో ఎక్కడో గాలి చెలరేగి వుండాలి. ఏ క్షణాన్నయినా భారీ ఎత్తున వర్షంపడే బెదిరింపూ, మేఘ గర్జనలూ తరుచూ వినవస్తున్నాయి. తోటలోంచి దూరంగా రాత్రిపూట మేలుకునే పక్షి ఏదో వికృతంగా అరుస్తోంది ఉండి ఉండి.

 

    వేదిత అప్రయత్నంగా వెనక్కు జరిగి గోడకు ఆనుకుని నిలబడింది దీనురాలిలా. కదులుతూన్న దీపంకాంతికి అతని ముఖం మీద నీడలు చూడటానికి తెరలు తెరలుగా కదిలిపోతున్నాయి. అతని ముఖంలోకి చూడటానికి ఆమెకు జంకుగా ఉంది. ఎటో చూస్తోంది. బహుశా లోతు తెలియని ఆగాధాల్లోకి.

 

    మసక వెల్తురు కళ్యాణమూర్తి మీదకు చాలీచాలనట్లు వ్యాపించి, అతను ఓ ఛాయతగ్గినట్లుగా, నల్లగా, మనిషి అర్థభాగంగా కనిపిస్తున్నాడు. తరుచూ కలసుకునే యిరువురు ఆప్తమిత్రులే. మసక వెల్తుర్లోగాని, చీకటిలోగాని కబుర్లు చెప్పుకుంటూంటే కాస్త కొత్తగా, తెలియని తేడాగా వుంటుంది. మనిషిలోని బలహీనతలు బయటకు వచ్చినట్లు, బయటకు వచ్చినా యెవరికీ కనిపించం కదా అన్న ధైర్యంతో సత్యాలు చీకటి ముసుగున సైర్వవిహారం చేసినట్లు, రుచులు మారినట్లు గొంతులో విచిత్ర వ్యక్తిత్వం తొణికిస లాడినట్లు... అపురూప అనుభూతులు.    

 

    కళ్యాణమూర్తి చెబుతున్నాడు. "మన బాల్యం, ఆ అమాయకపు అనుబంధాలూ, పసి మనస్తత్వాలూ, మరచిపోలేదనుకుంటాను. మన మిద్దరం ఒకరినొకరు ఎంత గాఢంగా పెనవేసుకుపొయామో, రెండులతల్లా ఎలా అల్లుకుపోయామో విద్యుల్లతల్లా మనలో యెలాంటి మెరుపులు మెరిసేవో నీకు తెలుసు. అలా పెనవేసుకుంటూనే బాల్యంలోంచి, యవ్వనారంభంలోకి అడుగుపెట్టాము. నీ మీద స్నేహవాత్సల్యం, మమత, అనురాగం యెంత గాఢంగా నుండేవో అంత లోతుగానే మరోవేదన నన్ను పీల్చి పిప్పి చేస్తూవుండేది లోలోపల. నీవా! వైష్ణవ కన్యవు. నేను బ్రాహ్మణేతరుడ్ని. మన యిరువురి మధ్యనున్న యీ అంతరం అంతులేనిది. ఎందుకంటే నీ తండ్రి పరమ ఛాందసుడు. అతి ఆచారవంతుడు. మన యిద్దరి కలయికా అసంభవమనీ, ఈ సంబంధం యెప్పటికన్నా తెగిపోక తప్పదని ముందుగానే గ్రహించి పెంచుకున్న ఆశల్ని తెంచుకోలేక, అంతకన్నా యేం చెయ్యాలో తెలీక నాలో నేను కుమిలిపోతూ వుండేవాడ్ని. ఇదంతా నీకు చెప్పటానికి భాష చాలక నిన్నుకూడా వ్యధలపాలు చేయటం యిష్టంలేక నా ఆలోచన్లు నాలోనే దాచుకుని సతమతమయ్యేవాడిని. అలా ఉక్కిరి బిక్కిరి అవుతూనే కాలేజీచదువుకని ఈ ఊరు విడిచిపెట్టాను. శేషుశాయీ, నేనూ ప్రాణస్నేహితులయ్యాము. అయినా ఎప్పుడూ అతన్తో మనసు విప్పి ఈ విషయం ప్రస్తావించలేదు. నీ పెళ్ళన్నారు ఒకమాట చెబుతాను కోపగించుకోకు వేదితా! నిన్నెందుకు లేవదీసుకుపోకూడదనిపించింది. అప్పుడు నీది చురుక్కుమనే లేత వయసు. నేను వచ్చి ప్రలోభపరిస్తే లొంగిపోయేదానివేమో! ఇప్పుడు కాదని ధిక్కరిస్తావులే. ఇప్పటి మానసిక ఎదుగుదల వేరు. అప్పటి ఆకర్షణా, ఆకళింపులూ వేరు. నువ్వు వెరిశావు. నేనే వెరవలేకపోయాను.       

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra