Home » Suryadevara rammohan rao » Rakthachandanam


    ఇష్టం లేకపోయినా ఆ నలుగుర్నీ వదిలేశాడు దినేష్.
    మరుక్షణం ఆ నలుగురు గ్రామానికేసి పరిగెత్తారు.
    డ్రైవర్ ఒక పాలిథిన్ కవర్ తెచ్చి రంజిత్ కి అందించాడు వినయంగా.
    కేబిన్ లోని లైట్ వేశాడు శర్మ.
    "అల్ త్రోసిన్, రోజ్ లిన్, పేరాసెటమోల్, క్రోసిన్, సైనస్ 77" అని పైకే చదివాడు రంజిత్. అందులో నుంచి కొన్ని కేప్స్యూల్స్, టాబ్లెట్స్ స్ట్రిప్ ని బయటకు తీసి.
    "అల్ త్రోసిన్, రోజ్ లిన్, ఏంటీబయాటిక్ - ఇన్ ఫెక్షన్, వైరల్ ఫీవర్ కి పనికొచ్చేవి. పేరాసెటమోల్ జ్వరాన్నీ, ఒళ్ళు నొప్పుల్నీ కంట్రోల్ చేస్తుంది. క్రోసిన్ ఓన్లీ ఫర్ ఫీవర్ కంట్రోల్. సైనస్ 77 వైరస్ కోసమే. సైనస్ 77 తీసుకెళ్ళటాన్ని బట్టి అక్కడ బాగా చలి, వర్షం ఉండాలి. అలాంటి వాతావరణంలోనే సైనస్ ఉన్నవాళ్ళకి అది మరింత రెట్టింపవుతుంది...." అన్నాడు శర్మ తనకున్న కొద్దిపాటి అవగాహనతో.
    "ఫైవ్ హండ్రెడ్ ఎమ్.జి. ఏంటీబయాటిక్ అంటే వీరూ అనుచరులు వైరల్ ఫీవర్, టెంపరేచర్ తో బాగా సఫరవుతుండాలి...." రంజిత్ అన్నాడు.
    "అలా అని ఎందుకనుకోవాలి? ఫీవర్ త్వరగా తగ్గిపోవాలని_ ఆ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మకాం మార్చటానికి స్వస్థత త్వరగా చేకూరాలని కూడా 500 ఎమ్.జి. వాడవచ్చుగా....?" శర్మ తిరిగి అన్నాడు.
    కొద్ది క్షణాలు వ్యాన్ క్యాబిన్ లో నిశ్శబ్దం అలుముకుంది.
    "మొత్తానికి వీరూ తన అనుచరులతో ఈ ప్రాంతంలోనే మకాం చేస్తున్నాడని కోటేయూర్ మాదయ్య, తంగవేలు వారసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరక్టే అని తేలింది. రాత్రనక వర్షంలో, చలిలో పనిచేసి ఉండటంతో చాలామందికి స్వస్థతగా ఉందన్నది కొత్తగా తెలిసింది...." రంజిత్ తనలో తానే అనుకున్నట్లుగా అన్నా, అక్కడున్న అందరికీ వినిపించింది.
    శర్మ పాలిథిన్ కవర్ లోకి చెయ్యి పెట్టి మరికొన్ని మందులు బయటకు తీశాడు.
    "కోబాడెక్స్ ఫోర్ట్ 500 ఎమ్.జి....అంటే పవర్ ఫుల్ ఏంటీబయోటిక్ క్యాప్స్యూల్స్ తీసుకుంటే వచ్చే వీక్ నెస్ ని కాంపేన్ సెట్ చేసేందుకు వాడే పవర్ ఫుల్ విటమినైజ్డ్ క్యాప్స్యూల్స్.... దే ఆర్ ఆల్ సో ఫెమిరైజ్డ్ విత్ మెడిసన్స్ అండ్ డిసీజెస్...." అంటూ శర్మ కవర్ లో ఉన్న కొన్ని బాటిల్స్ బయటకు తీశాడు.
    "ఎస్ కోల్డ్ సిరప్....జలుబు మందు....కోరెక్స్ కాఫ్ సిరప్....దగ్గు, పొడి దగ్గుమందు, ఇబ్రూఫెన్ సిరప్ బ్రూఫెన్_యాంటివైరస్, యాంటిఇన్ ప్లమేటరీ, అనాలజెసిక్_ఫెనర్గాన్_ అనుమానంలేదు. వార్ని ట్రీట్ చేసుకోవటం వారికి బాగా తెలుసు. మందులు పెద్ద మొత్తంలో తెప్పించుకోవాలని ప్రయత్నించారంటే వీరూ అనుచరులు చాలామంది అస్వస్థతకు గురయ్యారు....అంటే మరికొన్ని రోజులు ప్రస్తుతం ఉన్న హైడౌట్ లోనే ఉండక తప్పదు. విశ్రాంతి వాళ్ళకు చాలా అవసరం...." శర్మ అంటుండగానే రంజిత్ అడ్డుపడ్డాడు.
    "ఈ అటవీ ప్రాంతం గురించి బాగా తెలిసిన రేంజర్స్, ఫారెస్టర్, ఫారెస్ట్ గార్డ్స్, రిజర్వ్ వాచర్స్ సహకారం మనకిప్పుడు కావాలి.... సడన్ గా అన్నాడు రంజిత్.
    "ఎందుకు....?" శర్మ అనుమానంగా ప్రశ్నించాడు.
    "వైర్ లెస్ లో హెడ్ క్వార్టర్ ని కాంటాక్ట్ చేసి_ వాతావరణ శాఖ శోధనా కేంద్రాన్ని కాంటాక్ట్ చేసి గత రెండు మూడు రోజుల్లో బాగా వర్షం ఏ ప్రాంతంలో కురిసిందీ_ఇంకా కురుస్తున్నది కూడా కనుక్కొని మనకు ఇన్ ఫామ్ చేయమను" అన్నాడు రంజిత్ దినేష్ కేసి చూస్తూ.
    శర్మ ప్రశ్న అలాగే మిగిలి ఉంది.
    దినేష్ వెంటనే వైర్ లెస్ సెట్ ని ఆన్ చేశాడు.
    "బహుశా వాళ్ళిప్పుడు ఏ కొండ గుహలోనో, కొండ దిగువన ఉండే కప్పులాంటి ప్రాంతంలోనో తల దాచుకొని ఉండాలి. ఆ ప్రాంతంతో పరిచయం బాగా ఉన్న మీ సిబ్బందిని అడిగితే అలాంటి వేమయినా ఉంటే చెప్పవచ్చు. కమాన్ క్విక్....కాంటాక్ట్ ది రేంజ్ ఆఫీస్" అన్నాడు రంజిత్ యుద్ధానికి సిద్ధమవుతున్న మిలటరీ కమేండర్ లా.
    పాలార్ రేంజర్ భయంతో ఒణికిపోయాడు.
    తన పై అధికారి శర్మ కనుక అతనికేసి ఆ ప్రయత్నం మానుకోమన్నట్లు అభ్యర్ధనగా చూశాడు.
    శర్మ ఏదో అనేలోపే రంజిత్ తిరిగి మాట్లాడసాగాడు.
    "పాలార్ బ్రిడ్జి ప్రాంతానికి దగ్గరలోనే వాళ్ళు గంధం చెట్లు నరికి ఉండాలి. రవాణా చేయవలసిన సరుకు బరువుతో కూడుకున్నదయితే లారీలు తిరగ్గలిగే ప్రాంతానికి దగ్గర్లోనే చెట్లు కట్ చేసుండాలి. పాలార్ రివర్ ఎగువ భాగాన్ని మనం పరిశోధించగలిగితే మొదలుకంటా నరికిన గంధపు చెట్లు బోదెలు కనిపించవచ్చు. వాటిని బట్టి ఆ ప్రాంతాన్ని కూంబ్ చేస్తే వాళ్ళ హైడౌట్ దొరకవచ్చు. ఏమంటారు....? రంజిత్ రేంజర్ ని ప్రశ్నించాడు.
    భయంతో అతని గొంతు తడారిపోయింది.
    అదెంత దుస్సాహసమో అతనికి తెలుసు.
    "లక్కీగా వాతావరణ పరిశోధనా కేంద్రంవారు ఆ స్పాట్ ని చెప్పగలిగితే మరీ మంచిది....? రంజిత్ కసి, పట్టుదల, ఉద్వేగం స్పష్టంగా తొంగిచూశాయి.
    అలాంటి సాహసాలంటే ఇష్టపడే దినేష్ కి ఆ ప్రపోజల్ బాగా నచ్చింది.
    కాని....రేంజర్ కళ్ళలో తొంగిచూసిన భయాన్ని పసిగట్టి సందేహంలో పడిపోయాడు.
    "రంజిత్....అదంత క్షేమం కాదని నా ఉద్దేశం. ఎందుకంటే మా డిపార్ట్ మెంట్ కి సహకరించే మీ పోలీసులకు అడవి గురించి, అందులో పొంచి ఉండే ప్రమాదాల గురించి, ఈ ప్రాంతం గురించి కొంతయినా తెలియపర్చాలి. అందుకు కావాల్సిన సామాగ్రిని సమకూర్చుకోవాలి. అప్పుడు పకడ్బందీగా కూబింగ్ మొదలెడితే బాగుంటుంది. పై అధికారులుగా మనం చేసే ఏర్పాట్లు, తీసుకొనే జాగ్రత్తలు మన సిబ్బంది గుర్తిస్తే వాళ్ళలోనూ ధైర్యం పాదుకుంటుంది....వెయిట్ ఫర్ టూ ఆర్ త్రీ డేస్" అన్నాడు శర్మ మెస్మరైజ్ చేసే వాయిస్ తో.
    రంజిత్ ఆలోచనల్లో పడ్డాడు.
    శర్మ రీజనింగ్ మీద అతనికి కొద్ది కాలంలో మంచి గురి ఏర్పడింది. మొండిగా వేటాడి ప్రయోజనం లేదని తనకూ అనిపించింది.
    "ఫారెస్ట్ గురించి చాలా తెలుసుకోవాల్సి ఉంది. వీరూ మూలంగా ప్రమాదం వస్తుందనే కాదు_ అడవిలోని క్రూరమృగాలు, విషసర్పాలు, ఇతర క్రిమికీటకాల నుంచి ముందు మనల్ని మనం రక్షించుకుంటూ వీరూని వేటాడాలి. ప్రాథమిక రక్షణ చర్యలోనే మనం దెబ్బతింటే ఇంకెలా ముందుకు వెళ్ళగలం....? మోకాళ్ళ వరకు ఉండే దృఢమయిన రబ్బరు సోల్ ఉన్న షూస్ మనకి కొన్ని వందల జతలు కావాలి. లేదంటే అడవిలోకి ఎంటర్ అవుతూనే కొందరయినా మనవాళ్ళు విష సర్పాల బారినపడే ప్రమాదం ఉంది. అలాంటి ఉపకరణాలు, జాగ్రత్తలు గురించి మనం ముందు చర్య తీసుకోవాలి.
    నీ ఆత్రుతని, నీ సిన్సియారిటీని, లక్ష్యశుద్ధిని నేనర్ధం చేసుకున్నాను. దయచేసి నా వాదనలోని లాజిక్ ని నువ్వు కూడా అర్థం చేసుకొంటే వెనక్కి వెళ్ళిపోదాం" అన్నాడు శర్మ కన్విన్సింగ్ గా.
    ఒంటరిగా మేనీటర్ ని ఎంతో ధైర్యసాహసాలతో ఎదుర్కొని చంపిన సాహసి శర్మ.... ఊరికే ఉద్రేకపడి, రంగంలోకురికే దుడుకు స్వభావం లేనివాడు_ ఎంతో ఆలోచించి, ఆచితూచి అడుగేసే సమర్ధుడైన ఫారెస్ట్ ఆఫీసర్. పిరికితనం అతనికి తెలీదని కూడా రంజిత్ కి తెలుసు.
    తనకు పరిచయంలేని ప్రమాద భూయిష్టమయిన అటవీ అంతర్భాగంలో కూబింగ్ ఆపరేషన్ నిర్వహించాలంటే తనకి శర్మ కందబలము, ధైర్యమేకాదు, వివేకవంతమయిన మార్గదర్శకత్వం కూడా కావాలి. కొద్ది క్షణాల్లోనే ఇవన్నీ ఆలోచించిన రంజిత్ చిరుదరహాసం చేస్తూ_
    "ఎమ్.ఎమ్. హిల్స్ కి పోనివ్వు" అన్నాడు డ్రైవర్ వైపు చూస్తూ.
    రేంజర్ ఊపిరి తీసుకున్నాడు.
    శర్మ ఆలోచనల్లో పడిపోయాడు.
    జీప్ రివర్స్ అయి వేగాన్ని పుంజుకుంది.


                                                 *    *    *    *

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra