Home » Dr c. ananda ramam » Cheekati Kadupuna Kanthi

 

    తనను లత అన్న వాడి మాటలన్నీ గాలికి కొట్టుకు పోగా "రానీ అడుగుతాను -" అన్న ఒక్కమాటకి హడలిపోయింది వారిజ. "వద్దు - వద్దు - లతా! మూర్ఖంగా ఈ సంగతులన్నీ ఆయనకు చెప్పకు. నీకే ప్రమాదం నువు కొంత వివేకంతో ప్రవర్తిస్తావేమోనని ఆశపడి అసలు విషయం చెప్పాను కానీ ఇలా రెచ్చి పోతావనుకోలేదు."
    "వివేకం !" నాకే వివేకముంటే నా వెనుక మీరిలా నాటకం అడగలిగెవారా? ప్రమాదమూ! ఇంతకంటే ప్రమాదమే ముంది? చేసిన నిర్వాకం చాలు కాని ముందు నా గడపలోంఛి అవతలకు నడు నా సంసారంలో నా ఇష్ట మోచ్చినట్లుంటాను - నా మొగుడితో నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాను - ఇంకో సారి నువు జోక్యం కలిగించుకుంటే సహించను."
    "లతా...."
    "ముందు అవతలకి నడు...."
    "పైట ఒంటినిండా తీసుకుని , తల పంచుకుని, దుఃఖన్నంతా తన గుండెల్లో దాచుకుని గబగబ అడుగులు వేస్తూ వీధిలోకి నడిచింది వారిజ.

                                                         -----------


    లత కోసం మల్లెపూలు, సంపెగలూ కొని చిరునవుతో ఇంట్లో అడుగు పెట్టిన రామచంద్రను చురచుర చూసింది లత.
    "ఎందుకా పూలన్నీ ఇక్కడికి? దాని దగ్గిరకే తీసికెళ్ళక పోయారా?" నిర్ఘాంతపోయాడు రామచంద్ర - " అదెవరు?"
    "ఆహా ! ఏం నంగనాచి నటన! ఇంకెవరు ? మీ వారిజ. " రామచంద్ర  చేతిలోంచి పువులన్నీ నేల రాలిపోయాయి పాలిపోయిన ముఖంతో లతను చూస్తూ నించున్నాడు.
    "ఏం? ఎందుకలా అయిపోయారు ? నాకు తెలిసి పోయిందనా? ఎన్నాళ్ళు దాచగలరు? రంకూ- జోంకూ దాగవు." ఆవేశంగా లత రెండు భుజాలా పట్టుకుని ఊపి రెండు లెంపలూ టపటప వాయించాడు రామచంద్ర.
    కేవున కేకపెట్టి పెద్ద పెట్టున శోకండాలు ప్రారంభించింది లత. ఇరుగు పొరుగు వినకుండా తలుపులు గట్టిగా వేశాడు రామచంద్ర.
    "ఏం వాగావ్? రంకా? ఎవరు రంకుతనం చేస్త్గున్నది? నేనా! ఎవరు చెప్పారు నీకు?"
    "ఏం? ఎవరూ చెప్పకపోతే తెలీదా? ఎన్నాళ్ళు దాచగలరు?"
    "నోరు మూసుకుని , అడిగిన దానికి సమాధానం చెప్పు. "గర్జిస్తూ మళ్ళీ చెయ్యెత్తాడు.
    హడలిపోయింది లత. అతని భీకర స్వరూపం చూసి.
    "ఎవరో ఏం ఖర్మ! ఆవిడే వచ్చి చెప్పింది.
    "ఎవరు/ వారిజా! వారిజ ఇక్కడికి వచ్చి నేను తనతో రంకు సాగిస్తున్నానని చెప్పిందా?" కళ్ళల్లోంచి అగ్నివర్షం కురిపిస్తూ అడిగాడు.
    "రంకు చేస్తున్నది తను రంకులాడినని ఒప్పుకుంటుందా? అవిడెందుకు చెపుతోంది? ఆవిడ మాటల్నీ బట్టి నేనే అర్ధం చేసుకున్నాను."
    "ఏం మాట్లాడింది ? ఏం అర్ధం చేసుకున్నావు?" పనికట్టుకుని ఇక్కడి కొచ్చి , "నీ మొగుడు నీ మీద చూపిస్తున్న ప్రేమంతా నిజం ప్రేమ కాదు - నేనే నిన్ను ప్రేమించమన్నాను - అందుకని ప్రేమిస్తున్నాడు - ఇప్పుడు నువు అతనితో సవ్యంగా ఉండక పొతే నిన్ను వదిలేస్తాడు ." అని చెప్పింది. అవిడేలా అడిస్తుంటే, మీరలా అడుతున్నారంటే ఏం లేకుండానేనా? నేనా మాత్రం అర్ధం చేసుకోలేనా? విచ్చలవిడిగా వుండే సినిమా రంగంలో సహితం గొప్ప వ్యభిచారిణిగా పేరు సంపాదించుకున్న ఆ వారిజ మిమ్మల్ని మాత్రం గుప్పెటలో పెట్టుకోలేదా?
    మళ్ళీ చెంప చెళ్ళు మంది లతకు. బావురుమంది లత.
    "దాని వల్లో పడి - దాన్ని మరిగి కట్టుకున్నదాన్ని ఇలా నానా హింసలూ ....." రెండు చేతులతోనూ లతను ఇష్ట మొచ్చినట్లు బాదేశాడు రామచంద్ర.
    "అపు! ఆ వెధవ వాగుడు అపు!"
    "ఆపను- ఎందుకాపుతాను? కట్టుకున్న దాన్ని కష్ట సుఖాలు గాలికొదిలేసి ఆ రంకు ముండతో కులికే మీరు స్వంత చేల్లిలి కాపురంలోనే నిప్పులు పొయ్యడానికి తయారయిన ఆ వగలాడి - మీరు ఇద్దరూ ఏకమై నాకు చితి పెరుస్తోంటే నేనెందుకు నోరు మూసుకుంటాను?" కొట్టడానికి ఎత్తిన చేయి వాలిపోయింది రామచంద్రకు.
    పిచ్చి పట్టిన వాడిలా లతను చూస్తూ "ఏవన్నావ్" అన్నాడు.
    లతకు తన పొరపాటు తెల్సి వచ్చింది . భయంతో చూసింది . రామచంద్ర ముందుకు వంగి లత రెండు భుజాలు పట్టుకొని బలంగా ఊగిస్తూ "చెప్పు వారిజకు నువు చేల్లిలివా? ఈ సంగతి నా కిదివరకే ఎందుకు రహస్యంగా ఉంచారు ఈ సంగతిని?" అన్నాడు.
    "రహస్యంగా ఉంచక ఏం చెయ్యను? సినిమా స్టారంటేనే వల్లమాలిన ఆకర్షణ తో పాటు దానిలో లీనమై తేలిక భావం - అందులో ఈవిడ గారు , అలాంటి సినిమా రంగంలోనే పోకిళ్ళ మారిగా ప్రసిద్ధి పొందింది. అందరితోనూ ఈవిడ చచ్చిందనే చెప్పాము. అందుకే నేకు అక్క వుందని చెప్పలేదు. మా యింటికే పీడలా దాపురించిన ఈ శని ఇక్కడికి కూడా నా ఖర్మ కొద్దీ దాపురిస్తుందని నాకేం తెలుసు?"
    నించున్న మనిషి కుప్పలా కూలిపోయాడు రామచంద్ర. బిక్కుబిక్కు మంటూ చూసింది లత. రామచంద్ర కోపంతో గర్జిస్తున్నప్పుడో, చావ బడుతున్నప్పుడు కూడా కలగని భయమేదో రెండు చేతులలో తల పెట్టుకొని అతను శిలలా కూర్చున్నప్పుడు కదిలింది.
    గడియారపు ముళ్ళు చకచక కదిలిపోతున్నాయి. అయినా రామచంద్రలో చలనం లేదు. తనెంత చనువుగా రామచంద్రను పిలిచే సాహసం కలగటం లేదు లతకు.
    ఇంట్లోంచి శవాన్ని తీసుకెళ్ళిపొయిం తర్వాత ఏర్పడే దారుణ నిశ్శబ్దం లాంటిది ఆవరించింది ఇంట్లో. గడియారం తొమ్మిది కొట్టింది. లతకు ఆకలేస్తోంది.
    అయినా రామచంద్రను భోజనానికి లెమ్మని అనలేక పోయింది. ఎప్పటిలా తను పెట్టుకుని తినటానికి సాహసించలేక పోయింది  వున్నట్టుండి చటుక్కున లేచి "రైలు తొమ్మిదిన్నరకీ" అన్నాడు రామచంద్ర.
    తెల్లబోయి చూసింది లత. "ఇంకా అలా చూస్తావేం / త్వరగా నీ బట్టలన్నీ సర్దుకో! మళ్ళీ ఇక్కడికి రానక్కర్లేని పద్దతిన సర్దుకో."
    "అంటే? ఇక ఏకంగా దానితో వుందామనా? దాన్ని ఏకంగా ఇక్కడికి తెచ్చుకుందామనా?"
    "నోర్ముయ్! మీ నాన్న ఒక తాగుబోతు, మీ అక్క ఒక తిరుగుబోతు, నువొక పోగారబోతు! మీరెవరూ మనుష్యులు కారు - మీరేవరితోను నాకిక ఏ సంబంధము లేదు. అన్నీ సర్దుకో! రిక్షా తెస్తాను." రామచంద్ర వెళ్ళి రిక్షా తెచ్చాడు . లత ఏం సర్దుకోలేరు..... ఎలా కుర్చుందో అలాగే ఉంది.
    "అదేం? ఎందుకు తయారవలేదు?" రాళ్ళు రువుతున్నట్లు అడిగాడు.
    "ఎందుకు తయారవుతాను? మీ ఆటలు నేను సాగానిస్తాననే అనుకున్నారా? ఈ ఇల్లు నాది ....ఈ సంసారం నాది ....నన్ను ఎవరు వెళ్ళ గోడతారో చూస్తాను!" పెంకిగా అంది లత.
    "లే! వెంటనే బయలుదేరు .....రైలు దాటిపోతుంది...." నిర్లక్ష్యంగా, అజ్ఞాపిస్తున్నట్లుగా అన్నాడు. "దాటిపోతే దాటిపోనియ్యండి. నేను కదలను. నా ప్రాణం పోయినా ఇక్కడి నుండి కదలను."
    "లతా! నన్ను హంతకుడిని చెయ్యకు .....ఈ రాత్రి నుంచీ ఈ ఇంట్లో మనిద్దరం ఉండడం అసంభవం" నొక్కి పలికాడు అతను.
    శిలలా వున్న అతని ముఖాన్ని ఎర్రగా నిప్పులు కక్కుతోన్న అతని కళ్ళనీ చూసి నిజంగానే హత్య చేస్తా\డేమోనని హడలిపోయింది లత. చేతికందిన బట్టలన్నీ పెట్టెలో కూరుకుని ఉన్నది వున్నట్లుగానే వెళ్ళి రిక్షాలో కూర్చుంది. వెనకా తనే సైకిల్ మీద వెళ్ళి టికెట్ కొని లత రైలెక్కించాడు రామచంద్ర.
    అతను తనను పుట్టింటికి పంపెస్తాడని యెంత మాత్రమూ అనుకోని లతకు రైల్లో కూర్చోగానే దుఖం పొంగుకొచ్చింది.
    "నన్నింత ఉసురు పెడ్తున్నారు . మీకు న్యాయం కాదు. భోగం దాన్ని నమ్ముకుని కట్టుకున్న దాన్ని ఘోష పెట్టినవాడు ఎప్పటికీ బాగుపడలేదు. మీకున్న దంతా కైంకర్యం చేసి, అది మీ చేతికి చిప్ప తెచ్చిననాడు అప్పుడు నేను గుర్తుకొస్తాను. భోగంది కనుక అది వదిలి పోగలదు కాని నేను పోలేనుగా! ఆనాడు మీతో పాటు దరిద్రం అనుభవించటానికి వస్తాను. అప్పటికి తెలుస్తుంది మీకు."
    లత ఇంకా మాట్లాడుతోనే వుంది. రైలు కదిలే వరకూ కూడా వుండకుండా వచ్చేశాడు రామచంద్ర.

                                                    -----------

    శిశిర ఋతువు ప్రకృతి నిలువెల్లా వణుకుతూ మంచు బొండువులను విదిలించు కొంటుంది.....వెలుగు రేఖలు పూర్తిగా విప్పుకొని అరుణో దయాత్పూరపు టాకాశం బద్దకంగా ఎరుపులో నీలాన్ని విరుచుకొంటుంది. అతి పలచని అరుణ కాంతులు ప్రాచీన దిశగా బయలుదేరి ఆకాశంలో చాలావరకు నీలాన్ని చీల్చుకుంటూ అల్లుకుని క్రింది నల్లని చీకట్లలో ప్రతిఫలిస్తున్నాయి. మత్తు వదుల్చుకుని ప్రకృతి సుకుమారమయిన ఆ తేజ కిరణాలు గిలిగింతలు పెడుతోంటే ముసిముసి నవులతో కొద్ది కొద్దిగా చైతన్యం పొందుతోంది. ఆ ప్రశాంత సుందర సమయంలో తన ఇంటి ముంగిట నిలబడి ప్రకృతి పొందుతోన్న పారవశ్యాన్ని అర్ధం చేసుకోవటానికి అందులో తనూ భాగం పంచుకోవటానికి ప్రయత్నిస్తోంది వారిజ.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra