Home » Yamini saraswathi novels » Madyataragati Manishi


    పప్పన్నం ముద్ద నోట్లో పెట్టుకున్న రమణయ్య వెంటనే జవాబు చెప్పలేదు. తర్వాత గ్లాసెడు నీళ్ళు తాగి "గోపీ! ఒక్కో వాతావరణంలో ఇమిడిపోయిన వ్యక్తి మరో వాతావరణంలో అతకలేడు. నాకు శరీర కష్టం వుండాలి. నా పొలం నా పైరు అనేది వుండాలి. రోజుకి రెండు పూటలా పొలాన్ని చూసుకోకపోతే నాకు అదోలా ఉంటుంది. నేను ఈ పొలాన్ని విడిచి రాలేను" అన్నాడు.
    ఆ మాటలతో గోపీ నోరు మూతపడింది.
    రాధ ఇంకేమీ అనలేదు.
    భర్తకీ బావకీ కొసరి కొసరి వడ్డించింది. వాళ్ళ భోజనాలైపోయాక తనూ భోజనం చేసింది.
    భోజనానంతరం మళ్ళీ ముగ్గురూ కూర్చున్నారు. గోపీ తాంబూలం వేసుకుంటూ వుంటే రాధ చిలకలు చుట్టిస్తూ వుంది. రమణయ్య వాళ్ళ అనురాగానికి ఆత్మీయతకీ ముగ్ధుడయ్యాడు.
    దాంపత్యమంటే అలా వుండాలి అనుకున్నాడు.
    మళ్ళీ రాధ ప్రారంభించింది.
    "మేం ఆ మధ్య ఓ సినిమా తీసేం బావగారూ! ఫణిగారు తెలుసు కదూ! ఆయనా మనమూ భాగంగా సినిమా తీశాం."
    నోరు వెళ్ళబెట్టేడు రమణయ్య. వీళ్ళేమిటిలా తయారయ్యారు. ఊరుకున్న ప్రాణాన్ని ఉసురు పెట్టుకున్నట్టు, సుఖంగా బ్రతకలేక కష్టాలు కొనితెచ్చుకుంటున్నారా?" అనుకున్నాడు.
    అరవం సినిమాని తెలుగులో డబ్ చేశాం. అంటే అదే యాక్టర్స్ తో తెలుగు మాటలు, పాటలు వేరేవాళ్ళతో మాట్లాడించి తీశాం. బాగా పోయింది. అయితే మధ్యలో అమ్మటంవల్ల పెద్దగా లాభాలు రాలేదనుకో! కానీ రెండు నెలలు మద్రాసులో దర్జాగా గడిపొచ్చాం" అన్నాడు గోపీ.
    రమణయ్య పలకలేదు.
    "ఆ సినిమా పద్ధతీ అదీ చూశాక అది మంచి లాభసాటి బేరం అనిపించింది మాకు."
    "మళ్ళీ తీస్తున్నారా?"
    "ఆఁ అయితే ఈసారి డబ్బింగ్ సినిమా కాదు."
    మరేమిటన్నట్లు చూశాడు.
    "అంతా కొత్తవాళ్ళతో పూర్తిగా తెలుగు సినిమానే తీయాలనుకుంటున్నాం."
    "చాలా అవుతుందేమో కదూ!"
    "ఆ సుమారు నాలుగైదు లక్షలు పైనే అవుతుంది" తగ్గించి చెప్పాడు గోపీ!
    "అబ్బ నాలుగైదు లక్షలే! ఆ ఫణి బాగా ఉన్నవాడా?"
    "ఆ ఉన్నవాడే! కానీ అంతా ఆయనే పెట్టడు. పైగా సినిమా ఎవరూ పూర్తిగా తమ స్వంత డబ్బుతో తీయరు. డిస్ట్రిబ్యూటర్స్ అని ఉంటారు. వాళ్ళు పెడతారు. పిక్చరు అయ్యాక తమ డబ్బు తీరిపోయాక మనకిస్తారు."
    రమణయ్య వింటూ ఉన్నాడు.
    మొత్తం అయిదు వాటాలు. మనవి రెండు వాటాలు మన వాటాకి లక్షన్నర యివ్వాలి" అబద్ధం ఆడాడు గోపీ.
    "రమణయ్య ఆఁ ఊఁ అనకపోవటంతో మళ్ళీ అన్నాడు గోపీ" మనకు యింత క్రితం వచ్చిన లాభాలూ అవీ యిందులో పెట్టగా ఇంకా దాదాపు లక్ష కావాలి"
    "ఎక్కడుంది గోపీ మనవద్ద అంత డబ్బు. మొన్న పాతిక వేలకే ఇల్లు అమ్మి తీసికెళ్ళావుగా?"
    "నీవద్ద ఉందని కాదన్నయ్యా! ఎలాగయినా సంపాదించాలి."
    "లక్ష రూపాయలు అప్పు ఎవరిస్తారు గోపీ?" పేలవంగా నవ్వి అన్నాడు రమణయ్య.
    "ఊరికే ఇవ్వక్కర్లా! పొలం వుందిగా"
    "పొలం తనఖా పెట్టాలా?"
    "తనఖానో విక్రయమో!" అంది రాధ.
    "రాధా!" ఆశ్చర్యంగా అన్నాడు రమణయ్య పొలం అమ్మటమా? ఏమంటున్నావో ఆలోచించుకునే అంటున్నావా అమ్మా?"
    "ఆఁ"
    "వీల్లేదమ్మా! ఈ పొలం అమ్మటానికి వీల్లేదు" అన్నాడు రమణయ్య.
    "కానీ మాకు డబ్బు కావాలి బావగారూ!"
    "మీ ఇష్టం, ఏమయినా అనుకోండి. మరెక్కడయినా ప్రయత్నించండి, డబ్బు సంపాదించి సినిమా తీయండి, కానీ ఈ పొలం అమ్మటానికి వీలులేదు. ఇది రాము అనుభవించవలసిన ఆస్తి అన్నాడు రమణయ్య.
    "హుఁ పెద్దవాళ్ళకి అనుభవించటానికి లేదు. ఎప్పుడో ఎదిగొచ్చే పిల్లలట."
    "మీకేం తక్కువ చేశానమ్మా, ఈ పొలంపై పండిన అయివేజంతా మీకే యిచ్చానుగా, తడవ తడవకి వేలకివేలు తెచ్చాడుగా నీ భర్త అప్పుడు కాదన్నానా?"
    "అప్పుడే కాదనివుంటే పరిస్థితులు ఎలా వుండేవో, కాని యిప్పుడు కాదనటానికి వీల్లేదు."
    "అదే నేనూ అంటున్నాను. మీ యిష్టం ఏమయినా చేసుకోండి. ఈ పొలం అమ్మటానికి వీల్లేదు" అని లేచి వెళ్ళిపోయాడు రమణయ్య.
    ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు.
    "మీరిలా బెల్లం కొట్టిన రాయల్లే వుంటే ఏమీ లాభం లేదు. పదండి కారణంగారితో మాట్లాడి మన భాగం అమ్మే ప్రయత్నం చేద్దాం. తర్వాత జరుగబోయే విషయాలు లాయరుగారిని సంప్రదిద్దాం"
    "లాయరా?"
    "అవును. మన వాటా అమ్మినా ఎటూ చాలదు, ఇన్నేళ్ళుగా మన వాటాపై వచ్చిన అయివేజుకిగాను ఆయనభాగం ఇమ్మని అడుగుదాం, మనకు డబ్బిచ్చినట్లు ఋజువేముంది? అంతా అమ్మేశాక ఆయన అక్కడికి తప్పకుండా వస్తాడు."
    "రాధా! అది చాలా అన్యాయం. ఆయనపై దావా తేవటానికి నా మనసొప్పదు."
    "నా మనసొప్పుకుంటూ ఉందా? అదంతే! ఒట్టి స్టంట్! ఆయనకి మీరన్నా, పిల్లవాడన్నా పంచప్రాణాలు. మీకోసం ఏమయినా చేస్తారు. అవన్నీ తర్వాత, ముందు కరణంగారివద్దకు వెళ్ళి వద్దాం పదండి" అంది రాధ.
    ఇద్దరూ కరణంగారి వద్దకి వెళ్ళేరు.
    కుశల ప్రశ్నలూ అదీ అయ్యాక ప్రస్తావనగా "మాకెంత ఆస్తి వుందో వ్రాసి ఓ సర్టిఫికెట్ కావాలండీ" అని అడిగాడు గోపీ.
    "అలాగే! లక్షణంగా తీసికెళ్ళండి" అని రాసిచ్చాడు కరణంగారు.
    ఆ సర్టిఫికెట్ చూసుకొన్న గోపీ ఆశ్చర్యపోయాడు.
    "అంతా రాసిచ్చేరేమిటండీ! మా అన్నయ్యగారి భాగం కలపకండి. విడిగా నాపేర ఎంత అనుభవానికుందో అంతే రాసివ్వండి" అన్నాడు గోపీ.
    "అంతా నీ పేరే రిజిష్టరై వుంది గోపీ"
    రాధ కూడా ఆశ్చర్యపోయిందీమారు.
    "మీరు చెప్పేది అర్ధం కావటం లేదు" అని అడిగింది.
    "అమ్మా! మీ బావగారు ఈ కాలంలో ఉండవలసిన మనిషి కాదు. ఏ దైవాంశవున్న యోగో శాపవశాన ఇలా పుట్టాడేమో అనిపిస్తుంది. ఆయన ధర్మాత్ముడు"
    "ఏమంటున్నారు" అన్నాడు గోపీ.
    "అవునమ్మా రాధా! మీ గోపీ రమణయ్య స్వంత అన్నదమ్ములు కాదు. గోపీ రమణయ్య సవతి తమ్ముడు. తండ్రిపోయాక పుట్టింట్లో ఎవరూ దిక్కులేని రామలక్ష్మిగారు భర్తని వెతుక్కుంటూ వచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి భర్త పోయాడని తెలిసింది, కానీ ప్రాజ్ఞుడైన రమణయ్య తల్లినీ, తమ్ముడినీ చేరదీశాడు.
    ఇంటినుంచి చంద్రయ్య వెళ్ళగొడితే సవతి తల్లినీ, తమ్ముడినీ తీసుకుని బయటికి వచ్చాడు. తన శక్తితో సంసారాన్ని వృద్ధికి తేవటానికి శతవిధాలా కష్టపడ్డాడు, రాత్రింబవళ్ళు నిద్రాహారాలు లేక శ్రమించాడు.
    ఆరోజే పొలం కొనటానికి పెట్టుబడిగా సవతితల్లి నగలమ్మి డబ్బు తేవటంతో నలుగురూ సెభాషనేట్లుగా కొన్న ఆస్తి అంతా తమ్ముడిపేర పెట్టేడు. మిగిలిన డబ్బు అంతా ఫలసాయంలో తీర్చాడు.
    అదేం చిత్రమో! రమణయ్య అడుగుపెడితే పొలం విరగపండుతుంది. బంగారాన్నిపండించాడు. పొలం, ఇల్లు సంపాదించుకున్నాడు. తమ్ముడిని చదివించాడు.
    యోగ్యురాలిని నిన్ను తెచ్చి చేశాడు.
    కానీ విధే ఆయన్ని చిన్నచూపు చూసింది. భార్య బిడ్డల్ని దూరం చేసింది.
    కొంత తెలిసిందే అయినా వింతగా ఉంది అంతా.
    తేరుకున్న భార్యాభర్తలిద్దరూ వస్తామని సెలవుతీసుకు వచ్చేశారు.
    ఇంటికి వచ్చేసరికి రమణయ్య రాలేదింకా.
    "ఏమిటండీ అది?" అంది కళ్ళు తుడుచుకుంటున్న భర్తతో.
    "రాధా! ఆ యిల్లు నా పేరవున్నది అమ్మితే నాకేదో బాధగా వుంది. ఇపుడే విషయాలన్నీ తెలిశాక పొలం అమ్మటానికి మనస్కరించలేదు" అన్నాడు గోపీ.
    "నిజమేనండీ! ఆయన చేసిన దానికి చర్మం వలచి చెప్పులు కుట్టి యిచ్చినా ఋణం తీరదు. కానీ అలాంటి మహనీయుడిని ఇలా కష్టపడి చావు అని మనం వదిలేయటం కూడా బాగులేదు. ఆయన్ని తీసికెళ్ళి కాలు క్రింద పెట్టకుండా సాకాలి. మామూలుగా ఆయనరారు. పొలం అమ్మితేనే వస్తారు" అంది రాధ.  

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra