Home » Yandamuri veerendranath » ఆఖరి పోరాటం


    ఒకవేపు నుంచి పోలీసు వ్యాను, మరొకవేపు నుంచి ఫైరింజను వచ్చాయి. శవం దగ్గరకు పోలీసులు పరుగెత్తారు.

    యజమాని నుంచి అంతా తెలుసుకున్న ఇన్ స్పెక్టర్, పద్మాకర్ దగ్గరకొచ్చాడు. "కాల్పులు ఎవరిమీద ఎవరు జరిపారో మీకేమైనా అనుమానంగా వుందా?"

    "లేదే" అన్నాడు పద్మాకర్. "నేను గాలి కొట్టించుకుందామని వచ్చాను."

    'సరే, మీరు వెళ్ళొచ్చు. బైదిబై - కంగ్రాచ్యులేషన్స్ గొప్ప ప్రమాదం నుంచి ఈ ప్రదేశాన్ని కాపాడారు."

    "థాంక్స్" అని పద్మాకర్ మోటార్ సైకిల్ వేపు నడిచాడు.

    పెద్ద ప్రమాదం తనకోసం పొంచి వున్నదని అతడికి తెలీదు.


                       *    *    *


    విహారి, ప్రవల్లికలు ఉన్నది టయోటా, దుండగులది అంబాసిడరు. జనసమ్మర్ధం ఎక్కువ వున్న ప్రాంతాల్లో టయోటా వేగంగా నడవడం కష్టమైనా, ప్రవల్లిక చేతిలో అది బాణంలా దూసుకుపోతోంది. నిజానికి అది విహారి కారు, కాల్పుల సమయంలో ఆమె స్టీరింగ్ వేపు జరిగి స్టార్టు చేయడం వల్లనే ఇద్దరూ రక్షించబడ్డారు.

    ముందు కారులో వాళ్ళకి వెనుక అనుసరిస్తూ వస్తున్న విహారి కారు సంగతి తెలిసింది. దాని వేగం హెచ్చింది. దాని డ్రైవరు యిటువంటి పరిస్థితుల్లో కారు తప్పించడానికే ట్రెయినింగ్ పొందినవాడు.

    ప్రభుత్వం యిచ్చిన ట్రెయినింగ్ కి, టెర్రరిస్టుల ట్రెయినింగ్ కి మధ్య పోటీ...

    ఏదీ తీసిపోలేదు. రెండు కార్లూ వూరి చివరికి చేరుకుని నేషనల్ హైవే మీదకు ఎక్కాయి, ముందు కారులోంచి మిషన్ గన్ బయటికొచ్చింది. వరుసగా చప్పుళ్ళు... ప్రవల్లిక ముందు అద్దం బ్రద్దలైంది. ఇద్దరూ తలలు వంచి బుల్లెట్స్ బారినుంచి తప్పించుకున్నారు.

    రెండు కార్లూ తూనీగల్లా వెళుతున్నాయి.

    ఎదురుగా లారీలు వస్తూంటే ఆగి, అవి దాటగానే కాల్పులు కొనసాగిస్తున్నారు అవతలివాళ్ళు. అలా అయితే ఎవరికీ అనుమానం రాదని వాళ్ళ ఆలోచన. అది కరక్టే. మామూలు ట్రాఫిక్ కి యీ మారణహోమం గురించి తెలీదు. ఇంతలో ముందు కారు పక్కదారి పట్టింది. అది నిర్మానుష్యంగా వుంది.

    "పిస్టల్ వుందా?" అడిగాడు విహారి.

    డ్రైవ్ చేస్తూనే ప్రవల్లిక తీసి ఇచ్చింది. అతడు ఎదురు కాల్పులు సాగించాడు. రెండు గుళ్ళు బోనెట్ కి తగిలాయి. మూడు గాలిలోకి దూసుకువెళ్ళాయి. ఆరవదీ, ఆఖరుదీ అయిన బుల్లెట్ మాత్రం సరిగ్గా వెళ్ళి వెనుక టైర్ లో గుచ్చుకుంది.

    వేగంగా వెళుతున్న కారు, వెనుక టైర్ పేలిపోయేసరికి ఆ వత్తిడికి తట్టుకోక పక్కకి తిరిగింది. అదే వేగంతో వెళ్ళి హైవేమీద వున్న చెట్టుకు గుద్దుకుంది.

    స్టీరింగ్ కీ, సీటుకీ మధ్య ఇరుక్కుని డ్రైవర్ పెట్టిన ఆర్తనాదం ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. A-5 వెనుక సీటులోంచి దిగాడు. విహారి కారు సమీపించేలోపు పొలాల్లోకి అడ్డంగా పరుగెత్తాడు.

    విహారి వెనుకే వేగంగా అతడిని ఫాలో అయ్యాడు.

    ఫర్లాంగు దాటాక చిన్న సెలయేరు వుంది. రజకులు ఉతికిన బట్టలు వరుసగా ఆరేసి వున్నాయి. అక్కడ స్తంభాలకు తాళ్ళు కట్టి వ్రేలాడదీశారు. వాటి మధ్య A-5 అదృశ్యమయ్యాడు.

    వరుసగా ఉన్నాయి చీరెలు... పాంట్లు...

    విహారి తల క్రిందకి వంచి అవతలి వ్యక్తిని చూడడానికి ప్రయత్నించాడు. జవాబుగా పిస్తోలు పేలింది. విహారి తల పక్కనున్న చీరెకి కన్నం పడింది. అన్ని బట్టలమధ్య అవతలివ్యక్తి కనబడడం లేదు. పిస్తోలులో గుళ్ళు లేవు.

    విహారి ఒకరాయిని తీసుకుని దూరంగా ఒక పాంటున కొట్టాడు. పాంటు కదలికకి అదిరిపడి A-5 అటు పేల్చాడు. ఇటుపక్క చొక్కా కదిలింది. ఇటు పేల్చబోయాడు గానీ అతడి పిస్తోల్లో గుళ్ళు కూడా అయిపోయాయి. సరిగ్గా ఆ సందర్భం కోసమే ఎదురు చూస్తున్నాడు విహారి. వెనుకనుంచి పిస్తోలు మడమతో ఒకే ఒక దెబ్బ కొట్టాడు.

    A-5 కుప్పకూలిపోయాడు.

    అదే సమయానికి ప్రవల్లిక అక్కడికి చేరుకుంది. ఇద్దరూ కలిసి అతడికి స్పృహ తెప్పించడంకోసం ఒకరు యేటినుంచి నీళ్ళు తెచ్చిమొహంమీద జల్లారు. మరొకరు ఈ లోపులో చేతులు వెనక్కి కట్టేశారు, అయిదారు నిమిషాల్లో అతడికి     స్పృహ వచ్చింది. లేపి తమ కారు వద్దకు తీసుకొచ్చారు. A-5 దెబ్బతిన్న పులిలా వున్నాడు.

    "ఇతన్నేం చేస్తారు?" అడిగాడు ప్రవల్లికను.

    ఆమె అర్ధంకానట్టు "పెట్రోల బంద్ దగ్గర హత్యచేశాడు. మన మీద హత్యాప్రయత్నం చేశాడు. ఆ నేరాలమీద పోలీస్ స్టేషన్ లో అప్పగిస్తాం- అంతకన్నా ఏం చేస్తాం?" అంది.

    "ఇలాగే ఇంతకుముందు ఒక మనిషిని నువ్వు రవీంద్ర కళాక్షేత్రంలో పట్టుబడితే తీసుకువెళ్ళి పోలీస్ కస్టడీలో వుంచావు. వాడే మళ్ళీ నీ కారు డోర్ తెరిచాడు. గుర్తుందా?"

    "అవును. ఆ డిపార్టుమెంట్ లో ఎవరో అనంతానంతస్వామికి సాయపడ్డారు."

    "ఈసారి మళ్ళీ సాయపడరని నమ్మకం ఏమిటి?"

    "అందుకని ఏం చేద్దాం?"

    "మన కస్టడీలోనే వుంచుకుందాం,"

    ఆమె నిశ్చేష్టురాలై "ఏమిటీ?" అంది.

    "అవును. వీడిని చూస్తూంటే సీనియర్ సహచరుడిలా వున్నాడు. స్వామి తాలూకు ఎన్నో రహస్యాలు వీడికి తెలిసి వుంటాయి. వాటిలో ఏ ఒక్క ముఖ్యమైనది రాబట్టినా స్వామి అంతు చూడొచ్చు."

    "నా ప్రాణం పోయినా ఒక్క రహస్యం చెప్పను" అన్నాడు పట్టుబడిన టెర్రరిస్టు.

    ప్రవల్లిక విహారిని దూరంగా తీసుకెళ్ళింది. "పోలీసులకి తెలియకుండా వీడిని మన దగ్గర వుంచుకోవడం నేరం" అంది.

    "అందుకే మీ డిపార్టుమెంట్స్ లో ఏ పనీ సరిగ్గా అవదు. అన్నీ రూల్స్ ప్రకారం జరగాలంటారు. సరే.... వీడు నీకు దొరకలేదనుకుని ఇక ఈ విషయం మర్చిపో, నేను చూసుకుంటాను."

    ఆమె వప్పుకుంటున్నట్టు "సరే మన దగ్గిర వుంచుకుంటాము. బాగానే వుంది. కానీ వీళ్ళు చాలా మంచి ట్రెయినింగ్ పొందిన టెర్రరిస్టులు. మా ఇన్ స్పెక్టర్స్ సుశిక్షితమైన థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఉపయోగిస్తేనే ఏమీ చెప్పరు- నీకెలా చెప్తారు వాళ్ళు రహస్యాలు?"

    "నేను ఫోర్త్ డిగ్రీ మెథడ్స్ ఉపయోగిస్తాను, పద" అంటూ తిరిగి కారు వద్దకు తీసుకువచ్చాడు. అక్కడ కట్టివేయబడివున్న ఉగ్రవాదివైపు చూసి నవ్వేడు.

    "సూర్యారావు సెంట్రల్ మినిష్టర్ అయ్యాక స్వామికి ఏ విధంగా సాయపడుతున్నాడు?" అని అడిగాడు.

    "నాకు తెలీదు."

    "ఇంకొక్కసారి అడుగుతాను. సూర్యారావు సెంట్రల్ మినిస్టర్ అయ్యాక స్వామికి ఏ విధంగా సాయపడుతున్నాడు?"

    "నాకు తెలీదు."

    ఆ సమాధానానికి వాడి మొహం మీద కొడతాడేమో అనుకుంది ప్రవల్లిక. విహారి అలా చేయలేదు. పక్కనే వున్న కారు దగ్గరికి వెళ్ళి పరీక్షించాడు. స్టీరింగ్ దగ్గర రెండో టెర్రరిస్టు చచ్చిపోయి వున్నాడు. వాడి శరీరాన్ని లాగి బయటపడేశాడు. ప్రవల్లిక విస్తుబోయి చూస్తున్నది. ఆక్సిడెంట్ లో అలా జోక్యం కలుగచేసుకోవడం నేరం. అతడేం చేస్తున్నాడో అర్ధం కాలేదు. ఈ లోపులో విహారి కారు లోపలకి ఎక్కి స్టార్టుచేసి చూశాడు కొంచెం ట్రబుల్ ఇచ్చినా తొందరగానే స్టార్టు అయింది.

    విహారి తన పనిలో ఉండడం, ప్రవల్లిక అటే చూస్తూ ఉండడం చూసి, A-5 పరుగెట్టి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు. కానీ చేతులు వెనక్కి కట్టివేయబడి వుండడంతో నిమిషంలోనే తిరిగి లొంగిపోయాడు.

    విహారి వాడిని తీసుకొచ్చి కారు డిక్కీలో పడేశాడు. డిక్కీ మూసేసి స్టీరింగ్ దగ్గర కూర్చున్నాడు. లోపల్నుంచి వాడు "నో.... నో" అని అరుస్తున్నాడు. కారు స్టార్టుచేసి రివర్స్ లో వేగంగా తీసుకెళ్ళి చెట్టుకి కొట్టాడు. దబ్ మన్న శబ్దం-

    లోపల్నుంచి కెవ్వున కేక వినిపించింది.

    కారు కాస్త ముందుకి తీసుకెళ్ళి, మరో రివర్స్ లో కొట్టాడు. వెనుక చొట్ట పడింది. లోపల మూట కదిలినట్టు చప్పుడు... అరుపులు! వాటిని పట్టించుకునే నాధుడే లేడు.

    ప్రవల్లిక దూరంగా నిలబడి ప్రేక్షకురాలిగా చూస్తోంది. ఏ గూఢచారి సంస్థా రహస్యాలు చెప్పించడానికి ఇటువంటి విధానం అవలంభించి వుండదు. ఆమె మరో ప్రపంచంలో వున్నట్టు చూస్తోంది.

    విహారి ప్రత్యర్ధి మనస్తత్వం మీదే ఇక్కడే ట్రిక్ ప్లే చేశాడు. ప్రశ్నలడిగి బాధ పెట్టడంలేదు. చెప్తావా? చెప్పవా?? అని రెట్టించడం లేదు. కారు డిక్కీలో పడేశాడు. అక్కడ చీకటిగా వుంది. ఊపిరాడడంలేదు. కారు కదలిక విషయం తెలుస్తోంది. ఎప్పుడు కొట్టుకుంటుందో తెలియడం లేదు, చెయ్యే విరగొచ్చు. మెడే విరగొచ్చు. చచ్చిపోతే ఆక్సిడెంట్ లో చచ్చినట్టు కార్లో వదిలేసి వెళ్ళిపోతారు.

    ఏం చెయ్యాలి?

    A-5 ఆలోచించుకునే లోపులో కారు మళ్ళీ వెళ్ళి చెట్టుకి కొట్టుకుంది. బాధతో లుంగ తిరిగిపోయాడు.

    కారు మళ్లీ స్టార్టయింది.

    "చెప్తాను...చె....ప్తా....ను" అని అరిచాడు లోపల్నుంచి.

    విహారి కారు ఆపుచేసి దిగి, వెనుక డిక్కీ తెరిచాడు. బట్టల మూటలా లోపల టెర్రరిస్టు పడి వున్నాడు.

    వాడిని అలానే వెనుక సీటులో తెచ్చి కూలేశాడు. ప్రవల్లిక పక్కన కూర్చుంది. విహారి కారు స్టార్టుచేసి నగరంవైపు పోనివ్వసాగాడు.

    ప్రవల్లికకి ఆశ్చర్యంగా వుంది. టెర్రరిస్టు అంత సులభంగా 'బ్రేక్' అవుతాడనుకోలేదు. బహుశా కళ్ళముందే తన అనుచరుడు మరణించడం, 'నిన్ను చంపడానికయినా వెనుదీయను' అన్నట్టు విహారి ప్రవర్తన, కారు డిక్కీలో చీకటి- అన్నీ కలిసి అతడిని 'బ్రేక్' చేసి వుంటాయి. అదే సి.బి.ఐ. అయితే ఎన్నో ట్రీట్ మెంట్ లు చేయవలసి వచ్చేది.

    "వీడిని మనం మన దగ్గరే వుంచుకుందాం" అన్నాడు విహారి. "మీ డిపార్టుమెంట్ కి అప్పగిస్తే వీడేం చెప్పాడో స్వామికి తెలిసిపోతూ వుంటుంది. అదీగాక వీడి నోరు శాశ్వతంగా మూసెయ్యడానికి ప్రయత్నించవచ్చు కూడా."

    అది నేరం. కానీ ప్రవల్లిక దానికి వప్పుకుంది. ఆమె ఇప్పుడిప్పుడే విహారి పంథాలో ఆలోచించడం నేర్చుకుంటోంది.

    "ఊఁ చెప్పు. సూర్యారావు తరువాతి ప్రణాళిక ఏమిటి?"

    వెనుక సీట్ లో వాడు మాట్లాడలేదు. కాస్త ధైర్యం వచ్చినట్టుంది. విహారి కూడా మాట్లాడకుండా కారు మళ్ళీ వెనక్కి త్రిప్పాడు. "మళ్ళీ ఎక్కడికి?" అని అడిగింది ప్రవల్లిక.

    "ఆక్సిడెంట్ జరిగిన చోటుకే. వీడు మాట్లాడడం లేదుకదా. మళ్ళీ కారు డిక్కీలో..." అతడి మాటలు పూర్తికాకుండానే-

    "చెప్తాను" వెనుకనుంచి వాడు అన్నాడు. ఈసారి డిక్కీలో పడేస్తే మరణం తధ్యం.

    "చెప్పు మరి?" కారు తిరిగి స్టార్టు చేస్తూ అడిగాడు.

    "జపాన్ నుంచి ఇండియాకి రాబోయే ఆట బొమ్మల షిప్ లో..."

    "ఊ, షిప్ లో...?"

    సరిగ్గా అదే సమయంలో ఒక అనుకోని సంఘటన హఠాత్తుగా జరిగింది.

    ఆ టెర్రరిస్టు అసలే భయంతో వున్నాడు. చెప్పకపోతే ఇప్పుడు మరణం- చెప్తే ఎప్పటికైనా వాళ్ళచేతిలో మరణమే. ఆ డోలాయమాన స్థితిలో ఆఖరియత్నం చేశాడు. కారు వెనక్కి తిప్పడంలో కాస్త నెమ్మదైంది. చేతులు కట్టివున్నా, హాండిల్ తీసుకోవడం వాడికి కష్టంకాలేదు. ఒక్క ఉదుటున కారు దిగి గమ్యం లేకుండా పరుగెత్తాడు.  

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra