Home » Ravulapalli sunitha » Death Sentence


    మిగతావాళ్ళు కళ్ళు మూసుకొని, రాగానికి అనుగుణంగా చిటికెలు వేస్తూ గాలిలో తేలిపోయారు.

 

    పాట ముగిసింది చప్పట్లు.... చప్పట్లు....

 

    మరోపాట అందుకున్నాడు.

 

    "బహారావో పూల్ బర్ సావో - మేరా మెహబూబ్ ఆయాహై!"

 

    "మేఘాల్లారా! నా ప్రేయసి వచ్చింది. పువ్వులు వర్షించండి!"

 

    వినే వాళ్ళలో మళ్ళీ అదే స్పందన!

 

    ట్రెయిన్ పరిగెడుతోంది, కళ్ళు మూసుకుని భావంలో లీనమై అతను పాడుతున్నాడు. అతని బలమైన చేతివేళ్ళు పాటకి అనుగుణంగా సీటుమీద తాళం వేస్తున్నాయి.

 

    గాలి ఆకతాయితనంగా కిటికీలోంచి దూసుకొచ్చి అతని తల వెంట్రుకల్ని చెరిపి పారిపోతోంది!

 

    అతను స్ఫురద్రూపి!

 

    అందమైన అతని విగ్రహానికి గంభీర స్వరం మరింత అందాన్నిస్తోంది. ఏకాగ్రతతో దైవేచ్చని పొందుతున్న రుషిలా, భావంతో మమేకమై అతని మొహం వెలిగిపోతోంది.

 

    బయటి నుండీ, కిటికీలోంచి లోపలికి చూస్తూ, దూరంగా నిలబడిన చెట్లు పాటలోని భావానికి ఆనందిస్తూ, అతని కంఠంలోని, గొప్పదనాన్ని గౌరవిస్తున్నట్లు తలలు వంచి నెమ్మదిగా వెనక్కి కదులుతున్నాయి.

 

    రెండు హిందీ పాటలు ముగిశాక ఒక తెలుగుపాటని అందుకున్నాడు. 'దేవదాసు'లో పార్వతి విషాదగీతం.

 

    "అంతా బ్రాంతియేనా.... జీవితానా వెలుగింతేనా.... ఆశనిరాశానా" మనసుని పిండే భావాన్నంతా స్వరంలో నింపి - వింటున్న వాళ్లందరి కళ్ళు చెమ్మగిల్లేలా పాడాడు.

 

    పాట ముగిసేసరికి అతని కళ్ళలో కూడా నీళ్ళు!

 

    పాట మిగిల్చిన బాధ, ఉద్వేగాల నుండీ బయటికి రాలేక తల వంచుకు కూర్చుని ఉన్నాడు.

 

    ఎన్నిసార్లు పాడినా ఈ పాటలోని భావం ప్రతిసారీ అతన్ని బాధిస్తూనే ఉంటుంది.

 

    బరువెక్కిన హృదయాలకి తోడుగా అన్నట్లు అక్కడి అందరి తలలూ క్రిందికి వాలాయి.

 

    ఎవ్వరూ మాట్లాడే స్థితిలో లేరు. రైలుపట్టాల శబ్దం తప్ప అక్కడేం వినిపించడం లేదు.

 

    వైరాగ్యపు ఎడారిలో విహరిస్తున్న వాళ్ళ చెవులకు "థాంక్యూ డాక్టర్!" అంటూ మధురమైన స్త్రీ స్వరం వినిపించింది. అందరూ తలెత్తి చూసారు. అతనూ చూశాడు.

 

    ఆమె అతన్నే చూస్తోంది.

 

    ఆశ్చర్యంతో అతనిచూపు ఆమె మీదినుండి కదలడం లేదు.

 

    ఆ అమ్మాయే కాలేజీ డే రోజు తన పాటని మెచ్చుకున్న అందమైన అమ్మాయి.

 

    పై బెర్తుమీదికి ఎక్కేందుకు అమర్చిన నిచ్చెన ఆనుకొని అలవోకగా నిలబడి ఉంది. అతని గుండె లయ తప్పింది. బరువుగా కొట్టుకుంటున్న ఆ శబ్దం అతనికి స్పష్టంగా తెలుస్తోంది.

 

    "థాంక్యూ! మీ పాటలు మళ్ళీ వింటాననుకోలేదు" అంది శరత్ చంద్రని చూస్తూ.

 

    "మీరు.... ఇక్కడ....?" తేరుకుంటూ అన్నాడు.

 

    "విజయవాడ వెళుతున్నాను. ఇదే కంపార్ట మెంట్. మీ పాట విని ఇటు వచ్చాను" చెప్పింది. పాట విన్నతాలూకు తన్మయత్వం ఆమె గొంతులో వ్యక్తమౌతోంది.

 

    "అంటే..... ఆమె ఇంకా తన పాటల్ని మర్చిపోలేదు. తన కంఠస్వరం గుర్తించి లేచి వచ్చింది! అనుకున్నాడు. ఆ ఆలోచన అతనికి చాలా హాయినిచ్చింది.

 

    మిత్రులందరూ నిశ్శబ్దంగా ఆ ఇద్దర్నీ గమనిస్తున్నారు.

 

    "రండి. ఇక్కడ కూర్చోండి" అంటూ ప్రక్కకు జరిగి చోటిచ్చాడు.

 

    అక్కడ అంత మంది యువకుల మధ్య కూర్చోడానికి తటపటాయిస్తూ చూసింది. ఆమె భావాన్ని అర్ధం చేసుకున్న వాళ్ళలా "రండి మేడం ఫర్వాలేదు" అని అందరూ సర్దుకుని ఆమెకు ఎక్కువ చోటు మిగిల్చారు.

 

    కూర్చున్న వాళ్ళ కాళ్ళు తగలకుండా ఆమె ఒదిగి.... ఒదిగి వచ్చి అతని ప్రక్కనే ఒద్దికగా కూర్చుంది.

 

    "మీ పేరేమిటో ఆ రోజు చెప్పలేదు" అన్నాడు మాటలకోసం వెదుక్కుంటూ.

 

    "నీలిమ!" ఆమె మామూలుగా చెప్పిన పేరులో అతనికి ఓ కమ్మని భావం వినిపించింది.

 

    ఆమెకు తన మిత్రులందర్నీ పరిచయం చేసాడు.

 

    వీళ్ళంతా, కబుర్లతో కాసేపట్లోనే ఆమెకు కొత్తపోయేలా చేసారు.

 

    ఆమె, అడిగి మరికొన్ని పాటలు పాడించుకుంది.

 

    విజయవాడ వరకూ అలా సాగింది. ప్రయాణం. ఆమె ట్రెయిన్ దిగుతుంటే, లగేజీ తలా ఒకటీ అందుకుని వాళ్ళే అందించారు. ఆమె హాండ్ బాగ్ కూడా ఆమెని మోయనివ్వలేదు.

 

    కమ్మని పాట వింటూ గొప్ప భావావేశంలో తేలిపోతున్న సమయాన ఒక్కసారిగా.... పాట మధ్యలో ఆగిపోయినట్లు ఫీలయ్యాడు. అతను, మధ్యలో దిగిపోవాలనిపించలేదామెకు. వాళ్ళతో వైజాగ్ వరకూ ప్రయాణిస్తే బావుండుననిపించింది.

 

    ఆమె దిగిపోయాక మూడీగా వున్న శరత్ చంద్రని, "ఇప్పుడీ పాట అందుకో బాస్ - ఏక్ పరదేశీ మెరాదిల్ లేగయా! జాతేజతే మీఠా మీఠా గమ్ దేగయా!" అని ఒక పరదేశీ నా హృదయాన్ని తీసుకెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ తీయతీయని బాధ ఇచ్చింది" అని ఏడిపించారు.

 

    అప్పుడు మొదలయిన స్నేహం పెరిగిపెరిగి హృదయాలను అల్లుకుపోయింది.

 

    మొదట నెలకొకసారి కలుసుకునే వాళ్ళు అతను హాస్టల్ రావడమో.... ఆమె బయటికొచ్చి ఇద్దరూ కలిసి ఎక్కడయినా కూర్చోవడమో.... ముందుగా అనుకొనేవాళ్ళు.

 

    తర్వాత పదిహేను రోజులకొకసారి, ఆ తర్వాత పదిరోజులూ - వారం..... నాలుగురోజులూ.... చివరికి రోజువిడిచి రోజయినా ఒకరి నొకరు చూసుకోకుండా ఉండలేని స్థితిలోకొచ్చారు. కానీ చదువులూ, పరిస్థితులూ, అనుకూలించేవి కాదు.

 

    ఆ రోజుల్లోనే ఎన్ని ప్రేమలేఖలో....!

 

    ఆమె అందం తన భావుకతని నిద్రలేపింది!

 

    ఎన్నెన్ని పేజీల ఉత్తరాలు రాస్తుండేవాడు. ఉత్తరాల సైజులు చూసి మిత్రులు ఏడిపిస్తున్నారని చెబుతుండేది.

 

    ఆమె నుండి మాత్రం రెండు పేజీల ఉత్తరం వస్తే చాలా పెద్దది అనుకోవచ్చు. తన భావాలని అక్షరాల్లో కుమ్మరించే నేర్పూ.... భావుకత ఆమెలో లేవు. కానీ శరత్ చంద్రంటే ఎంతో ప్రేమ ఉందీ! అందుకేనేమో అతని ఆశయాలకు అనుగుణంగా స్పందిస్తూ మాట్లాడేది.

 

    పైన ట్యాంక్ లో నీళ్ళయిపోవడంతో షవర్ ఆగిపోయింది! స్నానం ఎప్పుడో ముగించికూడా, చాలా సేపటిగా షవర్ కింద నిలబడి ఉన్నానని అప్పటికర్ధమైంది శరత్ చంద్రకి.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra