Home » Dr c. ananda ramam » రేపటి మహిళ


    నేను మరోవ్యక్తి దగ్గిర కెళ్ళబోతున్నానని చెప్పాను గుర్తుందా? ఆవిడ లాయర్ యశోధరాదేవి. ఇహముందు ఆవిడతోనే వుంటాను బొంబాయిలో. జన్మజన్మలకి నీ కోసమే ఎదురుచూస్తూంటానని అనలేను. కనీసం ఈ జన్మంతా అయినా నిన్నే తలుచుకుంటూంటానని చెప్పలేను. జీవితంలో నాది రొమాంటిక్ అవుట్ లుక్ కాదు.
    చివరగా ఒక కోరిక. ముందు ముందు మనమెప్పుడైనా కలుసుకుంటే మామూలుగా స్నేహితుల్లా మాట్లాడుకుందాం. శత్రువుల్లా మొహాలు తిప్పుకుని వెళ్ళిపోవద్దు. ఈ మాట మర్చిపోవుగా? ఏమాత్రం సొంత ఆలోచన అన్నది లేకుండా నువ్వేం చెప్తే అది వినేసే ఆడపిల్ల నీకు భార్యగా దొరికి నీ జీవితం ఆనందమయం (?) కావాలని కోరుకుంటూ.
                                                                                                                       నీ
                                                                                                                 మృదుల ...."
    పోస్ట్ చూసుకుంటూన్న భాగవతార్ ఆ ఇన్విటేషన్ కార్డు చూసి తెల్లబోయాడు. కళ్ళు నులుముకుని మరోసారి చదివాడు.
    "మిస్టర్ అండ్ మిసెస్ భాగవతార్ ఇన్ వైట్ యు ఫరె డిన్నర్ పార్టీ ఎట్ హోటల్ నాగార్జున ఆన్ ఫ్రైడే ఈవినింగ్ బిట్వీన్ సెవెన్ పి.యమ్. టు టెన్ పి.యమ్".
    అతనికేమీ అర్ధంకాలేదు. మృదుల ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయాక మృదుల లేని ఇంట్లో అతడు ఒక్కక్షణం కూడా ఉండలేకపోయాడు భోజనమైనా చేయకుండా కేశవనాథ్ ఇంటికెళ్ళాడు. చూడామణి అతడ్ని ఇంట్లోకి రానీయలేదు. ఫ్యూన్ తో "ఈ ఇంట్లో అతని తాలూకు మనుష్యులెవరూ లేరని చెప్పు" అని పంపించేసింది. కనీసం బయటికొచ్చి, "హల్లో", అయినా చెప్పలేదు. చూడామణికి భాగవతార్ కి మధ్య ఎప్పుడూ సత్సంబంధాలు లేవు. ఈ నడివయసువాడు తన కల్లుడేమిటని చూడామణి కూతురుకు బుద్ధి చెప్పవలసిందిపోయి మరింత రెచ్చగొడ్తుందని భాగవతార్ కి, ఇద్దరికీ ఎప్పుడూ ఒకరిమీద ఒకరికి అక్కసుగానే వుంటుంది.
    బొంబాయిలో లాయర్ యశోధరాదేవితో ఎస్.టి.డి.లో మాట్లాడడానికి ప్రయత్నించాడు. యశోధరాదేవి పలకలేదు. ఆవిడ పి.ఏ. ఆమె సందేశాన్ని అందించింది. "మగవాళ్ళయినా- ఆడవాళ్ళయినా తమ లైఫ్ పార్టనర్స్ ని ప్రేమతో, అనురాగంతో తమని విడిపోకుండా చూసుకోవాలేగాని, ఒక హక్కుగా నిర్భంధించి కట్టిపడేసుకోవాలని ప్రయత్నించకూడదు. భార్య అంటే భర్తకి చెందిన వస్తువు కాదు. స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న సహధర్మచారిణి". హడలిపోయి రిసీవర్ కేడిలీల్లో పడేసి రెండు చేతుల్తోనూ జుట్టుపీక్కున్నాడు. ఈ రకమైన డైలాగులు వల్లిస్తూ మృదుల మాట వినకుండా తిరగుతూన్నప్పుడు చిరాకు గలిగేది. ఇప్పుడు మృదుల వెళ్ళిపోయాక ఇలాంటి మాటలు వినడానికి భయంగా వుంటోంది.
    ఆ తరువాత ఏం చెయ్యాలో తోచలేదు.
    మళ్ళీ సోమనాథ్ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజన్సీస్ కే వెళ్ళాడు.
    సోమనాధ్ సాదరంగా ఆహ్వానించి, "మళ్ళీ మీరేదేనా టూర్ వెళ్తున్నారా? మీ శ్రీమతిగారి డైలీ రిపోర్టు తయారు చెయ్యాలా? ఈసారి వీడియో ఇంకా పకడ్బందీగా రికార్డు చేయిస్తాను" అన్నాడు. భాగవతార్ లాంటి క్లెయింట్స్ అంటే సోమనాధ్ కి చాలా యిష్టం. వడ్లగింజలో బియ్యపుగింజ లాంటి విషయానికి డిటెక్టివ్ లను ఏర్పాటుచేసి పెద్ద మొత్తాలు చెల్లిస్తారు.
    ఒంచిన తల ఎత్తలేకపోయాడు భాగవతార్. అతడు ఇదివరలో రిపోర్టు తయారు చెయ్యమన్నది. మృదులని దోషిగా నిరూపించి ఒదిలించుకోవడానికి. ఇప్పుడు వచ్చింది ఆమె వెళ్ళిపోతే భరించలేక ఎక్కడుందో తెలుసుకొందామని!
    ఏమనుకుంటాడు సోమనాధ్ తన గురించి?
    "చెప్పండి సార్!" తలదించుక్కూర్చున్న భాగవతార్ ని అడిగాడు సోమనాధ్. భార్య మీద డిటెక్టివ్ ని పెట్టీ ప్రతీ మగవాడు ఇలాగే ఫీలవడం సోమనాధ్ కి బాగా తెలుసు. భార్యని అనుమానించకుండా ఉండలేరు. "నా భార్య బలహీనురాలు"- అని చెప్పుకోలేరు.
    "మా మృదుల ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఎక్కడుందో తెలుసుకోవాలి?" పూడుకుపోతున్న గొంతుతో అన్నాడు.
    "వాట్?"
    "మాట్లాడలేదు భాగవతార్. దించిన తల ఎత్తనూ లేదు.
    "ఆల్ రైట్ - ఆల్ రైట్. తప్పకుండా తెలుసుకుంటాను. అదేం కష్టంకాదు. దేశ విదేశాల్లో ఎక్కడున్నా తెలుసుకొని వారం పదిరోజుల్లో మీకు ఫోన్ చేస్తాను."
    ధైర్యం చెప్తున్నట్లు అన్నాడు. భాగవతార్ మొహం చూస్తే మృదుల వెళ్ళిపోయినందుకు అతడెంత బాధపడుతున్నాడో స్పష్టంగా తెలుస్తోంది. భార్యాభర్తల అనుబంధాల్లో ఇదికూడా సోమనాధ్ కి అనుభవమే. శత్రువుల్లా ఒకరిమీద ఒకరు కత్తి కట్టినవాళ్ళు ఏ క్షణంలో ఇద్దరూ ఒకటైపోతారో ఎవరూ చెప్పలేరు.
    సోమనాధ్ కి థాంక్స్ చెప్పి వచ్చేసాడు.
    అప్పటికి మృదుల వెళ్ళి వారంరోజులైంది. ఏ క్షణానికా క్షణం సోమనాధ్ ఫోన్ కోసం ఎదురుచూస్తూన్నాడు. ఇప్పుడీ ఇన్విటేషన్.
    "మిస్టర్ అండ్ మిసెస్ భాగవతార్ ...." ఈ పజిల్ ఏమిటో అర్ధం కాలేదు భాగవతార్ కి. ఏదైమైనా శుక్రవారం హోటల్ నాగార్జునకెళ్ళితే మృదుల కనిపిస్తుందనే ఆశతో వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. అక్కడ మృదులనెలాగైనా కన్విన్స్ చేసి ఏ వాగ్దానాలైనా చేసేసి మృదులని తనతో తీసుకొచ్చేయాలి. మృదుల తననుంచి పూర్తిగా విడిపోయింది అనుకున్న వారం రోజుల్లోనే మృదుల లేకుండా తనకి జీవితం లేదనే విషయం అర్ధమయిపోయింది భాగవతార్ కి.
    హోటల్ నాగార్జునలో డిన్నర్ ఏర్పాట్లు ఎప్పటిలా గ్రాండ్ గా ఉన్నాయి. దేవకి కేబరే డాన్స్ కూడా ఏర్పాటు చేసారు. వెండికాంతులు విరజిమ్మే లేత వెలుగుల షాండిల్యార్స్ గోడలకి చక్కని తైలవర్ణ చిత్రాలు యూనిఫారమ్స్ లో ఎవరిక్కావలసినవి వాళ్ళకందిస్తూన్న వెయిటర్స్ డాన్స్ ప్లోర్ మీంచి మండ్రంగా ఉత్తేజకరంగా - సెడెక్టివ్ గా- వినిపిస్తోన్న పాశ్చాత్య వాద్య సంగీతం ....
    "ఈ ఏర్పాట్లన్నీ తనపేరు మీదుగా ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? మృదుల కనిపిస్తే మిస్టరీ విడిపోతుంది కాని మృదుల ఎక్కడా కనపడ్డంలేదు. చూడామణి, కేశవనాధ్ లు అన్నివైపులా పర్యవేక్షించుకుంటూ హడావిడిగా తిరుగుతున్నా, చూడామణి చూపులు తనవైపు తిరిగేసరికి చేతులు జోడించి నవ్వబోయాడు భాగవతార్. నొసలు చిట్లించి ముఖం తిప్పుకుంది చూడామణి. నీరుకారిపోయాడు. ఏవో దోపిడీలు హత్యలుచేసిన ఇంటర్ నేషనల్ క్రిమినల్ ని చూసినట్లు కంపరంగా చూసింది చూడామణి. ఆ చూపులు నిలువునా కాల్చేసినా మృదుల ఎక్కడుందో చెప్తే బాగుండును. ఇంతగాదు- ఇంకో అంత కంపరంగా చూసినా ఛీకొట్టినా ఫరవాలేదు. బాధగా అనుకున్నాడు. గెస్ట్స్ చాలామందే వున్నారు. వాళ్ళల్లో చాలామంది భాగవతార్ ని గుర్తుపట్టి పలకరిస్తున్నారు. తనని పల్కరించేదెవరో కూడా గమనించికోకుండా యాంత్రికంగా సమాధానాలు చెప్తూ మృదులకోసం వెతుక్కుంటూన్నాడు.
    "అవతార్!" మెత్తగా, తియ్యగా పిల్చింది ఒక స్త్రీ కంఠం. గిరుక్కున వెనక్కి తిరిగాడు. ఎదురుగా దేవకి. అతని మనసులో లక్ష భావాలు ఒక్కసారిగా కమ్ముకొచ్చి ఏమీ మాట్లాడలేక తెల్లబోయి చూస్తుండిపోయాడు భాగవతార్.
    "నేను గుర్తున్నానా!"
    "లే....లే .... ఉన్నావు- ఉన్నారు."
    అతడి తడబాటుకి నవ్వింది.
"ఏం మారలేదు" ప్రేమాభిమానాలు నాట్యం చేసాయి దేవకి గొంతులో. ఇబ్బందిగా అటూ, యిటూ చూసేడు.
    "రండి అలా కూర్చుని మాట్లాడుకుందాం." కాస్త దూరంగావున్న టేబిల్ వైపు చూపించింది. కేబరే డాన్సర్ వేషంలో వున్న ఆమెవైపు  చూడలేక చూపులు తిప్పుకుంటూ, "వొద్దు, వొద్దు.... నాకు వేరే పని వుంది."
    "రండి మిమ్మల్నెత్తుకుపోను."
    "సారీ! మరోసారి వస్తాను."
    "మరోసారి కుదురుతుందో కుదరదో, మృదులకి సంబంధించి మీక్కొన్ని విషయాలు చెప్పాలి".... భాగవతార్ సంకోచం, మొహమాటం ఎక్కడివక్కడ ఎగిరిపోయాయి. మంత్రం వేసినట్లు ఆమె వెంటనడిచి కాస్త దూరంగా వున్న టేబిల్ ముందు ఆమె ఎదుట కూర్చున్నాడు.
    "ఏమిటి? మృదులకి సంబంధించిన విషయాలు?"
    "అంత ఆరాటమయితే ఎలాగ? మీరెలాగున్నారు? బాగున్నారా?"
    "బాగానే వున్నాను మృదు ...."
    "నేనెప్పుడైనా గుర్తొస్తానా?"
    "మృదుల గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు?"
    "మృదులా నేను స్నేహితులమని మీకు తెలుసా?"
    "పరిచయస్తులని తెలుసు."
    "నేను మృదుల ఏం మాట్లాడుకున్నామో మృదుల మీతో ఎప్పుడైనా చెప్పిందా?"
    "మృదులతో నేనెప్పుడూ మీకు సంబంధించిన విషయాలు మాట్లాడలేదు" కొద్దిగా వడిలింది దేవకి ముఖం.
    "నామీద నీకింకా కోపం పోలేదన్నమాట."
    "కోపం ఏమిటి? మీమీద నాకేం కోపం లేదు. మీక్కావలసిన జీవితాన్ని మీరెంచుకున్నారు. సుఖంగా ఉన్నారా?"
    నిట్టూర్చింది దేవకి.
    "నన్ను మీరండం దేనికి? ఇదివరకు లాగ నువ్వనే పిలవచ్చుగా!"
    "సారీ! సాధారణ పరిచయస్తులైన ఆడవాళ్ళని చనువుగా "నువ్వు" అని పిలవలేను.
    చిన్నబుచ్చుకుంది దేవకి.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra