Home » Yandamuri veerendranath » మరో హిరోషిమా


    "నేను చెప్పేది జాగ్రత్తగా అర్ధం చేసుకో! నీ దగ్గర డైరీలూ, ఫోటోలు ఎలాగా లేవు. కాబట్టి రేపీపాటికి సంకల్పనాథ్ రే ఎలాగూ నీ చెల్లెలి విషయం పత్రికలకి ఎక్కిస్తాడు. రేప్ జరిగినట్టు డాక్టరు ధృవీకరిస్తాడు. అందుకే ఆ అమ్మాయి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది అన్న విషయం జరమెరిగిన సత్యం అవుతుంది. అయితే ఆ రేప్ చేసింది దావూద్ అన్న సంగతి మనం అప్పుడు బయట పెట్టలేము. ముందే ఎందుకు చెప్పలేదని అడుగుతారు. రెండు రోజులైనా తర్వాత కంప్లైంట్ యిస్తే కేసుకూడా నిలవదు. కాబట్టి మనం వెంటనే దీనిమీద చర్య తీసుకోవాలి. జరగవలసిన నష్టం ఎలాగూ జరిగిపోయింది. తెలియవలసిన సత్యం రేపటికి ఎలాగు తెలుస్తుంది. మనమే ముందు దాన్ని బయట పెట్టి దోషుల్ని శిక్షిస్తే కనీసం సంతృప్తి అయినా మిగులుతుంది కదా!"

    బృహస్పతి ఆలోచనలో పడ్డాడు. శ్రీహర్ష చెప్పింది సబబు గానే తోచింది. అయితే ఏదో సందిగ్ధం!

    "మనంతట మనమే సమీర జీవితాన్ని నాశనం చేస్తున్నామేమోరా! ఇప్పటికే సగం అయింది. మనం దాన్ని పూర్తిగా పాడు చేస్తామేమో."

    "దాని గురించి కూడా ఆలోచించానురా. మీకు అభ్యంతరం లేకపోతే హిమసమీరని నేను పెళ్ళి చేసుకుంటాను."

    బృహస్పతి అతడివేపు అప్రతిభుడై చూశాడు. అతడి కళ్ళు సజలాలయ్యాయి. "నువ్వు.... నువ్వు.... అన్నీ ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చావా?"

    "ఇందులో ఆలోచించడానికి ఏముందిరా? అది ఒక యాక్సిడెంట్. అంతే! మనమే అనవసరంగా దానికి నిరర్ధకమైన ప్రాముఖ్యతనిచ్చి గొప్ప విషయంగా భావిస్తాం" అని ఒక క్షణం ఆగాడు. "....ఒక జర్నలిస్టుగా నేనెన్నో వార్తల్ని సంచలనాత్మకం చేశాను. ఉన్నవీ, లేనివీ కల్పించి కూడా రాశాను. నా వార్తలవల్ల ఎందరి భవిష్యత్తో పాడయి ఉండొచ్చు కూడా! నాకు కావలసింది కేవలం సెన్సేషనే! ఇంతకాలం నేను అదే దృక్పథంతో ఒక విలేఖరిగా పని చేశాను. ఇప్పుడు నేను మరో కోణంలో ఆలోచిస్తే నా తప్పు అర్ధమైంది. 'పాప పరిహారార్ధం' అన్నంత పెద్ద మాటలు వాడను కానీ నా తప్పుకి ఈ నిర్ణయం చాలా కరెక్ట్ అనిపిస్తోంది. అలా అని, నేనేదో గొప్ప త్యాగం చేస్తున్నాననుకోకు. హిమసమీర నిజంగా నీహార సమీరే! ఆ సమీరాన్ని ఏ వాతావరణమూ కలుషితం చేయలేడు. ఒక అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నానన్న సంతృప్తి నాకు కలుగుతోంది. అయితే- అంతిమ నిర్ణయం నీదే! పోరాడదామా? వద్దా? వివాహం జరగాలా, వద్దా- అన్న విషయాన్ని నువ్వూ, నీ చెల్లెలూ కలిసి ఆలోచించి చెప్పండి. ఇది తన జీవితానికి సంబంధించిన విషయం కదా!" 


                        19


    "యువరానర్! ఒక అమ్మాయిని అన్యాయంగా రేప్ చేసి అమానుషంగా ఆ దృశ్యాన్ని చిత్రీకరించి, టెలికాస్ట్ చేయడం అరాచకం! దారుణం!! రాక్షసత్వం!!! ఆ చర్యవల్ల ఆ అమ్మాయి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో తన స్వరాన్ని శాశ్వతంగా కోల్పోయింది. ఈ నేరానికి మూల కారకుడైన దావూద్ హర్షద్ ని ఇండియన్ పీనల్ కోడ్ కింద శిక్షించవలసిందిగా కోర్టుని కోరుతున్నాను" పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన ప్రారంభ వాదనని ముగించాడు.

    క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభమయింది. డిఫెన్స్ లాయర్ లేచాడు. "యువరానర్! ఇప్పటివరకూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పింది చాలా నిరాధారమైన విషయం. అంధ్రప్రదేశ్ లో ఒక ప్రైవేట్ ఛానల్ రాంభరత్ అనే కేంద్రమంత్రికి సంబంధించినది అన్న విషయం అందరికీ తెలిసినదే! దావూద్ హర్షద్ మీద అభియోగం మోపిన హిమసమీర కేవలం డబ్బుకోసమే ఈ పని చేసిందని న్యాయ స్థానానికి నేను విన్నవించుకుంటున్నాను. ఈ విషయమై నా ప్రథమ సాక్షి కేంద్రమంత్రి రాంభరత్ ని కోర్టులో ప్రవేశపెడుతున్నాను" అన్నాడు.

    రాంభరత్ బోనెక్కాడు. కోర్టు కిటకిట లాడుతోంది. అందరూ ఉత్సుకంగా చూస్తున్నారు. డిఫెన్స్ లాయర్ ప్రశ్నించడం ప్రారంభించాడు.

    "జూలై 12 సాయంత్రం 'ది రేప్' అన్న నాటకం టెలికాస్ట్ అయిన తర్వాత జరిగినది ఏమిటో మీరు కోర్టుకి చెప్పండి" అన్నాడు.

    రాంభరత్ కంఠం సవరించుకుని చెప్పడం ప్రారంభించాడు. "నేను కేంద్రమంత్రిని! అంధ్రప్రదేశ్ లో వున్నా ఒక ప్రైవేట్ టీ.వి. ఛానల్ నాది!! అక్కడ జరిగే వ్యవహారాలూ అనుక్షణమూ వీక్షించేంత సమయం నాకు ఉండదు. ఆ రోజు సాయంత్రం నన్ను బృహస్పతి అనే వ్యక్తి కలుసుకున్నాడు. ఆ అమ్మాయి మా ఛానల్ లో ఒక కాజువల్ ఆర్టిస్టు! మా స్టూడియోలోనే ఒక సెట్ వేసి, ఒక రేప్ సీన్ చిత్రీకరించాం. దానిని ఆధారం చేసుకుని అతడు నన్ను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. నిజంగానే రేప్ జరిగిందనీ, అందువల్ల తమకి రెండు లక్షలు ఇస్తే కేసు పెట్టకుండా వదిలేస్తామనీ బేరం పెట్టాడు. నేను ఒప్పుకోలేదు. చెల్లెలి చేత ఆత్మహత్యా ప్రయత్నం నాటకం ఆడించాడు. ఆ అమ్మాయిని ఆస్పత్రిలో జాయిన్ చేయించాడు. హిమసమీర చావుబ్రతుకులమధ్య ఉందనీ- ఇప్పటికయినా సరే రెండు లక్షలు ఇస్తే కేసు వదిలేసుకుంటామనీ, నాకు మళ్ళీ ఫోన్ చేశాడు. ఇటువంటి బెదిరింపులకి లొంగేవాడిని కాదు నేను. చివరివరకూ పోరాడతానని అతడిని హెచ్చరించాను. ఇదీ జరిగినది!" అంటూ తన సాక్ష్యాన్ని ముగించాడు.

    డిఫెన్స్ లాయరు కొన్ని ఫోటోల్ని జడ్జి ముందు పెట్టాడు. "రాంభరత్ కి సంబంధించిన స్టూడియోలో వేసిన సెట్ ఇది మిలార్డ్! షూటింగ్ యిక్కడే జరిగింది" అంటూ తన వాదనని కొనసాగించాడు. ".... నిజంగా రేప్ అంటూ జరిగి వుంటే ఆ అమ్మాయి ధాబా హోటల్ కి వెళ్ళి అక్కడ ఆత్మహత్యా ప్రయత్నం చేయవలసిన అవసరంలేదు. అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఒకటి వుంది. దూలానికి ఉరి వేసుకుంటే చచ్చిపోవడం నూటికి నూరుపాళ్ళు ఖాయం. కానీ ఆ అమ్మాయి బతికింది. ఇదంతా ఒక నాటకమని దీనినిబట్టే తెలుస్తోంది."

    "అబెక్షన్ యువరానర్!" అంటూ లేచాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ".... ఏ స్త్రీ కూడా కేవలం రెండు లక్షల రూపాయల కోసం అంత ప్రమాదకరమైన ఆత్మహత్యా ప్రయత్నం చేయదు. కేవలం రెండు లక్షలకోసం తన స్వరాన్ని శాశ్వతంగా కోల్పోదు. చెడిపోయిన స్త్రీగా సమాజంలో శాశ్వతమైన ముద్ర వేయించుకోదు."

    "అబ్జెక్షన్ సస్టెయిన్డ్!" అన్నాడు జడ్జి. ప్రాసిక్యూటర్ గర్వంగా బృహస్పతివేపు చూసాడు. ఆ తర్వాత హిమసమీర బోనులో ప్రవేశపెట్టబడింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆమెని ప్రశ్నించడం ప్రారంభించాడు. తరువాత డిఫెన్స్ లాయర్ క్రాస్ ఎగ్జామినేషన్ మొదలు పెట్టాడు.

    "ఆ రోజు టెలికాస్ట్ అయిన 'ది రేప్' అన్న నాటకాన్ని మీరు చూశారా?"

    తల అడ్డంగా 'చూడలేదు' అన్నట్టు వూపింది.

    "గౌరవనీయులైన జడ్జిగారు దానిని చూశారు. అందులో ఒక దృశ్యంలో మీరు దావూద్ హర్షద్ అన్న పాత్రధారిని తమకంగా మీ మీదకి లాక్కున్నారు. అవునా, కాదా?"

    ప్రేక్షకుల గ్యాలరీలో వున్న బృహస్పతి పిడికిళ్ళు అప్రయత్నంగా బిగుసుకున్నాయి.

    ఈ ప్రశ్నకి హిమసమీర బేలగా చూసింది.

    "అబ్జెక్షన్ యువరానర్" అంటూ లేచాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్.... "ఇది చాలా అసందర్భమైన ప్రశ్న!"

    "కాదు యువరానర్!" అన్నాడు డిఫెన్సు లాయరు. "....రేప్ జరుగుతున్న ఏ సమయంలో నయినా- స్త్రీ తన అంగీకారాన్ని తెలిపితే, అది రేప్ అవదు. హిమసమీర మేజర్ కాబట్టి అది న్యాయపరమైన సంభోగమే అవుతుంది."

    "లేదు" అని అరవాలన్న ఆమె ప్రయత్నానికి గొంతు సహకరించలేదు. "....అతడు నన్ను బలాత్కరించాడు. ఎంతో ప్రతిఘటించాను. గింజుకున్నాను. విదిలించుకున్నాను. ప్రాధేయ పడ్డాను. అయినా అతడు నన్ను వదలలేదు" అని గబగబా రాసి చూపింది.

    బృహస్పతి మొహం మ్లానమయింది. అతడికి దుఃఖం ఉబికి ఉబికి వస్తోంది. అది వాస్తవికమైన దుఃఖం!! అకారణ దుఃఖాలుకూడా వుండవచ్చు. అవి మానవ కల్పితాలు. సకారణమయినవి కావు. కానీ అక్కడ జరుగుతున్నది ఏమిటి? న్యాయానికీ, అన్యాయానికీ మధ్య జరుగుతున్న పోరాటం! అందులో సమిధ అవుతున్నది మాత్రం ఒక స్త్రీ!!

    అతడికి చాలా ఇరిటేటింగ్ గా వుంది. ఏమీ చేయలేని నిస్సహాయస్థితి!

    పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేచి అన్నాడు. "డిఫెన్సు లాయరు న్యాయశాస్త్రంలో వున్న లొసుగుల్ని ఆధారం చేసుకుని- దోషుల్ని ఈ కేసులోంచి బయటపడెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు మిలార్డ్! తాను అనుభవిస్తున్న వ్యక్తిని తమకంతో కౌగలించుకునే స్త్రీ , ఆ తర్వాత ఆత్మహత్యా ప్రయత్నం చేయదు."

    "అబ్జెక్షన్ సస్టెయిన్డ్".

    బృహస్పతి రిలీఫ్ గా అనిపించింది. న్యాయశాస్త్రం ఎన్ని చెప్పినా, న్యాయం తమవేపు వుంది. అది చాలు!

    "నా తర్వాతి సాక్షి మిస్టర్ బృహస్పతి" అన్నాడు డిఫెన్స్ లాయరు.

    అన్యమనస్కంగా ఈ వాదనలు వింటున్న బృహస్పతి ఉలిక్కిపడ్డాడు. డిఫెన్సు వాదనకి తను ఏ విధంగా ఉపయోగపడతాడో అతడికి అర్ధం కాలేదు. ఆలోచనలతోనే వెళ్ళి బోనులో నిల్చున్నాడు.

    అతడి సాక్ష్యంతోనే కేసు తారుమారు కాబోతుందని అతడికి ఆ క్షణం తెలీదు.

    డిఫెన్సు లాయర్ ఈ రోజు జరిగిన సంఘటనని వివరంగా వర్ణించమన్నాడు. బృహస్పతి జరిగినదంతా చెప్పాడు.

    "టీ.వీ.లో ఆ నాటకం ఎన్ని గంటలకి వచ్చింది?" డిఫెన్సు లాయరు ప్రశ్నించాడు.

    "అయిదింటికి!"

    "మీరు మీ హోటల్ కి వెళ్ళడానికి ఎంత టైం పట్టి వుంటుంది?"

    "దాదాపు అరగంట"

    "షూటింగ్ పూర్తయిన అరగంటవరకూ మీ చెల్లెలు ఏం చేసి వుంటుంది? షూటింగ్ తాలూకు జనం అంతా వెళ్ళిపోగానే ఆత్మహత్యా ప్రయత్నం చెయ్యొచ్చుగా!"

    "అబ్జెక్షన్!" అంటూ లేచాడు ప్రాసిక్యూటర్. "....ఆ అమ్మాయి ఎప్పుడు ఆత్మహత్య చేసుకోవాలన్నది డిఫెన్స్ సాక్షికి సంబంధించిన విషయం కాదు."

    "నేను కేవలం సాక్షి అభిప్రాయం మాత్రమే అడుగుతున్నాను యువరానర్!" డిఫెన్స్ లాయరు వినమ్రంగా చెప్పాడు.

    "అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్".

    "నా ప్రశ్నకి సమాధానం చెప్పండి మిస్టర్ బృహస్పతీ!"

    "నేను వెళ్ళేసరికి అక్కడ సామాన్లన్నీ చిందరవందరగా పడివున్నాయి. నాటకం దాదాపు గంటసేపు ప్రసారం జరిగింది. 'ఆరు అవుతోంది' అని సంకల్పనాథ్ హెచ్చరించడం నాకు బాగా గుర్తుంది. అదృష్టవశాత్తూ నా చెల్లెలి ప్రాణం పోకముందే నేను ఆమెను రక్షించుకోగలిగాను."

    డిఫెన్స్ లాయరు నవ్వాడు. "గంటసేపు నీ చెల్లెలి రేప్ టీ.వీ.లో కేంద్రమంత్రుల సమక్షంలో కూచుని చూసానంటావ్! ఆ తర్వాత తీరిగ్గా అరగంటసేపు పరుగెత్తుకు వెళ్ళి ఆమెను రక్షించుకున్నానంటావ్! కేంద్ర మంత్రులున్న గెస్ట్ హౌస్ నుంచి ఊరిబయట ధాబా దగ్గరికి అరగంటలో పరుగెత్తి వెళ్ళగలగడానికి నువ్వు ఏమైనా జాన్సన్ వా? లూయిస్ వా?"

    "అబ్జెక్షన్ యువరా...." అంటూ పి.పి. లేవబోయాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra