Home » Dr. dasaradhi rangacharya » Shrimadbhagwatgeeta


    కపిలదేవుడు ఇట్లనెనుః
    "నీవు నా అనుజ్ఞ వేడుచున్నావు కావున చెప్పుచున్నాను. స్వేచ్చగా సంచరించుము. కాని నీ సర్వకర్మములు నాకు సమర్పించుము. మృత్యువును గెలిచి అమరత్వమునకుగాను నన్ను నీ హృదయమున దర్శించగలవు".
    కపిలదేవుని ఉపదేశము పొంది కర్దముడు ప్రసన్నహృదయమున అరణ్యములకు వెళ్ళినాడు. అహింసతో కూడిన సన్న్యాస ధర్మమును అవలంభించినాడు. భగవంతుని శరణు జొచ్చినాడు. అగ్ని హోత్రమును ఆశ్రమమును విడిచి నిస్సంశయ భావమున సంచరించినాడు. అహంకార మమకారములను వదలి సమదర్శనుడై సర్వత్ర ఆత్మనే సందర్శించినాడు. అంతర్ముఖమైన బుద్ధి గల కర్దముడు తరంగములు లేని సాగరమువలె ప్రశాంతతను అనుభవించినాడు.
    భక్తి భావమున కర్దముడు పరమపదము చేరుకున్నాడు.    
    సాంఖ్యయోగము    
    కర్దముడు అడవికి వెళ్ళిపోయిన తరువాత కపిలదేవుడు బిందుసరోవరము వద్దనే నివసించినాడు. ఒకనాడు దేవహూతి కుమారుని దర్శించి "ప్రభూ! విషయవాసనలతో విరిగిపోయినాను. ఇప్పుడు అజ్ఞానాంధకరమున మునిగిపోయినాను. అజ్ఞానాంధకారమున మునిగినవారికి తేజస్సువంటి వాడవు నీవు. ఈ సంసారార్ణవము నుండి తరించునట్టి జ్ఞానము ఉపదేశింపుము" అని ప్రార్దించినది.
    కపిల భగవానుడు సాంఖ్యమును ఇట్లు ఉపదేశించినాడు.
    ప్రకృతి సత్వము, రజస్సు, తమస్సు అనుమూడు గుణములు కలది. దానికి జ్ఞానమును కప్పిపెట్టునట్టి  ఆవరణశక్తి వున్నది. పురుషుడు దానికి మోహితుడు అగును. ఆ మోహమున వాస్తవమైనట్టి ప్రకృతి వేరనియు, తానువేరనియు గుర్తించలేడు. ప్రకృతి గుణములవలననే పనులు జరుగును. అట్టివానికి తానే కర్తనని భావించును. అందువలననే అతనికి జన్మ మృత్యు రూపమైన బంధనము ప్ర్రాప్తించును. సుఖదుఃఖములందు అనుభూతి మాత్రమే ముఖ్యమైనందున పురుషుడు ప్రకృతికి అతీతుడు.
    ప్రకృతి భిన్నమైదనియు, పురుషుడు భిన్నమైన వాడనియు వివరించి ప్రకృతి లక్షణములను పరమాత్మను వివరించుచున్నాడు.
    ప్రకృతి ఖేదరహితమైనది. అయినను భేదములకు ఆశ్రయమైనది. ప్రకృతి సత్వ, రజ, స్తమోగుణములకు ఆలవాలమైనదైనం దున అది బ్రహ్మముకాదు. అది దేని పరిణామముకూడా కాదు. అది అవ్యక్తము, నిత్యము, సదపదాత్మకము, కార్యకారణ రూపమైనది.
    అయిదు భూతములు, అయిదు తన్మాత్రలు, నాలుగు అంతఃకరణములు, పది ఇంద్రియములు ఈ ఇరువది నాలుగు తత్వములు ప్రకృతి.
    పంచభూతములు : భూమి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశము
    పంచతన్మాత్రలు : గంధము, రసము, రూపము, స్పర్శ, శబ్దము
    దశేంద్రియములు : చెవులు, చర్మము, కాళ్ళు, చేతులు, ముక్కు, నాలుక, వాక్కు, పాదములు, వాయువు ఉపస్థము.
    చతురంతఃకరణములు : మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్రము. ఈ ఇరువది నాల్గు కాక మరి రెండుతత్వములున్నవి. 1. కాలము 2. భగవంతుడు.
    ప్రకృతి గుణములు క్షోభపడనపుడు చిచ్చక్తిరూపమైన తన వీర్యమును పరమపురుషుడు ప్రకృతి యోనియందు స్థాపించినాడు.  అప్పుడు ప్రకృతి నుండి మహతత్త్వము పుట్టినది. అది ప్రళయపు అంధకారమును త్రాగి వేయును. మహతత్త్వము వికారము పొందిన అహంకారము పుట్టును. ఈ అహంకారమును సంకర్షణుడు అందురు.

             
     అహంకారము మూడు విధములు:
       వైకారికము  
    తైజసము తామసము మనస్తత్వము బుద్ధి, ఇంద్రియములు శబ్దతన్మాత్రము (అనిరుద్ధుడు) (ప్రద్యుమ్నుడు) శబ్దమునకు మూడు లక్షణములు. వాని వికారము వలన ఈ దిగువని కలుగును.
    ఆకాశతన్మాత్రత్వము అర్ధాశ్రయత్వము ఉచ్చారణకర్త జ్ఞాపకత్వము ఆకాశము(చెవి) (లక్షణములు)
    1. ప్రాణులకు లోపల బయట అవకాశము కలిగించును.
    2. ఇంద్రియములకు ప్రాణమునకు ఆధారముగా ఉండును.
    స్పర్శతన్మాత్రము (లక్షణములు)
    1. మృదుత్వము 2. కఠినత్వము 3. శీలత్వము 4. ఉష్ణత్వము
    వాయువు - (చర్మము) రూపతన్మాత్రము (కన్ను) రూపము - తేజస్సు రసతన్మాత్రము (నాలుక) నీరు గంధతన్మాత్రము (ముక్కు) భూమి
    అవకాశము మొదలగువాని శాబ్దాది ధర్మములు వాయువు, భూమి మున్నగువాని లోనను కనిపించుచున్నవి. మహత్తత్వము, అహంకారము భూమి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశము అను ఈ ఏడు పుట్టినను, ఇవి పరస్పరము కలియకున్న పురుషుని పుట్టించలేవు. భగవంతుడు వానిలో ప్రవేశించగా అవన్నియు క్షోభ పొంది వానిలోనుండి అచేతనమైన ఒక అండము పుట్టినది.
    మహదాదుల వలన పుట్టిన హిరణ్యయాండము ఎంతో కాలము నీటిలో వున్నది. ఆ అండకోశము నుంచి విరాట్పురుషుడు లేచినాడు. ఈ దిగువ క్రమముగా ఆ పురుషునకు ఇంద్రియములు ఏర్పడి ఇంద్రియాధి దేవతలు ఏర్పడినారు.
    1. ముఖము - నోరు (అగ్ని)
    2. ముకుపుటములు - ఘ్రాణేంద్రియములు (వాయువు)
    3. నేత్రములు -నేత్రేంద్రియములు (సూర్యుడు)
    4. చెవులు - శ్రవణేంద్రియములు (దిగ్దేవతలు)
    5. చర్మము - త్వగింద్రియములు (ఓషధులు)
    6. శిశ్నము - ఉపస్థేంద్రియము (జలము)
    7. గుదస్థానము - అపానేంద్రియము (మృత్యువు)
    8. చేతులు - పాణీంద్రియములు (ఇంద్రుడు)
    9. కాళ్ళు - పాదేంద్రియములు (ఉపేంద్రుడు)
    10. నాడులు - రక్తము (నదులు)
    11. కడుపు - ఆకలిదప్పులు (సముద్రము)
    12. హృదయము - మనస్సు (చంద్రుడు)
    13. హృదయము - బుద్ధి (బ్రహ్మ)
    14. హృదయము - అహం కారము (శివుడు)
    15. హృదయము - చిత్తము (క్షేత్రజ్ఞుడు)

                                 
    నీటిలో ప్రతిబింబించిన సూర్యునకు నీతి గుణములు అంతనట్లు ప్రకృతిలో ఉన్న పురుషునకు ప్రకృతిగుణములు అంటవు. అందులకు కారణమూ అతడు నిర్గుణుడు అయినప్పటికిని ప్రకృతి గుణములతో సంబంధము పెట్టుకొని అహంకార మోహితుడగును. కర్మదోషమువలన దేవతిర్యఙ్శనుష్య జన్మలెత్తి సంసార చక్రమున పడి తిరుగుచుండును.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra