Home » Yandamuri veerendranath » రక్త సింధూరం

    చేరిన కొద్ది రోజులకే నాకు స్ట్రిక్టు ఆఫీసరుగా పేరొచ్చింది!
    ఎంత పెద్ద బందిపోట్లయినా నన్ను చూసి భయంతో తొలగిపోయేవారు. నా క్రింద జవాన్లు పరోక్షంగా కూడా నన్ను మెచ్చుకోవటం నాకు తెలుసు. 'ఈ దొంగ ముండా కొడుకుల్ని నొక్కటానికి ఇలాటి ఆఫీసర్లే కావాలి' అని వాళ్ళు తరచు అనుకునేవారు.
    ఒక్కొక్క సంఘటన ప్రభావం మనిషిమీద ఎంతో వుంటుంది. సంఘటన చిన్నదే కావొచ్చు. కానీ మనిషి అప్పటి పరిస్థితినిబట్టి దాని అఫెక్టు వుంటుందనుకుంటాను. గోపాల్ మరణం నామీద అలాటి ప్రభావాన్నే చూపించింది. దానికి తోడు నేను చిన్నప్పుడు చదివిన కథ. ఈ రెండూ కలిసి నాకు మానవత్వం మీద నమ్మకం పోయేలా చేసినయ్. ఆ తరువాత జైల్లో ఈ కిరాతకులు నా నమ్మకాన్ని మరింత బలపరిచారు. ఇవన్నీ ఆధారంగా నేను కొన్ని సూత్రాలు నిర్మించుకున్నాను. ఒకటి " మనిషి స్వార్ధపరుడు. తన తరువాతే ఎంత దగ్గిర బంధుత్వమైనా! రెండు: ప్రతి మనిషిలోనూ రాక్షసత్వం వుంటుంది. అది బయటపడితే అతడు జైల్లో వుంటాడు. అది లోపలున్నంత కాలం బయట వుంటాడు.
    అలాటి రాక్షసుల్తో రోజూ వ్యవహరించే ఉద్యోగం నాది. అందుకే జైలంటే నాకు చాలా ఇష్టం.
                                                    1
    "ఫిఫ్టీవన్..."
    "ప్రజెంట్ సార్"
    "ఫిఫ్టీయూ..."
    "తోలుతీస్తా నా కొడకా"
    అటెండెన్స్ వేస్తూ శివప్రసాద్ వులిక్కిపడి "ఎవడ్రా అది" అన్నాడు.
    "నేను కాద్సార్... యస్సార్"
    గొల్లున నవ్వులు. శివప్రసాద్ మొహం జేగురు రంగుకి మారింది. తమాయించుకొని మళ్ళీ మొదలెట్టాడు.
    "ఫిఫ్టీత్రీ..."
    "ఇక్కడుండా సార్"
    దూరంనుంచి వాళ్ళని గమనిస్తున్నారు. నేను అటెండెన్స్ తీసుకుంటే ఇంత గొడవ చెయ్యరు. శివప్రసాద్ మెతక, వీళ్ళదగ్గిర పనికి రాడు.
    తెల్లటి ఎండ ఖైదీలమీద పడుతూంది. ఒక్కొక్కడూ తాటిమొద్దుల్లా వున్నారు. భారతదేశంలో మరే జైలూ భరించలేకపోతే ఏరేరి ఇక్కడకు పంపిస్తారనుకొంటాను.
    కుడివైపు వరుసలో ముందు నిల్చున్నవాడు స్వామి. ఆరు హత్యలు చేశాడు. బెంగుళూరు జైల్లో పెడితే రెండుసార్లు తప్పించుకున్నాడు. ఒకసారి తప్పించుకున్నప్పుడు ఆ పరారీలో పన్నెండేళ్ల బాలికని రేప్ చేసి అప్పుడు పట్టుబడ్డాడు. అతగాడు 'ఆర్' వార్డ్ కి దాదా.
    వాడి వెనుక నిలబడ్డవాడు షణ్ముగం. మతకలహాలు బాగా చెలరేగే సమయంలో వాడు చేతిలో చిన్న స్ప్రింగ్ చాకు దాచుకొని ఫుట్ పాత్ మీద వెళ్తూ ఎదురొచ్చినవాడి డొక్కల్లో గుచ్చి గిర్రున తిప్పి ప్రేగులు బయటకు లాగుతాడు. ఇలా దాదాపు పదిమందిని చంపివుంటాడు (అవీ రికార్డు ప్రకారం. వాస్తవానికి యాభైకి తక్కువచేసి వుండడు.) అసలు మూడో కంటికి తెలీదు- అలా పేగులు లాగటం కూడా ఒక ఆర్టు అంటారు. అవతలి వాడెవడో అనవసరం. గొడవ ప్రజ్వరిల్లుతూనే వుండాలి. అలా వున్నంత కాలం 'లూటీ' లకు అవకాశం వుంటుంది. కాస్త తగ్గుతూ వుందని గమనించగానే కత్తి తీసుకెళ్ళి రెండు మూడుపోట్లు ఎవరినో ఒకరిని పొడిస్తే చాలు - మళ్ళీ రాజుకుంటుంది. వాడు చేసేది అదే.
    వరుసలో అట్నుంచి నాలుగోవాడు, అందరికన్నా పొట్టిగా వున్న వాడిపేరు రామానందం. సన్నగా పీలగా వున్నాడు. ఎప్పుడూ నవ్వుతూ వుంటాడు. వాడి ఆకారాన్నీ, మొహాన్నీ చూసి అమాయకుడు అనుకుంటే పొరపాటే. వాడిని ఎలుక అని పిలుస్తారు మా వాళ్ళు. మూడుసార్లు జైలులోంచి తప్పించుకున్నాడు. ఏ జైలూ వాడిని ఆపలేదు అని ప్రతీతి. ఈ జైల్లోకి వచ్చేకే వాడి ఆటలు సాగటం లేదు. ఈ తప్పించుకునే ప్రయత్నంలో ముగ్గురు పోలీసులమీద హత్యాప్రయత్నం చేశాడు. ఈ జైలు వాడి ఆటలు కట్టించింది.
    "డిస్ పర్స్"- శివప్రసాద్ అరుపుకి ఈ లోకంలోకి వచ్చాను. ఖైదీలు కదిలి వెళ్ళిపోతున్నారు.
    ప్రిజ్నర్స్ కౌన్సిల్ వచ్చాక మేము జాగ్రత్తగా వుండవలసి వస్తోంది. ఖైదీ శరీరంమీద చెయ్యి వేయటానికి వీల్లేదు. ఖైదీ ఏదైనా వ్యతిరేకంగా ప్రవర్తిస్తే "సాలిటరీ కన్ ఫైన్ మెంట్" (ఒంటరి జైలు) లో కొన్ని రోజుల పాటూ వుంచటమే మేము విధించగలిగే పెద్ద శిక్ష. అందుకే శివప్రసాద్ లాటి ఆఫీసర్లు ఖైదీలు ఏడిపించినా పెద్దగా పట్టించుకోరు. అందులోనూ ముందే చెప్పినట్టు - మిగతా జైళ్ళ సంగతివేరు, ఈ జైలు వేరు. ఇక్కడుండేది నరరూప రాక్షసులు. వీళ్ళతో ఏ మాత్రం శత్రుత్వం పెట్టుకున్నా, వీళ్ళు బయటపడ్డాక తమ భార్యా పిల్లలకిగానీ, తమకిగానీ రక్షణ వుండదన్న సంగతి ఆజైల్లో ప్రతీ ఉద్యోగికీ తెలుసు. అలా తెలుసని ఖైదీలకీ తెలుసు. అందుకే వీళ్ళని ఏడిపిస్తూ వుంటారు- నన్ను తప్ప.
    నా సంగతి వాళ్ళందరికీ తెలుసు.
    రెండు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అది. భీమరాజు అని ఒక భయంకరమైన క్రిమినల్ వుండేవాడు. (వాడిప్పుడు కూడా మా జైల్లోనే వుంటున్నాడు) ఒకసారి రౌండ్స్ కి వెళ్తూంటే వాడి కిటికీ వెనుకవైపు తుప్పల్లో 555 సిగరెట్ ప్యాకెట్ ఖాళీది కనిపించింది. ఎవరిదని అడిగితే ఎవరూ చెప్పలేదు. మాటువేసి వాడు కాలుస్తూంటే పట్టుకున్నాను. నన్ను చూసి సిగరెట్ నలిపేసి పారేస్తూ 'నీకు సాక్ష్యాదారాలేవి? ఇన్ స్పెక్టర్...' అని నవ్వేడు. ఇదిగో ఇప్పుడు శివప్రసాద్ దగ్గిర నవ్వినట్టే చుట్టూ వున్న ఖైదీలు గొల్లుమన్నారు. నేను తలవంచుకుని వెళ్ళిపోయాను.
    ఆ రాత్రి ఎనిమిదింటికి వాడి సెల్ కి వెళ్ళాను. జెండా పక్కనవున్న ఖాళీస్థలంలోకి తీసుకెళ్ళాను. "నా దగ్గిర ఏ ఆయుధమూ లేదు. నీ దగ్గిర సాక్ష్యాధారాలు ఏమైనా వున్నాయేమో వెతకమంటావా" అని అడిగాను. వాడు చిత్రంగా చూశాడు. అంతలోనే అర్ధమైనట్టు నవ్వేడు. వాడి బలంతో పోల్చుకుంటే నేను చాలా చిన్నవాణ్ణి. కానీ నాకున్న పోలీసు ట్రెయినింగు వాడికి లేదు. సరీగ్గా రెండు నిముషాల్లో వాడి కాలు ఎముక విరిగింది.
    "ప్రిజ్నర్స్ కౌన్సిల్ రిపోర్టు చేసుకోవటానికి నీకూ ఏ సాక్ష్యాధారమూ లేదు భీమరాజూ! జైలు ఆస్పత్రిలో రెండు నెలలుండు. ఎవరన్నా ఇచ్చినా ఇక త్రిబుల్స్ ఫైవ్ లు పుచ్చుకోకు-" అని అక్కణ్ణుంచి వెళ్లిపోయాను. కౌన్సిల్ కి రిపోర్టు చేయటానికి వాడికి అహం అడ్డొచ్చింది. దానికి కారణం నేను ఏ ఆయుధమూ ఉపయోగించక పోవటం.
    ఆ మరుసటిరోజు సూపర్నెంటెండెంట్ పిలిచి ఖైదీని రాత్రిపూట సెల్ నుంచి బయటికి తీసుకొచ్చినందుకు సన్నగా చివాట్లు వేశాడనుకోండి- కానీ ఈ వార్త జైలంతా గుప్పుమంది. భీమరాజు లాటివాడిని 'సరిచేసినందుకు' అభినందనలు లభించాయి. ఖైదీలు భయంతో చూడసాగారు. అప్పట్నుంచి జైల్లో నా గౌరవం పెరిగింది.
    "ఆ భీమరాజు గాడికి చాలా పలుకుబడి వుందిగురూ! 'పేరోల్' మీద బయాటిక్ వెళ్ళొచ్చు తొందర్లోనే. జాగ్రత్తగా వుండు' అని హెచ్చరించాడు.
    "ఏడిశాడు, నా బ్రతుకుపట్ల నాకు భయంలేదు. ఇక నాకున్నది అమ్మ ఒక్కతే. నేను చేసిన పనిని అమ్మ కాదంటుందని నేను అనుకోను. ఒకవేళ ఇలా చేయకుండా భీమరాజుకి నేను భయపడి వుంటేనే అమ్మ నన్ను తిట్టేది అనుకుంటాను" అన్నాను.
    నా ఆలోచన కరెక్టే.
    అమ్మ నన్ను ముద్దు పెట్టుకుంది.
    చిన్నప్పట్నుంచి క్లాసులో ఫస్ట్ మార్కొచ్చినప్పుడు, ఏదైనా కాంపిటీషన్ లో బహుమతి వచ్చినప్పుడూ అమ్మకి నా నుదుటన ముద్దు పెట్టుకోవటం అలవాటు. మూడోక్లాసు చదువుతున్నప్పుడు అనుకుంటాను- లెక్కల్లో నూటికి నూరు మార్కులొచ్చినయ్. చేతిలో పుస్తకాల సంచి జారిపోతుందేమో కూడా చూసుకోకుండా ఇంటికి పరుగెత్తుకు వెళ్ళి ఆ సంగతి చెప్పాను. అమ్మ భుజం తట్టింది. నాకైతే చాలా కోపం వచ్చింది.
    "ఇంత కష్టపడి ఫస్టుమార్కు తెచ్చుకుని పరుగెత్తుకుంటూ వచ్చి చెప్తే ఇంతేనా" అన్నాను రోషంగా.
    "మరింకేం కావాల్రా" అంది నవ్వి.
    "నాకు సైకిలు కావాలి."
    అమ్మ నన్ను దగ్గిరకి తీసుకుంది. "చూడ్రా బాబూ. మనం బీదవాళ్లం- నువ్విలాటివన్నీ అడగకూడదు. నువ్వు బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తే అప్పుడు నీ కిష్టమైనవన్నీ కొనుక్కోవచ్చు. నీకు ప్రజంటేషన్ కావాలంటే నేను ఒకటే యివ్వగలను- కానీ చాలా బీదది...."
    "ఏమిటమ్మా."
    ....అప్పుడు అమ్మ నన్ను నుదుటిమీద ముద్దుపెట్టుకుంది. ఎందుకో తెలీదుగానీ నాకు బాగా ఏడుపొచ్చింది. అమ్మ నన్ను ఓదార్చే ప్రయత్నం ఏమీ చేయలేదు. మనిషి తనంతట తానే తన దుఃఖంలోంచి బయటకు రావాలని అమ్మ విశ్వాసం. బహుశా అలా రావటం వల్లనే కాబోలు జీవితంపట్ల తనకి ఇంత థీమా అలవడింది. ఆ ధీమాతోనే నన్నో వ్యక్తిగా తీర్చిదిద్దింది.
    ఆ తరువాత ఎప్పుడూ మా జీవితాల్లో డబ్బొక సమస్య కాలేదు- విచారం వెంటాడలేదు.
    రక్తం తాగే దుర్మార్గుల్ని అమాయక ప్రజల్నించి దూరంగా వుంచే ఈ జైలంటే నాకు చాలా ఇష్టం! కానీ అంతకంటే ఎక్కువగా- సమస్యని సూటిగా ఎదుర్కోవటం నేర్పిన అమ్మంటే నాకు మరీ ఇష్టం.
    ఈ రెండింటికన్నా ఎక్కువగా నా జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి అతి తొందరలోనే నా జీవితంలో ప్రవేశించాడు.
                                                 *    *    *
    "సూపర్నెంటెండెంట్ గారు" అని చెప్పాడు జవాను. దూరంగా శివప్రసాద్ ఆయనతో కలిసి వార్డులవైపు వెళ్ళటం కనిపించింది. నేనూ అటువైపు నడిచాను.
    శివప్రసాద్ ఈ డిపార్టుమెంట్ కి తగని మనిషి. స్వతహాగా చాలా మంచివాడు. బాగా డబ్బున్న అమ్మా నాన్నలకు ఒక్కడే కొడుకు. ఎప్పుడూ ఏవో జోకులూ అవీ వేస్తూ వుంటాడు. అయితే, అంత తెలివితేటలున్న వాడు కాకపోవటంతో అవి అంతా పేలవు. ఉన్నట్టుండి తెగ దిగాలు పడిపోతూ ఉంటాడు. సినిమాకి వెళ్తే, హలో నలుగురు అమ్మాయిలు ఐస్ క్రీమ్ తింటూ కిలకిలా నవ్వుతూ కనబడితే, "మ్చ్! మనం తప్ప మిగతా ప్రపంచం అంతా ఆనందంగా వుంది గురూ!" అని వాపోతాడు. అతడు ప్రేమించిన అమ్మాయి పేరు మంగతాయారు. ఉమెన్స్ కాలేజీలో ఫైనల్ బియస్సీ చదువుతూంది. ఇప్పటికి డెబ్భై అయిదు లెటర్స్ వ్రాసేడు. ఆ అమ్మాయి అంతకు రెట్టింపు వ్రాసి ఉంటుంది. ఒక మనసు తన స్థాయీ భావానికి తగిన మనసునే ప్రేమిస్తుందనటానికి ఈ యువ ప్రేమికుల కథే తార్కాణం.
    'నా ప్రేమ సిగరెట్ లాటిది
    మంటతో ప్రారంభమయింది
    వెలుగులో నిండి వుంది
    నువ్వు కాదంటే బూడిద మిగులుతుంది."
    దానికామె జవాబు ఈ విధంగా వుండేది :
    "నేను వ్రాసే ఈ కాగితం నీలం
    నా పెన్నులో ఇంకు నీలం
    ఉవ్విళ్ళూరుతోంది నా మనసు
    అవటానికి నీలో విలీనం."

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra