Home » D kameshwari » Kannitiki Viluventha Kathalu


    "పోనీ లేబర్ రూము ఎక్కడండి," 'అలా కుడివైపు తిరిగి నడిచి మళ్ళీ ఎడం వైపు తిరగండి.' అంటూ వెళ్ళిపోయింది.
    నర్సు చెప్పిన కుడి ఎడమలు చూసుకుంటూ లేబర్ రూమ్ చేరాడు. అక్కడ బెంచీల మీద కూర్చున్న పేషంట్ల తాలూకు బంధువులు ఆడ, మగ తప్ప నర్సులు, డాక్టర్లు ఎవరూ కనపడలేదు. ఎవర్నడగడం? ఆరాటం, గాభరా, ఆందోళనతో చెమటలు పట్టేస్తున్నాయి శంకరంకి. ఓ ఐదు నిముషాలు ఇటు అటు తచ్చాడాక లోపల్నించి ఓ నర్సు ఏదో సామానులు పట్టుకొస్తుంటే గభాలున ముందుకెళ్ళి మళ్ళీ ఆరాటంగా సీత గురించి అడిగాడు.
    "పదకొండో నెంబరా,.... ఇక్కడెవరూ లేనట్టున్నారే! వుండండి అడిగి వస్తాను. పేరేమిటి? రెండు కాన్పులవుతున్నాయి, చూసొస్తాను" అంది నర్సు. 'అమ్మయ్య ఈ మాత్రం జాలి దలచింది, అంతే చాలు' అనుకున్నాడు.
    'సారీ, ఆ పేషంటు ఇక్కడ లేరండీ' శంకరం తెల్లపోతూ అయోమయంగా 'మరేమయిందండీ, లేబర్ రూముకి తీసికెళ్ళారన్నారు కూడా' అతని అవస్థ వర్ణనాతీతం! కబురేమిటో తెలుసుకోలేక అసలేమయిందో తెలియక అతను గిజగిజలాడాడు.
    "తెలియదండి. నేను డే డ్యూటీ నర్సుని, ఇందాకే వచ్చాను...."
    'అమ్మా ప్లీజ్ కాస్త వివరం కనుక్కుని చెప్పారంటే మీ మేలు మరవను. అక్కడెవరో అన్నారు ఆపరేషన్ చేయాలిట అని"
    "ఆపరేషన్ చెయ్యాలన్నారా.... అయితే థియేటరుకి తీసుకెళ్ళారేమో వుండండి లోపల అడుగుతాను" మళ్ళీ వెళ్ళింది నర్సు.
    "ఆపరేషన్ థియేటరుకి తీసికెళ్ళారుటండి, కేన్ కాంప్లికేటెడ్ గా వుందట. అక్కడకెళ్ళి అడగండి" అంది. శంకరం మళ్ళీ ఉరుకులు పరుగులతో నర్సు చెప్పిన కుడి ఎడమల వరుసన దాటి థియేటర్ చేరాడు. మరోసారి అక్కడ నర్సు కోసం ఆరాటంగా చూడడం, ఎవరూ కనపడకపోవడం, కనపడినవాళ్ళు మాకు తెలియదనడం, నిముషాలు గడిచిపోతూ అసలు సంగతేమిటో కూడా తెలియకుండా శంకరం పడ్డ అవస్థ వర్ణనాతీతం. శంకరానికి భోరున ఏడ్పు వస్తూంది, అవతల భార్య బాధ అటుంచి యీ అవస్థలకి అతనికి నిస్సహాయంతో దుఃఖం ముంచుకు వస్తూంది. రామచంద్రప్రభో పగ వాళ్ళకన్నా వద్దు యీ ఆస్పత్రి బాధలు! రెండు పురుళ్ళకి సవ్యంగా పురుడవడం అదీ రాత్రి కాన్పు అయి తెల్లారి తను ఆస్పత్రి కొచ్చేసరికి తల్లి బిడ్డలు క్షేమంగా కనపడడంతో అవస్థ, ఆరాటం తెలీలేదు. సీతా సీతా ఏమయ్యావు? బ్రతికున్నావా అనుకుంటూ కళ్ళు వత్తుకున్నాడు. ఇంక నిలబడడానికి ఓపిక లేనట్టు అక్కడున్న బెంచీమీద చతికిలబడిపోయాడు. అప్పుడే ముప్పావు గంట అయింది. ఆస్పత్రి కొచ్చి ఇప్పటివరకు అసలు భార్య స్థితి ఎలావుందో తెలియలేదు. ఆపరేషన్ చేశారా! సీత బతికిందా, పిల్ల చచ్చిపోయిందా? సీత చచ్చిపోయిందేమో! తెల్లగుడ్డ కప్పి సినిమాలలో మాదిరి స్ట్రెచ్చర్ మీద తీసుకొస్తున్నట్టు, తను భోరున ఏడవడం, సీతా నిన్ను నేనే చంపేశాను. చేతులారా చంపేశాను అంటూ జుట్టు పీక్కోడం ఇంట్లో పిల్లలు తల్లిలేని పిల్లలు తను చెయ్యాల్సిన చాకిరీ పిల్లలని పెంచలేక పడే అవస్థలు సినిమా రీలులా గిర్రున కళ్ళముందు తిరిగి పోతున్నాయి. మరో రీలులో సీత చచ్చిపోయింది. పిల్లాడు బ్రతికాడు మీ కోరిక తీర్చాగా అంటూన్న సీత. ఆ కొడుకు అంజి మొహంతో భీకరంగా కనపడి వికటాట్టహాసం చేస్తూ డబ్బు తే డబ్బు తే అంటున్నాడు. తనని నాలుగు తగలనిచ్చి తాళాలు లాక్కుని పెట్లోంచి డబ్బు లాక్కుపోతున్న కొడుకు. శంకరం కూర్చుని వున్నా తనున్న స్థితి ఏమిటో తనకే తెలియని స్థితిలో కళ్ళమ్మట కారుతున్న నీరుతో అలా ఎంతోసేపు కూర్చున్నాడు! ఆ కొద్ది నిమిషాలలో తనని తాను వందసార్లు తిట్టుకొన్నాడు. మనసులోనే లెంపలు ఫెడీ ఫెడీమని వాయించేసుకున్నాడు. కొడుకూ వద్దు ఏమీవద్దు భార్యని రక్షించు దేముడా' అంటూ వెయ్యిసార్లు ప్రార్థించాడు.
    ఆపరేషన్ థియేటరు తలుపు తెరుచుకొని ఓ నర్సు బయటికి వచ్చింది. ఒక్క ఉదుటున ముందుకెళ్ళాడు శంకరం.... "సీత.... సీత పదకొండో నెంబర్ బెడ్డు ఆవిడ' శంకరంకి అంతకంటే మాటలురాలేదు. నర్సు ఎగాదిగా చూసి 'పదకొండో పేషెంటు తాలూకా మీరు?' అంది.
    'అమ్మయ్య' అనుకుంటూ గబగబ తలాడించాడు.
    "ఇప్పుడా వస్తారు? ఆవిడకి ఎంతో సీరియస్ అయింది. ఆపరేషన్ చెయ్యాలి బ్రతుకుతుందో లేదో పేషెంటు తాలూకు మనిషి ఎవరా అని చూస్తే ఎవరూ లేరు. ఇప్పుడా వస్తారు___?" అంది కోపంగా.
    "నాకు తెలియదండీ అవసరమయితే ఫోను చెయ్యమని నెంబరిచ్చాను"
    "ఆ నర్సు రెండుసార్లు ఫోను చేసింది. అటునించి నో రిప్లయ్"
    "నేనేం చెయ్యనండీ, తెలీదండీ...ఎలా ఉందండీ' ఆరాటంగా అడిగాడు.
    ఈ లోపల డాక్టరమ్మ తొంగిచూసింది. శంకరాన్ని చూస్తూనే కోపంగా యివతలకి వచ్చి, 'ఏమండీ, పెళ్ళాం బ్రతికుందో లేదోనని చూడ్డానికి వచ్చారా ఏమిటి యిప్పుడు.... ఏం మనుషులండీ,.... కడుపు చేయడం.... రాత్రినించి ఆవిడ బాధపడ్తూంది.... తెల్లారుఝామునించి సీరియస్ అయింది. ఆపరేషన్ చెయ్యాలి. బ్రతుకుతుందో లేదోననే సీరియస్ స్థితిలో వున్న మనిషి తాలూకు వాళ్ళు ఇంతవరకు ఊడిపడకపోతే ఎలాగండీ....' ఆవిడ వరసపెట్టి దులిపేస్తూంది.
    'అమ్మా, తల్లీ మీకో నమస్కారం. నా భార్య బ్రతికుందో లేదో చెప్పి మరీ తిట్టు తల్లీ' అనుకున్నాడు శంకరం. కాని ఆ మాట పైకి అనే ధైర్యం లేదు.
    'ఏమయిందండీ....' ఏడుపు గొంతుతో అడిగాడు.
    'ఏమవుతుందీ, వంట్లో బలం, రక్తం లేకపోయాక! ఏడాదికో బిడ్డ చొప్పున కంటూ వుంటే ఇంకేమవుతుంది."
    పాలిపోయిన మొహంతో గజగజ వణుకుతున్న శంకరం స్థితిని చూసి ఆవిడకే జాలి పుట్టినట్టుంది. అక్కడితో ఆగింది. 'పెద్ద ప్రాణాన్ని అతి కష్టం మీద బ్రతికించాం. మీరు కావాలనుకున్న కొడుకు మాత్రం దక్కలేదు' అంది డాక్టరు సీరియస్ గా ముఖం పెట్టి.
    తుఫాను వెలిసిన ప్రశాంతిలా, మండుటెండలోంచి వచ్చి చల్లని నీరు త్రాగినంత హాయిగా అన్పించింది శంకరానికి ఆ క్షణం.
    ఏ కొడుకు కోసం కలవరించి కలవరించి నలుగురి పిల్లలని కని బ్రతుకు భారం పెంచుకున్నాడో ఆ కొడుకు పుట్టకుండానే చచ్చిపోతే ఏడవకపోవడమే గాక ఏదో రిలీఫ్ దొరికినవాడిలా 'సీతా ఎలా వుంది యిప్పుడు' అంటూ సాయంత్రం అడుగుతున్న భర్తని, భర్త ముఖం మీద విరిసిన ప్రశాంతతని చూసి విస్తుపోయింది సీత.
    "మనం దురదృష్టవంతులం....ఇంత కష్టపడ్డా ఫలం దక్కలేదు...." అంది సీత కళ్ళ నీళ్ళతో.
    "మనం అదృష్టవంతులమే సీతా, ఎప్పటి నరకం సంగతో అప్పుడు చూసుకోవచ్చు గాని ముందు యిప్పటి నరకం నుంచి తప్పించుకున్నాం.... నీవు బ్రతికావు అంతే చాలు" అతనికి నిజంగానే ఆనందంగా వుంది. కొనాల్సిన పాల డబ్బాలు, మందులు, మరో ప్రాణి తిండి ఖర్చు తగ్గినందుకు. అతని విచారమల్లా ఈ తెలివితేటలు ఏ మూడోసారి వుంటే, ఎంత బాగుండేది అని!
        
                                                                                              (జ్యోతి దీపావళి ప్రత్యేక సంచిక 72)

                                                 *  *  *  *

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra